Guppedantha Manasu: రిషి లైఫ్‌లోకి కొత్త అమ్మాయి.. తమ్ముడిని చంపమన్న శైలేంద్ర.. మహేంద్ర ఫైర్
హాల్లో ఫణీంద్ర, దేవయాని, శైలేంద్ర కూర్చుని ఉంటారు. రిషి అంటూ సంతోషంగా వస్తాడు మహేంద్ర. అన్నయ్యా కంగ్రాట్స్. మన డీబీఎస్టీ కాలేజ్ నంబర్ వన్ కాలేజ్ స్థానంలో నిలబడింది తెలుసా అని చెబుతాడు మహేంద్ర. ఇంతలో అక్కడికి జగతి వస్తుంది. హేయ్ జగతి.. మన రిషి పేరును ఢిల్లీలో ఎంత బాగా చెప్పుకుంటున్నారో తెలుసా. కంగ్రాట్స్. మన రిషి కల నెరవేరింది.
వాడిని నా ముందే పొగుడుతుంటే నాకు అంతకన్నా కావాల్సింది ఏముంది చెప్పు. అందుకే ఇవన్నీ తెచ్చాను అని మహేంద్ర చెబుతూ ఉంటాడు. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్ మే 30 మంగళవారం నాటి ఎపిసోడ్ 776లో ఇంకా ఏం జరిగిందంటే?

రిషి బర్త్ డే: రేపు రిషి బర్త్ డే కదా. బాగా సెలబ్రేట్ చేయాలి. శైలేంద్ర దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయు. ఇంకో విషయం. మనం ఇదంతా చేస్తున్నట్లు వాడికి తెలియకూడదు. రిషికి సర్ ప్రైజే ఇద్దాం. జీవితంలో వాడు మరిచిపోలేని గిఫ్ట్ ఇస్తాను అని మహేంద్ర అంటాడు. ఫణీంద్ర, జగతి, ధరణి బాధగా ఉంటే దేవయాని, శైలేంద్ర మాత్రం నవ్వుతూ ఉంటారు. అవును వీళ్లు (రిషి, వసుధార) ఎక్కడా. కనిపించడం లేదేంటీ. లోపల ఉన్నారా.
హో ఈ ఆనందంలో బయటకు వెళ్లారా. లవ్ బర్డ్స్.. ఎక్కడికి వెళ్లారు జగతి అని మహేంద్ర అడుగుతాడు. దీంతో మోసం చేసి పారిపోయానని చెప్పమన్న రిషి మాటలు గుర్తు చేసుకుంటుంది జగతి. చెప్పు జగతి, అక్కడ చేసిందంతా చేసి, ఇక్కడ మౌనంగా ఉంటావేంటీ. నా కొడుకు ఎక్కడా అని మహేంద్ర అడుగుతున్నాడు కదా అని కావాలనే వెటకారంగా అంటుంది దేవయాని.

నింద ఎలా మోపావ్: ఏంటీ జగతి అసలు జరిగింది. అందరూ ఎందుకు డల్ గా ఉన్నారు. ఏదైన జరగరానిది జరిగిందా అని మహేద్ర అంటే.. ఏం లేదు బాబాయ్.. రిషి మనసుకు గాయం చేశారు అని శైలేంద్ర అంటాడు. గాయమా.. ఎవరు.. రిషి ఎక్కడా జగతి. అడుగుతుంది నిన్నే అని మహేంద్ర అంటాడు. ఇంకెక్కడ రిషి.. కాలేజీని ఇంటిని వదిలేసి శాశ్వతంగా ఎక్కడికో వెళ్లిపోయాడు అని చెక్ విషయం గురించి మొత్తం చెబుతుంది దేవయాని.
దీంతో వాట్ అంటూ సోఫాలో కూలిపోతాడు మహేంద్ర. జగతి భుజంపై చేయి వస్తే.. చేయి తీయ్ అని ఫైర్ అవుతాడు మహేంద్ర. నువ్వు ఏం చేశావో నీకు అర్థం అవుతోందా. ఎవరి మీద అభియోగం మోపావో తెలుసా. ఎందుకు ఈ పని చేశావ్. నీతికి నిజాయితికి నిలువెత్తు నిదర్శనం నా కొడుకు. అలాంటి వాడిమీద నింద ఎలా మోపావ్ అని కోపంగా అంటాడు మహేంద్ర.

ఏం ఆశించి చేశారు: జగతి ఏదో చెప్పబోతుంటే.. హేయ్ మాట్లాడకు. రిషి నా ప్రాణం. నేను నిన్నుగా ప్రాణంగా ప్రేమించినందుకు నా ప్రాణాన్నే తీసేశావ్ కదా. చిన్నప్పుడు వాడిని ఒంటరిగా వదిలేశావ్. అడిగితే ఏవేవే సాకులు చెప్పావ్. నిన్ను ఈ ఇంటికి తీసుకువచ్చిన వాడిని శాశ్వతంగా బయటకు వెళ్లగొట్టి.. మళ్లీ నన్ను ఒంటరిని చేశావ్.
ఎందుకు వాడి మీద నీకు అంత కోపం. నీ కడుపును పుట్టడమే వాడు చేసిన తప్పా అని మహేంద్ర అంటే జగతి మనసు ముక్కలు అవుతుంది. ఆవేశపడకు.. రిషి వస్తాడు అని ఫణీంద్ర అంటే.. లేదు అన్నయ్యా.. రాడు. వాడు మనసుకు గాయం చేశారు. నా రిషికి ఆత్మాభిమానం ఎక్కువ. వీళ్లు చేసిన పనికి ఎప్పటికీ తిరిగి రాడు. రిషి ఏంటో వసుధారకు తెలుసు కదా. అలాంటిది వసు అలా చెప్పడం ఏంటీ. దీని వెనుక ఉన్నది ఎవరు జగతి. మీరిద్దరు ఏం ఆశించి ఈ పని చేశారు అని మహేంద్ర నిలదీస్తాడు.

మట్టిలో కలిపేస్తా: మీ ఇద్దరిని చాలా నమ్మాడే వాడు. చాలా తెలివిగా మోసం చేశారు కదా అని మహేంద్ర ఆవేదనగా అంటాడు. నేనేం కావాలని చేయలేదు మహేంద్ర. రిషి బాగు కోసం చేశాను అని జగతి అంటుంది. బాగు కోసమా. ఏంటా ఘోరమైన కారణం అని మహేంద్ర అంటాడు. జగతి చెప్పబోతుంటే శైలేంద్ర బెదిరిస్తాడు. నా కొడుకుని చూసుకోవాలని ఆశగా వస్తే ఇంత పని చేశారు కదా.
నాకు కన్నీళ్లు మిగిల్చారు అంటూ వెళ్లిపోతాడు మహేంద్ర. అంతా వెళ్లిపోతారు. పిన్ని.. బాబాయ్ కోపంలో ఏదో అన్నాడు కానీ, కారణం లేకుండా నువ్వు ఈ పని చేయవని ఆరా తీస్తాడు. ఏడుస్తాడు. నువ్ దానికి కరిగి నిజం చెబితే.. నిజం తెలిసిన వెంటనే బాబాయ్ ను మట్టిలో కలిపేస్తా అని వార్నింగ్ ఇస్తాడు శైలేంద్ర. దీంతో జగతి అల్లాడిపోతుంది.

భూమ్మీద ఉండకూడదు: అనంతరం ఛా.. ఎంత పెద్ద ప్లాన్ చేశాను. అంతా పాడైంది. చివరికీ ఎండీ సీటు పిన్ని చేతుల్లోకి వెళ్లింది. రిషిని అడ్డం పెట్టుకుని పిన్నిని బెదిరించాను. పిన్నీకి ధైర్యం చాలా ఎక్కువ. కానీ ఇప్పుడు పిన్ని మాట వినదు. ఈలోపు రిషిగాడు తిరిగి వస్తే ఎలా.. నేను అనుకుంది జరగాలంటే.. రిషిగాడిని భూమ్మీద ఉండకూడదు అనుకుంటాడు శైలేంద్ర.
ఇంతలో కాల్ వస్తే.. మేము ఇప్పుడే రిషిని చూశాం సార్. ఏం చేయమంటారు అని ఓ రౌడీ అడుగుతాడు. చంపేయండి. వాడు తప్పించుకోకూడదు. పని పూర్తి చేసి రండి. జీవితంలో చూడని డబ్బు ఇస్తాను. ఏ ఎంక్వైరీలో కూడా దొరకొద్దు. ఎవరు చూడకూడదు అని శైలేంద్ర తమ్ముడిని చంపమని చెబుతాడు. దీంతో సరే సార్ అని రౌడీలు అంటారు.
అమ్మాయి ఏంటీ: రోడ్డుపై రిషి నడుచుకుంటూ వెళ్తుంటే ఫాలో అవుతారు రౌడీలు. రోడ్డుపై ఓ యువతి కారు పాడైపోతుంది. రిపేర్ చేయడం రాక ఇబ్బంది పడుతుంటుంది. అది చూసిన రిషి ఆమెకు హెల్ప్ చేస్తానంటాడు. అర్జంట్ వర్క్ మీద వెళ్తున్న ఇలా ట్రబుల్ ఇచ్చింది.
ఏమైందో తెలియట్లేదు అని ఆ అమ్మాయి అంటే చూస్తాను అని రిషి అంటాడు. అదంతా చూస్తున్నరౌడీలు మధ్యలో ఈ అమ్మాయి ఏంట్రా.. ఇప్పుడు రెండు మర్డర్స్ చేయాల్సి వస్తుంది. తర్వాత చూద్దాం అని వెళ్లిపోతారు రౌడీలు. ఇక రిషీనే తీక్షణంగా చూసిన ఆ అమ్మాయి.. కొద్దిసేపటికీ.. రిషి కదా అని అడుగుతుంది. దీంతో షాక్ అయి చూస్తాడు రిషి.


Click it and Unblock the Notifications











