Guppedantha Manasu: నిప్పు రాజేసిన శైలేంద్ర.. ఒరేయ్ తమ్ముడు నీకు అంతా విషాదమే అంటూ!

డీబీఎస్టీ మెడికల్ కాలేజీ లోగోని జగతి-వసుధార ఇద్దరు ఆవిష్కరిస్తాని చెప్పి శైలేంద్రకు షాక్ ఇస్తాడు రిషి. దానికి మేము ఎందుకు రిషి అని జగకి. వసుధార అంటారు. తర్వాత మహేంద్ర చెప్పడంతో రిషి పక్కకు వెళ్లి జగతి, వసుధార నిల్చుంటారు. సర్ మేము ఏం చేసినా మీకోసమే.

మీ మోటివేషన్ తోనే అదంతా చేశాం. ఈ కాలేజీ పెడదామన్న లక్ష్యాన్ని నెరవేర్చుందుకే అని వసుధార అంటే.. సరే ముగ్గురం కలిసి లోగో ఆవిష్కరిద్దాం అని రిషి చెబుతాడు. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్‌ మే 2 మంగళవారం నాటి తాజా ఎపిసోడ్‌ 752లో ఇంకా ఏం జరిగిందంటే?

Guppedantha Manasu Serial May 2 2023 Today Full Episode 752

నీ బలం వీళ్లేనా: లోగో ఆవిష్కరించేందుకు రిమోట్ పట్టుకుని ఉంటాడు రిషి. అప్పుడు రిషి చేయి పట్టుకునేందుకు జగతి చాలా ప్రేమగా చూస్తుంది. ఈ సన్నివేశానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తోడు కావడంతో మంచి ఎమోషనల్ గా ఉంటుంది. మెడికల్ కాలేజీ లోగోను రిషి, వసుధార, జగతి ముగ్గురు కలిసి స్టార్ట్ చేస్తారు. అది చూసి రగిలిపోతాడు శైలేంద్ర. ఒరేయ్ తమ్ముడు.. నీ బలం వీళ్లిదరే అన్నమాట.

ముందు వీళ్లిద్దరిని తప్పిస్తే నీ పతనం మొదలవుతుంది. అప్పుడు ఈ సంతోషం ఉండదు. అంతా విషాదమే అని శైలేంద్ర మనసులో అనుకంటాడు. తర్వాత కాలేజీ స్టూడెంట్స్ రిషి థ్యాంక్స్ చెబుతాడు. అప్పుడు అంతా వెళ్లిపోతారు. రిషితో మీకు ఓ ప్రత్యేక కానుక ఉంది అని వసుధార చెబుతుంది.

Guppedantha Manasu Serial May 2 2023 Today Full Episode 752

ఎలా ఓపెన్ చేస్తావో చూస్తా: రిషిని కళ్లు మూసుకోమ్మని చెప్పి చేతికి బ్రాస్ లెట్ తొడుగుతుంది వసుధార. ఇదే ఎందుకు అని రిషి అడిగితే.. మీరు సంతకాలు చేసే ప్రతిసారి దీన్ని చూస్తారు. మీ లైఫ్ లో చేసే ప్రతి సంతకంలో వసుధార ఉండాలి. అప్పుడు నేను గుర్తుకురావాలి అని వసుధార అంటుంది. ఇది ఉన్న లేకపోయినా నువ్వు ప్రతిక్షణం గుర్తుంటావ్ అని రిషి అంటాడు.

తర్వాత శైలేంద్రకు మెడికల్ కాలేజీ బిల్డింగ్ ఏరియా చూపిస్తాడు రిషి. అడ్మిషన్ స్టార్ట్ అయ్యేలోగా బిల్డింగ్ రెడీ అవుతుందా అని శైలేంద్ర అడిగితే.. పూర్తయ్యేలోపు పాత బిల్డింగ్ లో క్లాసులు రన్ చేస్తాను. తర్వాత ఇక్కడికి షిఫ్ట్ చేస్తాను. అడ్మిషన్స్ మాత్రం ఆపను అని రిషి అంటాడు. ఈ బిల్డింగ్ ఎలా పూర్తి చేస్తావో, అడ్మిషన్స్ ఎలా ఓపెన్ చేస్తావో చూస్తాను అని మనసులో అనుకుంటాడు శైలేంద్ర. ఫైల్ చూడమని శైలేంద్రకు ఇచ్చిన రిషి తన మొబైలే తీసుకుంటాడు.

Guppedantha Manasu Serial May 2 2023 Today Full Episode 752

లెక్కలు సరిచేద్దాం: అప్పుడే సౌజన్య రావు నుంచి కాల్ వస్తుంది. అది చూసి షాక్ అయిన శైలేంద్ర గాబారాగా రిషి నుంచి ఫోన్ తీసుకుంటాడు. పక్కకు వెళ్లి మాట్లాడతాడు. నేనే కాల్ చేస్తాను కదా. సైట్ లో ఉన్నా. ఇప్పుడే మొదలైంది. అన్ని లెక్కలు సరిచేస్తా అని శైలేంద్ర కాల్ కట్ చేస్తాడు శైలేంద్ర. కాల్ కట్ చేసేసరికి వెనుకే ఉన్న వసుధార ఫోన్ లో ఎవరు సార్ అని అడుగుతుంది. ఇలా వచ్చావేంటీ అని శైలేంద్ర అంటే మీరు మా అతిథి కదా.

మీకోసం అందరు ఎదురుచూస్తున్నారు అని వసుధార అంటుంది. ఫోన్లో ఎవరు.. లెక్కలు సరిచేద్దాం అంటున్నారు అని వసుధార అంటే బిజినెస్ పార్టనర్ అని శైలేంద్ర కవర్ చేస్తాడు. తర్వాత రిషికి వసుధార గొడుగు పడుతుంది. శైలేంద్రకు కూడా ఒక గొడుగు ఇస్తుంది. శైలేంద్ర ముందు వెళ్తే వసు, రిషి వెనుక వస్తుంటారు.

Guppedantha Manasu Serial May 2 2023 Today Full Episode 752

క్యాబిన్ లేకపోవడం ఏంటీ: వసు, రిషిని చూసి ఇద్దరికిద్దరు చక్కగా ఉన్నారు. కానీ ఎక్కువ రోజులు ఉండరులే అని శైలేంద్ర అనుకుంటాడు. అంతా కాలేజీ లోపలికి వెళ్తారు. కాలేజీ ఎలా ఉందని అడిగితే చూడలేనంత అందంగా ఉంది అని శైలేంద్ర అంటాడు. అంటే కాలేజీ చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. రిషి దగ్గరుండి మొత్తం చూపించాడు. రిషిని చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది. ఐయామ్ ఫ్రౌడ్ ఆఫ్ యూ మిస్టర్ రిషీంద్ర భూషణ్ అని శైలేంద్ర అంటాడు.

కానీ ఆ మాటలకు జగతి అదోలా, అనుమానంగా చూస్తుంది. డాడ్ ఇక్కడ అందరికీ క్యాబిన్ ఉంది మీకు మాత్రం లేదే అని శైలేంద్ర నిప్పు రాజేస్తాడు. కాలేజీ వ్యవహారాలన్ని వాళ్లే చూసుకుంటారు కదా. నేను అప్పుడప్పుడు వస్తాను. ఈ మాత్రం దానికి నాకు క్యాబిన్ ఎందుకు అని ఫణీంద్ర అంటాడు. దీంతో మీకు క్యాబిన్ లేకపోవడం ఏంటీ, వేరే వాళ్ల క్యాబిన్ వాడుకోవడం ఏంటీ హడావిడి చేస్తాడు శైలేంద్ర.

సామ్రాజ్యానికి రాజు ఒక్కడే: బావగారు మీరు నా క్యాబిన్ వాడుకోండి. నేను మహేంద్ర క్యాబిన్ లో అడ్జస్ట్ అవుతాను. మహేంద్ర బావ గారి పేరు మీద నేమ్ బోర్డ్ చేయించు అని జగతి అంటుంది. ఊరుకో జగతి శైలేంద్ర సరదాగా అంటున్నాడు. నాకు ఎందుకు క్యాబిన్. అంతకావాలనుకంటే రిషి నాకు తనే సీటు ఇస్తాడు. ఏం రిషి అని ఫణీంద్ర అంటాడు. అవును పెదనాన్న.

నా సీటు మీదే. మీదే కాదు అన్నయ్యది కూడా అని శైలేంద్రను తన సీటులో కూర్చోబెడతాడు రిషి. అన్నయ్య ఈ సీటులో నువ్వు రాజులా ఉన్నావని రిషి అంటాడు. థ్యాంక్యూ రిషి. కానీ మన సామ్రాజ్యానికి రాజు ఒక్కడే అది నువ్వే అని శైలేంద్ర అంటాడు. మీ ఇద్దర్ని చూస్తుంటే సంతోషంగా ఉందని మహేంద్ర అంటాడు.

జోక్యం చేసుకోవద్దు: నేను మీ అందరి మధ్య నిప్పు రాజేద్దం అనుకుంటే రిషి చల్లార్చాడు. రిషి తెలివైనవాడే. పరిస్థితిని ముందే పసిగట్టి అనుకూలంగా మారుస్తాడు అనుకుంటూ ఎండీ బోర్డ్ వైపు క్రూరంగా చూస్తాడు శైలేంద్ర. మరోవైపు ధరణిని వంటగదిలో నీ స్థాయి ఇంతే.. కాలేజీకి వెళ్లడానికి పనికిరావు, ఎక్కడికి వెళ్లాలనుకోకు, ఇకపై వంట విషయం తప్ప ఇంకే విషయాల్లోనూ జోక్యం చేసుకోవద్దు అంటూ బాధపెడుతుంది దేవయాని. మరోవైపు రిషిని తన సీటులో కూర్చోబెట్టి ఈ సీటులో మీరు తప్పా ఎవ్వరూ కూర్చోవద్దు. ఇందులో కూర్చునే అర్హత మీకు మాత్రమే ఉంది అని వసుధార అంటంది.

మే 3 ఎపిసోడ్ లో: కిచెన్ లో ఇంకా వంట చేస్తున్నారా అని ధరణిని వసుధార అడుగుతుంది. రిషి అక్కడే ఉంటాడు. ఇంతలో వచ్చిన శైలేంద్ర నేను కూడా అదే అడుగుదామనుకుంటున్నా. ధరణికి కాస్తా నేర్పించొచ్చు కదా అంటాడు. అన్నయ్యా వసుధార పర్ ఫెక్ట్ గురువు.

నాక్కూడా అన్నీ తనే నేర్పించిందని రిషి అంటాడు. నేను కూడా నేర్చుకోవాల్సింది చాలా ఉందన్నమాట అని శైలేంద్ర అంటే.. అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత జగతి వంట గదిలోకి వస్తూ శైలేంద్ర, ధరణిని చూసి ఆగిపోతుంది. మన మధ్య దూరం మన మధ్యే ఉండాలని గుర్తు పెట్టుకో అని ధరణిని శైలేంద్ర బెదిరించడం చూస్తుంది జగతి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X