For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Guppedantha Manasu Today Episode:జగతి కోసం చెరువులో వసుధార.. రగిలిపోతున్న దేవయాని, రిషి రియాక్షన్?

  |

  యూనివర్శిటీ టాపర్ గా వసుధార నిలుస్తుంది. దీంతో అందరూ సంతోష పడతారు. ఈ విషయాన్ని జగతి-మహేంద్రలకు గౌతమ్ చెబుతాడు. దీంతో వారు తెగ సంతోషపడిపోతారు. ఈ అజ్ఞాతవాసం ఎందుకు అంకుల్. అంతా హ్యాపీగా ఉన్నారు. ఈ సంతోషంలో మీరు కూడా ఇంటికి వస్తే బాగుంటుంది కదా. రిషి ఈ రోజు మిమ్మల్ని ఎంత మిస్ అయ్యాడో అని గౌతమ్ అంటాడు.

  పరుగులు తీయడానికి సిద్ధంగా ఉన్న గుర్రంలా ఉంది నా మనసు. కానీ నేనే కంట్రోల్ చేసుకుంటున్నా.. కొన్నాళ్లు ఆగక తప్పదని మహేంద్ర అంటాడు. మీకోసం రిషి వెయిట్ చేస్తున్నాడు. వాడికోసం మీరు బాధపడుతున్నారు. ఇలా ఆసక్తికర కథా కథనంతో సాగుతోన్న గుప్పెడంత మనసు సీరియల్ నవంబర్ 10, 2022 గురువారం నాటి తాజా ఎపిసోడ్​ 604లో ఏం జరిగిందో చదివేసేయండి.

  నా ప్రతి విజయానికి తనే కారణం..

  నా ప్రతి విజయానికి తనే కారణం..

  ఎందుకిదంతా.. మేడమ్ మీరైనా చెప్పండని గౌతమ్ అంటే.. రిషి బాగుకోసం ఇంకొన్నాళ్లు ఈ అజ్ఞాతవాసం తప్పదు అనేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు మహేంద్ర. మరోవైపు కారులో రిషి, వసుధార వెళ్తుంటారు. తను టాపర్ గా రావడం, అందరూ విష్ చేయడాన్ని తలుచుకుంటూ సంతోషపడుతుంది వసుధార. ఏంటీ ఆలోచిస్తున్నావ్.. ఎట్టకేలకు సాధించావ్ అని రిషి అంటే.. ఈ విజయం వెనుక చాలా మంది ఉన్నారని వసుధార అంటుంది. ముందు సెలబ్రేట్ చేసుకోవాలి. నీకు ఏం కావాలో కోరుకో.. నువ్ అడిగి చూడు.. కాదనే సమస్యే లేదని రిషి హామీ ఇస్తాడు. దీనికి నిజంగా కాదనరా.. అని అంటుంది వసుధార. ఒక్కసారి మాటిస్తే.. వెనక్కు వెళ్లడని రిషి అంటాడు.

  దీంతో వసుధార.. జగతి మేడమ్.. అని అనగానే.. కారుని రోడ్డు పక్కకి ఆపేస్తాడు రిషి. ఏం కోరుతుంటో అనుకుంటాడు. నా ప్రతి విజయానికి తనే కారణం.. ఎక్కడో ఉన్న నేను ఇక్కడికి వచ్చాను.. మీ పక్కన నేను కూర్చుని ఉన్నానంటే దానికి కారణం మేడమే.. మేడమ్ కి నేను చాలా రుణపడి ఉన్నాను సార్.. ఇంతపెద్ద విజయం తర్వాత కూడా నేను తనకు ఏం చేయలేకపోతే ఎలా సార్ అని అంటుంది వసుధార. దీంతో నీకు ఏం కావాలని రిషి అడుగుతాడు.

  పట్టుకునేందుకు మీరున్నారు కదా..

  పట్టుకునేందుకు మీరున్నారు కదా..

  ఆ దేవతకు పాదాభివందనం చేయాలి. తనను నేను చూడాలి అని వసుధార అంటుంది. ఇవన్నీ ఓకే.. ఏదో అడుగుతాను అన్నావ్ కదా.. అడుగు.. అని రిషి. మీకు నచ్చకపోవచ్చు అని వసుధార అంటే.. నీకు కావాల్సింది అడగమన్నాను.. నాకు నచ్చేది కాదని రిషి అంటాడు. చెప్తాను సార్ మీరు కారు పోనివ్వండని వసుధార అంటుంది. ఇద్దరూ చెరువు పక్కన కూర్చుని ఉంటారు.

  మళ్లీ పడవలు చేసిన వసధార.. జగతి మేడమ్ రావాలని రాస్తున్నా సార్.. అంటే మహేంద్ర సార్ కూడా వస్తారు కదా.. అని వసుధార అంటుంది. ఇవన్నీ కేవలం నీకోసమే చేస్తున్నా.. నేను చేయనా అంటూ పేపర్ తీసుకుని పడవ చేస్తాడు రిషి. చెరువులోకి పడవలు వేసేందుకు ఇద్దరు వెళతారు. పడిపోతావ్ జాగ్రత్త అని రిషి అంటే పట్టుకునేందుకు మీరున్నారు కదా అని వసుధార అంటుంది. ఇద్దరు పడవలు వదులుతారు.

  నాకు చెప్పాల్సిన పనిలేదా..

  జగతి మేడమ్ రావాలని వసుధార అనుకుంటే.. వసు నమ్మకం నిజం కావాలని, డాడ్ వాళ్లు ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటాడు రిషి. తర్వాత సంతోషంతో నీటిలో ఎగురుతూ కిందపడుతుంది వసుధార. దీంతో రిషి కంగారు పడతాడు. బట్టలు తడిచిపోయాయని వసుధార అంటే.. నాకోటు వేసుకో అని ఇస్తాడు రిషి. మరోవైపు ఇంట్లో దేవయాని చిరాకుతో ఉంటుంది. ఇంకా ఎవ్వరూ ఇంటికి రావడం లేదేంటో అనుకుంటూ ధరణిని కోపంగా పిలుస్తుంది దేవయాని.

  వచ్చిన ధరణి.. వసుధార మంచి విజయం సాధించింది కదా.. రిషి స్వీట్స్ చేయమన్నాడు రిషి అని చెబుతుంది. నాకు చెప్పాల్సిన పనిలేదా అని దేవయాని అంటుంది. సరే.. వద్దులేండి ఆపేస్తాను.. రిషి అడిగితే మీరు వద్దన్నారని చెబుతాను అని ధరణి అంటుంది.

  నాకు మాట్లాడే ఓపిక లేదు..

  నాకు మాట్లాడే ఓపిక లేదు..

  నన్నెందుకు రాక్షసిని చేయాలని అనుకుంటున్నావ్. ఈ భూమి మీద ఎన్ని రకాల స్వీట్స్ ఉంటాయో అన్నీ చేయు అని దేవయాని అంటుంది. దీంతో మీరు కూడా ఓ చేయి వేస్తారా అని ధరణి అంటే.. నాకు మాట్లాడే ఓపిక లేదు.. గ్రీన్ టీ తీసుకొచ్చి ఇవ్వు అంటుంది దేవయాని. ఇంట్లోకి వచ్చిన గౌతమ్.. దేవయాని ముందు కూర్చొని వసుధార గురించి గొప్పగా చెబుతాడు. నేను చాలా వీడియోలు తీశాను.. చూస్తారా అని గౌతమ్ అంటే.. ధరణి చూపించిందిలే అంటుంది దేవయాని. అవును పెద్దమ్మా.. వీడింకా రాలేదేంటని గౌతమ్ అడుగుతాడు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మీరిద్దరు కలిసి తిరుగుతారు. నువ్ నాకు చెప్పాల్సి కానీ, నన్ను అడుగుతావేంటి అంటుంది దేవయాని. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.

  English summary
  Guppedantha Manasu Serial November 10 2022 Today Full Episode 604
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X