Guppedantha Manasu: మరో కొత్త విలన్ ఎంట్రీ.. గుడ్డిగా నమ్మేసిన రిషి.. జగతికి 3 రోజుల గడువు
రిషి తన గదిలోకి కోపంగా వెళ్లి.. శైలేంద్ర, వసుధార అన్న మాటలు గుర్తు చేసుకుంటాడు. అక్కడికి వసుధార వస్తుంది. సార్ నా ప్రాణం మీరు.. మిమ్మల్ని వదిలేసి నన్ను వెళ్లమంటారేంటీ అని వసుధార అంటుంది. మరి ఆ కాలేజ్ నా ప్రాణం.. అలాంటి కాలేజీని వదిలేసి వెళ్దాం అంటావేంటీ. కాలేజీ కోసం నేను చనిపోవడానికైన సిద్ధమే. అయినా అంతవరకు రాదు. ఇంకెప్పుడు నా దగ్గర ఇలాంటి మాటలు మాట్లాడొద్దు. సరేనా అని రిషి అంటాడు. వసుధార ఏం చెప్పలేక సరే అంటుంది. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్ మే 20 శనివారం నాటి ఎపిసోడ్ 768లో ఇంకా ఏం జరిగిందంటే?
పెద్ద ప్రాజెక్ట్స్ చేశాడు:సరే నాకు కాలేజీలో పని ఉందని చెప్పి వెళ్లిపోతాడు రిషి. కట్ చేస్తే మెడికల్ కాలేజీకి బిల్డర్స్ కోసం టెండర్స్ వేద్దామని చర్చించుకుంటారు రిషి, ఫణేంద్ర, జగతి, వసుధార. ఇంతలో శైలేంద్ర ఎంట్రీ ఇస్తాడు. నాకు తెలిసిన బిల్డర్ ఉన్నాడని చెప్పా కదా రిషి. తనను పిలిచాను అని శైలేంద్ర అంటాడు. అలా అయితే రమ్మనమని రిషి చెబుతాడు. దాంతో ఆ వ్యక్తి లోపలికి వస్తాడు. రిషి.. ఇతడి పేరు సారథి. ఏస్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇన్ ఛార్జ్ అని పరిచయం చేస్తాడు శైలేంద్ర. ఇ ఇతను మా తమ్ముడు రిషి అని చెబుతాడు. దీంతో అతన్ని కూర్చోమని రిషి చెబుతాడు. ఇతడి గురించి నాకు బాగా తెలుసు. ఇండియాలో చాలా పెద్ద ప్రాజెక్ట్స్ చేశాడు. మేము కూడా ఒక ప్రాజెక్ట్ కలిసి చేశాం. చాలా జెన్యూన్ వ్యక్తి అని శైలేంద్ర అతని గురించి గొప్పగా చెబుతాడు.

ప్రాజెక్ట్ కొటేషన్స్:అంత పెద్ద ప్రాజెక్టస్ చేసిన మీరు.. ఈ కాలేజీకి పని చేయాలని ఎందుకు అనుకుంటున్నారు అని జగతి అడుగుతుంది. నేను మీ డీబీఎస్టీ కాలేజీ, మిషన్ ఎడ్యుకేషన్ గురించి చాలా గొప్పగా విన్నాను. ఎంత సంపాదించిన చివర్లో మనకు ఒక సంతృప్తి ఉండాలి. అది ఈ కాలేజీకి పనిచేయడం ద్వారా వస్తుంది. మీ కాలేజీ జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంటుంది. అప్పుడు ఈ కాలేజీకి నేను పనిచేశాను అని చెబితే చాలా బాగుంటుంది కదా అని సారథి బదులిస్తాడు. వెంటనే వసు.. మరి ఇంతకుముందు మీరు చేసిన ప్రాజెక్ట్స్ కొటేషన్స్ అవి ఉన్నాయా చూపించండి అని వసుధార అడుగుతుంది. దీంతో అవేం లేవు మేడమ్. నేను తీసుకురాలేదు అని కంగారుగా చెబుతాడు సారథి.

నమ్మకం లేదు కదా:పోనీ ల్యాప్ ట్యాప్ లో కానీ, పోన్ లో కానీ ఉంటాయి కదా. వాటినైనా చూపించండి. ఏదీ చూడకుండా కాంట్రాక్ట్ ఇవ్వలేం కదా అని వసుధార అంటుంది. ల్యాప్ టాప్ కూడా మర్చిపోయాను. శైలేంద్ర రమ్మనేసరికి హడావిడిగా వచ్చేశాను అని సారథి అంటాడు. సారథి గారు మిమ్మల్ని పిలిచింది ఈ విషయం గురించే కదా. అవి తీసుకురాకపోతే ఎలా అని శైలేంద్ర అంటాడు. సారీ సార్ అని సారథి అంటాడు. అవసరం లేదేమో శైలేంద్ర. నీకు బాగా నమ్మకస్తుడు అని చెబుతున్నావ్. ఒకసారి కలిసి పని చేశారని అంటున్నావ్ ఇది చాలదా అని ఫణీంద్ర అంటాడు. నాకేం అవసరం లేదు డాడ్. కానీ పిన్నీ, వసుధారలకు నమ్మకం లేదు కదా. మనమేం చేస్తాం. సారథి గారు అన్నీ ప్రూఫ్స్ తీసుకుని వచ్చాకే పని స్టార్ట్ చేద్దాం అని శైలేంద్ర అంటాడు,.

ఎక్కడికి దారి తీస్తుందో:అన్నయ్య అలా ఏం లేదు. నా మంచి కోరుకునే వాళ్లు మీరు. సారిథి గారి నేను నమ్ముతున్నాను. కాంట్రాక్ట్ మీకే ఇస్తాను అని రిషి అంటాడు. ప్రాజెక్ట్ విషయంలో చాలా జాగ్రత్తగా పని చేయాలి అని జగతి అంటే.. యజమానులను బట్టి పని ఉంటుంది. అడ్వాన్స్ త్వరగా ఇచ్చేస్తే.. నేను పని మొదలు పెట్టేస్తా అని సారథి అంటాడు. అకౌంట్స్ చూసుకుని ఇస్తాను. మీరు కొటేషన్ రెడీ చేసి చూపించండి అని రిషి అంటాడు. తర్వాత అక్కడి నుంచి అంతా వెళ్లిపోతే.. వసు, జగతి ఉంటారు. మేడమ్ ఏంటిది బెస్ట్ బిల్డర్ ను తేవాలనుకుంటే.. ఆ శైలేంద్ర గారు తెచ్చిన బిల్డర్ ను రిషి సార్ ఓకే చేశారు. ఏదైనా అడిగితే పెద్దపెద్దవి చేశాను అంటున్నాడు. అసలు ఇదంతా ఎక్కడికి దారి తీస్తుందో తెలియట్లేదు అని వసు అంటుంది.

జగతి కన్నీళ్లు:వాళ్లు ఎన్ని ప్లాన్స్ చేసినా మనం జాగ్రత్తగా ఉండాలి అని జగతి అంటుంది. కానీ ప్రతిసారి రిషి సార్ ను అంటిపెట్టుకుని ఉండలేం కదా. శైలేంద్ర గారి విషయం దాచి పెట్టడం కరెక్ట్ కాదు మేడమ్. ఆయ ఇలాగే చేస్తారు. అంతా బెదిరిస్తారు. రిషి సార్ కి నిజం చెబుతాను అని వసుధార వెళ్తుంది. అదంతా కిటికి నుంచి శైలేంద్ర వింటాడు. వసుధార వెళ్తుంటే జగతి ఆపేందుకు చూస్తుంది. కానీ వసు వెళ్తూనే ఉంటుంది. ఇంతలో రిషిపై పూల కుండి పైనుంచి పడబోతుంది. ఫోన్ మాట్లాడుతున్న రిషి అది చూసుకోడు. పూల కుండీ పైన పడే సమయంలో సార్ అంటూ వచ్చిన వసుధార రిషిని పక్కను నెట్టేస్తుంది. అది చూసి జగతి గట్టిగా అరుస్తుంది. రిషి చూసుకోవాలి కదా.. అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది జగతి. మేడమ్ నేను బాగానే ఉన్నాను అని రిషి అంటాడు. ఇంతలో శైలేంద్ర వచ్చి డ్రామా చేస్తాడు.

చంపేద్దామని డిసైడ్ అయ్యా:వసుధార రిషిని తీసుకెళ్లు అని శైలేంద్ర అంటే అలాగే చేస్తుంది. పిన్నీ పూల కుండి ఎలా పడిందా అని చూస్తున్నావా. నేనే పడేయించాను. జెస్ట్ మిస్ కదా పిన్నీ. కనీసం కోమాలోకి పోయేవాడు అని శైలేంద్ర అంటాడు. దీంతో షాక్ అయిన జగతి.. శైలేంద్ర అని గట్టిగా అరుస్తుంది. ఎందుకు పడేయించానో తెలుసా. నేను కొంచెం హర్ట్ అయ్యాను. ఇందాక నువ్వు వసుధార మాట్లాడుకోవడం విన్నాను. చాటుగా వినడం నాకు అలవాటే. నేను కేవలం బెదిరించడానికి చేస్తున్నారు అనుకున్నారు కదా. అందుకే ఈసారి బెదిరించడం కాదు. డైరెక్ట్ గా చంపేద్దామని డిసైడ్ అయి పూల కుండీ పడేలా చేయించా అని శైలేంద్ర అంటాడు. నేను ఇంత దుర్మార్గుడిని అని మా డాడీకి చెబితే ఆయన గుండె ఎక్కడ ఆగిపోతుందోనని మీ భయం. ఒకవేళా బాగున్నా.. ఈ విషయంలో బాబాయ్ కు డాడీకి ఏం గొడవలు అవుతాయోనని భయం పిన్నీ మీకు అని శైలేంద్ర అంటాడు.

3 రోజులే గడువు:అందుకే రిషిని పంపించేయ్.. లేట్ చేయొద్దు. పిన్నీ తుది నిర్ణయం మీదే. వాడు ప్రాణాలతో ఉండాలా.. భూమీ మీదే లేకుండా పోవాలా.. ఎండీ సీటులో కూర్చోవాలా.. ఎక్కడొ ఓ చోట బతికింటే చాలా అని శైలేంద్ర అంటాడు. నా కొడుకుని వదిలేయ్.. ఎందుకు అలా పగబట్టావ్. అని జగతి అంటుంది. నాకంటే గొప్పగా ఎదిగాడు. ఎదుటివారి మీద ఈర్ష్య, పగ, కోపం పెంచుకోడానికి ఇవి చాలదా.. వాడిని 3 రోజుల్లో పంపిచేయ్ లేకుంటే తెలుసుకదా. ఆ సీటులో నేను కూర్చోవడం మా అమ్మ కోరిక అని శైలేంద్ర అంటాడు. దీంతో జగతి షాక్ అవుతుంది.


Click it and Unblock the Notifications











