Guppedantha Manasu: ప్రెస్ మీట్ కు రాకుండా బంధీగా వసుధార.. ఎమోషనల్, ఆసక్తిగా ఎపిసోడ్

కాలేజీలో మీడియా ఇంటర్వ్యూకి జగతి మేడమ్ లేదని ఆలోచిస్తూ బాధపడుతుంటుంది వసుధార. వసుధారకు ధైర్యం చెబుతూ మీడియా ఇంటర్వ్యూకి వసుధారను ప్రిపేర్ చేస్తుంటాడు రిషి. అందుకోసం తానే రిపోర్టర్ అని చెప్పి సరదాగా ఇంటర్వ్యూ చేస్తాడు. జగతి గురించి గొప్పగా వసుధార చెబుతూ ఉంటుంది. ఇంతలో మరోవైపు కాలేజీలోకి జగతి ఎంట్రీ ఇస్తుంది. వసుధారకు ధైర్యం చెబుతున్న రిషిని, వసుధారను దూరం నుంచి చూసిన జగతి సంతోషపడుతుంది. ఇలా ఆసక్తికర కథా కథనంతో సాగుతోన్న గుప్పెడంత మనసు సీరియల్ నవంబర్ 19, 2022 శనివారం నాటి తాజా ఎపిసోడ్​ 612లో ఏం జరిగిందో చదివేసేయండి.

ఈసారి నేను చెప్పినట్లు జరగాలి..

ఈసారి నేను చెప్పినట్లు జరగాలి..

కాలేజీలో వసుధార, రిషిని చూసి జగతి సంతోషపడుతుంది. మరోవైపు దేవయాని మరో ప్లాన్ కు సిద్ధమవుతుంది. చెప్పింది గుర్తుంది కదా.. ఈసారి నేను చెప్పినట్లు జరగాలి మర్చిపోవద్దండి అని అంటుంది. మీరు చేయాల్సింది మీరు చేయండి ఆ తర్వాత ఏం చేయాలో నేను చూసుకుంటాను అని మాట్లాడుతూ ఉంటుంది. ఈ మాటలు విన్న ధరణి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ధరణి అటుగా వెళ్లిందని అనుమానం వచ్చిన దేవయాని.. ధరణి అని పిలుస్తుంది. అప్పుడే వచ్చిన ధరణి.. నాకు వినిపించలేదు అత్తయ్య గారు కిచెన్ లో బిజీగా ఉన్నానంటుంది. హమ్మయ్యా అనుకుంటుంది దేవయాని.

దేవయాని ప్లాన్ గురించి చెప్పాలి..

దేవయాని ప్లాన్ గురించి చెప్పాలి..

ధరణి మాత్రం దేవయాని ప్లాన్ గురించి వెంటనే రిషికి గానీ వసుధారకు గానీ ఎవరో ఒకరికి చెప్పాలి. ఏదో పెద్ద ప్లాన్ వేస్తున్నారు. ఈ విషయం రిషికి చెప్పాలని అనుకుంటూ వెళ్తుంటుంది. ఇంతలో వెనుకే దేవయాని వచ్చి ఆపుతుంది. ఎక్కడికి వెళ్తున్నావ్ అని నిలదీస్తుంది. ఊరికే వెళ్తున్నా అని కవర్ చేస్తుంది ధరణి. ఏదో టెన్షన్ గా కనిపిస్తున్నావని దేవయాని అనడంతో.. మిమ్మల్ని చూసిన ప్రతిసారి ఏదో టెన్షన్ గా ఉంటుంది అత్తయ్యా అని చెబుతుంది ధరణి. దేవయాని మాత్రం నాకు తలనొప్పిగా ఉంది, తలపట్టు అంటుంది. అయ్యో ఫోన్ చేద్దాం అనుకుంటే ఇలా అయిందేంటని మనసులో అనుకుంటుంది ధరణి.

వసుధార డ్రెస్ పై జ్యూస్..

వసుధార డ్రెస్ పై జ్యూస్..

దేవయాని తల పడుతుంటుంది ధరణి. వసుధార ఇంటర్వ్యూకి మహేంద్ర-జగతి వస్తారంటావా అని దేవయాని అడిగితే.. వస్తే మంచిదే కదా.. అయినా నాకెలా తెలుస్తుందని అంటుంది ధరణి. మరోవైపు గౌతమ్ ఇంట్లో మహేంద్ర ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో వచ్చిన గౌతమ్.. వసుధార బాధను మేడమ్ అర్థం చేసుకున్నారు.. అందుకే వెళ్లారు.. మీరు కూడా రండి అని పిలుస్తాడు. గౌతమ్ ఎంత చెప్పినా మహేంద్ర రాను అంటాడు. ఇంతలోనే ధరణి గౌతమ్ కి ఫోన్ చేస్తుంది. మరోవైపు కాలేజీలో జగతి గురించి వసుధార ఆలోచిస్తూ ఉంటుంది. వేరే వ్యక్తి జ్యూస్ తీసుకొచ్చి ఇస్తూ కావాలనే వసుధార డ్రెస్ పై పోస్తాడు. రిషి సీరియస్ అవుతాడు.

డాడ్ నాకోసం రాలేదు..

డాడ్ నాకోసం రాలేదు..

ఇంతలో పుష్ప వచ్చి మీడియా వాళ్లు వచ్చారు సార్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. డ్రెస్ క్లీన్ చేసుకుందామని లోపలకి వెళ్తుంది వసుధార. డ్రెస్ క్లీన్ చేసుకుంటూ ఉండగా జగతి అక్కడికి రావడంతో షాక్ అవుతుంది. ఆ తర్వాత ఆనందంగా జగతిని హగ్ చేసుకుంటుంది వసుధార. కంగ్రాట్స్ వసు.. నువ్ సాధించావని అంటుంది. వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి రిషి వస్తాడు. అప్పుడు.. మేడమ్ డాడ్ ఎక్కడా అని అడుగుతాడు రిషి. డాడ్ అంటూ రిషి వెతుకుతుంటే జగతి బాధపడుతుంది. మేడమ్ మీరు శిష్యురాలి మీద ప్రేమతో వచ్చారు. కానీ డాడ్ నాకోసం రాలేదు అని ఎమోషనల్ అవుతాడు.

వసుధార ఇంకా రాలేదేంటి..

వసుధార ఇంకా రాలేదేంటి..

డాడ్ నన్ను ఇంత బాధపెడుతున్నారు. అంత పెద్ద తప్పు నేనేం చేశాను మేడమ్. ఇప్పుడు చెప్పండి మేడమ్. ఒకవేళ మీకు ఇప్పుడు చెప్పడం ఇష్టం లేకపోతే ఇంటర్వ్యూ అయిపోయినా తర్వాత అయినా, వెళ్లేటప్పుడు అయినా చెప్పి వెళ్లండి మేడమ్ అని జగతిని బతిమిలాడతాడు. వసుధార కంటే ముందే మీరు వచ్చి ఇంట్రడక్షన్ ఇవ్వండని చెప్పేసి రిషి వెళ్లిపోతాడు. అప్పుడు ఓ వ్యక్తి వచ్చి వసుధార లోపల ఉండగా గదికి తాళం వేస్తాడు. మరోవైపు ఫణీంద్రతో జగతి మాట్లాడుతుంటుంది. వసుధార ఇంకా రాలేదేంటని రిషి కంగారుపడుతూ ఉంటాడు. ఇలా ఆసక్తికగా సాగుతోన్న గుప్పెడంత మనసు సీరియల్ లో తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తదుపరి ఎపిసోడ్ (సోమవారం) వరకు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X