For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Guppedantha Manasu Today Episode:తల్లి రాక కోసం రిషి కొత్త ప్లాన్.. జగతికి ఎమోషన్ గా మెయిల్

  |

  దేవయాని భర్త ఫణీంద్ర ఊరు నుంచి వస్తాడు. రిషితో మాట్లాడుతుంటాడు. టాపిక్ డైవర్ట్ చేసేందుకు మీరు వెళ్లిన పని ఏమైంది పెద్దనాన్న అని అడగుతాడు రిషి. మిషన్ ఎడ్యుకేషన్ గురించి అక్కడి వాళ్లతో మాట్లాడాను. వారు చాలా ఆసక్తిగా ఉన్నారని చెబుతాడు ఫణీంద్ర. అందుకు సంబంధించిన వివరాలు మనకు త్వరలోనే తెలుస్తాయి అని రిషి అంటాడు.

  తర్వాత రిషి.. నువ్వు మహేంద్ర వాళ్ల గురించి బాధపడకు.. ఎందుకు వెళ్లిపోయారు అనేదానికంటే.. ఏం చేస్తే వస్తారు అన్న విషయం గురించి నిదానంగా ఆలోచించు అని చెబుతాడు ఫణీంద్ర. కట్ చేస్తే వసుధార కోసం భోజనం తీసుకొస్తాడు రిషి. ఇలా ఆసక్తికర కథా కథనంతో సాగుతోన్న గుప్పెడంత మనసు సీరియల్ నవంబర్ 17, 2022 గురువారం నాటి తాజా ఎపిసోడ్​ 610లో ఏం జరిగిందో చదివేసేయండి.

  గుడ్ నైట్ జెంటిల్ మెన్..

  గుడ్ నైట్ జెంటిల్ మెన్..

  రిషి భోజనం తీసుకొస్తే నాకు ఆకలిగా లేదు సార్ అని అంటుంది వసుధార. వసుధారకు తినిపించేందుకు ట్రై చేస్తాడు రిషి. అప్పుడు వసుధార తాను తింటూ.. రిషికి కూడా తినిపిస్తుంది. అప్పుడు రిషి కూడా వసుధారకు తినిపిస్తాడు. ఇద్దరు ఒకరికొకరు తినిపించుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత రిషి చేతులు కడుక్కున్న తర్వాత వసుధార తన చున్నీని తుడుచుకోవడానికి ఇస్తుంది.

  నువ్ ఎప్పుడూ ఏడవకు వసుధార ప్లీజ్.. గుడ్ నైట్ అని చెప్పి వెళ్లిపోతాడు రిషి. అప్పుడు మనసులో గుడ్ నైట్ జెంటిల్ మెన్ అని నవ్వుకుంటుంది వసుధార. ఆ తర్వాత రిషి తన గదిలోకి వెళ్లి వసుధార అన్నమాటలు తలుచుకుని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే జగతి గురించి ఆలోచిస్తూ మేడమ్ నాకు మీ మీద చిన్నప్పటి నుంచి కోపం ఉందేమో.. వసుధార అంటే మీకు ఇష్టమే కదా.. అలాంటప్పుడు ఎందుకు విడిచి వెళ్లారు అని అనుకుంటాడు రిషి.

  ఇంటర్వ్యూకి మేడమ్ వస్తున్నారు కదా..

  ఇంటర్వ్యూకి మేడమ్ వస్తున్నారు కదా..

  ఫణీంద్ర-దేవయాని, గౌతమ్ అందరూ కూర్చుని మాట్లాడుకుంటారు. అప్పుడు వచ్చిన రిషి..వసుధార సాధించిన విజయానికి ఇంటర్వ్యూ చేస్తున్నారని చెబుతాడు. అప్పుడే కాఫీ తీసుకొచ్చిన వసుధారతో ఏం వసుధార ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యావా.. జగతి వాళ్లు లేరు కదా అన్నట్లు మాట్లాడుతుంది. నేను ఎప్పటికీ మేడమ్ ని మిస్ అవ్వను. తను నా మనసులోనే ఉంటారు. మేడమ్ ఎక్కడున్నా ఆమె ఆశీస్సులు నాకు ఉంటాయి.

  అయినా ఇంటర్వ్యూకి మేడమ్ వస్తున్నారు కదా.. అని అంటుంది. దీంతో అక్కుడున్న వారంతా షాక్ అవుతారు. మేడమ్ వాళ్లు ఎలాగైనా వస్తారని రిషి సార్ అన్నారు. ఆయన ఓ మాట అన్నారంటే.. ఊరికే అనరు. అది నిజం అవుతుంది. ఆ నమ్మకం నాకుంది అని వసుధార అంటుంది. దీనికి నీ నమ్మకం నిజం కావాలని కోరుకుంటున్నానమ్మా అని ఫణీంద్ర అంటాడు.

  నాకు ఎందుకింత శిక్ష పడిందో..

  నాకు ఎందుకింత శిక్ష పడిందో..

  ఏదో నీ కన్నీళ్లను చూడలేక రిషి అలా అని ఉంటాడు. వాళ్లెక్కడి నుంచి వస్తారు అదంతా నీ భ్రమ అని దేవయాని అంటుంది.అంకుల్ వాళ్లు ఎక్కడున్నారో తెలుసా. వస్తారని అంత నమ్మకంగా చెబుతున్నావేంటి అని గౌతమ్ అంటాడు. చూస్తుండు అని రిషి అనుకుంటాడు. మరోవైపు రిషి నుంచి వచ్చిన మెయిల్ చూసుకుని జగతి మురిసిపోతుంది.

  రిషి పక్కనే ఉండి చదివి వినిపిస్తున్నట్లుగా భావించుకుంటారు జగతి-మహేంద్ర. ఆ మెయిల్ లో.. మీరు నన్ను వదిలిపెట్టి ఎందుకు వెళ్లారో నాకు ఇప్పటికీ తెలియదు. నాకు ఎందుకింత శిక్ష పడిందో నాకు తెలియదు. ఇప్పుడు మీరు అదే శిక్ష వసుధారకు వేస్తున్నారు.

  మీరుంటే బాగుంటుందని ఆశ..

  మీరుంటే బాగుంటుందని ఆశ..

  డాడ్ ఆనందం కోసం ఒక మెట్టు దిగి నేను మిమ్మల్ని ఇంటికి ఆహ్వానించాను. వచ్చినట్టే వచ్చి డాడీని తీసుకుని వెళ్లిపోయారు. ఇది మీకు న్యాయం కాదు కదా మేడమ్. ఎక్కడికి వెళ్లారో ఏంటో తెలియదు. మీరెలా ఉన్నారో అని ప్రతి క్షణం టెన్షన్ పడుతున్నాను. కానీ మీ ఇద్దరి వైపు నుంచి సమాచారం లేదు. మినిస్టర్ గారి దగ్గరి నుంచి కావాలనే నాకు కనిపించకుండా వెళ్లారు.

  అది నాకు ఎంతో బాధ కలిగించిన విషయం. కానీ ఇప్పుడు ఈ బాధ నా ఒక్కిడిదే కాదు. వసుధారది కూడా. వసుధార యూనివర్శిటీ టాపర్ అయ్యాక కూడా మీరు ప్రత్యక్షంగా అభినందించాలని ఎందుకు అనుకోవడం లేదే అర్థం కావడం లేదు. మీడియా ఇంటర్వ్యూ సమయంలో మీరుంటే బాగుంటుందని తను ఆశపడుతుంది. తన కోరికను మీరు నెరవేరుస్తారని ఆశిస్తున్నాను.

  పెళ్లి విషయం ప్రకటించే వరకు..

  తల్లి వదిలేసి వెళ్లిన కొడుకు ప్రార్థన అనుకుంటారో.. గురువు వదిలేసి వెళ్లిన శిష్యురాలి బాధ అనుకుంటారో.. వసుధార కళ్లలో సంతోషం చూడాలని డాడ్ తో కలిసి మీరు కాలేజీకి వస్తారని ఎదురుచూస్తున్నాను అని మెయిల్ లో ఉంటుంది. రిషి మెయిల్ చూసిన జగతి ఆనందపడుతుంది. రిషి నిన్ను అమ్మగా రమ్మని చెప్పడం లేదు.

  వసుధారకి ఇంటర్వ్యూ చేస్తుంటే తనకు సపోర్ట్ గా ఉండటం కోసం తాను రమ్మంటున్నాడని అంటాడు మహేంద్ర. నాకు వెంటనే వెళ్లిపోవాలని ఉంది మహేంద్ర అని జగతి అంటే.. వారి పెళ్లి విషయం ప్రకటించే వరకు మనం ఇక్కడి నుంచి వెళ్లేది లేదని మహేంద్ర చెబుతాడు. ఇప్పుడు నేను వెళ్లకపోతే రిషి చాలా ఫీల్ అవుతాడు అని జగతి అంటుంది. దీనికి ఇప్పుడు మనం వెళ్లలేం అని మహేంద్ర చెబుతాడు.

  English summary
  Guppedantha Manasu Serial November 17 2022 Today Full Episode 610
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X