twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Guppedantha Manasu Today Episode:వసుధార కోసం దేవయాని మరో ప్లాన్!.. ఫణీంద్ర రాకతో టెన్షన్

    |

    వంటగదిలో వసుధార పని చేసుకుంటూ ఉంటుంది. అక్కడికి వచ్చిన గౌతమ్.. రిషితో జీవిత ప్రయాణం ఎంతవరకు వచ్చింది, మీ ఇద్దరి మధ్య ఆ అడ్డుతెర తొలగిపోయినట్టేనా అంటాడు. జగతి మేడమ్ నా జీవితానికి దిక్సూచి లాంటివారు. ఆవిడ దూరమైన అమ్మా అనే పిలుపు అందించాలని ఆ ప్రయత్నం చేశాను. అయితే ఆయన నాకోసం పిలవడం కాదు. తనంతట తాను పిలవాలి అని వసుధార చెబుతుంది. నువ్ మారావా.. ఆ ఒప్పందం నుంచి డ్రాప్ అయినట్టేనా.. రిషికి ఎలాంటి టెన్షన్ లేనట్టేనా అని గౌతమ్ అంటాడు. ఇలా ఆసక్తికర కథా కథనంతో సాగుతోన్న గుప్పెడంత మనసు సీరియల్ నవంబర్ 12, 2022 శనివారం నాటి తాజా ఎపిసోడ్​ 606లో ఏం జరిగిందో చదివేసేయండి.

    ఒక్కటి తెలుసుకుంటే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్..

    ఒక్కటి తెలుసుకుంటే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్..

    గౌతమ్ అడిగిన ప్రశ్నకు.. మారాను.. మారుతున్నాను.. మారబోతున్నాను.. ఇలాంటివి చెప్పను.. పరిస్థితులు, ఎదుటివారిని బట్టి అభిప్రాయాలు మారొచ్చు అని వసుధార అంటే కొంచెం అర్థమయ్యేలా చెప్పు అని గౌతమ్ అంటాడు. నేను దారి మార్చుకున్నాను.. గమ్యం మార్చుకోలేదు.. అభిప్రాయం మార్చుకోలేదు.. ఇచ్చిన మాట వదులుకోలేదు.. అలాగని రిషి సార్ ని వదులుకోలేను.. నా పంథాన్ని మార్చుకున్నాను. పంతం తగ్గించుకున్నాను. కొన్ని మార్పులు జరగలని ఆశించాలి కానీ, కాస్త ఓపిక పట్టాలి. అవి మనమే మార్చాలని అనుకోవచ్చు.. చాలా బంధాలు విడిపోవడానికి పెద్ద పెద్ద కారణాలు ఉండవు సార్.. అన్నీ చిన్నచిన్నవే.. ఈ ఒక్కటి తెలుసుకుంటే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని వసుధార చెబుతుంది.

    ఇతరులకు స్ఫూర్తిగా..

    ఇతరులకు స్ఫూర్తిగా..

    వసుధార సమాధానానికి గ్రేట్.. బాగా చెప్పావ్ అని గౌతమ్ అంటాడు. ఇంతలో ఎంట్రీ ఇచ్చిన రిషి.. వసుధార బుర్ర తింటున్నావా అని గౌతమ్ ని అంటాడు. తర్వాత వసుధార యూనివర్శిటి టాపర్ అయినందుకు కాలేజీలో సెలబ్రేషన్ పార్టీ ప్లాన్ చేస్తున్నారని చెబుతాడు రిషి. జగతి మేడమ్, మహేంద్ర సార్ లేనప్పుడు ఇవన్నీ ఎందుకని వసుధార అంటుంది. నువ్ సాధించినదానికి ఇంకా బాగా సెలబ్రేట్ చేయాలి.. మళ్లీ ఇలాంటివి రావు కదా అని గౌతమ్ అంటాడు. సరే పార్టీని వద్దు.. నిన్ను ఇంటర్వ్యూ చేసేందుకు వేచ్చే మీడియాను వద్దనలేవు కదా అని రిషి అంటాడు. నువ్ సాధించిన విజయం ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తుందని గౌతమ్ అంటాడు. మరోవైపు వీరి మాటలను చాటుగా ఉండి వింటుంది దేవయాని. తన గదిలోకి వెళ్లి ఆలోచిస్తుంది.

    నన్ను ఒంటరి చేస్తుందా..

    నన్ను ఒంటరి చేస్తుందా..

    ఇంతకీ వసుధార ఏం ఆలోచిస్తుంది.. అసలు మారాను అంటుందా... మారలేదు అంటుందా.. ఇంట్లో అందరినీ ఒక్కటి చేసి.. నన్ను ఒంటరి చేస్తుందా.. రిషి నా పట్టులో నుంచి జారిపోయినట్టేనా.. జగతి మహేంద్ర ఇంట్లోంచి వెళ్లడం నాకు కలిసి వస్తుందనుకుంటే వసుధారకు కలిసొచ్చినట్టుంది. ఈ పరిస్థితిన ఎలా ఆధీనంలోకి తెచ్చుకోవాలి. నీ దూకుడికి కళ్లెం వేస్తాను.. నిన్ను ఎలా ఆపాలో నాకు బాగా తెలుసు. జగతి లాంటి తెలివైనదాన్నే 20 ఏళ్లు ఇంట్లోంచి బయటకు పంపించగలిగా నువ్ నాకొక లెక్కా.. నీ ఎత్తుకు పైఎత్తు తప్పకుండా వేస్తాను అని దేవయాని అనుకుంటుంది. తర్వాత పొద్దున వంటగదిలో ఉన్న ధరణి దగ్గరికి వెళ్లిన దేవయాని.. విశేషాలు అడుగుతుంది. తర్వాత రిషి ఇంకా నిద్రలేవలేదు ఈ అవకాశాన్ని మనం వాడుకోవాలి. ఆ వసుధారను గెలవాలంటే మనిద్దరం ఒకేలా ఆలోచించాలి అంటుంది దేవయాని.

    ప్రేమ ప్రయాణం గురించి రిషిధార..

    ప్రేమ ప్రయాణం గురించి రిషిధార..

    రిషి రూమ్ ను సర్దుతూ ఉంటుంది వసుధార. పక్కనున్న ర్యాక్ లో గతంలో తాను ఇచ్చిన గోళీలా సీసా మెమోరీస్ ను గుర్తుచేసుకుంటుంది. వీఆర్ ఉంగరాన్ని తీసు చూసుకుంటుంది. వెనక నుంచి వచ్చన రిషి.. ఇకికడేం చేస్తున్నావ్ అని అడిగితే సర్దుతున్నాను అని చెబుతుంది వసుధార. తర్వాత గిఫ్ట్ ఇచ్చిన వారిని వదిలేసి గిఫ్ట్ ను చూస్తున్నావేంటో అని రిషి అంటాడు. ఇది నాకు గొప్ప బహుమతి అని వసుధార అంటే.. నువ్వే నాకు గొప్ప బహుమతి అని వసుధార చేయి పట్టుకున్న రిషి ప్రేమ ప్రయాణం గురించి మాట్లాడుకుంటారు. ఇంతలో కాఫీ పట్టుకుని దేవయాని వస్తుంది. ఏంటీ వసుధార పొద్దున్నే లేచావా అని దేవయాని అంటే అద మంచి అలవాటు కదా అని అంటుంది వసుధార. వసు చేతిలో ఉన్న ఉంగరం బాక్స్ చూస్తుంది దేవయాని.

    నా మెడకు చుట్టుకునేలా ఉంది..

    నా మెడకు చుట్టుకునేలా ఉంది..

    రిషికి కాఫీ ఇచ్చిన దేవయాని వసుధారకు కూడా కాఫీ తీసుకొస్తానని అంటుంది. నాకోసం మళ్లీ మళ్లీ ఇంకో కాఫీ తెప్పించడం ఎందుకు.. షేర్ చేసుకుంటాం లేండి అని కౌంటర్ ఇచ్చినట్లు దేవయాని వైపు చూస్తుంది వసుధార. కాఫీ చాలా బాగుంది మేడమ్.. మీరే కలిపారు కదా అని వసుధార అంటుంది. నీ టైమ్ బావుందే వసుధార కానివ్వు అని అనుకుంటుంది దేవయాని. పెద్దనాన్న కాల్ చేస్తున్నారని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు రిషి. ఇక్కడికి వచ్చిన పని సక్సెస్ అయింది.. నేను వస్తున్నా అని కాల్ కట్ చేస్తాడు ఫణీంద్ర. పెద్దమ్మా, పెద్దనాన్న వచ్చాక డాడ్ గురించి అడిగితే ఏం చెబుదాం.. డాడ్ వాళ్లు ఇంట్లోంచి వెళ్లిపోయారని తెలిస్తే పెదనాన్న బాధపడతాడని రిషి అంటాడు. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను.. ఆయన వచ్చి వీళ్ల గురించి అడిగితే నాక్కూడా ఇబ్బందే.. అని దేవయాని అంటుంది. వసుధార, రిషి వెళ్లిపోయాక.. ఏంటో మహేంద్ర జగతి వెళ్లిన వ్యవహారం నా మెడకు చుట్టుకునేలా ఉందని అనుకుంటుంది దేవయాని.

    English summary
    Guppedantha Manasu Serial November 12 2022 Today Full Episode 606
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X