Guppedantha Manasu: రిషిని కాదు నిన్ను చంపాం.. జగతికి నరకయాతన.. ధరణికి వార్నింగ్

దేవయాని, శైలేంద్రను బయటపెడదామని చూసిన జగతికి ఘోర అవమానం ఎదురవుతుంది. జగతిపై రిషి చాలా సీరియస్ అవుతాడు. జరిగింది ఏదో జరిగిపోయింది. మేడమ్ చేసింది తప్పే. అందుకు నేను క్షమాణలు చెబుతాను అని వసుధార అంటుంది. ఎవరో ఏదో చేసిన దానికి నువ్వు ఎందుకు సారీ చెప్పడం అని రిషి అంటాడు. అర్థం చేసుకోండి ప్లీజ్ అని శైలేంద్ర, దేవయానికి సారీ చెబుతుంది వసు. మీరు చేసిన పనికి వేరేవారు బాధ్యత వహించాల్సి వస్తుంది అని జగతిపై రిషి మరింత కోప్పడతాడు. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్‌ మే 17 బుధవారం నాటి ఎపిసోడ్‌ 765లో ఇంకా ఏం జరిగిందంటే?

ప్రాణాలు ఇస్తాడట:నాన్నా వదిలేసేయ్.. పందిట్లో ఈ గొడవలు ఎందుకు. తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. మీరు గుడికి వెళ్లి రండి అని వసుధార, రిషిలను పంపిస్తాడు మహేంద్ర. అక్కడి నుంచి అంతా వెళ్తారు. జగతి, దేవయాని, శైలేంద్ర మిగులుతారు. ఏంటీ జగతి రిషి ఏమన్నాడో విన్నావా.. నేను విషం ఇచ్చిన తీసుకుంటాడట, నాకోసం ప్రాణాలు కూడా ఇచ్చేస్తాడట అని దేవయాని అంటుంది. అసలు మా ఉద్దేశం రిషిని చంపడం కాదు నిన్ను చంపడం. రిషి మనసులో నీ స్థానాన్ని చంపడం అని శైలేంద్ర అంటాడు. దీంతో షాక్ అయిపోతుంది జగతి. చూశావ్ గా.. నువ్వు మమ్మల్ని ఏం చేయలేవు అని శైలేంద్ర అని ఇద్దరూ వెళ్లిపోతారు. అక్కడే కూర్చుని కుమిలికుమిలి ఏడుస్తుంది జగతి.

Guppedantha Manasu Serial May 17 2023 Today Full Episode 765

పదిమంది బాగుంటారు:పెద్దమ్మా నిజంగా విషం పెట్టినా తినేస్తానని రిషి అన్న మాటలు తలుచుకుంటూ బాధపడిపోతుంది జగతి. మరోవైపు రిషి, వసుధార అమ్మవారి దగ్గరకు వెళ్తారు. సంతోషంగా జరుపుకోవాల్సిన నిశ్చితార్థం భయభయంగా జరిగింది. నువ్వే మా బంధాన్ని నిలబెట్టాలని అమ్మవారిని కోరుకుంటుంది వసుధార. నీ సమక్షంలో మా బంధం ముడిపడింది. ఆ బంధం నిశ్చితార్థం వరకూ వచ్చింది. వసుధారకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకునే శక్తిసామర్థ్యాలు ఇవ్వమని రిషి కోరుకుంటాడు. జగతి మేడమ్ బయటకు చెప్పలేక లోలోపలే వేదన అనుభవిస్తున్నారు. మేడమ్, రిషికి ఏం కాకూడదని వసు వేడుకుంటుంది. ఏం కోరుకున్నావ్ అని రిషి అడుగుతాడు. కొత్తగా కోరుకోవాల్సింది ఏం లేదు సార్. మీరు, మేడమ్ బాగుండాలని, వారు బాగుంటే పదిమంది బాగుంటారు అని వసుధార అంటుంది.

Guppedantha Manasu Serial May 17 2023 Today Full Episode 765

ఇదే సంకేతం:ఈ మధ్య మీ చుట్టూ ఏవేవో జరుగుతున్నాయి. ఊహించని సంఘటనలు, ప్రమాదాలు. రోజు గడిచే లోపు ఏదో ఒక డిస్టర్బెన్స్ అని వసు అంటుంది. ఇంకా నీ మనసులో భయం, ఆందోళన పోలేదు అనుకుంటా. చిన్న చిన్న వాటికి, నువ్వు మేడమ్ ఎక్కువగా టెన్షన్ పడుతున్నారు. ఇవి సంతోషంగా ఉండే క్షణాలు అని రిషి అంటాడు. ఇద్దరు కలిసి అమ్మవారికి దండ వేద్దామని వెళ్తారు. ముందున్న రాయి తగిలి వసుధార పడబోతుంటే ఆ దండ ఇద్దరి మెడలో పడుతుంది. చూశావా ఆ అమ్మవారు మన ఇద్దరినీ ఒకే దండలో చేర్చింది. ఎప్పటికీ విడిపోము అనడానికి ఇది సంకేతమని రిషి అంటే.. వసుధార అవును సర్ అని సంతోషపడుతుంది.

Guppedantha Manasu Serial May 17 2023 Today Full Episode 765

ధరణికి వార్నింగ్:మరోవైపు జ్యూస్ లో విషం కలిపిన విషయాన్ని జగతికి చెప్పినందుకు ధరణిపై శైలేంద్ర, దేవయాని విరుచుకుపడతారు. మనింట్లో బిస్కెట్లు తిని పక్కింట్లో మొరిగే కుక్కలను ఏమంటారు అని శైలేంద్ర అడిగితే.. ధరణి అంటారు అని దేవయాని అంటుంది. నువ్ అటు సహాయం చేద్దామనుకున్న చివరికీ మాకే మంచి జరిగింది. నువ్వు చెప్పడం వల్లే పిన్ని హడావిడి చేసింది. చివర్లో జ్యూస్ లో విషం లేదని తెలిసేసరికి అందరి ముందు నువ్వు, పిన్ని దద్దమ్మల్లా నిలబడ్డారు. ఇక ముందు ముందు నువ్వు తోక జాడిస్తే నేను సహించను. నా రియాక్షన్ చాలా సీరియస్ గా ఉంటుంది. జాగ్రత్తగా నడుచుకో అని ధరణికి వార్నింగ్ ఇస్తాడు శైలేంద్ర.

Guppedantha Manasu Serial May 17 2023 Today Full Episode 765

ఢిల్లీకి మహేంద్ర:ఇంకోవైపు ఏడుస్తున్న జగతిని ఓదార్చుతాడు మహేంద్ర. నీ సమస్య ఏంటో చెప్పు. ఏమైనా అంటే కన్నీళ్లు పెట్టుకుంటావ్ అని మహేంద్ర అంటే జగతి మౌనంగానే ఉంటుంది. శైలేంద్రని, వదినని ఎందుకు అనుమానిస్తున్నావ్. ఈరోజు ఏదో కలిపారని ఊహించుకుని అందరి ముందు బ్యాడ్ అయిపోయావ్. నాకు చాలా బాధేసింది అని మహేంద్ర అంటాడు. నావన్నీ భ్రమలు అని నిర్దారణకు వచ్చావా. అక్కయ్య గురించి నీకు తెలియదా అని జగతి అడుగుతుంది. వదినగారి కక్షలన్నీ నీపైనే. రిషిని ఏం చేయరు. నువ్వు కోరుకున్నట్లే రిషి, వసుధార హ్యాపీగా ఉంటారు అని చెప్పిన మహేంద్ర తాను ఢిల్లీకి వెళ్తున్నట్లు చెబుతాడు. ఈ సమయంలో నన్ను వదిలేసి వెళ్తావా మహేంద్ర అని జగతి అంటే.. మెడికల్ కాలేజీ పనులు ఉన్నాయి. వెళ్లాలి తప్పదు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. లేనిపోనివి ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు అని మహేంద్ర చెబుతాడు.

Guppedantha Manasu Serial May 17 2023 Today Full Episode 765

ఆలోచనలో వసు తల్లిదండ్రులు :మరోవైపు కారులో వెళ్తూ వసుధార తల్లిదండ్రులు జరిగినదంతా ఆలోచిస్తారు. అసలు జగతి మేడమ్ ఎందుకు టెన్షన్ పడ్డారో అర్థం కావట్లేదు. మనం వెళ్లినప్పటి నుంచి సరిగా పలకరించలేదు. మనస్ఫూర్తిగా మాట్లడలేదు. ఏదో ఆలోచిస్తూనే ఉన్నారు. వసుధారను అడిగిన ఏం లేదంది. ఈ టైమ్ లో మనం వాళ్ల దగ్గర ఉంటే బాగుండేది అని చక్రపాణి అంటాడు. మనం ఉండటం కూడా కరెక్ట్ కాదండి. గొడవ జరుగుతుంది కదా. వాళ్లు కూడా ఇబ్బందిపడతారు. అల్లుడు గారు జగతిని అంటుంటే చాలా బాధేసింది అని సుమిత్ర అంటుంది. మరోవైపు వసు, రిషి ఇంకా రాలేదని జగతి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి దేవయాని, శైలేంద్ర వస్తారు.

Guppedantha Manasu Serial May 17 2023 Today Full Episode 765

రిషికి శైలేంద్ర ఫోన్ కాల్స్:జగతిని మళ్లీ వేధిచండం మొదలు పెడతారు దేవయాని, శైలేంద్ర. రిషి, వసుధార ఇంటికి వస్తారో రారో అని భయపడుతున్నావా పిన్ని. వస్తారులే. గుడికి వెళ్లారుగా. ప్రశాంతంగా వస్తారు. లేకుంటే వాళ్లు ఎక్కడున్నారో తెలుసుకోవ్నా అని శైలేంద్ర అంటాడు. శైలేంద్ర తెలుసుకుంటే వాళ్లకు ప్రమాదం అని మనసులో అనుకున్న జగతి వద్దని చెబుతుంది. అరే నేను తెలుసుకుంటా అని ధరణిని పిలిచి ఫోన్ తెమ్మంటాడు. మరోవైపు రిషి, వసుధార ఇద్దరూ వెన్నెల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇంతలో కాల్ రావడంతో అసలు ఏ శబ్దం ఉండకూడదు అనుకున్నాం. కానీ ఈ ఫోన్ కాల్స్ డిస్టర్బ్ చేస్తున్నాయంటూ కాల్ కట్ చేస్తాడు రిషి. కాసేపు ఇక్కడే ఉందాం అని రిషి అంటే వసుధార సరే అంటుంది. శైలేంద్ర మళ్లీ కాల్ చేస్తూనే ఉంటాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X