Guppedantha Manasu Today Episode: కొద్దిలో తప్పించుకున్న మహేంద్ర, ముగింపుకు నిర్ణయం.. చిక్కుల్లో దేవయాని

తండ్రి మహేంద్ర గురించి బాధపడుతుంటాడు రిషి. పెదనాన్న (ఫణీంద్ర) వచ్చి డాడ్ గురించి అడిగితే తానేం చెప్పాలని రిషి తన బాధను వసుధారతో చెబుతాడు. డాడ్ కి నా మీద కోపం వచ్చింది సరే. మీ మేడమ్ అయినా డాడ్ కి సర్దిచెప్పి తీసుకురావాలి కదా.. మీ మేడమ్ కూడా కఠినంగా ఆలోచిస్తున్నారేమో అని రిషి అంటాడు. రిషి సార్ ను బాధపెడుతున్నారు మహేంద్ర సార్ అని అనుకుంటుంది వసుధార. అంటాడు. ఇలా ఆసక్తికర కథా కథనంతో సాగుతోన్న గుప్పెడంత మనసు సీరియల్ నవంబర్ 14, 2022 సోమవారం నాటి తాజా ఎపిసోడ్​ 607లో ఏం జరిగిందో చదివేసేయండి.

మనసులో తిట్టుకున్న దేవయాని..

మనసులో తిట్టుకున్న దేవయాని..

రిషి వాళ్ల పెద్దనాన్న వస్తున్నారు.. ఆయన ఏం అనకపోయినా అన్నట్లుగా రిషికి చాలా చెప్పాను. ఇప్పుడు దాన్ని ఎలా కవర్ చేయాలో అని తలపట్టుకుని కూర్చుంటుంది దేవయాని. జగతి-మహేంద్ర వెళ్లిపోయారని సంతోషించాల్సిన నేను.. ఈయన రావడం వల్ల టెన్షన్ పడాల్సి వస్తుందని మనసులో తిట్టుకుంటుంది దేవయాని. అప్పుడే ధరణి కాఫీ తీసుకుని వస్తుంది. జగతి-మహేంద్ర ఎక్కడికి వెళ్లారని ధరణిని అడుగుతుంది దేవయాని. దీంతో తెలియదని చెబుతుంది ధరణి. వాళ్లకు అసలు వెళ్లిపోవాలనే ఆలోచన ఎందుకు వచ్చిందని మళ్లీ దేవయాని అడిగితే.. నాకేం తెలుసని ధరణి సమాధానం చెబుతుంది.

రిషి రాకతో కంగారు పడిన మహేంద్ర-జగతి..

రిషి రాకతో కంగారు పడిన మహేంద్ర-జగతి..

జగతికి మెయిల్ చేస్తుంది వసుధార. వసుధార మెయిల్ చూసిన జగతి.. నా గురించి ఆలోచించడం మానేసేయ్. మా వల్ల నువ్వు రిషికి దూరం కావొద్దని జగతి మనసులో అనుకుని బాధపడుతుంది జగతి. ఇంతలో మహేంద్ర వస్తాడు. వసుధార మెయిల్ గురించి మహేంద్రకు చెబుతుంది జగతి. తప్పుదు.. కొన్నాళ్లు వేచి ఉండాలి అని మహేంద్ర జగతి ఇద్దరు అనుకుంటారు. ఇంతలో గౌతమ్ ఇంటికి రిషి, వసుధార వస్తారు. వెంటనే గౌతమ్ కి కాల్ చేస్తాడు మహేంద్ర. కాల్ చేసి రిషి, వసుధార వచ్చారని గౌతమ్ కి మహేంద్ర చెబుతాడు. దీంతో కంగారు పడతాడు గౌతమ్. రిషి ఇంట్లోకి వచ్చేలోపు వెళ్లి గదిలో దాక్కుంటారు మహేంద్ర-జగతి.

పోలీస్ కంప్లైంట్ ఇద్దామని..

పోలీస్ కంప్లైంట్ ఇద్దామని..

గౌతమ్ ను పిలుస్తూ ఇంట్లో ఉన్న గదులన్నీ వెతుకుతాడు రిషి. మరోవైపు నుంచి కంగారుగా బయలు దేరతాడు గౌతమ్. ఎంత పిలిచినా పలకడం లేదంటే ఇంట్లో లేరేమో అని వసుధార అంటుంది. రిషి నిలబడిన గది లోపలే మహేంద్ర వాళ్లు ఉంటారు. రిషి గది తలుపు తీయబోతుంటే వెనుకాలే మహేంద్ర వాళ్లు తమను ఎక్కడా చూస్తారో అని టెన్షన్ పడుతుంటారు. గదిలోకి రిషి వెళ్లబోతుంటే.. ఇంతలో గౌతమ్ వచ్చి పిలుస్తాడు. దీంతో రిషి ఆ గదిలోకి వెళ్లకుండా వెనక్కి వచ్చేస్తాడు. తర్వాత కొద్దిసేపు డిస్కషన్ తర్వాత డాడ్ వాళ్ల గురించి పోలీస్ కంప్లైంట్ ఇద్దామని రిషి అంటాడు.

ఎక్కడ ఉన్నారో నీకైనా తెలుసా..

ఎక్కడ ఉన్నారో నీకైనా తెలుసా..

గౌతమ్ వద్దని ఎంత చెప్పినా రిషి వినడు. ఎన్నాళ్లు వెయిట్ చేయాలిరా.. పెదనాన్న వస్తున్నారని రిషి చెబుతాడు. వీడు పోలీస్ కంప్లైంట్ ఇస్తే నేను ఇరుక్కుపోతా అని మనసులో అనుకుంటాడు గౌతమ్. మహేంద్ర కోసం రిషి ఎంత బాధపడుతున్నాడో గౌతమ్ కి చెబుతుంది వసుధార. వసుధార చెప్పేదంతా చాటుగా ఉన్న మహేంద్ర-జగతి వింటుంటారు. పెదనాన్న వస్తున్నారని అంకుల్ కి మెయిల్ చేయి.. ఫ్యామిలీ మ్యాటర్ పోలీస్ స్టేషన్ కి ఎందుకని నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తాడు గౌతమ్. వాళ్లు ఎక్కడ ఉన్నారో నీకైనా తెలుసా అని గౌతమ్ ని నిలదీస్తాడు రిషి. నాకేం తెలుసురా అని గౌతమ్ అంటాడు.

రిషిని బాధపెట్టడం కరెక్ట్ కాదు

రిషిని బాధపెట్టడం కరెక్ట్ కాదు

తర్వాత పెదనాన్న వస్తున్నారని మెయిల్ చెయ్యి.. రెండు రోజులు చూడు అప్పటికే రాకపోతే.. అప్పుడు చూద్దామని గౌతమ్ నచ్చజెబుతాడు. అందుకు సరే అన్న రిషి వెళ్లిపోతాడు. రిషి మాట్లాడిన మాటలు తలుచుకుంటూ బాధపడిపోతుంది జగతి. ఈ దాగుడుమూతలకు ముగింపు పలుకుదాం.. అన్ని ఆపేసి వెళ్లిపోదాం.. పదా అని జగతి మహేంద్రతో అంటుంది. రిషిని బాధపెట్టడం కరెక్ట్ కాదని గౌతమ్ కూడా మహేంద్రకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు. ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వచ్చే వరకు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X