twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Guppedantha Manasu Today Episode:మహేంద్ర చేసిన పనికి షాక్ అయిన దేవయాని.. రిషికి వసుధార హగ్గులు

    |

    రిషి ఇంట్లోకి వెళ్లిన గౌతమ్.. దేవయానితో.. అవును పెద్దమ్మా వీడింకా రాలేదంటని అడుగుతాడు. దీంతో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మీరిద్దరు కలిసి తిరుగుతారు. నువ్ నాకు చెప్పాలి కానీ, నన్ను అడుగుతావేంటి అంటుంది దేవయాని. ఇంతలో పార్టీ ఏమైనా ఇస్తున్నాడేమో అని ధరణి అంటుంది. అన్నీ భలే అనుకుంటున్నావ్.. స్వీట్స్ మాత్రమేనా ఇంకా హారతులు పడతావా అని దేవయాని అంటుంది. పెద్దమ్మకు వసుధార అంటే ఇష్టం ఉండదు.. కేవలం రిషి కోసమే ఇదంతా చేస్తున్నారు అని గౌతమ్ అంటాడు.. ఇంతలో రిషి, వసుధార వస్తారు. రిషి కోట్ ను వసుధార వేసుకుని రావడంతో అదేంటి వసుధార ఇలా వచ్చింది అని దేవయాని అంటుంది. ఇలా ఆసక్తికర కథా కథనంతో సాగుతోన్న గుప్పెడంత మనసు సీరియల్ నవంబర్ 11, 2022 గురువారం నాటి తాజా ఎపిసోడ్​ 605లో ఏం జరిగిందో చదివేసేయండి.

    Photos Courtesy: Star మా and Disney+Hotstar

    నా స్టూడెంట్ వసుధార యూనివర్శిటీ టాపర్..

    నా స్టూడెంట్ వసుధార యూనివర్శిటీ టాపర్..

    రిషి కోటును వసుధార వేసుకుందేంటని దేవయాని అడిగిన ప్రశ్నకు చెప్తాను పెద్దమ్మా.. అంటూ నువ్ వెళ్లి డ్రెస్ మార్చుకో అని వసుధారను పంపిస్తాడు రిషి. ఏంటిందంతా అని దేవయాని అడిగితే.. నేను ఫ్రెష్ అయ్యి వచ్చి చెప్తాను పెద్దమ్మ అనేసి వెళ్లిపోతాడు. మరోవైపు మహేంద్ర-జగతి ఇద్రూ వసుధార విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. వసుధారకు కేక్ పంపించాలి, విషెస్ చెప్పాలి అంటే అవన్నీ ఇప్పుడు కుదురుతాయా అని జగతి అని మహేంద్ర అంటాడు. నువ్ ఏదైనా చేయి.. నా స్టూడెంట్ వసుధార యూనివర్శిటీ టాపర్ అని జగతి అంటుంది. దీనికి హలో మేడమ్.. తను డీబీఎస్టీ కాలేజ్ స్డూడెంట్ కూడా అని మహేంద్ర అంటాడు. అయినా.. ఆ ఫ్లవర్ బొకేలు, కేక్ లు ఎవరైనా ఇస్తారు.. నేను కొత్తగా ట్రై చేస్తానంటూ వెళ్లిపోతాడు మహేంద్ర.

    ఇక్కడ లేకపోతే ఏంటి..

    ఇక్కడ లేకపోతే ఏంటి..

    కట్ చేస్తే ఇంట్లో అందరూ వసుధారకు కంగ్రాట్స్ చెబుతారు. దేవయాని కూడా పొగుడుతుంటుంది. దీంతో ఏంటీ ఇలా మాట్లాడుతోంది అని అక్కడ అందరూ అనుకుంటారు. రిషి కూడా వసుధారకు స్వీట్ తినిపించి కంగ్రాట్స్ చెబుతాడు. ఈ విజయం నాది మాత్రమే కాదు.. ఇది రిషి సార్ గొప్పతనం అంటూ రిషికి స్వీట్ తినిపిస్తుంది వసుధార. ఈ సమయంలో డాడ్ ఉండే బాగుండేది అని రిషి మొదలుపెడితే.. అవును జగతి మేడమ్, మహేంద్ర సార్ ఉంటే చాలా బాగుండేది అని వసుధార కూడా ఫీల్ అవుతుంటుంది. ఇంతలో దేవయాని కలుగజేసుకుని.. వాళ్లు ఇక్కడ లేకపోతే ఏంటి కనీసం ఒక బొకే పంపించి అయినా కంగ్రాట్స్ చెప్పొచ్చుగా అంటుంది.

    వసుధారది గొప్ప ప్రయాణం..

    వసుధారది గొప్ప ప్రయాణం..

    న్యూస్ పేపర్ తీసుకుని వస్తాడు గౌతమ్. స్వయంగా అంకుల్-మేడమ్ వసుధారకు అభినందనలు తెలిపారంటూ పేపర్ చూపిస్తాడు గౌతమ్. దీంతో దేవయాని షాక్ అవుతుంది. రిషి, వసుధార మాత్రం తెగ సంతోషపడిపోతారు. వసుధార పరిచయం అయినప్పటి నుంచి జరిగినవన్ని గుర్తు చేసుకుంటూ మురిసిపోతాడు రిషి. వసుధారది గొప్ప ప్రయాణం, గొప్ప విజయం అంటూ పొగుడుతాడు. ఆ తర్వాత వసుధార బుక్ లో పేపర్ పై వీఆర్ ఉండటం చూసి తాను చేయించిన ఉంగరం గుర్తుకువచ్చి బయటకు తీస్తాడు. రిషి లేకుండా వసుధార పూర్తవ్వదు అన్న వసుధార మాటలు గుర్తు చేసుకుని ఆ ఉంగరం తీసుకుని మేడపైకి వెళతాడు రిషి. పైన మేడపై సంతోషంగా దీపాలు వెలిగిస్తుంది వసుధార.

    అయితే డాడ్ కూడా వస్తారు కదా..

    అయితే డాడ్ కూడా వస్తారు కదా..

    రిషి రావడంతో వెనుకకు చూడకుండానే.. ఇప్పుడొచ్చారా అని వసుధార అంటుంది. వెనక్కి తిరిగి చూడకుండా నేనొచ్చినట్లు ఎలా తెలిసిందని రిషి అడిగిన ప్రశ్నకు..ఓ మనసుకి మరో మనసు వచ్చినట్లు తెలుస్తుంది అని వసుధార సమాధానం ఇస్తుంది. ఇద్దరూ కలిసి దీపాలు వెలిగిస్తారు. ఈ దీపాలు ఎందుకు వెలిగిస్తున్నానంటే.. జగతి మేడమ్ రావాలని వసుధార అంటే.. అలా అయితే డాడ్ కూడా వస్తారు కదా.. నేను కూడా వెలిగిస్తానంటాడు రిషి. గాలికి ఆరిపోతున్న దీపాలను ఇద్దరు చేయిపెట్టి ఆపుతారు. అప్పుడే వీఆర్ అనే అక్షరాలు ఉన్న ఉంగరాన్ని వసుధారకు గిఫ్ట్ గా ఇస్తాడు.

    నా జీవితంలోకి వచ్చాక కొత్త వెలుగు వచ్చింది..

    నా జీవితంలోకి వచ్చాక కొత్త వెలుగు వచ్చింది..

    వీఆర్ ఇంగ్లీష్ అక్షరాలు ఉన్న ఉంగరాన్ని వసుధారకు రిషి గిఫ్ట్ గా ఇవ్వడంతో వసుధార ఎంతో సంతోషపడుతుంది. ఆ ఉంగరాన్ని చూస్తూ మురిసిపోతుంది. ఆ తర్వాత ఉంగరాన్ని రిషి చేతికి ఇచ్చి తనకు తొడగమని చెబుతుంది వసుధార. నువ్వు నా జీవితంలోకి వచ్చాక కొత్త వెలుగు వచ్చింది. నువ్వు కలిసిన ప్రతిసారి నాలో ఏదో కొత్త శక్తి వచ్చినట్లుంది అని రిషి అంటాడు. దీంతో ప్రేమగా రిషిని హగ్ చేసుకుంటుంది వసుధార.

    English summary
    Guppedantha Manasu Serial November 11 2022 Today Full Episode 605
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X