twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Guppedantha Manasu: మీడియాకు దొరికిన రిషిధార.. సూపర్బ్ గా మహేంద్ర ఎంట్రీ

    |

    మీడియా ఇంటర్వ్యూకి వసుధార అటెండ్ కాకుండా దేవయాని మనిషి వచ్చి తలుపుకున్న గడియ పెట్టేసి వెళ్లిపోతాడు. బయట వసుధార ఇంకా రాలేదేంటని రిషి టెన్షన్ పడుతుంటాడు. మరోవైపు జగతో ఫణీంద్ర మాట్లాడుతాడు. మీరు ఇంట్లో నుంచి వెళ్లిపోవడం ఏంటమ్మా.. మహేంద్ర ఎక్కడ అని ఫణీంద్ర అడుగుతాడు. కానీ జగతి మాత్రం ఏం మాట్లాడకుండా రాలేదని తల ఊపుతుంది. అసలు ఏం జరిగింది.. ఈ కోపాలు ఏంటి.. ఇల్లు వదిలి వెళ్లిపోవడం ఏంటి.. రిషి ఎంత బాధపడతాడో మీరిద్దరు ఒక్కసారి కూడా ఆలోచించలేదా.. మహేంద్ర ఒక్క గంట కనిపించకపోతే ఎంతో తల్లడిల్లిపోతాడు.

    అలాంటింది ఇన్ని రోజులు మహేంద్ర కనపడకపోతే.. ఎలా ఉంటాడో తన బాధను అర్థం చేసుకోవద్దా.. అని జగతితో అంటాడు ఫణీంద్ర. ఇలా ఆసక్తికర కథా కథనంతో సాగుతోన్న గుప్పెడంత మనసు సీరియల్ నవంబర్ 21, 2022 సోమవారం నాటి తాజా ఎపిసోడ్​ 613లో ఏం జరిగిందో చదివేసేయండి.

    ఎవరో కావాలనే గడియ పెట్టారు..

    ఎవరో కావాలనే గడియ పెట్టారు..

    రూమ్ నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తుంటుంది. కానీ గడియ పెట్టి ఉండటం వల్ల రాలేకపోతుంది. దీంతో ఎవరైనా ఉన్నారా అని పిలుస్తూనే ఉంటుంది వసుధార. కానీ ఎవరికీ వినిపించదు. రిషికి కాల్ చేసి గదిలో లాక్ అయిపోయినట్లు చెబుతుంది వసుధార. దీంతో రిషి వచ్చి తలుపు తీస్తాడు.

    రిషి లోపలికి వెళ్లడం చూసిన దేవయాని మనిషి.. వాళ్లిద్దరు గదిలో ఉండగా.. మళ్లీ తలుపు గడియ పెట్టేస్తాడు. బయటకు వెళ్లేందుకు రిషి డోర్ దగ్గరికి వెళతాడు. కానీ తలుపు రాదు. ఎవరో కావాలని గడియ పెట్టారని వసుధార అంటుంది. దేవయాని మనిషి మీడియా అతని దగ్గరికి వెళ్లి ప్లాన్ సక్సెస్ అయిందని సైగ చేసి చెబుతాడు.

    ఇలా కవర్ చేస్తున్నారా..

    ఇలా కవర్ చేస్తున్నారా..

    మరోవైపు దేవయాని కుట్ర ఏంటో తెలుసుకునేందుకు గౌతమ్ కాలేజీకి వస్తాడు. లోపల రిషి, వసుధార టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడే దేవయాని మనిషి మళ్లీ వచ్చి గడియ తీస్తాడు. ఇంకోసారి ట్రై చేద్దామని రిషి తలుపు తీసేసరికి ఎదురుగా మీడియా వాళ్లు జగతి, ఫణీంద్ర అందరూ ఉంటారు. వాళ్లను చూసి వసుధార షాక్ అవుతుంది. అందరూ అక్కడికి చేరుకుంటారు. మీడియా ఏంటి ఇది అని ప్రశ్నిస్తుంది. మేమిద్దరం లోపలకి వెళ్లేసరికి ఎవరో గడియ పెట్టారని రిషి చెబుతాడు. మరి మేము వచ్చేసరికి మీరు తలుపు ఎలా తీశారు.. మేము వచ్చేసరికి ఇలా కవర్ చేస్తున్నారా అని అంటారు.

    భలే స్టోరీ అల్లారు..

    భలే స్టోరీ అల్లారు..

    ఒక స్టూడెంట్ తో మీరు గదిలో ఉన్నారు. మేము వచ్చేసరికి గడియ పెట్టారని సింపుల్ గా చెప్పేశారు. అందరూ అక్కడ ఉంటే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు.. అని తప్పుగా మాట్లాడతారు. ఆ మటాలకి కోప్పడిన రిషి అరుస్తాడు. అసలు మీరిద్దరు గదిలోకి ఎందుకు వచ్చారని మళ్లీ అడుగుతాడు. దీంతో తన డ్రెస్ పై జ్యూస్ పడిందని క్లీన్ చేసుకుని వచ్చేసరికి గడియ పెట్టి ఉందని.. దీంతో రిషి సార్ కి కాల్ చేస్తే వచ్చారు. మళ్లీ బయటకు వచ్చే సమయానికి ఎవరో గడియ పెట్టారని వసుధార చెబుతుంది. ఇలా చెబితే భలే స్టోరీ అల్లారు.. కాలేజీ గదిలో దొరికిన స్టూడెంట్.. ఇంకా అని మీడియా వ్యక్తి మాట్లాడుతుంటే ఆపమని రిషి గట్టిగా అరుస్తాడు.

    తండ్రిని చూసి రిషి ఎమోషనల్..

    తండ్రిని చూసి రిషి ఎమోషనల్..

    వసుధార మీకే ఎందుకు ఫోన్ చేయాలి.. ఫ్రెండ్స్ ఉన్నారు కదా.. మీకే ఎందుకు చేసింది.. మీరు కాలేజీ ఎండీ కదా.. మీకే ఎందుకు చేసింది. చేస్తే మీరే ఎందుకు వచ్చారు. ఎవరినైనా పంపించొచ్చు కదా... చెప్పండి మీరే ఎందుకు రావాలి అని మీడియా ప్రశ్నలు వేస్తుంది. దీంతో రిషి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు.

    అటు నుంచి నేను చెప్పొచ్చా అని మహేంద్ర ఎంట్రీ ఇస్తాడు. వసుధార వాళ్లు వచ్చిన గదిలోపల ఉండి అడుగుతాడు. మహేంద్రను చూసిన రిషి చాలా ఎమోషనల్ అవుతాడు. రిషి నాకోసం వచ్చాడు.. నేనే రిషిని రమ్మన్నాను.. గదిలో ఇద్దరం ఉన్నాం.. ఆలోచనలు మారిపోతాయా.. గదిలో ముగ్గురుం ఉన్నాం.. ఏం కావాలి నీకు అని గట్టిగా అరుస్తాడు మహేంద్ర.

    ఇంకో తలుపు తాళం తీసుకుని..

    అనంతరం అందరిని వెళ్లిపోమ్మని చెబుతాడు మహేంద్ర. తర్వాత.. డాడ్ అంటూ మహేంద్రను కౌగిలించుకుని ఎమోషనల్ అవుతాడు రిషి. సమయానికి వచ్చి మంచి పని చేశావ్ అని ఫణీంద్ర అంటాడు. ఈ గదిలోకి ఎలా వచ్చావ్ అని మహేంద్రను జగతి అడుగుతుంది. రిషి వాళ్లు బయటకు రావడం చూశాను.. ఆ గదికి ఉండే ఇంకో తలుపు తాళం తీసి లోపలికి వచ్చానని చెబుతాడు మహేంద్ర. ఈ సంఘటన తర్వాత వసుధార ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుంది.

    English summary
    Guppedantha Manasu Serial November 21 2022 Today Full Episode 612..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X