Guppedantha Manasu: దేవయాని కుట్రపై గౌతమ్ ఆరా.. తండ్రిని ఇంటికి రమ్మని ప్రాధేయపడిన రిషి

వసుధార, రిషి ఒకే గదిలో నుంచి రావడాన్ని తప్పు పడుతుంది మీడియా. రిషిపై మీడియా ప్రశ్నల వర్షం కురిపిస్తే అదే గది నుంచి మహేంద్ర ఎంట్రీ ఇచ్చి మీడియా క్వశ్చన్స్ కి చెక్ పెడతాడు. ఇక ఈ గొడవ తర్వాత కాలేజీలో ఫంక్షన్ కొనసాగుతుంది. యూనివర్శిటీ టాపర్ గా వసుధార రావడంతో అందరు బొకేలు ఇస్తారు. వసుధార మెడలో పూలమాల వేస్తాడు రిషి. దీంతో జగతి-మహేంద్ర తెగ సంతోషపడతారు. అనంతరం ఇంటర్వ్యూ మొదలు పెట్టండని జగతి అంటుంది.

ఇంతలో వసుధార ఒక రిక్వెస్ట్ అని అంటుంది. నన్ను ప్రోత్సహించి నన్ను నడిపించిన రిషిసార్.. జగతి మేడమ్ నా పక్కనే ఉండాలని చెబుతుంది. జగతి-రిషి సరే అంటారు. ఇలా ఆసక్తికర కథా కథనంతో సాగుతోన్న గుప్పెడంత మనసు సీరియల్ నవంబర్ 21, 2022 మంగళవారం నాటి తాజా ఎపిసోడ్​ 614లో ఏం జరిగిందో చదివేసేయండి.

జగతి కాళ్లకు నమస్కరించి..

జగతి కాళ్లకు నమస్కరించి..

జగతి కాళ్లకు నమస్కరించి ఇంటర్వ్యూకు సిద్ధమవుతుంది వసుధార. నన్ను నడిపించింది జగతి మేడమ్ అయితే.. ఈ ప్రయాణంలో ధైర్యం నింపింది రిషి సార్ అంటూ ఇద్దరిని పొగుడుతూ ఇంటర్వ్యూ స్టార్ చేస్తుంది. మీ కుటుంబం గురించి చెప్పమని అడిగిన ప్రశ్నకు.. ఎక్కడో ఓ మూలనున్న అందమైన పల్లెటూరు. అమ్మా నాన్న, అక్కయ్యలు ఇదే నా కుటుంబం. జీవితంపై ఎన్నో ఆశలతో కలలతో ఈ కాలేజీకి చేరుకున్నాను. ఇల్లు-కుటుంబం, ఊరుని వదిలేసి ఒంటరిగా ఇక్కడకు వచ్చేశాను. పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ చదువుకున్నాను. చివరికి నా కష్టానికి ఫలితం దక్కింది అని వసుధార సమాధానం ఇచ్చింది.

అవసరమైన చోట ఎదిరించాలి..

అవసరమైన చోట ఎదిరించాలి..

యూనివర్శిటీ టాపర్ అవ్వాలంటే ఏం చేయాలని మీరు స్టూడెంట్స్ కి చెబుతారని అడగ్గా.. విజయానికి మూడు సూత్రాలు. శ్రమ.. శ్రమ.. శ్రమ. వెళ్లే దారిలో కష్టాలు, కన్నీళ్లు, అవమానాలు ఇలా ఎన్నెన్నో ఉంటాయి. అన్నింటినీ భరించాలి. అవసరమైన చోట ఎదిరించాలి. అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని వసుధార చెబుతుంది.

మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటన్న ప్రశ్నకు.. ఎక్కడికి వెళ్లను.. ఇక్కడే ఉంటానని వసుధార అంటుంది. ఏదైనా పెద్ద ఉద్యోంగలో స్థిరపడతారా అన్నదానికి.. అవును.. స్టూడెంట్స్ కి చదువు చెప్పే ఉద్యోగంలో స్థిరపడతాను అని వసుధార చెబుతుంది. గతంలో లెక్చరర్ అవుతానన్న వసుధార మాటలను గుర్తు చేసుకుంటాడు రిషి.

జగతికి సైగ చేస్తూ వెళ్లేందుకు..

జగతికి సైగ చేస్తూ వెళ్లేందుకు..

వసుధార విజయంపై మీరు ఏం భావిస్తున్నారని రిషిని అడగ్గా.. వసుధార అందరికీ ఆదర్శంగా నిలిచింది. తను జీవితంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆశిస్తున్నాని చెప్పి ఇంటర్వ్యూ ముగిస్తాడు. ఆ తర్వాత నువ్ ఈ కాలేజీకే కాదు.. నాక్కూడా చాలా ముఖ్యం అని చెప్పాలనిపిస్తోంది అని వసుధారతో అంటాడు రిషి. దీనికి వద్దు సార్.. ఇది సందర్భం కాదని అంటుంది వసుధార.

అనంతరం అందరూ సెల్ఫీలు తీసుకుంటారు. జగతికి సైగ చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తాడు మహేంద్ర. అయితే జగతి చేతిని వసుధార అస్సలు వదలదు. మహేంద్ర వెళ్తుండగా.. రిషి వెళ్లి చేయి పట్టుకుంటాడు. నన్ను వదిలి వెళ్లొద్దని అంటాడు. ఇంతలో రిపోర్టర్ వచ్చి రిషిని మాటల్లో పెడతాడు. దీంతో మహేంద్ర జారుకునేందుకు ప్రయత్నిస్తాడు. కానీ ఇంతలో రిషికి జగతి ఎదురుపడుతుంది.

కొన్ని తప్పవు అంటూ..

కొన్ని తప్పవు అంటూ..

డాడ్ ఏ విషయంలో నాపై కోపం పెంచుకున్నారో తెలియదు.. కానీ తనను మీరు జాగ్రత్తగా చూసుకోండి మేడమ్ అని రిషి అంటాడు. అది నా బాధ్యత రిషి అని జగతి చెబుతుంది. మీరు నాకో సాయం చేయాలి మేడమ్.. పదండి డాడ్ దగ్గరికి వెళదాం అని రిషి అంటాడు. ఈలోగా స్టూడెంట్స్ వచ్చి సెల్ఫీ పేరుతో చుట్టుముడతారు. బయటకు వచ్చిన జగతి మనం వెళ్లాలా మహేంద్ర అని అడుగుతుంది. కొన్ని తప్పవు అంటూ మహేంద్ర కారు డోర్ తీస్తుండగా.. రిషి వచ్చి మళ్లీ చేయి పట్టుకుంటాడు. మీతో మాట్లాడాలి డాడ్ అంటాడు. మరోవైపు ఇంట్లో కాలేజీ ఫంక్షన్ గురిచి తల్చుకుంటూ దేవయాని రగిలిపోతూ ఉంటుంది. మహేంద్ర వాళ్లు ఎక్కడికి వెళ్లారు, ఎందుకు వెళ్లారో అడిగారా అని భర్త ఫణీంద్రను అడుగుతుంది దేవయాని. నిదానంగా చెబుతారు కానీ రిషి రాగానే ఇవన్నీ అడగొద్దని చెబుతాడు ఫణీంద్ర.

కొంచెం గ్రౌండ్ వర్క్ చేస్తే..

కొంచెం గ్రౌండ్ వర్క్ చేస్తే..

అసలు అదేం కుట్రో.. రిషి, వసుధారను అందరి ముందు తలదించుకునేలా చేద్దాం అని ఎవరు అనుకుంటున్నారో అని గౌతమ్ అంటాడు. రిషి, వసుధార ఒకర్నొకరు కోరుకుంటున్నప్పుడు వాళ్లిద్దర్ని ఇబ్బంది పెట్టాలని ఎవరనుకుంటారని ఫణీంద్ర అంటాడు. దీనికి కొంచెం గ్రౌండ్ వర్క్ చేస్తే అసలు విషయం బయటపడుతుంది కదా అని గౌతమ్ అంటే.. దేవయాని హర్ట్ అయి.. ఇంక ఆపుతావా అని అరిచి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇటు కాలేజీలో మహేంద్ర-రిషి ఓవైపు.. జగతి-వసుధార మరోవైపు నిల్చుంటారు. డాడ్ ఏం జరిగిందని, మీరు ఎందుకు వెళ్లారని నేను అడగను.. మిమ్మల్ని దూరం చేసుకుని మీరు లేని రిషి ఎలా ఉంటాడే ఆ బాధ ఎలా ఉందో నాకు మాత్రమే తెలుసు. మీరెప్పుడూ నాతోనే ఉండాలి అని రిషి అంటాడు.

నేనేదైనా తెలియక తప్పు చేశానో..

కాలం, పరిస్థితులు.. ఈ రెండు మనుషుల కన్నా, బంధాల కన్నా బలమైనవి. అవి ఆడిస్తాయి.. అవే శాసిస్తాయి.. ఇప్పుడు జరిగింది కూడా అదే. కొన్ని ప్రమేయం లేకుండా జరుగుతాయి. వాటికి మనం బాధ్యులం కాదు.. బాధితులం మాత్రమే అవుతామని మహేంద్ర సమాధానం ఇస్తాడు. డాడ్ మీరు ఎన్ని చెప్పినా సరే.. జరిగిందేదో జరిగింది.. నాపై కోపం వచ్చిందో.. నేనేదైనా తెలియక తప్పు చేశానో.. పెద్దమ్మ ముందు మిమ్మల్ని హర్ట్ చేశానో.. ఏదేమైనా ఈ రిషి మిమ్మల్ని వదిలి ఉండలేడు డాడ్ అని రిషి అంటాడు.

ఎందుకు వెళ్లామో అది ఇంకా అసంపూర్ణంగానే మిగిలిపోయిందని మహేంద్ర అంటాడు. మీరు రావాలని ఆశపడుతున్నాను, అయినా నాకు శిక్ష విధిస్తారా అని రిషి అంటే.. శిక్ష వేశానని నువ్ అనుకుంటున్నావ్.. నాకు నేనే శిక్ష విధించుకున్నానని నేను భావిస్తున్నాను అని మహేంద్ర అంటాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X