Guppedantha Manasu: సూపర్ ట్విస్ట్.. శైలేంద్ర-దేవయానికి జగతి మాస్ వార్నింగ్.. తల్లీకొడుకుల బెదిరింపు

రిషి వసుధారలు డీబీఎస్టీ కాలేజీలోకి వెళ్తారు. డీబీఎస్టీ కాలేజీలో ఓ ప్లేసులో గతంలో జరిగిన విషయాలను గుర్తు చేసుకుంటారు. వసుధారకు అడ్మిషన్ ఇవ్వను అని రిషి అన్న మాటలను వసుధార తలుచుకుంటుంది. అప్పట్లో గెటౌట్ అన్నవాళ్లే ఇప్పుడు ఇక్కడకు తీసుకొచ్చారు వసుధార అంటుంది.

ప్రేమ ఎక్కడి నుంచి పుడుతుందో తెలుసా వసుధార. పరిచయం నుంచి.. ఆ పరిచయం ఇద్దరి మధ్య కోపం, ద్వేషం, అయిష్టం సృష్టించవచ్చు. కానీ చివరిగా ప్రేమగా మారుతుంది అని రిషి చెబుతాడు. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్‌ మే 6 శనివారం నాటి తాజా ఎపిసోడ్‌ 756లో ఇంకా ఏం జరిగిందంటే?

Guppedantha Manasu Serial May 6 2023 Today Full Episode 756

అది మనిషి నీడే: రిషి చెప్పిన మాటలకు అతన్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది వసుధార. మరోవైపు ఒకతను కాలేజీ గోడ దూకి లోపలికి రావడం చూపిస్తారు. ఇంతలో రిషికి ఏదో నీడ కనిపించే సరికి అలర్ట్ అవుతారు. ఎవరా అని అటు ఇటు తిరిగి చూస్తారు. బయటకు వెళ్లి కారు దగ్గరుండి చూస్తారు. నాకు ఏదో నీడ కనిపించింది.. అది మనిషి నీడే అని రిషి చెబుతాడు.

ఇంతలో వెనుక నుంచి మంకీ క్యాప్ పెట్టుకుని ఒకతను కత్తితో రిషి వెనుకాలే వస్తాడు. రిషిని వెనుక నుంచి కత్తితో పొడిచేందుకు ప్రయత్నిస్తాడు. ఇంతలో అటు వెళ్లి చూద్దాం సార్ అని వసుధార అనడంతో పక్కకు జరుగుతాడు రిషి. దీంతో ముసుగు వేసుకున్న వ్యక్తి ముందుకు తూలుతాడు.

Guppedantha Manasu Serial May 6 2023 Today Full Episode 756

జగతి మాటలు: రిషి తప్పించుకోవడంతో మంకీ క్యాప్ వేసుకున్న వ్యక్తి పారిపోయేందుకు ప్రయత్నిస్తాడు. అతని వెంటే రిషి పరుగెత్తుతాడు. కానీ అతను దొరకడు. వసుధార వాచ్ మెను ను పిలిచి అతనెవరో చూడమంటుంది. ఎవరు సార్ అని వసుధార భయంతో అడుగుతుంది. తెలియట్లేదు అని రిషి అంటాడు. ఇంతలో వచ్చిన వాచ్ మేన్ అతను గోడ దూకి పారిపోయాడు సార్ అని చెబుతాడు.

వాడు ఎంతో దూరం వెళ్లి ఉండడు.. చూద్దాం పదా అని రిషి అంటే.. వద్దు సార్ నాకు భయంగా ఉంది. ఇక్కడి నుంచి వెళ్లిపోదాం అని వసుధార కంగారుగా చెబుతుంది. దీంతో సరే అని ఇద్దరు కారులో బయలుదేరతారు. అప్పుడు శత్రువుల నుంచి రిషికి అపాయం ఉందని అన్న జగతి మాటలు గుర్తు చేసుకుంటుంది వసుధార.

Guppedantha Manasu Serial May 6 2023 Today Full Episode 756

ఇంతకన్నా దారుణం: ఏమైంది అని రిషి అడిగితే.. కారు ఆపమని చెబుతుంది వసుధార. కారు ఆపిన రిషిని హగ్ చేసుకుని ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావ్ అని రిషి అంటే. భయంగా ఉంది సార్ అని వసుధార చెబుతుంది. నాకేం కాలేదు కదా. ఈరోజు నీవల్లే సేవ్ అయ్యాను కదా అంటాడు రిషి. ఈ మధ్య నువ్వు ఎక్కువగా కన్నీళ్లు పెట్టుకుంటున్నావ్.

ఆడపిల్ల ఏడవకూడదు. నువ్వు ధైర్యంగా ఉండు అని రిషి ఓదార్చుతాడు. తర్వాత ఇంట్లో రిషిపై అటాక్ జరిగిన విషయంపై దేవయాని రియాక్ట్ అవుతుంది. రిషి మీద అటాక్ జరిగిందా. అది మన కాలేజీలో. ఇంతకన్నా దారుణం ఉందా. కాలేజీ అయిపోయాక ఇంట్లోనే ఉండొచ్చు కదా. నువ్వు చీటికిమాటికి బయటకకు వెళ్తుంటావ్ అని దేవయాని డ్రామా చేస్తుంటే.. ఫణీంద్ర సైలెంట్ గా ఉండమని అంటాడు.

Guppedantha Manasu Serial May 6 2023 Today Full Episode 756

శత్రువులు జాగ్రత్త పడతారు: రిషిని టార్గెట్ చేసి దాడి చేయాలి అనుకున్నారు. ఇది చిన్న విషయం కాదు. దీన్ని సీరియస్ గా తీసుకోవాలని ఫణీంద్ర అంటే పోలీస్ కంప్లైంట్ ఇద్దామని మహేంద్ర అంటాడు. ఇప్పుడు ఐజీతో మాట్లాడతానని ఫణీంద్ర అంటే వద్దు పెద్దనాన్న అని రిషి ఆపుతాడు. జగతి, వసుధార, మహేంద్ర చెప్పిన వినడు. స్టూడెంట్స్ కోసం చెబుతున్నాను.

మన కాలేజీ పేరు పోలీస్ స్టేషన్ వరకూ వెళితే స్టూడెంట్స్ భవిష్యత్ పాడైపోతుంది. వారి పేరెంట్స్ ఆందోళనకు గురవుతారు. ఇది పరీక్షల టైమ్. ఈ సమయంలో కాలేజీ ఏ డిస్టర్బెన్స్ జరిగిన స్టూడెంట్స్ స్టడీస్ పై కాన్సంట్రేషన్ పోతుంది. అలాగే పోలీసులకు తెలిస్తే శత్రవులు జాగ్ర్తతపడిపోతారు. ఈసారి మళ్లీ ట్రై చేసి దొరికిపోతారు. ఇదంతా వదిలేయండి నేను చూసుకుంటాను అని రిషి అంటాడు.

Guppedantha Manasu Serial May 6 2023 Today Full Episode 756

నాకు ముందే తెలుసు: శైలేంద్ర కోసం అతడి ఇంటి బయట కత్తితో దాడి చేసిన వ్యక్తి ఎదురుచూస్తుంటాడు. శైలేంద్ర వచ్చి కలుస్తాడు. రిషి కొద్దిలో తప్పించుకున్నాడు. లేకుండా గాల్లో కలిసిపోయేవాడు అని అతను అంటే.. మిస్ అవ్వడం మంచిదే అని శైలేంద్ర అంటాడు. అతడికి ఫుల్ పేమెంట్ ఇచ్చి ఈ విషయం ఎక్కడా బయటకు రాకూడదు, ఈసారి రిషిని ఫినీష్ చేయడానికే పిలుస్తానని శైలేంద్ర అంటాడు. అదంతా పైనుంచి జగతి చూస్తుంది.

తర్వాత అటాక్ నుంచి రిషి బయటపడటంపై దేవయాని అసహనంగా ఉంటుంది. దానికి అటాక్ మిస్ అవుతుందని నాకు ముందే తెలుసు. ఈ అటాక్ తో రిషితోపాటు జగతి, వసుధార, మహేంద్రలలో భయం మొదలవుతుంది. ఆ భయాన్ని పెంచుతూ ఈ పదవులు మాకొద్దు అనేలా చేస్తాను. నాకు అనుకున్నది దక్కని రోజు రిషిని ఈ చేతులతోనే చంపేస్తాను అని శైలేంద్ర అంటాడు.

Guppedantha Manasu Serial May 6 2023 Today Full Episode 756

ఆవేశంగా జగతి: శైలేంద్ర అన్న మాటలను విన్న జగతి ఆవేశంగా అరుస్తుంది. అప్పుడే డోర్ తెరుచుంటుంది. అసలు మీరు మనుషులేనా. తల్లి కొడుకులు నా కొడుకుని చంపడానికి కుట్రలు చేస్తున్నారా. నేనుండగా రిషికి ఏం జరగనివ్వను అని జగతి అంటుంది. అందుకే ఇంత ఓపెన్ గా మాట్లాడుకోవద్దని నేనంటాను. మన ప్లాన్స్ అన్ని తెలిసిపోయింది.

జరిగింది మొత్తం పిన్ని వినేసింది అని దేవయానితో శైలేంద్ర అంటాడు. వినడం కాదు. చూశాను కూడా. నువ్వు ఆ వెధవకి డబ్బులు ఇవ్వడం చూశాను. నీపై మొదటి నుంచి సందేహంగానే ఉంది. ఈ రోజు పూర్తి క్లారిటీ వచ్చింది. ఇప్పుడే మీ నిజ స్వరూపం రిషికి అర్థమయ్యేలా చేస్తాను అని జగతి వెళ్లబోతుంది. ఏంటీ బెదిరిస్తున్నావా అని దేవయాని అనడంతో జగతి ఆగిపోతుంది.

మే 7 ఎపిసోడ్ లో: రిషి ప్రాణాలతో ఉండాలంటే కాలేజీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని శైలేంద్ర-దేవయాని షరతు పెడతారు. రిషి ప్రాణాలా, కాలేజీ బాధ్యతలా అంటూ తర్వాతి ఎపిసోడ్ ప్రోమోలో చూపించారు. ఆ తర్వాత రిషిని హగ్ చేసుకుని చాలా బాధగా కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఏమైంది మేడమ్ ఎందుకు ఇంతలా ఏడుస్తున్నారు అంటే అప్పుడు జగతి ఏదో చెప్పినట్లుగా చూపించారు. మేడమ్ మీరుండగా నన్ను ఎవరు ఏం చేయలేరు అని రిషి అంటాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X