Guppedantha Manasu: శైలేంద్రకు అడ్డు పడిన జగతి.. రిషిపై రాళ్లు.. ఇల్లు, కాలేజీ నుంచి పంపించేలా!

డాక్టర్స్ మేక్స్ డాక్టర్స్ అనే థీమ్ తో చాలా మంది డాక్టర్స్ ని అప్రోచ్ అయ్యాను. మనదేశంలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది సెటిల్ అయిన డాక్టర్స్ ఉన్నారు. వాళ్లు ఒక్కొక్కరు ఒక్కే పేద విద్యార్థిని సపోర్ట్ చేస్తే చాలన్నాను. అందుకు అందరూ ఒప్పుకున్నారు. కచ్చితంగా సపోర్ట్ చేస్తామన్నారని రిషి చెబుతాడు. ప్రతీ స్టూడెంట్ ఓ డాక్టర్ చదివించాలి. ఇది స్పాన్సర్ చేయడం కాదు. సపోర్ట్ అని రిషి అంటాడు. దీంతో బోర్డ్ సభ్యులంతా బాగుందంటూ చప్పట్లు కొడతారు. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్‌ మే 4 గురువారం నాటి తాజా ఎపిసోడ్‌ 754లో ఇంకా ఏం జరిగిందంటే?

కాంటాక్ట్ అయ్యేందుకు:డాక్టర్స్ మేక్స్ డాక్టర్స్ అనే క్యాప్షన్ అద్భుతంగా ఉందని జగతి అంటుంది. ఫణీంద్ర, మహేంద్ర కూడా మెచ్చుకుంటారు. శైలేంద్ర మాత్రం లోపల రగిలిపోతుంటాడు. సార్ నాదో సలహా. ఫారెన్ లో కూడా సెటిల్ అయిన మన దేశం డాక్టర్స్ ని కూడా సాయం కోరాల్సింది అని వసుధార అంటుంది. ఆ ఆలోచన కూడా చేశాను. వాళ్లను కాంటాక్ట్ అయ్యేందుకు ట్రై చేస్తున్నా అని రిషి అంటాడు. మీటింగ్ పూర్తయ్యాక ఫణీంద్ర, రిషి మాట్లాడుకుంటారు. అప్పుడే మహేంద్ర వచ్చి ఓ వీడియో చూపిస్తాడు. అందులో మిషన్ ఎడ్యుకేషన్ తర్వాత ఫ్రీ మెడికల్ కాలేజీ ప్లాన్ చేస్తున్న డీబీఎస్టీ కాలేజ్ ఎండీ రిషి అంటూ గొప్పగా చెబుతారు. అది చూసి శైలేంద్ర రగిలిపోతుంటాడు.

Guppedantha Manasu Serial May 4 2023 Today Full Episode 754

ఛీ కొట్టేలా చేస్తా..:ఇక మహేంద్ర ఫోన్ లో మాట్లాడుతూ తెగ సంతోషపడిపోతాడు. అది జగతికి వసుధార చూపిస్తూ రిషి గొప్పదనాన్ని పొగుడుతుంటుంది. రిషి సార్ కు మంచితనం, ప్రతిభ అన్ని ఉన్నాయి. జెంటిల్ మెన్. ఎంతైనా రిషి సార్ గ్రేట్ అని వసుధార అంటుంది. ఇదంతా విన్న శైలేంద్ర వాడు గ్రేట్ కాదు వరస్ట్ అనిపిస్తాను. తనకు ఎక్కడైతే బ్రహ్మరథం పట్టారో అక్కడే రాళ్లు విసిరేలా చేస్తాను.. ఎవరైతే జేజేలు కొడుతున్నారో వాళ్లే ఛీ కొట్టేలా చేస్తాను అంటూ రగిలిపోతాడు శైలేంద్ర. తర్వాత బయట కూర్చోని రిషి గురించి ఆలోచిస్తుంటాడు శైలేంద్ర. రిషీ చాలా గొప్ప పేరు తెచ్చుకున్నాడు. ఇక్కడ స్టూడెంట్స్ కూడా రిషిని ఓ బ్రదర్ లా ఫీల్ అవుతున్నారు. ఛైర్మన్ స్థానంలో రిషిని తప్పా మరొకరిని ఊహించుకోలేకపోతున్నారు. కానీ అదే స్థానం నాకు కావాలి అని అనుకుంటాడు.

Guppedantha Manasu Serial May 4 2023 Today Full Episode 754

అడ్డదారిలో రాజ్యాలు:సౌజన్య రావుకు కాల్ చేస్తాడు శైలేంద్ర. నేను ఇక్కడ ఇదంతా గమనించాను. ఎక్కడి నుంచి మొదలు కావాలో అక్కడి నుంచి మొదలు పెడతాను. నువ్వు రెడీగా ఉండు. ఆట మొదలవుతోంది. ఈ ఆటలో పడిపోయే రాజు రిషి. సింహాసనం ఎక్కే రాజు ఈ శైలేంద్ర భూషణ్ గుర్తుపెట్టుకో. మర్చిపోవద్దు అని శైలేంద్ర అంటే.. అప్పుడు నేను మీ మంత్రినే కదా సార్ అని సౌజన్య రావు అంటాడు. చెప్పక్కర్లేదు. నువ్వే మంత్రివి. ఎందుకంటే అడ్డదారిలో రాజ్యాలను ఎక్కే రాజులకి అడ్డమైన ఐడియాలు ఇచ్చే మంత్రి కావాలి అని శైలేంద్ర అంటాడు. థ్యాంక్యూ సార్. నా అవసరాన్ని, నా సామర్థ్యాన్ని గుర్తించినందుకు అని సౌజన్య రావు అంటాడు.

Guppedantha Manasu Serial May 4 2023 Today Full Episode 754

అనుమతి తీసుకోవాలా..:నువ్వు రావాల్సిన సమయం ఆసన్నమైంది. ఎప్పుడు రావాలి అనేది చెబుతాను రెడీగా ఉండు అని శైలేంద్ర ఫోన్ పెట్టేస్తాడు. ఇంతలో అక్కడికి జగతి వచ్చి.. ఇక్కడ కూర్చున్నావేంటీ శైలేంద్ర అని అడుగుతుంది. ఊరికే పిన్నీ.. నాకు కాసేపు ఒంటరితనం కావాలనిపించింది. కూర్చున్నాను. మీకేమైనా అభ్యంతరమా.. లేక కాలేజీ ఎండీ అనుమతి ఏమైనా తీసుకోవాలా. నేను గెస్టును కదా అని శైలేంద్ర వెటకారంగా అంటాడు. నాకేం అభ్యంతరం ఉంటుంది శైలేంద్ర. నువ్వు గెస్టువి ఏంటీ. కాలేజీ ఎండీకి నువ్వు అన్నయ్య అని నువ్వు అనుకోవట్లేదా అని జగతి అంటుంది. ఎందుకు అనుకోవట్లేదు. కానీ దానితోనే సరిపెట్టుకోమంటారా అని శైలేంద్ర అంటాడు.

Guppedantha Manasu Serial May 4 2023 Today Full Episode 754

రిషికి కొమ్మలం:ఏది ఏమైనా తమ్ముడి గొప్పతనం చూసి చాలా సంతోషంగా ఉంది. దీనికి కారణం ఏంటా అని ఆలోచిస్తే నాకో విషయం అర్థమైంది. నువ్వు, వసుధార రిషికి సపోర్ట్ గా నిలుస్తున్నారు. మీరే రిషి బలం అని శైలేంద్ర అంటే.. నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావ్ శైలేంద్ర. తనకు మేము బలం కాదు. తనే మాకు శక్తి. తన ఆలోచనలకు మేము ఆధారం అంతే. తను చిన్నప్పటి నుంచి చెట్టుల ఎదిగాడు. చెట్టుకు వేర్లే బలం కానీ కొమ్మలు కాదు. మేము రిషి కొమ్మలం. ఇప్పుడు ఆ చెట్టు పదిమందికి నీడను ఇస్తుంది అని జగతి అంటుంది. ఇంతలో రిషి వస్తాడు. మేడమ్ బిల్డర్స్ ను పిలిపించే పని మిగిలిపోయింది. అది చూద్దాం అని రిషి అంటే.. రిషీ నాకు తెలిసిన బిల్డర్ ఒకరు ఉన్నారు. పిలిపించనా అని శైలేంద్ర అంటాడు. సరే అని రిషి అంటాడు.

Guppedantha Manasu Serial May 4 2023 Today Full Episode 754

శైలేంద్ర ముందు ఐడియా:ఎందుకు రిషి పాత బిల్డర్ ని కూడా ఓసారి రమ్మందాం అని జగతి అడ్డుకుంటుంది. కానీ రిషి మాత్రం జగతి మాట వినడు. ఇక రాత్రి రిషి, వసుధార మాట్లాడుకుంటారు. అక్కడికి వచ్చిన శైలేంద్ర.. మొత్తం పనులు వసుధారకే ఎందుకు. నేను కొన్ని పనులు చేస్తాను అంటాడు వసుధారకు కష్టమా. తను అనుకుంటే ఏదైనా చేస్తుంది అని రిషి అంటే.. అయినా సరే ఖాలీగా ఉండి ఏం చేయను. ఈ పనులు చేస్తాను అని శైలేంద్ర అంటాడు. సరే అని రిషి తన ఐడియాను మరోసారి చెబుతాడు. అది కష్టం కదా. ముందు ఒప్పుకుంటారు. తర్వాత సాయం చేసేటప్పుడు ఆలోచిస్తారు అని శైలేంద్ర అంటే.. లేదు అన్నయ్యా వాళ్లంతా మనస్ఫూర్తిగా ఒప్పుకున్నారు. దాని గురించి వర్రీ అవ్వకు అని చెబుతాడు రిషి.

Guppedantha Manasu Serial May 4 2023 Today Full Episode 754

రిషి, జగతి మధ్య:రేయ్ రిషి.. ఇక్కడే దొరికిపోయావ్ రా. పేద విద్యార్థులకు సాయం చెయ్యాలనుకుంటున్నావ.. అదే అవకాశంగా మార్చుకుని ఈ ఇంట్లోంచి.. కాలేజీ నుంచి బయటకు పంపిచేస్తాను అని శైలేంద్ర అనుకుంటాడు.
తర్వాత జగతితో ఒక ఫైల్ తీసుకురమ్మని చెబితే తీసుకొస్తుంది. ఫైల్ గురించి రిషి చెప్పబోతుంటే.. రిషి ఎప్పుడే ఎందుకు అన్ని ప్లాన్స్ చెప్పడం. ప్రాసెస్ లో ఉంది కదా కంప్లీట్ అయ్యాక చెప్పు అని జగతి అంటుంది. దీనికి ఏంటీ పిన్ని అడ్డు పడుతుంది అనుకున్న శైలేంద్ర.. పిన్నిని నువ్వు మేడమ్ అని పిలవడం నాకు నచ్చట్లేదు అని ఓ పుల్ల వేస్తాడు. దాని గురించే అది ఇదీ మాట్లాడుతుంటే.. శైలేంద్ర.. రిషిని ఈ విషయంలో ఇబ్బంది పెట్టకు అని చెప్పి వెళ్లిపోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X