Guppedantha Manasu: కన్నీళ్లు పెట్టించే సీన్.. కొడుకుని పట్టుకుని కుమికుమిలి ఏడ్చిన జగతి

రిషిని హత్య చేసేందుకు శైలేంద్ర, దేవయాని చేసిన కుట్ర జగతికి తెలిసిపోతుంది. ఇప్పుడే మీ నిజ స్వరూపం రిషికి అర్థమయ్యేలా చేస్తాను అని జగతి బయలుదేరబోతుంది. ఏంటీ బెదిరిస్తున్నావా. ఇప్పుడు నీకు మేము భయపడాలా అని దేవయాని అంటుంది. భయపడాల్సింది నాకు కాదు, రిషికి. ఈ విషయం తెలిస్తే రిషినే మీ అంతు చూస్తాడు అని మళ్లీ జగతి బయలుదేరుతుంది. రిషి చివరి క్షణాలు చూడటానికి వెళ్తున్నావా పిన్నీ. ఉండు మేము కూడా వస్తాం అని శైలేంద్ర అంటాడు. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్‌ మే 8 సోమవారం నాటి తాజా ఎపిసోడ్‌ 757లో ఇంకా ఏం జరిగిందంటే?

భలే చెప్పావ్: నా గొంతులో ప్రాణం ఉండగా నా కొడుకుని ఏం చెయ్యలేరు అని జగతి ఆవేశంగా అంటుంది. తల్లి ప్రేమ ఎన్ని మాటలైన మాట్లాడిస్తుంది. కానీ నిజం వేరేలా ఉంటుంది అని దేవయాని అంటుంది. పదా పిన్నీ మేము కూడా నీతో వస్తాం. మళ్లీ రిషి ఇక్కడి దాకా వచ్చి మాకు ఛాన్స్ ఇవ్వడం దేనికి. మేము కూడా వస్తాం పదా అని శైలేంద్ర అంటాడు. కానీ, శైలేంద్ర ఈవిడ గారి మాటలు రిషి నమ్మడు కదా అని దేవయాని అంటే.. హా అది కూడా నిజమే కదా. రిషి గారి కన్నతల్లి అయిన ఈ జగతి గారు ఆవిడ ఇంట్లోనే శరణార్థిలా బతుకుంది కదా అని శైలేంద్ర అంటాడు. భలే చెప్పావ్ శైలేంద్ర. కొడుకు దయ తలిస్తే మేడమ్ గా వచ్చిన తల్లి ఈవిడ. రిషి దగ్గరికి వెళ్లి మన గురించి బయటపెడతా అని చెబుతోంది అని దేవయాని అంటుంది.

Guppedantha Manasu

కొడుకు ప్రాణాలు ముఖ్యమా: ఈ విషయం మన ముందు చెప్పడం ఒక విడ్డూరం అయితే, ఈవిడ మాటలు రిషి నమ్ముతాడని భ్రమ పడటం మరో విచిత్రం అని దేవయాని అంటుంది. నమ్మకపోయినా చెబుతాను అని జగతి అక్కడి నుంచి బయలుదేరుతుంది. అయ్యో పిచ్చి జగతి.. రా ఇలా కూర్చో. ఇప్పుడు నీ కొడుకు ప్రాణాలు ముఖ్యమా.. మమ్మల్ని అందరి ముందు దోషులుగా నిలబెట్టడం ముఖ్యమా అని దేవయాని అంటుంది. మీ తల్లీకొడుకుల్నీ ఏం చేసినా పాపం లేదు అని జగతి అంటుంది.

పెంచిన ప్రేమలో స్వార్థం: అబ్బా జగతీ నీకు ఈ గతి రావడానికి కారణం ఏంటో తెలుసు కదా. నువ్వు ఏ తప్పు చేయకపోయినా రిషితో అమ్మా అని పిలిపించుకునే అర్హత పొగొట్టుకున్నావ్. పొగొట్టుకునేలా చేశాను. వాడ్ని ఈ చేతులతో పెంచాను. వాడి మెదడు నిండా నేను చెప్పింది మాత్రమే నమ్మేలా చేశాను. ఇప్పుడు నువ్వు ఆ వసుధార కొత్తగా వాడి జీవితంలోకి వచ్చి వాడి జీవితాన్ని కొత్తగా చూపిస్తుంటే మేము చూస్తూ కూర్చోవడానికి అంతా పిచ్చి వాళ్లలా కనిపిస్తున్నామా. వాడికి నేనే అమ్మని. నేనే పెద్దమ్మని. నేను ఏం చెబితే వాడు అదే వినాలి అని దేవయాని అంటుంది. ఛీ పెంచిన ప్రేమలో కూడా స్వార్థాన్ని వెతుక్కునే నీకు అమ్మా అనిపించుకునే అర్హత లేదు అని జగతి అంటుంది.

Guppedantha Manasu

దేవతలా వచ్చి: ఇప్పుడు ఏమంటావ్ పిన్ని. నువ్వు మా గురించి రిషికి చెబుతా అంటావ్. చెబితే వింటాడా.. విన్నాడే అనుకో నమ్ముతాడా.. నమ్మాడే అనుకో ప్రాణాలతో ఉంటాడా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు. మీరింత మంచివారు కదా. రిషితో అమ్మా అని పిలిపించుకోవాలనే కోరికని చంపేసుకుంటారా. పిన్నీ మీకు ఇంతెందుకు. మీలాంటి మంచి వాళ్లకు నేనో మంచి ఆఫర్ ఇస్తాను తీసుకోండి. మీరు మా మాటలు వినడం వల్ల ఎంత మంచి జరిగిందో తెలుసా. మం కష్టపడకుండానే రిషిని ఎలా తప్పించాలో అని బుర్రలు బద్దలు కొట్టుకుంటే, మనం ఎలాంటి పాపాలు చేయకుండానే పిన్ని దేవతలా వచ్చింది. నీ అంతట నువ్వే రిషిని డీబీఎస్టీ కాలేజ్ ఎండీ పదవి నుంచి తప్పుకునేలా చేయ్ అని శైలేంద్ర అంటాడు.

నాకు అస్సలు నచ్చడు: రిషి ఎండీ పదవి వదలుకునేలా చేయ్.. మోసం చేస్తావా, వెన్ను పోటు పొడుస్తావా, బుజ్జగిస్తావా, ఏడిపిస్తావా అది నీ ఇష్టం. ఏం చేసినా వాడు కాలేజీ పరిసరప్రాంతాల్లో కనబడకూడదు. ఇలా చేస్తేనే నీ కొడుక్కి ప్రాణభిక్ష పెడతా అని శైలేంద్ర అంటాడు. అన్నయ్యా అన్నయ్యా అంటూ ఎలాంటి కల్మషం లేకుండా నీకోసం పరితపించే రిషిపైన నీకు ఎందుకింత ద్వేషం అని జగతి అంటుంది. దుర్మార్గులు, నీచులు ఇంతే పిన్ని. వాళ్లకు ఎమోషన్స్ ఉండవు. అయినా నాకు రిషి మొదటి నుంచి నచ్చడు. ఏదో మమ్మీ చెప్పింది కదా అని నటించాను. వాడు నాకు అస్సలు నచ్చడం లేదు అని శైలేంద్ర అంటాడు. రిషి నీ కడుపున పుట్టడమే వాడు చేసుకున్న పాపం. నువ్వు నోరెత్తి చెప్పినా వినేవాళ్లు లేరు అని దేవయాని అంటుంది.

Guppedantha Manasu

కొడుకు ప్రాణాలు పోతాయ్: జగతి బాధతో బయటకు అడుగులు వేస్తుంటుంది. డోర్ దగ్గరికి వచ్చినా శైలేంద్ర.. పిన్నీ నాకు తెలుసు. నువ్వు చెప్పిన దానికి ఒప్పుకుంటావని. లేదంటే నీ కొడుకు ప్రాణాలు పోతాయి. నిన్ను అమ్మా అని పిలవకుండానే వాడు గాల్లో కలిసిపోతాడు. ఆ పరిస్థితి తెచ్చుకోకు. మీరు వెళ్లండి. ఇంత జరిగాకా కూడా నువ్వు మా గురించి రిషికి, బాబాయ్ కి నిజం చెప్పాలని ప్రయత్నిస్తే తెలుసుగా.. ఒక్కసారి ఊహించుకో ఏం జరుగుతుందో. వెళ్లండి అని చేయి చూపిస్తాడు శైలేంద్ర. జగతి బాధగా వెళ్లిపోతుంది. మరోవైపు జగతి కోసం మహేంద్ర, వసుధార, రిషి వెతుకుతారు. తర్వాత టెర్రస్ పై కుమిలి కుమిలి ఏడవడం చూసి షాక్ అవుతారు మహేంద్ర, వసుధార.

కుమిలిపోయిన జగతి: శైలేంద్ర, దేవయాని అన్నమాటలను తల్చుకుంటూ కుమిలిపోతుంటుంది జగతి. అప్పుడే వచ్చిన మహేంద్ర, వసుధార ఏమైంది అని అడుగుతారు. అయినా జగతి ఏం చెప్పకుండా కంటిన్యూగా ఏడుస్తూనే ఉంటుంది. జగతి నిన్ను ఇలా ఎప్పుడు చూడలేదు. ఇంతలా నువ్వు ఎప్పుడు ఏడవలేదు అని మహేంద్ర అడుగుతాడు. అప్పుడే రిషి వచ్చి మేడమ్ అని పిలుస్తాడు. అది చూసిన జగతి పరుగెత్తుకెళ్లి రిషిని హగ్ చేసుకుని కన్నీరుమున్నీరు అవుతుంది. జగతి కుమిలికుమిలి ఏడిచే సీన్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. చూసే ప్రతి ఒక్కరికి కన్నీళ్లు పెట్టించేలా ఉంది ఆ సీన్. ఇక తర్వాత ఏం జరుగుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X