For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Guppedantha Manasu Today Episode:దేవయానిని నిలదీసిన ఫణీంద్ర.. గౌతమ్ పై వసుధారకు అనుమానం!

  |

  అటు రిషి ఇటు మీరు ఎన్నాళ్లిలా బాధపడతారు. ఇది కరెక్ట్ కాదని అంటాడు గౌతమ్. ఆ మాటలకు బాధపడిన మహేంద్ర మీ ఇద్దరికన్నా, రిషి కన్నా ఈ మహేంద్ర భూషణ్ కే ఎక్కువ బాధ కలుగుతోంది. ఆ బాధను భరిస్తూ చెప్పుకోలేక తట్టుకోలేక సతమతమవుతున్నాను. తల్లిగా జగతి బాధ, ఫ్రెండ్ గా నీ బాధను అర్థం చేసుకుంటాను.

  కానీ తండ్రిగా నన్నెందుకు అర్థం చేసుకోవడం లేదు. రిషికి శిక్ష వేసింది నేనే కానీ రిషి కన్నా ఎక్కువగా ఆ శిక్షకు బాధపడుతున్నది నేనే తెలుసా మీకు.. అని మహేంద్ర అంటాడు. దీంతో ఎందుకిలా మాట్లాడుతున్నావ్ అని జగతి అంటుంది. ఇలా ఆసక్తికర కథా కథనంతో సాగుతోన్న గుప్పెడంత మనసు సీరియల్ నవంబర్ 15, 2022 మంగళవారం నాటి తాజా ఎపిసోడ్​ 608లో ఏం జరిగిందో చదివేసేయండి.

  కొలిమిలో కాలుతున్న ఇనుము రిషి..

  కొలిమిలో కాలుతున్న ఇనుము రిషి..

  నేను రిషి భాదని కావాలనే చూస్తూ ఊరుకుంటున్నా అనుకుంటున్నారా.. ఈ విషయంలో కూడా మీకు స్పష్టత ఇవ్వాలి కదా.. ఇనుమును కొలిమిలో కాల్చాలి. ఆ తర్వాత కాలిన ఇనుమును సుత్తితో కొట్టాలి అప్పుడే అనుకున్న ఆకారం వస్తుంది. ఇప్పుడు రిషి.. కొలిమిలో కాలుతున్న ఇనుము. ఆ రిషిని దేవయాని వదిన ముట్టుకోలేదు. తనకు ఇష్టం వచ్చినట్లు ఆటలాడిన వదినగారి ఆటలు ఇక సాగవ్.

  వదినగారికి మనుషుల బలం, బలహీనతలు తెలుసు. ఎదుటివారి బలహీనతలను తనకు బలంగా మార్చుకుంటుంది. ఇప్పుడు రిషి తనను ఎక్కువగా ఇబ్బంది పెట్టలేదు. ఎందుకంటే ఎక్కువ చేస్తే రిషి తన చేతుల్లోంచి జారిపోతాడని భయపడుతుంది. ఆవిడ ఆట కట్టించాలి. రిషి వసుధార బంధం బలంగా ఉండాలనే కదా ఇదంతా చేస్తోంది అని మహేంద్ర అంటాడు.

  రిషి.. కొలిమిలో కాలుతున్న ఇనుము..

  రిషి.. కొలిమిలో కాలుతున్న ఇనుము..

  రిషిని ఇంతలా బాధపెట్టి చివరికీ.. అని జగతి అంటే.. ఫలితం దక్కదని బాధపడుతున్నావా.. ఓపికగా ఎదురుచూస్తే ఫలితం తప్పుకుండా దక్కుతుంది. ఇప్పుడు ఫలితం దక్కబోతోంది. రిషి నువ్వు మీరిద్దరూ నాకు ప్రాణసమానం. రిషికి దూరమై నువ్వు ఎంత బాధపడ్డావో నాకు తెలుసు. మళ్లీ ఏమవుతుందో అని భయపడుతున్నావ్ అంతేకదా.. మన బంధాల మధ్య అడ్డుగోడలు నిర్మిస్తోన్న వదినగారి ఆటలు కట్టించాలన్నా, రిషి మనసు కడిగిన ముత్యంలా మారాలన్నా, వసుధార బంధం బలపడాలన్న ఈ అజ్ఞాతవాసం ఇంకొన్నాళ్లు తప్పదేమో.

  ఒక్కోసారి చేదుగా ఉన్నా ఆరోగ్యం బాగుపడటం కోసం తాగక తప్పదు. ఇది కూడా అంతే అనుకో అని మహేంద్ర అంటాడు. రిషికి అండగా వసుధార ఉంది. రిషి పక్కన నిలబడింది అంటే ఏంటి అర్థం.. గౌతమ్ బాగా ఆలోచించు.. వసుధార రిషితోనే ఉంది.

  నువ్ చేసే పెత్తనం ఇదేనా..

  నువ్ చేసే పెత్తనం ఇదేనా..

  మేం తనను వదిలేశామని తను ఒంటరి అవుతాడని ఆలోచించి బాసటగా నిలుస్తోంది. రిషిని కంటికిరెప్పలా చూసుకుంటోంది. వసుధార ఆలోచనల్లో మార్పు మొదలైనట్టే కదా. రిషి విషయంలో ఎంతో కొంత తన పంతాన్ని తగ్గించుకున్నట్టే కదా అని మహేంద్ర అంటాడు. మరోవైపు కాలేజీలో ఇంటర్వ్యూ గురించి మీడియా వాళ్లు వసుధారకు కాల్ చేస్తే వద్దంటుంది. తర్వాత ఎప్పుడు అనేది ఇన్ఫామ్ చేస్తా సారీ.. అని చెబుతుంది వసుధార. మరోవైపు ఇంటికి ఫణీంద్ర వస్తాడు.

  ఇంటికొచ్చిన భర్తతో.. చూశారుగా ఈ మొగుడు పెళ్లాం ఎలా వెళ్లిపోయారో అంటుంది దేవయాని. ఏం చేశావ్ నువ్వు అని ఫణీంద్ర అడుగుతాడు. మీరు నన్ను అనడం కరెక్ట్ కాదు. నేను జగతిని చెల్లిలా చూసుకున్నాను. రిషిని పట్టించుకోకుండా వెళ్లిపోయారని దేవయాని అంటుంది. నేను అడుగుతుంది కాఫీ గురించి.. సరేకానీ అసలు వాళ్లు ఇంట్లో నుంచి వెళ్లిపోవడం ఏంటీ.. గొడవేమైనా జరిగిందా.. ఊరికెళ్లారని చెప్పావ్. ఇంటి పెత్తనం అంతా నాదే అంటావ్.. నువ్ చేసే పెత్తనం ఇదేనా.. నాకు నిజం చెబుతావా లేదా అని ఫణీంద్ర నిలదీస్తాడు.

  ఏం జరిగిందో కాస్త ఊహించగలను..

  దేవయాని దొంగ ఏడుపు స్టార్ట్ చేస్తుంది. జగతి చిన్నప్పుడే వెళ్లిపోతే రిషిని చూసుకున్నాను. ఇప్పుడు మాయమాటలు చెప్పి ఇంట్లోకి వచ్చింది. ఇప్పుడేమైందో తెలియదు ఇంట్లోంచి వెళ్లిపోయారు. ఇంటిగుట్టు బయటపెట్టడం ఎందుకని పోలీస్ కంప్లైంట్ ఎందుకు అన్నాను. ఇది కూడా నా తప్పేనా అయినా న్యాయానికి రోజుల్లేవు. వాళ్లని ఎలా పిలుస్తారో మీరే చూసుకోండి అని ఏడుస్తుంది దేవయాని.

  ఏం జరిగిందో కాస్త ఊహించగలను. మిగిలింది చెప్పమని అడుగుతున్నాను అని ఫణీంద్ర అంటాడు. మరోవైపు కాలేజీలో వసుధార దగ్గరికి గౌతమ్ వస్తాడు. రిషి గురించి అడుగుతాడు. మిషన్ ఎడ్యుకేషన్ పనులన్నీ సార్ చూసుకుంటున్నారు మహేంద్ర సార్ ఉంటే బాగుండేదని వసుధార అంటుంది.

  అది అసంభవం కదా..

  అది అసంభవం కదా..

  జరుగుతున్న పరిస్థితులకు తగినట్లుగా మనం నిర్ణయాలు తీసుకోవాలి. అంకుల్ జగతి మేడమ్ రారు అని గౌతమ్ అంటే.. మీరెలా చెబుతున్నారు వసుధార అంటుంది. మీ పెళ్లి విషయంలో ఓ నిర్ణయం తీసుకుని ఒక్కటైతే తప్ప వాళ్లు రారని అనిపిస్తోందని గౌతమ్ అంటాడు. ఈ మాటలు మీరే అంటున్నారా మీతో ఎవరైనా చెప్పిస్తున్నారా. మీరైతే ఇంతదూరం ఆలోచించలేరు కదా.

  అని వసుధార అనుమానంగా అడుగుతుంది. ఆలోచించాలి వసుధార పరిస్థితి తగ్గట్టుగా మారాలి. పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకోండి వాళ్లే వస్తారని గౌతమ్ అంటాడు. మహేంద్ర సార్ వాళ్లు ఎక్కడున్నారో మీకు తెలుసు కదా సార్. మా పెళ్లి విషయంలో ఓ అడుగు ముందుకు వేస్తే వాళ్లు వస్తారని మీరెలా అంటారు అని వసుధార అంటుంది. నేను అలా అనుకుంటున్నాను అంతే.. గుచ్చిగుచ్చి ఎందుకు అడుగుతున్నావ్. మీరిద్దరు ఒక్కటైతేనే వాళ్లొస్తారు అని గౌతమ్ అంటే.. వాళ్లిద్దరు లేకుండా మేము ఎలా ఒక్కటవుతాం. అది అసంభవం కదా అని వసుధార అంటుంది.

  English summary
  Guppedantha Manasu Serial November 15 2022 Today Full Episode 608
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X