Guppedantha Manasu: దాడి చేసిన రౌడీని పట్టుకున్న రిషి.. సౌజన్య రావుతో శైలేంద్ర గొడవ

జగతి టెర్రస్ పై కూర్చుని కుమిలిపోతు ఏడుస్తుంది. ఇంతలో వచ్చిన రిషిని చూసి హగ్ చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది. శైలేంద్ర, దేవయాని మాటలు తలుచుకుంటూ మరింత బాధపడిపోతుంది. అలా రిషిని పట్టుకుని జగతి ఏడవం చూసి కంగారు పడిపోతారు మహేంద్ర, వసుధార. రిషి కళ్లల్లో తల్లి మీద ప్రేమ క్లియర్ గా కనిపిస్తుంది. తల్లిని ఓదార్చేందుకు అన్నట్లుగా జగతి చేతులు పట్టుకోవాలనుకుంటాడు రిషి. కానీ పట్టుకోకుండా చేతులను పైకి కిందకు అంటూ సందేహిస్తుంటాడు. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్‌ మే 9 మంగళవారం నాటి ఎపిసోడ్‌ 758లో ఇంకా ఏం జరిగిందంటే?

రిషికి కన్నీళ్లు : రిషి చుట్టూ అల్లుకున్న చేతులను విడిపించుకునేందుకు రెండు మూడు సార్లు ప్రయత్నించి ఆగిపోతాడు. అది చూసిన జగతి రిషిని వదిలేస్తుంది. ఈ సీన్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. అంతలా తల్లి ఏడవడం చూసి రిషికి కూడా కళ్లలో నీళ్లు తిరుగుతాయి. మేడమ్ ఏమైంది. ఎందుకు అలా ఏడుస్తున్నారు. ఏం జరిగింది అంటూనే డాడ్ మీరైనా చెప్పండి అని రిషి అంటాడు. మాకు తెలియదు రిషి.. మేము వచ్చేసరికి ఇక్కడ కూర్చుని ఒక్కత్తే ఏడుస్తుంది అని మహేంద్ర అంటాడు. మేడమ్ ఏం జరిగిందో ఇప్పటికైనా చెప్పండి. రిషి సార్, మహేంద్ర సార్ ను నేను ఎప్పుడు ఇలా చూడలేదు. రిషి సార్ కళ్లలో నీళ్లు కూడా వచ్చేశాయి అని వసుధరా అంటుంది.

rishi

రిషిపై జరిగిన దాడి : జగతి ఏం చెప్పదు. మేడమ్ చెప్పండి ఒకవేళ మీ మీద జరిగిన దాడి గురించి భయపడుతున్నారేమో సార్ అని వసుధార అంటుంది. అయ్యో మేడమ్.. నాకేం కాలేదు కదా. అయినా మీరంతా నాకు రక్షణ కవచంలా ఉండగా నాకేం అవుతుంది చెప్పండి. మీరుండగా నన్ను ఎవ్వరూ టచ్ చేయలేరు అని రిషి అంటాడు. అయినా జగతి ఏడుస్తూనే ఉంటుంది. సార్ మీరుంటే చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారేమో. నేను తెలుసుకుంటాను అని చెప్పి రిషి, మహేంద్రను పంపిస్తుంది వసుధార. ఏం జరిగిందో చెప్పమని జగతిని ఆరా తీస్తుంది వసుధార. రిషి మీద జరిగిన దాడి గురించే వసు, నాకు చాలా కంగారుగా ఉంది అని జగతి అబద్దం చెబుతుంది. సరే మేడమ్. రిషి సార్ కు ఏం కాదు అని చెప్పి హాల్లోకి తీసుకెళ్తుంది వసుధార.

vasudhara-rishi

భయం ఉండాలి : అక్కడికి వచ్చిన దేవయాని ఏంటీ ఈ టైమ్ లో ఇక్కడ కూర్చున్నారు, జగతికి ఏమైంది, అంత డల్ గా ఎందుకు ఉంది అని కావాలనే అడుగుతుంది. నా కోసం బాగా భయపడుతున్నారు పెద్దమ్మా అని రిషి చెబితే.. ఏంటీ జగతి నువ్వు కూడా భయపడతావా అని దేవయాని అంటుంది. కోపం వచ్చిన మహేంద్ర.. ఏంటీ వదినగారు. తను మనిషే. మనలానే ఫీలింగ్స్, సంతోషం అన్నీ ఉన్నాయి అని అంటే.. వదిలేయమని జగతి చెబుతుంది. నేను బాగానే ఉన్నాను. అందరు వెళ్లి పడుకోండి అని చెబుతుంది జగతి. దీంతో అంతా వెళ్లిపోతారు. గుడ్ ఈ మాత్రం భయం ఉండాలిలే అని చెప్పేసి వెళ్లిపోతుంది దేవయాని. తర్వాత ఉదయాన్ని కాలేజీ సీసీ టీవీ ఫుటేజ్ తెప్పించి ఇంట్లో వాళ్లంతా చూస్తారు.

rishi-guppedantha-manasu-

గట్టిగా బుద్ధి చెప్పండి : ఆ ఫుటేజ్ లో రిషిని పొడిచేందుకు వచ్చిన వాడి మొహం కనపడుతుంది. అది చూసిన వసుధార వీన్ని ఎక్కడో చూసినట్లుంది అని అంటుంది. ఎక్కడో ఏంటీ వసుధార మనల్ని కిడ్నాప్ చేసిన వాళ్లలో వీడు ఒకడు. అంటే రెండు చేసింది ఒక్కరే అయి ఉంటారు. అయితే వీడు ధర్మరాజు మనిషి అయినా ఉండాలి, లేదా సౌజన్య రావు మనిషి అయినా కావాలి అని రిషి అంటాడు. దీంతో శైలేంద్ర కాస్తా కంగారు పడతాడు. శైలేంద్ర ఈ విషయంలో తమ్ముడితో ఉండు. వాడు ఎవరో ఎక్కడుంటాడో తెలుసుకుని దీనికి కారణమైన వాళ్లకి గట్టిగా బుద్ధి చెప్పండి అని ఫణీంద్ర అంటాడు. అయ్యో బావగారు దీనంతటికీ కారణం మీ కొడుకే అని జగతి అనుకుంటుంది.

 guppedanthamanasu

నిజం దాస్తున్నాడు : ఇక్కడ సీన్ కట్ చేస్తే ఒక రూమ్ లో ఆ రౌడీని కట్టిపడేస్తాడు రిషి. పక్కనే శైలేంద్ర కూడా ఉంటాడు. దాడి ఎవరు చేయించారో చెప్పమని రౌడీని కొడుతూనే ఉంటాడు రిషి. వాడు శైలేంద్రను చూస్తాడు. నోరు విప్పొద్దు. నేను చూసుకుంటాను అని చేతిపై రాసి ఉన్న దాన్ని రౌడీకి శైలేంద్ర చూపిస్తాడు. తర్వాత వాళ్లు ఎవరో నాకు తెలియదు. మాకు డబ్బు ఇచ్చి ఈ పని చేయాలని ఫోన్ చెబుతారు అని రౌడీ చెబుతాడు. వాడు చెప్పేది నిజమే అనుకుంటా అని శైలేంద్ర అంటే.. లేదు అన్నయ్యా వాడు నిజం దాస్తున్నాడు. రెండు సార్లు దాడి చేయించారు అని రిషి అంటాడు. దీంతో రౌడీని శైలేంద్ర నిజం చెప్పమని విపరీతంగా కొడతాడు. తర్వాత అన్నయ్యా వాడిని వదిలేయ్.. ఇదంతా చేయించింది సౌజన్య రావే. వాడితోనే డైరెక్ట్ గా మాట్లాడుదాం పదా అని రిషి అంటాడు.

 manasu

లీగల్ గా ప్రోసీడ్ : రిషి, శైలేంద్ర, ఎమ్ఎస్ఆర్ ముగ్గురు కలుస్తారు. వీడేనా ఎమ్ఎస్ఆర్ అని శైలేంద్ర అంటే.. ఏం తెలియనట్లుగా.. హలో కొంచెం మర్యాదగా మాట్లాడండి అని సౌజన్య రావు అంటాడు. నీకు మర్యాదేంట్రా. మా తమ్ముడి మీద దాడి చేయిస్తావా అని శైలేంద్ర అంటే.. మీ కాలేజీని దక్కించుకుందామని చూసింది నిజమే.. కానీ జరిగిన దాడికి నాకు ఏ సంబంధం లేదు. కావాలంటే లీగల్ గా ప్రోసీడ్ అవుదాం. నిర్దోషి అని నిరూపించుకునేందుకు నేను ఎక్కడికైనా వెళ్తాను అని ఎమ్ఎస్ఆర్ అంటాడు. ఆపురా నీ నాటకాలు, నిజం చెప్పు అని ఎమ్ఎస్ఆర్ మీదకు రిషి వెళ్లబోతుంటాడు. దీంతో రిషిని ఆపి.. కూల్ రిషి.. వీడ్నీ ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు. నువ్వు వెళ్లి కారులో కూర్చో అని శైలేంద్ర అంటాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X