Guppedantha Manasu: ఘోరం.. తమ్ముడిని చంపేందుకు అన్నయ్య కుట్ర.. రిషిని పట్టుకుని ఏడ్చేసిన జగతి

జగతిని రిషి అమ్మా అని పిలవడంపై చర్చ పెడతాడు శైలేంద్ర. దీంతో విసిగిపోయిన జగతి రషిని ఈ విషయంలో ఇబ్బంది పెట్టకని చెప్పి వెళ్లిపోతుంది. జగతి వెనుకే వెళ్లిన శైలేంద్ర పిన్నీ అని పిలిచి.. మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుంది. అమ్మా అని పిలవని రిషి మీద అంత ప్రేమ ఎందుకు. దేనికోసం పిన్ని ఈ పాకులాట రిషి మీద ఎంత ప్రేమగా ఉన్నా కానీ ఉపయోగం లేనప్పుడు ఎందుకు. పట్టించుకోకపోతే సరిపోతుంది కదా అని అంటాడు. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్‌ మే 5 శుక్రవారం నాటి తాజా ఎపిసోడ్‌ 755లో ఇంకా ఏం జరిగిందంటే?

ప్రేమకు ప్రశ్నలు ఉండవు: శైలైంద్ర అన్న మాటలకు ఏం మాట్లాడుతున్నావ్ శైలేంద్ర. ఒక తల్లికి కొడుకు మీదుంటే ప్రేమని ఎందుకు అని ప్రశ్నిస్తున్నావా. ఇదే మాట దేవయాని అక్కయ్యని అడుగు. నువ్వు ఒక ఆడదానివై పుట్టి కడుపులో ఒక బిడ్డను నవమాసాలు మోసి ఉంటే నీకు అమ్మ మనసేంటో తెలిసేది. పురిటి నొప్పుల్లో చావుకి దగ్గరగా వెళ్లొచ్చి ఒక జన్మనిస్తే నీకు అమ్మ ప్రేమేంటో తెలిసేది. అమ్మ ప్రేమకు ప్రశ్నలు ఉండవు, ఆశ్చర్యాలు ఉండవు. అదొక అద్భుతం. అనంతం అని జగతి చెబుతుంది. కానీ ప్రేమ నీవైపే ఉంది కానీ రిషి నుంచి లేదు కదా. నీ ప్రేమ వల్ల తిరిగి నువ్వు ఏమైనా పొందితే. నీ అద్భుతమైన ప్రేమకు అర్థముండేది. ఏం పొందడం లేదు. ఏం లాభం లేదు. అలాంటప్పుడు నీ ప్రేమ ఎందుకు అని శైలేంద్ర అంటాడు.

Guppedantha Manasu

ప్రేమగా పిలవకపోవచ్చు: పిల్లలు తల్లిదండ్రుల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా తల్లిదండ్రులు చివరి శ్వాస వరకూ ప్రేమిస్తూనే ఉంటారు. తల్లిదండ్రుల ప్రేమ స్వార్థాన్ని లాభాపేక్షను ఆశించదు. అయినా మా మధ్య దూరం ఉంది. కాదు అనడం లేదు. కానీ మా మనసులు దగ్గరగానే ఉన్నాయి. ఒకప్పుడు నాతో మాట్లాడటానికి కూడా ఇష్టపడని నా రిషి ఈరోజు ఇంటికి తీసుకొచ్చి ప్రేమగా మాట్లాడుతున్నాడు. అమ్మా అని పిలవకపోవచ్చు. మేడమ్ అనే పిలుపులో ఆ ప్రేమ, ఆప్యాయత కనిపిస్తాయి అది చాలు అని చెప్పి జగతి వెళ్లిపోతుంది. రిషి పవర్ ఏంటనేది ఇప్పుడు అర్థమైంది. నీ తల్లి బ్లడ్ లోని బలం వచ్చిందిరా నీకు. కానీ నిన్ను వదిలిపెట్టనురా రిషీంద్ర భూషణ్ అని రగిలిపోతాడు శైలేంద్ర.

ప్రమాదం తలపెట్టే మనుషులు: ఇక జగతి ఆలోచనలతో జరిగినదంతా గుర్తు చేసుకుంటూ దిగాలుగా ఉంటుంది. ఇంతలో వచ్చిన మహేంద్ర రిషిను చూస్తే గర్వంగా ఉంది. ఈ మూమెంట్ ను ఎంజాయ్ చేద్దాం. బయటకు వెళ్లి తిరిగి వద్దాం అని మహేంద్ర అంటాడు. నాకు కొంచెం తలనొప్పిగా ఉంది. పడుకుంటాను అని జగతి చెబితే.. సరే వసుధారతో కాఫీ పంపిస్తానని చెప్పి వెళ్లిపోతాడు మహేంద్ర. వసుధార కాఫీ తీసుకొస్తుంది. వసు ఆ తలుపు వేసి రా మాట్లాడాలి అని చెబుతుంది జగతి. తలుపు ఎందుకు మేడమ్ అని వసు అంటే ప్రమాదం తలపెట్టే మనుషులు పక్కనే ఉన్నప్పుడు తలుపులు వేసుకునే మాట్లాడాలి అని జగతి అంటుంది. వసు, మనిద్దరి మీద చాలా భారం, బాధ్యత ఉన్నాయి అని జగతి చెబుతుంది.

Guppedantha Manasu

మొదటిసారి భయం వేస్తుంది: అర్థం కాలేదు మేడమ్, దేని గురించి అంటున్నారు అని వసు అంటుంది. రిషి గురించి. నా కొడుకుని కాపాడుకోవడం కోసం నేను చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తాను. కానీ నువ్వు మాత్రం రిషిని కంటికి రెప్పలా కాపాడుతూ ఉండు. ఒక్క క్షణం కూడా తనను వదిలిపెట్టొద్దు. నాకు ఎందుకో భయంగా ఉంది. లేనిపోని ఆలోచనలన్నీ వస్తున్నాయి. ఎవరికీ చెప్పాలో, ఎలా చెప్పాలో తెలియట్లేదు. నేను ఒంటరిగా ఉన్నప్పుడు బాధపడ్డానే కానీ భయపడలేదు. అలాంటిది ఈరోజు నా జీవితంలో మొదటిసారి భయమేస్తుంది. శత్రువులు రిషికి ఎటు నుంచి ఏ అపాయం తలపెడతారో అని భయంగా ఉంది అని జగతి కన్నీళ్లతో ఎమోషనల్ గా చెబుతుంది.

రిషిని గుప్పెట్లో పెట్టుకోవాలి: మేడమ్ ఎంతమంది శత్రువులు వచ్చినా రిషి సార్ కి ఏం కాదు. తను ఎలాంటి వాళ్లని అయినా ఎదుర్కోగలరు. ఏదైనా తనదాకా రానంతవరకే. లేకుంటే తాట తీసే రకం అని జగతికి ధైర్యం చెబుతుంది వసు. దీంతో వసుని హగ్ చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది జగతి. తర్వాత ఇంట్లో ఏం జరుగుతుందో మీకు ఎలా చెప్పాలి. నా అనుమాం నిజమో కాదో నాకు తెలియదు. అదే మీకు చెప్పి బాధపెట్టలేను అని జగతి మనసులోనే కుమిలిపోతుంది. మరోవైపు మనం అనుకుంది నెరవేరుతుంది మమ్మీ. నేను చేయాల్సింది నేను చేస్తున్నాను. నువ్వు చేయాల్సినవి కొన్ని మిగిలి ఉన్నాయి. ఆ సమయంలో నువ్వు ముందుండాలి. రిషిని గుప్పెట్లో పెట్టుకోవాలి. వాళ్లు వేసే ప్రతి అడుగుకి నువ్వే బంధనం వేయాలి అని శైలేంద్ర చెబుతాడు.

ఎవరికీ చెప్పకు: నేను నీ తల్లిని శైలేంద్ర.. నీ బుద్ధులు నాకు రాలేదు. నా బుద్ధులే నీకు వచ్చాయి. నువ్వు నా గురించి మరిచోపోయి, నువ్వు చేస్తున్న పనులు కొంచెం ఎవరి కంట పడకుండా చూసుకో అని దేవయాని అంటుంది. ఇంతలో అక్కడ కాఫీ పట్టుకుని నిల్చుని ఉన్న ధరణిని చూసి షాక్ అవుతాడు శైలేంద్ర. తర్వాత దేవయాని కూడా షాక్ అవుతుంది. ఎంతసేపు అయింది వచ్చి అని శైలేంద్ర అడిగితే ఇప్పుడే అని ధరణి చెబుతుంది. ఇలా వచ్చి మాటలు వినడమేనా. విన్నా సరే ఎవరికీ చెప్పకు అని ధరణిని బెదిరిస్తాడు శైలేంద్ర. ఇద్దరు మాటలు అనడంతో ఏడ్చుకుంటూ వెళ్లిపోతుంది ధరణి. ఇంతలో కారు వెళ్లిన శబ్దం వినిపిస్తుంది. ప్రేమ పక్షులు విహరించడానికి వెళ్లినట్లు ఉన్నాయి అని దేవయాని అంటుంది.

Guppedantha Manasu

రిషిపై కత్తితో దాడి: కారులో వసుధార రిషి వెళ్తుంటారు. డీబీఎస్టీ కాలేజీ వద్ద ఆగి ఉంటారు. ఇంతలో మంకీ క్యాప్ పెట్టుకున్న ఓ రౌడీ కత్తితో రిషిని పొడిచేందుకు వస్తాడు. అటు వెళ్లి చూద్దాం రండి సార్ అని వసుధార అనడంతో రిషి పక్కకు జరుగుతాడు. దీంతో మంకీ క్యాప్ వేసుకున్న అతను ముందుకు వంగి వెళ్తాడు. అది చూసిన రిషి అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తాడు. కట్ చేస్తే కొద్దిలో మిస్ అయ్యాడు సార్ అని శైలేంద్రకు చెబుతాడు. పర్లేదు అన్న శైలేంద్ర అతనికి డబ్బు ఇస్తాడు. అదంతా దూరం నుంచి చూస్తుంది జగతి. తర్వాత ఇంటికొచ్చిన రిషిని హగ్ చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది జగతి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X