Guppedantha Manasu: కుప్పకూలిన బంధాలు.. జగతిని నిందించిన శిష్యురాలు.. వసు తల్లికి గుండెపోటు
వసుధారకు తన చేతికి ఉన్న వీఆర్ అనే ఉంగరాన్ని ఇచ్చేస్తాడు రిషి. మన బంధానికి మనం పెట్టుకున్న పేరు రిషిధార. కానీ ఇప్పుడు వసుధార మాత్రమే మిగిలి ఉంది. రిషిధారను మీ అబద్ధపు సాక్ష్యాధారాలతో కూల్చేశారు. రిషిని పడగొట్టారు. ఇప్పుడు వసుధార మాత్రమే నిలబడి ఉంది అని రిషి ఆవెదనగా అంటాడు. సార్ ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి. ఇంకెప్పుడు మీ దగ్గర ఏ విషయం దాచిపెట్టను అని వసు అంటుంది. వసుధార ప్లీజ్ అన్న రిషి దండం పెడతాడు. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్ మే 29 సోమవారం నాటి ఎపిసోడ్ 775లో ఇంకా ఏం జరిగిందంటే?
జీవితంలో ఎదురుపడకు:బంధం ఉన్న ప్రతీ ఒక్కరూ నాతో ఆడుకుంటూ వేధిస్తూనే ఉన్నారు. మీతం బంధం నన్ను హింసిస్తోంది. మన మధ్య నమ్మకం కోల్పోయింది. నమ్మకం లేని చోట ప్రేమ నిలబడదు అని రిషి అంటాడు. సార్ నేను మీ నీడను అని వసధార అంటుంది. మనిషిగా చంపేశారు. ఇంకా నీడేంటీ.. వదిలేయ్. వెంటాడకు దయచేసి అని రిషి అంటాడు. నాకు మీ మీద ప్రేమ అభిమానం ఎప్పటికీ పోవు సార్ అని వసుధార ఎడుస్తూ అంటుంది. నవ్వు చెప్పింది నిజమే అయితే నాకు ఇంకెప్పుడు ఎదురుపడకు. జీవితంలో నన్ను కలవాలని కానీ చూడాలని కానీ ప్రయత్నించకు. సెలవు అని రిషి కోపంగా వెళ్లిపోతాడు. సార్ ఆగండి అంటూ వసు ఎంత అన్న వినిపించుకోకుండా వెళ్లిపోతాడు. జగతి వచ్చి వసుధార భుజంపై చేయి వేస్తుంది.

మీరే కారణం:నన్ను టచ్ చేయకండి మేడమ్ అని అరుస్తూ దూరంగా జరుగుతుంది వసుధార. వసు అని జగతి దగ్గరికి వెళ్లబోతుంటే.. వద్దు మేడమ్.. మీరి ఇక ఏం చెప్పొద్దు. నేనేం వినదలుచుకోలేదు. నేను ముందు నుంచి చెబుతూనే ఉన్నాను. జరుగుతున్నవన్నీ రిషి సార్ కి చెబుదామని. సార్ దగ్గర దాచిపెడితే మనల్ని క్షమించడు. తను భరించలేడు అని. ఇప్పుడు చూశారు కదా. నేను భయపడినట్లే జరిగింది కదా మేడమ్ అని కోపంగా ఏడుస్తూ అంటుంది వసు. నేను ఎందుకు చేశానో నీకు తెలుసు కదా వసు. నేను ఏం చేసినా మీకోసమే చేశాను వసు అని జగతి అంటుంది. ప్రయోజనం ఏముంది మేడమ్. మా ప్రేమకు కారణం మీరే.. అది విడిపోవడానికి కూడా మీరే కారణం అని వసుధార అంటుంది.

ఒంటరి అవుతాడనుకోలేదు:వసు అలా అనుకోకు. మీ ప్రేమ చాలా గొప్పది. ఏ రోజుకైనా రిషి తిరిగి వస్తాడు. నిన్ను అర్థం చేసుకుంటాడు అని జగతి అంటుంది. అది కల మేడమ్, కల. సార్ ఇక తిరిగి రారు. మనం తన మనసుని ముక్కలు చేశాం. అందుకే మన బంధానికి ముగింపు చెప్పి వెళ్లిపోయారు. దానికి సాక్ష్యం ఇదే మేడమ్ అని రిషి ఇచ్చిన ఎంగేజ్ మెంట్ రింగ్ జగతికి చూపిస్తుంది వసు. దీంతో జగతి షాక్ అవుతుంది. మీ మాట విన్నందుకు నాకు నేనే విధించుకున్న శిక్ష మేడమ్. మీరు చెప్పినట్లు చేస్తే రిషి సార్ దక్కుతారనుకున్నాను. కానీ ఇలా ఎవరికీ కాకుండా ఒంటరివాడై వెళ్లిపోతాడనుకోలేదు. మీరు నన్ను గురుదక్షిణ కోరి నాకు మంచి ప్రతిఫలమే ఇచ్చారు అని వసుధార అంటుంది.

ముగ్గురు 3 దారుల్లో:వసు అని జగతి అంటుంటే. మేడమ్ ప్లీజ్ అంటూ దండం పెట్టిన వసు.. శిష్యులకు ఇచ్చే ప్రతిఫలం ఏదైనా ఉంటే మీరు నన్ను మళ్లీ కలవాలని చూడకండి మేడమ్. నాతో మాట్లాడటానికి ప్రయత్నించకండి. రిషి సార్ లాగే నేను కూడా అందరికీ దూరంగా వెళ్లిపోతున్నాను. మీకు దండం పెడతాను. మీ కాళ్లు పట్టుకుంటాను. నా వెంట రాకండి. ఇది నాకు నేను విధించుకున్న శిక్ష అని చెప్పేసి వెళ్లిపోతుంది వసుధార. బ్యాక్ గ్రౌండ్ లో పాట వస్తుంటే జగతి, వసు, రిషి ముగ్గురు మూడు దారుల్లో వెళ్లిపోతుంటారు. జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుంటారు. పుట్టింటికి వచ్చిన వసును చూసి సంతోషపడుతుంది సుమిత్ర. కానీ వసుధార ఏడవం చూసి ఏమైంది అని అడుగుతుంది.

సుమిత్రకు గుండెపోటు:వసుధార ఎంతకు చెప్పకపోవడంతో ఏమైందో చెప్పవే. కట్టుబట్టలతో వచ్చావేంటీ. నాకు గుండె దడగా ఉంది అని సుమిత్ర నిలదీస్తుంది. దీంతో మా మధ్య ఉన్న బంధం తెగిపోయిందమ్మా. ఈ జీవితంలో నా ముఖం చూడనని రిషి సార్ చెప్పారు. నమ్మించే మోసం చేశాను. రిషి సార్ ఏ తప్పు చేయలేదు. తనను కాపాడుకోవడానికి అలా చేయాల్సి వచ్చింది. చివరికి ఇలా ఒంటరిగా మిగిలిపోయాను అని జరిగిన విషయమంతా వసుధార చెబుతుంది. దీంతో సుమిత్ర షాక్ అవుతుంది. ఏంటే నీ జీవితం ఇలా అయిపోయింది, నా గుండె పగిలిపోతుందే అంటూ గుండెపోటుతో కుప్పకూలిపోతుంది. ఇంతలోనే వచ్చిన చక్రపాణి కంగారుపడతాడు. అమ్మకు గుండెపోటు వచ్చింది నాన్న ఆస్పత్రికి తీసుకుపోదామని వసుధార కంగారుగా అంటుంది.

నేను మోసగాడిని:మరోవైపు ఓ చోట రిషి టీ తాగుతుంటాడు. అక్కడ టీ షాపు అతని కొడుకు హోమ్ వర్క్ చేసుకుంటాడు. ఛ.. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ కావట్లేదే అని అనుకుంటాడు. దీంతో ఆ బాబుని రిషి పిలిచి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడు. టీ కొట్టు అతనికి రిషి టీ డబ్బులు ఇవ్వబోతుంటే వద్దని, నా కొడుకు ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు. దానికి ప్రతిఫలంగా డబ్బు తీసుకోను అని టీ అతను అంటాడు. నేను నేర్చుకుంది నలుగురికి ఉపయోగపడాలనే చేశాను తప్పా. వేరే ఏది ఆశించి కాదు అని చెప్పిన రిషి డబ్బులిస్తాడు. ఇంతలో ఆ బాబు వచ్చి.. సార్ మీరు స్కూల్లో టీచరా.. కాలేజీలో లెక్చరరా.. మీరు ఏం చేస్తారు అని అడుగుతాడు. దానికి నేను మోసగాడిని అని రిషి అనడంతో అక్కడున్న వాళ్లంతా షాక్ అవుతారు.


Click it and Unblock the Notifications











