Guppedantha Manasu Today Episode: మేడమ్ కోసం స్టూడెంట్ ఆరాటం.. మహేంద్రకు షాక్ ఇచ్చిన జగతి

వసుధార కోసమైన కాలేజీకి రమ్మని జగతికి మెయిల్ చేస్తాడు రిషి. అది చూసి సంబరపడిపోతుంది జగతి. కానీ మహేంద్ర మాత్రం నిన్ను అమ్మగా పిలవలేదు. వసుధారకు తోడుగా పిలిచాడని చెబుతాడు. మనం గెలవడానికి మూడు అడుగుల దూరంలో ఉన్నాం. ఇప్పుడు మనం వెళ్లొద్దని మహేంద్ర చెబుతుంటే.. ఇప్పుడు నేను వెళ్లకపోతే రిషి ఎప్పటికీ క్షమించడు అని అంటుంది జగతి. మీడియా ముందు వసుధార మాట్లాడుతుంటే వసుధార విజయాన్ని గర్వంగా చూడాలంటుంది జగతి. నేను చెప్పేది చెప్పాను.. ఆ తర్వాత నీ ఇష్టం అని అంటాడు మంహేంద్ర. మరోవైపు వసుధార రెడీ అవుతూ తనకు తానే పొగుడుకుంటూ ఉంటుంది. ఇలా ఆసక్తికర కథా కథనంతో సాగుతోన్న గుప్పెడంత మనసు సీరియల్ నవంబర్ 18, 2022 శుక్రవారం నాటి తాజా ఎపిసోడ్​ 611లో ఏం జరిగిందో చదివేసేయండి.

మీరెప్పటికీ నాకు తోడుగా ఉంటారు..

మీరెప్పటికీ నాకు తోడుగా ఉంటారు..

నువ్వు మంచి అమ్మాయివి. రిషి సార్ ను నొప్పించొద్దు అని మాట్లాడుకుంటూ ఉంటుంది వసుధార. ఈలోపే రిషి వస్తాడు. దీంతో సార్ వెళదాం పదండి అంటుంది. అప్పుడు రిషి.. వసుధార నుదిటిపై బొట్టు లేకపోవడంతో చూసి వసుధారకు దగ్గరగా వెళ్లి.. అద్దం దగ్గర ఉన్న బొట్టు తీసి పెడతాడు. వసుధార ఆల్ ది బెస్ట్ ఎవరు వచ్చిన, రాకపోయినా కొన్ని జరుగుతూ ఉంటాయి. నీ వెనుక నేనున్నాను అని ధైర్యం చెబుతాడు. మీరెప్పటికీ నాకు తోడుగా ఉంటారు సార్.. ఈ విషయం నాకు తెలుసు. కానీ మనసులో మాత్రం జగతి మేడమ్ వస్తే బాగుండు అని చిన్న కోరిక మిగిలిపోయింది అంటుంది. ఇద్దరూ చేతిలో చేయివేసి మాట్లుడుకుంటూ ఉండగా దేవయాని వచ్చి మీ పెద్దనాన్న బయలుదేరారని చెబుతుంది. మేము కూడా వెళ్తున్నాం వసుధారకి ఆల్ ది బెస్ట్ చెప్పండని రిషి అంటాడు.

మహేంద్ర వాయిస్ గుర్తపట్టిన ఫణీంద్ర..

మహేంద్ర వాయిస్ గుర్తపట్టిన ఫణీంద్ర..

మీడియా ముందు ఎలా మాట్లాడాలో ప్రిపేర్ అయ్యావా అని రిషి అడిగితే.. వాళ్లు అడిగిన దానికి సమాధానం చెప్పడమే, ప్రిపేర్ ఏముంటుంది అని సమాధానం ఇస్తుంది వసుధార. ఓ చిన్న పని ఉంది. ఇప్పుడే వస్తానంటూ వసుధారను తీసుకెళ్లిపోతాడు రిషి. ఇంతలో గౌతమ్ కి మహేంద్ర కాల్ చేస్తాడు. ఆ ఫోన్ ఫణీంద్ర లిఫ్ట్ చేస్తాడు. తన అన్నయ్య వాయిస్ విన్న మహేంద్ర ఫోన్ కట్ చేస్తాడు. ఇంతలో గౌతమ్ అక్కడకు రావడంతో నీకు ఏదో కాల్ వచ్చింది.. మహేంద్ర వాయిస్ లా అనిపించిదని ఫణీంద్ర అనడంతో రిషి, వసుధార షాక్ అవుతారు. అప్పుడు బలవంతంగా గౌతమ్ ఫోన్ తీసుకుని తిరిగి కాల్ చేస్తాడు. రిషి వాయిస్ విని మహేంద్ర ఎమోషనల్ అవుతాడు. ఫోన్ కట్ చేస్తాడు. గౌతమ్ మాత్రం ఏదో కవర్ చేసి అక్కడి నుంచి తప్పించుకుంటాడు.

మేడమ్ వస్తారా.. రారా..

మేడమ్ వస్తారా.. రారా..

మరోవైపు జగతి గురించి వసుధార ఆలోచిస్తూ ఉంటుంది. ప్రెస్ మీట్ లో మేడం వాళ్లు ఉంటే బాగుంటుంది అని అనుకుంటూ వెళ్తూ ఉంటుంది. గౌతమ్ ని పిలిచి అడుగుదాం అనుకున్నా.. తప్పించుకుని వెళ్లిపోయాడని అనుకుంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన రిషి ఏంటీ మేడమ్ గురించి ఆలోచిస్తున్నావా అని అంటాడు. మేడమ్ వస్తారా.. రారా.. అనే విషయం పక్కన పెట్టి నువ్వు ధైర్యంగా మీడియా ముందు ఇంటర్వ్యూకి అటెండ్ అవు అని ధైర్యం చెబుతాడు. కాసేపు సరదాగా ఇంటర్వ్యూ చేస్తాడు. జగతి మేడమ్ గురించి వసుధార ఎమోషనల్ గా మాట్లాడుతుంటుంది. మరోవైపు కాలేజీలోకి జగతి ఎంట్రీ ఇస్తుంది.

వసుధార కోసం జగతి..

వసుధార కోసం జగతి..

మరోవైపు గౌతమ్ ఇంట్లో జగతి కోసం వెతుకుతాడు మహేంద్ర. అప్పుడు ఒక లెటర్ ఉంటుంది. నేను వెళ్లిపోతున్నాను మహేంద్ర అని లెటర్ లో రాసిపెట్టి వెళ్లిపోతుంది జగతి. ఇటు కాలేజీలో రిషి మాట్లాడుతుండగా వసుధార జగతి కోసం బాధపడుతూ ఉంటుంది. అప్పుడు వసుధారకు ధైర్యం చెబుతూ ముందుగానే ప్రెస్ మీట్ ఎలా ఉంటుంది. నేను రిపోర్టర్ అంటూ వసుధారపై ప్రశ్నల వర్షం కురిపిస్తాడు రిషి. అప్పుడు రిషి అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది వసుధార. మరోవైపు వసుధార కోసం జగతి వస్తూ ఉంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X