Guppedantha Manasu: రిషి ప్రతిష్ట పొగెట్టేలా అన్నయ్య దొంగ దెబ్బ.. వసుధార మీదకు తోసేసిన శైలేంద్ర

రిషి మీద పూల కుండి పడేలా శైలేంద్ర ప్లాన్ చేస్తాడు. అది చూసిన వసుధార.. రిషిని కాపాడుతుంది. తర్వాత తనే ప్లాన్ చేసినట్లుగా జగతితో చెబుతాడు శైలేంద్ర. మూడు రోజుల్లో రిషిని ఎక్కడికైనా పంపించేయమని వార్నింగ్ ఇస్తాడు శైలేంద్ర.

ఇది మా అమ్మ కోరిక. నువ్వు నీ కొడుకుని ఉన్నత స్థాయిలో చూస్తున్నట్లుగానే.. మా అమ్మ కూడా నన్ను రాజులా చూడాలనుకుంటుంది కదా పిన్నీ. నీకు 24 గంటల సమయమే ఉంది బాగా ఆలోచించుకో అని చెప్పేసి వెళ్లిపోతాడు శైలేంద్ర. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్‌ మే 22 సోమవారం నాటి ఎపిసోడ్‌ 769లో ఇంకా ఏం జరిగిందంటే?

Guppedantha Manasu Serial May 22 2023 Today Full Episode 769

రిలాక్స్ గా కూర్చోండి: శైలేంద్ర వెళ్లిపోయాక.. దేవుడా ఏంటీ ఈ కష్టాలు.. ఈ గండాలు ఎప్పుడు తీరతాయి. ఈ విషయాన్ని నాలో ఉంచుకోవడం మంచిది కాదు. మహేంద్రకు చెబుదాం అనుకుని కాల్ చేస్తుంది జగతి. మహేంద్ర ఫోన్ కలవకపోవడంతో టెన్షన్ పడిపోతుంది జగతి. మరోవైపు రిషిని క్యాబిన్ లో కూర్చోబెట్టిన వసుధార.. సార్ కంగారుగా ఉందా.

కాస్తా రిలాక్స్ గా కూర్చొండి. పెద్ద ప్రమాదం తప్పింది. నేను లేకుండా మీరు ఎక్కడికి వెళ్లకండి అని వసుధార అంటుంది. అవును వసుధార.. చాలా థ్యాంక్స్. నువ్వు లేకుంటే ఏమయ్యేదే.. ఈపాటికి హాస్పిటల్ లో ఉండేవాన్ని. అసలు ఎలాంటి స్థితిలో ఉండేవాన్నో ఆలోచిస్తేనే అదోలా ఉంది అని రిషి అంటాడు.

Guppedantha Manasu Serial May 22 2023 Today Full Episode 769

ఏ దేవుడికి మొక్కితే: ఇంతలో అక్కడికి జగతి వస్తుంది. రిషి నీకు ఏం కాలేదు కదా. వరుసగా నీకు ఇలా జరుగుతుంటే నాకు దడగా ఉంది. తట్టుకోవడం నా వల్ల కావట్లేదు రిషి. నువ్వు ఇంకా జాగ్రత్తగా ఉండాలి అని కన్నీళ్లు పెట్టుకుంటుంది జగతి. నాకు ఏం కాలేదు మేడమ్. మీరు కంగారు పడకండి. ఇది చిన్న విషయం అని రిషి అంటాడు. నీకు చాలా చిన్న విషయంగా ఉంది.

నాకు మాత్రం చాలా కష్టంగా ఉంది. ఏ దేవుడికి మొక్కితే ఈ గండాలు తప్పుతాయో తెలియట్లేదు అని బాధపడుతుంది జగతి. మేడమ్ మీరు భయపడకండి. ఏం కాదు అని ధైర్యం చెప్పి కాలేజీ వర్క్స్ చూసుకోమ్మని జగతిని పంపించేస్తాడు రిషి. మరుసటి రోజు రిషి క్యాబిన్ లో వసు, రిషి మాట్లాడుకుంటారు.

నమ్మకం పోతుంది: సార్ మన డాక్టర్స్ ప్రాజెక్ట్ కు చాలా మంది డాక్టర్స్ స్పందిస్తున్నారు. అమౌంట్ పంపిస్తున్నారు. కొత్త డాక్టర్స్ కూడా బాగా స్పందిస్తున్నారు అని వసుధార అంటుంది. రిషి చాలా సంతోషిస్తాడు. మెడికల్ కాలేజీ కోసం ఒక అకౌంట్ క్రియేట్ చేశాను. చెక్స్ విషయంలో జాగ్రత్తగా ఉండు. మిషన్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన చెక్స్ అన్నీ దాని అకౌంట్ లోనే వేయాలి.

మెడికల్ కాలేజీవి మెడికల్ కాలేజీ అకౌంట్ లోనే వేయాలి. జాగ్రత్త. లేదంటే సమస్యలు వస్తాయి. మిషన్ ఎడ్యుకేషన్ అమౌంట్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ మెడికల్ కాలేజీకి వాడకూడదు. ఎందుకంటే చాలా మంది మన మీదున్న నమ్మకంతో ఫండ్స్ పంపిస్తున్నారు. అలాంటప్పుడు మనం ఏ చిన్న పొరబాటు చేయకూడదు. అలా చేస్తే వాళ్లకు మన మీదున్న నమ్మకం పోవడమే కాదు. మన స్టూడెంట్స్ భవిష్యత్ కి చాలా నష్టం జరుగుతుంది అని రిషి అంటాడు.

Guppedantha Manasu Serial May 22 2023 Today Full Episode 769

అడ్వాన్స్ నేను ఇవ్వనా: రిషి అన్నదానికి సరే అంటుంది వసుధార. ఇంతలో మేనేజర్ వచ్చి బిల్డర్స్ కి చెక్ పంపిచమని చెప్పారు కదా సార్. ఆ విషయం జగతి మేడమ్ గారిని అడిగితే మిమ్మల్ని ఒకసారి కలవమని చెప్పారు అని అంటాడు. పర్సనల్ బ్యాంక్ బ్యాలెన్స్ వసుధారను అడిగితే.. నిన్ననే 2 కోట్లు రిలీజ్ చేశాం. ఇప్పుడు అమౌంట్ తక్కువగా ఉంది. వేసిన చెక్స్ ఇంకా క్రెడిట్ కాలేదు.

ఈరోజు అకౌంట్ లో వేయాలి అని వసుధార అంటుంది. సరే నేను చూసుకుంటాను అని మేనేజర్ ను పంపిస్తాడు రిషి. ఇంతలో అక్కడికి వచ్చిన శైలేంద్ర ఆరా తీస్తాడు. డబ్బులు లేవని అంటే.. అడ్వాన్స్ అమౌంట్ నేను ఇవ్వనా. ఎంతైనా ఇది మన కాలేజీ కదా అని శైలేంద్ర అంటాడు. వద్దు అన్నయ్యా.. అలా నాకు ఇష్టం ఉండదు. నేను చూసుకుంటాలే అని రిషి అంటాడు.

Guppedantha Manasu Serial May 22 2023 Today Full Episode 769

మీరు నమ్మరని తెలుసు: వసుధార నేను కొన్ని డీటేల్స్ ఇస్తాను రాసుకో అని రిషి వసుతో మాట్లాడుతుంటాడు. ఇంతలో టేబుల్ మీదున్న మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కు వచ్చిన ఒక చెక్ ను వసు, రిషిలు చూడకుండా తీసుకుంటాడు. తర్వాత ఆ చెక్ ను సారథికి ఇస్తాడు. నేను చెప్పింది మొత్తం గుర్తుంది కదా. మిస్టర్ రిషీంద్ర భూషణ్ సొసైటీలో నీకు పేరు ప్రతిష్టలన్నీ పోతాయి దీనితో నిన్ను దెబ్బ కొట్టి ఏండీ సీటులో నేను కూర్చుంటాను అని శైలేంద్ర అంటాడు.

సారథి వెళ్లి మంత్రిని కలుస్తాడు. సార్ నేను డీబీఎస్టీ మెడికల్ కాలేజీ కన్స్ట్రక్షన్ బిల్డర్ ను సార్. రిషి సార్ తప్పు చేశారు. మీరు నమ్మరని తెలిసే ఆధారాలతో వచ్చాను అని చెప్పిన సారథి చెక్ ఇస్తాడు. ఇది మిషన్ ఎడ్యుకేషన్ చెక్ కదా అని మంత్రి అంటే.. అవును సార్.. దీన్ని నాకు అడ్వాన్స్ గా రిషి ఇచ్చారు అని సారథి చెబుతాడు.

Guppedantha Manasu Serial May 22 2023 Today Full Episode 769

ఇద్దరు ఆఫీస్ కు రండి: నేను నమ్మను. రిషి మీద కుట్రలు జరుగుతున్నాయి. ఇప్పుడే కనుక్కుంటాను అని చెప్పిన మంత్రి వసుధారకు కాల్ చేసి ఒక అభియోగం వచ్చింది అని చెబుతాడు. ఏంటీ సార్ అది అని వసుధార కంగారు పడితే.. కంగారు పడకమ్మా. నేనేం నమ్మలేదు. మిషన్ ఎడ్యుకేషన్ ఫండ్స్ ను దారి మళ్లించి వేరే వాటికి ఉపయోగిస్తూ రిషి ఒక చెక్ ఇచ్చాడనదే అభియోగం.

దీనిమీద క్లారిటీ కావాలి అని మంత్రి అంటాడు. సార్ అలా ఎప్పుడు జరగదు అని వసుధార అంటే.. సరే.. నువ్వు జగతి మేడమ్ ఇద్దరు కలిసి ఆఫీస్ కు రండి అని మంత్రి చెబుతాడు. జరిగింది జగతికి వసు చెబుతుంటే.. శైలేంద్ర వచ్చి వసుధార అని గట్టిగా అరుస్తాడు.

ఏం ఆశించి చేశావ్: శైలేంద్ర మాట విని షాక్ అవుతారు జగతి, వసుధార. ఎందుకు ఈ పని చేశావ్. చెక్ మీద సంతకాలు ఎలా వచ్చాయి. ఆ చెక్ వేరే దాని కోసం బయటకు ఎలా వెళ్లింది. నాకు తెలిసి రిషి ఈ పని చేయడు. కానీ నువ్వు ఎందుకు ఈ పని చేశావో చెప్పు. ఏం ఆశించి చేశావో చెప్పు అని శైలేంద్ర అంటాడు. నేనేం తప్పు చేయలేదు అని వసుధార కోపంగా అంటుంది. అంటే జగతిని ఇరికించినట్లుగానే వసుధారను కూడా రిషి మనసులో బ్యాడ్ చేసేందుకు శైలేంద్ర స్కెచ్ వేసినట్లుగా తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X