Guppedantha Manasu: కన్నీళ్లు తెప్పించే సీన్లు.. జగతికి వరంగా అమ్మ పిలుపు.. వసుతో రిషి బ్రేకప్

మిషన్ ఎడ్యుకేషన్ ఫండ్స్ దారి మళ్లించినట్లుగా రిషి దోషి అవుతాడు. కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఇక నుంచి రిషి ఒంటరి అని వెళ్లిపోతాడు. దీంతో దేవయాని, శైలేంద్ర సంతోషంలో మునిగిపోతే.. రిషిని ఆపేందుకు వసుధార, జగతి ప్రయత్నిస్తారు. రిషి అని జగతి పిలిస్తే.. ఇంకా ఏమైనా చెప్పేది మిగిలి ఉందా మేడమ్ అని కోపంగా అంటాడు రిషి. అది కాదు రిషి నిన్ను కాపాడుకునేందుకే ఇలా చేయాల్సి వచ్చింది అని జగతి అంటుంది. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్‌ మే 27 శనివారం నాటి ఎపిసోడ్‌ 774లో ఇంకా ఏం జరిగిందంటే?

ఇది నయ వంచనే" కాపాడుకోవడానికి నా వ్యక్తిత్వంపై దాడి చేయాలా మేడమ్, నన్ను ఇలా మోసగాడిగా నిరూపించాలా. మీ శిష్యురాలితో ఇలా చెప్పించాలా. ఇది నయ వంచనే కదా. ఈ బాధను మోయడం నా వల్ల కావట్లేదు మేడమ్. నమ్మి మోసపోయాను అని రిషి ఆవేదనగా అంటాడు. రిషి నిన్ను కాపాడుకోవడం కోసమే ఈ విధంగా వసు అబద్ధం చెప్పాల్సి వచ్చింది. ఇందులో వసుధార తప్పేం లేదు అని జగతి అంటుంది. అవును మేడమ్. మీ తప్పు ఏం లేదు. తప్పంతా నాదే. నమ్మడం నాదే తప్పు. ఓ మనిషిని కాపాడటానికి వాడి వ్యక్తిత్వాన్ని చంపేస్తారా అని రిషి అంటాడు.

Guppedantha Manasu

చంపేశారుగా: నేను ఏం పాపం చేశాను మేడమ్. మీ కడుపున పుట్టడమే నేను చేసిన నేరమా. అన్నదమ్ములు మోసం చేయడం, భార్యా భర్తలు ద్రోహం చేసుకోవడం చూస్తాం.. వింటాం. కానీ కన్న బిడ్డను ఏ తల్లి మోసం చేస్తుంది మేడమ్ అని రిషి అంటే జగతి గుండె పగిలేలా ఏడుస్తుంది. నన్ను నమ్ము రిషి. నేను నీకు ద్రోహం చేయలేదు అని జగతి అంటుంది. ఇది ద్రోహం కాదు. దీన్ని చెప్పడానికి మాటలు కూడా లేవనుకుంటా. మనుషులు పుడుతుంటారు. చస్తుంటారు. కానీ మీరు బతికుండగానే చంపేశారుగా. నన్ను బయటకు పంపించడానికి సాక్ష్యాధారాలతో నిరూపించారు అని రిషి అంటాడు. ఏ తల్లి తన కొడుక్కు అన్యాయం చేయదని జగతి అంటుంది.

పారిపోయాడని చెప్పండి: అవును నిజమే. ఎక్కడో చదివాను. చెడ్డ కొడుకు ఉంటాడు కానీ, చెడ్డ తల్లి ఉండదని. మీరు నాపై అనర్హత వేటు వేశారు కదా. అలాగే నేను చూడటానికి, మాట్లాడటానికి అనర్హుడిని చేయండి. చిన్నతనంలో నన్ను వద్దనుకున్నట్లుగానే ఇప్పుడు కూడా వద్దనుకోండి. ఈ మోసగాడిని ఇలా వదిలేయండి అని రిషి వెళ్తుంటే.. మీ డాడ్ అడిగితే ఏం చెప్పను అని జగతి అంటుంది. దీంతో రిషి ఆగిపోతాడు. మహేంద్ర నా కొడుకు ఎక్కడ అని అడిగితే ఏం చెప్పను రిషి అని జగతి కుమిలిపోతుంది. అలా కొద్దిసేపు ఎమోషనల్ అయిన రిషి.. మోసం చేసి పారిపోయాడు అని చెప్పండి. మొహం చెల్లక, తలెత్తుకోలేక ఎటో వెళ్లిపోయాడని చెప్పండి. నేను మోసగాడు అంటే నమ్మరేమో. మీ దగ్గర ఉన్న సాక్ష్యాలు చూపించండి. కచ్చితంగా తప్పు చేశానని నిరూపించండి అని రిషి అంటాడు.

Guppedantha Manasu

అమ్మా అని పిలిచిన రిషి: రిషి ఈ అమ్మను క్షమించు.. వీలైతే శిక్షించు అని వేడుకుంటుంది జగతి. మీరు నన్ను వదిలి వెళ్లిన తర్వాత ఎంతో క్షోభ పడ్డాను. తర్వాత మొదట మీ శిష్యురాలిని నా జీవితంలోకి పంపారు. తర్వాత మీరు వచ్చారు. ఇది నేను చాలా సార్లు అనుకున్నా. మీతో చెప్పాలనుకున్నా. మీరు వెళ్లిన కారణం కరెక్టేనేమో అని అనిపించింది. అందుకే చాలా సార్లు అమ్మా అని పిలవాలనుకున్నా. కానీ ఇలాంటి రోజు ఒకటి వస్తుందని అస్సలు అనుకోలేదు. మిమ్మల్ని క్షమించడానికి నేను ఎవరిని. తల్లిని క్షమించే కొడుకు ఇంకా పుట్టలేదనుకుంటా. కానీ కొడుకుగా కాపాడుకుంటున్నానని కారణం చెప్పి.. వ్యక్తిగా నన్ను చంపేశావ్ కదమ్మా అని తొలి సారిగా జగతిని అమ్మా అని పిలుస్తాడు. ఒక్కసారిగా అక్కడ నిశబ్దం ఏర్పడి స్థంభించిపోయినట్లుగా ఉంటుంది.

ఇది ధృతరాష్ట కౌగిలి: అమ్మా అని పిలిచినందుకు జగతి ఆశ్చర్యంగా సంతోషిస్తూ నువ్వు నన్ను అమ్మా అని పిలిచావా రిషి అని అంటుంది. జీవితంలో ఈ పిలుపు మీరు వినలేదనే బెంగ మీకు ఉండకూడదని పిలిచాను. ఇక నేను మీ జీవితాల్లోకి రాను అని తెగేసి చెబుతాడు రిషి. శిక్షించమంటే వరం ఇచ్చి వెళ్తున్నావా రిషి అని జగతి అంటుంది. డాడ్ ని జాగ్రత్తగా చూసుకోండి అని వెళ్లిపోతాడు రిషి. దీంతో జగతి రోడ్డుపైన కూలబడి కుమిలి కుమిలి ఏడుస్తుంది. రిషి వెంటే వెళ్లిన వసుధార హగ్ చేసుకుంటుంది. ఇది ధృతరాష్ట కౌగిలి వదులు వసుధార అని రిషి విడిపించుకుంటాడు. వసు అలాగే పట్టుకోవడంతో బలవంతంగా విడిపించుకుని అటు తోసేస్తాడు. నన్ను ముట్టుకోకు, తాకకు, నీకు ఆ అర్హత లేదు అని రిషి అంటాడు.

Guppedantha Manasu

వసుధార మాత్రమే: ఓ మనిషికి ప్రాణం ముఖ్యమనినువ్వన్నప్పుడు రిషిధారలకు మాత్రం ప్రేమే ముఖ్యమని అన్నాను. కానీ ఆ ప్రేమను నువ్వు చంపేశావ్. అక్కడ నాపై వచ్చిన అభియోగం నిజం కాదని నిరూపించడానికి నాకు రెండు సెకన్లు పట్టదు. కానీ నీకోసం, నువ్వు చిన్నబోకూడదని మౌనంగా దోషిలా నిలబడ్డాను. దాపరికాలు లేని ప్రేమను కోరుకున్నాను. కానీ నువ్వు ఆ దాపరికాల్లోనే బతికావ్. నువ్వు ఉన్న చోట నేనుండలేను. పెద్దల కుదిర్చిన బంధంతో నువ్వు మా ఇంట్లో ఉంటానంటే ఉండు. కానీ నేను మాత్రం అక్కడ ఉండను. నువ్వు నా పక్కన ఉంటే ప్రశాంతంగా ఉండలేను అని చెప్పిన రిషి ఎంగేజ్ మెంట్ రింగ్ తీసి వసు చేతిలో పెడతాడు. మన బంధానికి మనం పెట్టుకున్న పేరు రిషిధార. ఇప్పుడు వసుధార మాత్రమే మిగిలింది అని రిషి అంటాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X