Guppedantha Manasu: రిషిని పూర్తిగా ముంచేసిన కుటుంబం.. రాజు ఎక్కడున్నా రాజే అంటూ!
రిషిని అవినీతిలో ఇరికించేందుకు వసుధారను ఒప్పిస్తుంది జగతి. ఏం మాట్లాడుతున్నారు మేడమ్. రిషి సార్ మీద నింద వేయడమా. అది కూడా చేయని తప్పుకి బలి చేయడమా. నా వల్ల కాదు మేడమ్. ప్లీజ్ నేను అబద్దం చెబితే రిషి సార్ మనసు విరిగిపోతుంది. నన్ను జీవితంలో క్షమించరు.
మా బంధం చెదిరిపోతుంది. రిషి సార్ నా ప్రాణం. తను నాకు దూరం అయితే తట్టుకోలేను. సార్ నన్ను దూరం పెడితే నేను బతకలేను. కావాలంటే నా ప్రాణాలు అడగండి ఇచ్చేస్తా అని వసుధార ఏడుస్తూ అంటుంది. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్ మే 25 గురువారం నాటి ఎపిసోడ్ 772లో ఇంకా ఏం జరిగిందంటే?

నీ కాళ్లు పట్టుకుంటాను: అది కాదు వసు.. మనకు వేరే మార్గం లేదు. మహేంద్రకు చెప్పిన ఇప్పుడు ఆలోచించే సమయం కూడా లేదు. శైలేంద్ర రాక్షసుడు. వాడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు. రౌడీ ఎటాక్, లారీ యాక్సిడెంట్, పూల కుండీ పడేయించి రిషి ప్రాణాలు తీయడానికి చూశాడు. నాకు తెలుసు రిషి ప్రాణంగా ఈ సామ్రాజ్యాన్ని పెద్దది చేశాడు. కానీ దీన్ని వదిలి పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది.
కానీ రాజు ఎక్కుడున్నా రాజే కదా. నీకు దండం పెడతాను. కావాలంటే నీ కాళ్లు పట్టుకుంటాను అని వసుధార కాళ్లమీద పడబోతుంది జగతి. వసుధారా ఆపుతుంది. అన్నిటికంటే మనకు రిషి ప్రాణాలతో ఉండటమే ముఖ్యం కదా అని జగతి ఏడుస్తూ అంటుంది. తల అడ్డంగా ఊపుతు వసుధార కూడా ఏడుస్తూ ఉంటుంది.

కుమిలిపోయిన వసు: మరోవైపు రిషి దగ్గరకు వెళ్లిన కాలేజీ బాయ్ సార్ మిమ్మల్ని జగతి మేడమ్ కాన్ఫరెన్స్ హాల్లోకి రమ్మనమని చెప్పారు అని అంటాడు. ఎందుకు అని రిషి అడిగితే.. తెలియదంటాడు కాలేజీ బాయ్. ఇంతలో సార్ అర్జెంట్ గా నా క్యాబిన్ కు రండి అని వసుధార కూడా మెసేజ్ చేస్తుంది. ఇదేంటి వసుధార కూడా అర్జంట్ గా రమ్మంటుంది అని వెళ్తాడు రిషి.
వసుధార క్యాబిన్ కు వెళ్లేసరికి ఏడుస్తూ కూర్చుంటుంది. అది చూసి కంగారుగా వసుధార ఏమైంది అని రిషి అడుగుతాడు. దీంతో కుర్చి లో నుంచి లేచి రిషిని గట్టిగా హగ్ చేసుకుని కుమిలి కుమిలి ఏడుస్తుంది వసుధార. వసుధార ఏమైంది అని మరింత కంగారుగా అడుగుతాడు రిషి. వసుధార మాత్రం అలా ఏడుస్తూనే ఉంటుంది. ఈ సీన్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది.

ఎందుకు ఏడుస్తున్నారు: సార్ ఏ మనిషికైనా జీవితంలో ఏది ముఖ్యం అని రిషిని వసుధార అడుగుతుంది. ఎందుకు అలా అడుగుతున్నావ్ వసుధార అని రిషి అంటాడు. ప్లీజ్ సార్ చెప్పండి. ప్రాణం ముఖ్యం కదా. ప్రాణం ఉంటేనే కదా పేరు పరపతి అన్నీ ఉండేవి అని వసుధార అంటుంది. మిగతా వాళ్ల విషయంలో నువ్వు చెప్పింది నిజమే. కానీ రిషిధారలకు ప్రేమే ముఖ్యం అని రిషి అంటాడు. దీంతో మరింతగా ఏడుస్తూ రిషిని హగ్ చేసుకుంటుంది వసు.
వసుధార నువ్వు ఇలా కన్నీళ్లు పెట్టుకోవడం చూడలేకపోతున్నా. ఈరోజు నాకు చాల సంతోషంగా ఉండే రోజు. కానీ నువ్వు మేడమ్ ఆనందంగా ఉండాల్సిందిపోయి కంగారు పడుతున్నారు. ఎందుకు ఇలా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. చెప్పు ఏదైనా సమస్య. ఏదైనా ఉంటే చెప్పు. అంతేకానీ నా దగ్గర దాచి పెట్టి మీలో మీరు బాధపడుతూ ఉండకండి అని రిషి అంటాడు.

చెక్ ఎవరికీ ఇవ్వలేదు: ఏం లేదు సార్. ఎందుకో ఆందోళనగా ఉంది అని వసుధార అంటుంది. నాకేం వసుధార. నువ్వు, మేడమ్ పక్కనే ఉండగా నాకు ఎలాంటి ఆపద రాదు అని రిషి అంటాడు. కట్ చేస్తే అంతా కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం అవుతారు. ప్రెస్ మీటి గురించి రిషి అడిగితే జగతి క్యాన్సిల్ చేశాను. నీ మీద అభియోగం వచ్చింది. అది నిజమో కాదో తేలాలి. మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కోసం వాడాల్సిన ఫండ్ ను మరోదానికి ఉపయోగించారని అభియోగాలు వచ్చాయి అని జగతి అంటుంది.
లేదు మేడమ్ నేను ఏ చెక్ ఎవరికీ ఇవ్వలేదు అని రిషి అంటాడు. దీంతో అదేంటీ సార్.. మీరు నాకు ఇచ్చారు కదా. మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ చెక్ ఇచ్చారనే కదా మంత్రి గారిని కలిసింది. అది మా సర్దుబాటు. మీకు కావాల్సింది డబ్బులు. ఇవన్నీ మీకు అనవసరం. ముందు డబ్బులు తీసుకోండని అన్నారు అని సారథి అంటాడు.

సాక్ష్యాలే ముఖ్యం: సారథి అన్న మాటలకు ఫైర్ అవుతాడు రిషి. బయటకు వెళ్లరా అని గట్టిగా అరుస్తాడు రిషి. సార్ అతను ఫ్రాడ్. అబద్ధం చెబుతున్నాడు మంత్రితో రిషి అంటాడు. మా రిషి అలా ఎందుకు చేస్తాడు. వేరే వాళ్ల ఒక్క రూపాయి కూడా ఆశించడు అని దేవయాని అంటుంది. ముందు విచారణ కానివ్వండి అని మంత్రి అంటాడు. ఏంటీ సార్ విచారణ. మా తమ్ముడు అలా చేయడు అని శైలేంద్ర నటిస్తాడు.
మా రిషి తప్పు చేయని మనిషి. ఆ నమ్మకం నాకు ఉంది అని ఫణీంద్ర అంటాడు. ఇక్కడ నమ్మకాలతో పని లేదు. సాక్ష్యాలే ముఖ్యం అన్న జగతి చెక్ తీసి చూపిస్తుంది. ఈ చెక్ మీద రిషి నీ సంతకాలు ఉన్నాయి. పైగా అవి మీ అసలు సంతకాలతో మ్యాచ్ అయ్యాయి కూడా. ఇప్పుడు చెప్పండి అని జగతి కఠినంగా అంటుంది.
అనుమానిస్తున్నారు: ఆ చెక్ అందుకుని దాని మీద ఉన్న సంతకాలు చూసి షాక్ అవుతాడు రిషి. చెక్ జారీ చేసే పవర్స్ మీ ఇద్దరికే ఉంది అని మంత్రి అంటాడు. దీంతో వసుధార మనం ఈ చెక్ ఇష్యూ చేశామా. లేదు కదా అని రిషి అంటాడు. జగతికి ఇచ్చిన మాటను గుర్తు చేసుకుంటుంది వసుధార. ఇది మన వ్యక్తిత్వానికి సంబంధించిన విషయం. మనల్ని అనుమానిస్తున్నారు.
ఈ సమయంలో సైలెంట్ గా ఉండటం కరెక్ట్ కాదు. ఈ చెక్ మననం ఇవ్వలేదు అని చెప్పు వసుధార అని ఆవేశంగా పైకి లేస్తాడు రిషి. దీంతో బిత్తరచూపులు చూస్తుంది వసుధార. ఇక చూస్తుంటే తర్వాతి ఎపిసోడ్ లో రిషినే చెక్ ఇచ్చినట్లు వసుధారు చెప్పేలా ఉంది. అదే జరిగితే జగతి, వసుధార పరోక్షంగా, దేవయాని, శైలేంద్ర కుట్ర పన్ని రిషిని పూర్తిగా ముంచేసిన వాళ్లు అవుతారు.


Click it and Unblock the Notifications











