Guppedantha Manasu: అన్నయ్యకు ఎదురు తిరిగిన రిషి.. మంచికి మంచి చెడుకు చెడు అంటూ!

రిషి, వసుధార ఇంటికి ఆలస్యంగా రావడంతో రిషిని ఏమనలేక వసుధారపై కోప్పడుతుంది జగతి. దీంతో జగతిపై కోప్పడతాడు రిషి. వసుధారల లాన్ లో కూర్చుని ఆలోచిస్తుంటే వెళ్లి రిషి మాట్లాడతాడు. మీ కోపం తగ్గిందా అని వసు అడిగితే.. అది కోపం కాదు మేడమ్ నిన్ను అలా అనేసరికి కోపం వచ్చింది. మేడమ్ నీకు హద్దులు పెట్టడం నాకు నచ్చలేదు అని రిషి అంటాడు. అమ్మ ప్రేమకి.. అంటూ ఏదో చెప్పబోయి.. ఏం లేదు సార్ మనకు ప్రమాదం జరుగుతుందేమోనని మేడమ్ భయం అని వసుధార అంటుంది. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్‌ మే 19 శుక్రవారం నాటి ఎపిసోడ్‌ 767లో ఇంకా ఏం జరిగిందంటే?

అదేంటీ బాధపడలేదా:నేను అన్నమాటలకు మేడమ్ ఏమైనా బాధపడ్డారా అని రిషి అడుగుతాడు. వెంటనే జగతి అన్న మాటలు తలుచుకుంటుంది వసుధార. మేడమ్ మీద కోప్పడాలంటే నాకు మనసు రావడం లేదు. కానీ తను చేసే పనులు మాట్లాడే మాటలు నాకు కోపం తెప్పిస్తున్నాయి అని రిషి అంటాడు. మేడమ్ బాధపడలేదు సార్ అని వసు అంటే.. అదేంటీ బాధపడలేదా అని రిషి అడుగుతాడు. అవును సార్. బాధలేదా అని నేనూ అడిగాను. రిషి ఏమన్నా నేను బాధపడను. నాకు కావాల్సింది రిషి సంతోషంగా, క్షేమంగా ఉండాలి అన్నారు సార్. మేడమ్ చాలా గొప్పవారు సార్. ప్రతిక్షణం మీ గురించే ఆలోచిస్తూ ఉంటారు. తనవి అనవసరమైన ఆలోచనలు కావు అని వసుధార చెబుతుంది.

Guppedantha Manasu Serial May 19 2023 Today Full Episode 767

సిగ్గుతో టవల్ లాక్కుని:తర్వాత ఇద్దరూ వాళ్ల జీవితానికి సంబంధించి క్విజ్ పెట్టుకుంటారు. అలాగే రాత్రంతా కబుర్లు చెప్పుకుంటూ అక్కడే నిద్రపోతారు. ఉదయం ధరణి వచ్చి వసుధార, రిషిని లేపి కాఫీ ఇస్తుంది. అనంతరం కాలేజీకి వెళ్లడానికి వసుధార తలస్నానం చేసి వచ్చి అద్దం ముందు తల తుడుచుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి రిషి వస్తాడు. అప్పుడే చేతిలో నుంచి వసు టవల్ కిందపడితే రిషి తీసుకుంటాడు. వసు మెడ వంపుల్లో ఉన్న తడిని తుడుస్తుంటాడు రిషి. వసుధారకు అతని ఉద్దేశం అర్థమై సిగ్గుతో టవల్ లాక్కుని.. సార్ మీరు ఇలాంటి పనులు చేయకూడదు అని అంటుంది. ఏ ఎందుకు చేయకూడదు ఏమైనా క్రైమా అని రిషి అంటాడు.

Guppedantha Manasu Serial May 19 2023 Today Full Episode 767

రిషిని పొగిడిన శైలేంద్ర:వేరేవాళ్లు చేస్తే క్రైమ్ కాదు కానీ, మీలాంటి జెంటిల్ మెన్ చేస్తే నేరమే అని వసు అంటుంది. అలా అయితే ఇంత అందంగా ఉండటం కూడా క్రైమే అని రిషి అంటాడు. వీరిద్దరిని చూసి జగతి వాళ్లు ఇలాగే సంతోషంగా ఉండాలి అని అనుకుంటుంది. ఇదంతా చూసిన దేవయాని.. ఇప్పుడే చూసి ఆనందించు జగతి అని మనసులో అనుకుంటుంది. కట్ చేస్తే.. ధరణి, మహేంద్ర మినహా మిగతా అంతా హాల్లో కూర్చుని ఉంటారు. ఏంటీ అన్నయ్యా మాట్లాడాలని రమ్మన్నావ్ అని రిషి అంటాడు. మిషన్ ఎడ్యుకేషన్ కి ఎంత గొప్ప పేరు వచ్చందో అందరూ చెబితే విన్నాను. కానీ ఇప్పుడు కళ్లారా చూస్తున్నాని అని రిషిని తెగ పొగుడుతాడు శైలేంద్ర.

Guppedantha Manasu Serial May 19 2023 Today Full Episode 767

నీ మాట కాదంటున్నా:మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ ను ఇతర రాష్ట్రాల్లో కూడా విస్తరించాలి. అక్కడ ఉన్న నా ఫ్రెండ్స్ అదే కోరుకుంటున్నారు. అందుకే నువ్వు, వసుధార వెళ్లి ఇతర స్టేట్స్ లో కూడా మిషన్ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేయాలి అని శైలేంద్ర అంటాడు. లేదు అన్నయ్యా నేను అక్కడికి వెళ్లను. నేను అక్కడికి వెళితే ఇక్కడ కాలేజీని ఎవరూ చూసుకుంటారు అని రిషి అంటాడు. నేను లేనా రిషి. అందుకు నాకు అర్హత లేదా. కాలేజీని చాలా అభివృద్ధి చేశావ్. ఇతర రాష్ట్రాల్లో కూడా మిషన్ ఎడ్యుకేషన్ తో మంచి పేరు తీసుకొస్తావ్. దేశం నలుమూలలా నీ పేరు తెలియాలి అదే నా కోరిక అని శైలేంద్ర అంటాడు. సారీ అన్నయ్యా మీ మాటని నేను కాదంటున్నాను అని రిషి కాస్తా కోపం ఆపుకుంటూ అంటాడు.

Guppedantha Manasu Serial May 19 2023 Today Full Episode 767

వెళ్లడమే మాకు మంచిది:నీకు కాలేజీ అంటే ప్రాణమని తెలుసు రిషి. నీ ప్రాణాన్ని నా ప్రాణంగా చూసుకుంటాను అని శైలేంద్ర అంటే.. ఇది రిషికే కాదు నాకు కూడా ఇష్టం లేదు. రిషి వెళ్లిపోతే కాలేజీ రూపురేఖలే మారిపోతాయి అని ఫణీంద్ర అనడంతో శైలేంద్ర, దేవయాని షాక్ అవుతారు. తర్వాత చూడు నాన్న నువ్వు అక్కడికి వెళ్లడమే మంచిది అని దేవయాని అంటే లేదు పెద్దమ్మా.. నేను లేకపోతే మీరంతా అల్లాడిపోతారు. అలాంటిది ఎలా వెళ్తాను. మీరు కూడా ఇలా అనడం నాకు నచ్చలేదు అని రిషి అంటాడు. తర్వాత ఏం వసుధార నువ్వేమంటావ్ అని శైలేంద్ర అడుగుతాడు. మీరు కావాలని పంపిస్తున్నారని అర్థమైంది. అయినా ఇప్పుడు వెళ్లడమే మాకు మంచిది అని మనసులో అనుకున్న వసుధార.. వాళ్లు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది. మనం వెళ్లిపోదాం అని అంటుంది.

Guppedantha Manasu Serial May 19 2023 Today Full Episode 767

శత్రువుకు బుద్ధి:వెంటనే రిషి కోపంగా లేచి.. ఏంటీ కరెక్ట్. మనం ఎక్కడికి పోవాలి. ఇప్పుడున్న పరిస్థితిల్లో మన కాలేజీ, స్టూడెంట్స్ భవిష్యత్ ముఖ్యం. నేను మెడికల్ కాలేజీ స్టార్ట్ చేస్తాను. దాన్ని వదలి వెళ్లను. అయినా అన్నయ్యకంటే తెలియదు. మీకు తెలుసు కదా నా గురించి. నేను ఎదుర్కున్న సమస్యల గురించి తెలుసు కదా. నాకు ఎదురొచ్చే శత్రువులకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. నాకు భయాలు, స్వార్థాలు ఉండవు. ఒక్కటే తెలుసు. మంచికి మంచి.. చెడుకు చెడు అంటే అని అంటాడు. సార్ ప్లీజ్ సార్ వెళ్దాం అని వసు అంటే.. నీకు అంతగా వెళ్లాలని ఉంటే వెళ్లు.. అంతేకానీ, నేను కాలేజీని, ఈ ఇంటిని వదిలి పెట్టి రాను అని కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు రిషి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X