Guppedantha Manasu: ఊహించని మలుపు.. మహేంద్ర-జగతికి యాక్సిడెంట్.. తండ్రికోసం రిషి ఎదురుచూపులు

రిషి దగ్గరికి వెళదామని రెడీ అవుతారు మహేంద్ర-జగతి. ఇంతకీ మనం వచ్చిన పని సక్సెస్ అయిందా అని మహేంద్ర అడుగుతాడు. అదేంటి కొత్తగా మాట్లాడుతున్నావ్.. మళ్లీ మనసు మార్చుకున్నావా అని జగతి అంటుంది. అలాగే ఓ రకంగా దేవయాని అక్కయ్య ఓడిపోయింది. రిషి నిన్నేం అడగలేదు కదా ఇంకేం ఆలోచించకు.. రిషి నీకోసం ఎదురుచూస్తుంటాడు వెళదాం పద అని అంటుంది జగతి. నీ మనసులో ఉన్న ప్రశ్నలు అన్నింటికీ రిషి ప్రేమే సమాధానం. రిషికోసం ఏదైనా చేయొచ్చు.. గెలవచ్చు.. ఓడిపోవచ్చు.. కానీ రిషి ప్రేమ కోల్పోవద్దు మహేంద్ర అని జగతి ఎమోషనల్ గా మట్లాడుతుంది. ఇలా ఆసక్తికర కథా కథనంతో సాగుతోన్న గుప్పెడంత మనసు సీరియల్ నవంబర్ 24, 2022 గురువారం నాటి తాజా ఎపిసోడ్​ 616లో ఏం జరిగిందో చదివేసేయండి.

నా కలలు నిజం కాకుండా పోతాయి..

నా కలలు నిజం కాకుండా పోతాయి..

రిషి దగ్గరికి వెళ్లేందుకు మహేంద్ర-జగతి డిస్కషన్ లో ఉంటే అటు ఇల్లంతా రిషి సందడి చేస్తుంటాడు. మహేంద్ర రూమ్ మొత్తం సర్దుతుంటాడు. ఏంటీ సార్ ఇంకా తెల్లాలరలేదు, మీరసలు పడుకోలేదా అని అడుగుతుంది వసుధార. రిషి ఏదోదో మాట్లాడుతుంటూ సంతోషంగా ఉంటే.. మహేంద్ర సార్ వాళ్లు రాకపోతే.. పరిస్థితి ఏంటో.. ఎలాగైనా వాళ్లు రావాలని కోరుకుంటుంది వసుధార. మరోవైపు దేవయాని కోపంతో రగిలిపోతుంది. వాళ్లు వస్తే నా కలలు నిజం కాకుండా పోతాయి.. అలా జరగకూడదని అనుకుంటుంది దేవయాని. ఇక మొత్తానికి మహేంద్ర-జగతి బయలుదేరతారు. కారులో వస్తూ రిషి గురించి సంతోషంగా మాట్లాడుకుంటారు. ఇంకెప్పుడూ రిషిని వదిలి దూరంగా వెళ్లను, విడిచి పెట్టి ఉండనని మహేంద్ర అంటాడు. దీనికి నేను కోరుకునేది అదే అని జగతి అంటుంది.

ఒక్క మంచి మాట కూడా రాదనుకుంటా..

ఒక్క మంచి మాట కూడా రాదనుకుంటా..

ఇంటికి వెళ్లగానే రిషి అలా చేస్తాడు.. ఇలా చేస్తాడు అని సందడిగా మాట్లాడుతాడు మహేంద్ర. అది చూసి జగతి మురిసిపోతుంది. ఇంతలో అనుకోకుండా ఓ లారీ ఎదురుగా వచ్చి ఢీ కొట్టి వెళ్లిపోతుంది. తర్వాత జగతి మహేంద్రను ఆస్పత్రికి తీసుకెళతారు. మరోవైపు తండ్రి వస్తాడా రాడా అని రిషి ఆలోచిస్తూ ఉంటాడు. కిందకు వచ్చి పెద్దమ్మా డాడ్ వాళ్లు ఇంకా రాలేదేంటని అడుగుతాడు రిషి. రావాలని అనుకుంటే కదా వచ్చేది, నిన్ను కాదనుకుని వెళ్లినవారి గురించి నువ్వెందుకు బాధపడతావ్, వాళ్లకు ప్రేమలు లేవు, వాళ్లు రారనుకుంటాను అని దేవయాని అంటుంది. ఈవిడగారి నోటినుంచి ఒక్క మంచి మాట కూడా రాదనుకుంటా అని అనుకుంటుంది ధరణి. దేవయాని మాటలకు పెద్దమ్మా అలా మాట్లాడకండి.. వాళ్లు తప్పనిసరిగా వస్తారని రిషి అంటాడు.

డాడ్ వాళ్లు ఇంకా రాలేదేంటి..

డాడ్ వాళ్లు ఇంకా రాలేదేంటి..

గౌతమ్ కూడా వీళ్లింకా రాలేదేంటో అని ఆలోచిస్తాడు. రిషి టెన్షన్ పడుతున్నాడు.. అంకుల్ కి ఫోన్ చేసి అడుగుదాం అనుకుని ఫీల్ అవుతారేమో అని ఆగిపోతాడు. ఇంతలో జగతి-మహేంద్రను అడ్మిట్ చేసిన ఆస్పత్రి నుంచి కాల్ వస్తుంది. యాక్సిడెంట్ జరిగింది. ఆ కారులో మీ విజిటింగ్ కార్డ్ దొరికింది అందుకే కాల్ చేశామని చెబుతారు. దీనికి పాపం ఎవరో ఏంటో.. నా విజిటింగ్ కార్డ్ చాలా మందికి ఇచ్చాను అనుకుంటూ వెళతాడు గౌతమ్. ఇదిలా ఉంటే రిషి, వసుధార కూర్చుని ఆలోచిస్తూ ఉంటారు. డాడ్ వాళ్లు ఇంకా రాలేదేంటి టెన్షన్ గా ఉందని రిషి అంటే.. కంగారు ఎందుకు సార్.. వస్తూ ఉంటారు.. ఫోన్ చేద్దామా అని వసుధార అంటుంది. ఇలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో కిందకి వచ్చిన గౌతమ్.. తాను బయటకు వెళ్లోస్తా అంటాడు. డాడ్ వాళ్లు వస్తుంటే ఇప్పుడు ఎక్కడికిరా అని అడుగుతాడు రిషి.

కాల్ కట్ చేస్తున్న దేవయాని..

కాల్ కట్ చేస్తున్న దేవయాని..

రిషి ఎక్కడికని అడగడంతో ఎవరికో యాక్సిడెంట్ అయిందట.. నా నంబర్ వాళ్ల దగ్గర ఉందని కాల్ చేశారు. తప్పనిసరి వెళ్లాల్సి వస్తోంది అంటాడు గౌతమ్. సరే నువ్వెళ్లు డాడ్ వాళ్లు వస్తున్నారు కదా అని రిషి అంటాడు. అలాగే అరేయ్ గౌతమ్ డాడ్ వాళ్లు వస్తారు కదా.. అని సందేహంగా రిషి అడిగితే.. నువ్ టెన్షన్ పడకు.. అంకుల్ వాళ్లు తప్పకుండా వస్తారని ధైర్యం చెప్పి వెళతాడు గౌతమ్. హాస్పిటల్ కి వెళ్లిన గౌతమ్.. యాక్సిడెంట్ అయింది మహేంద్ర-జగతి అని తెలియడంతో షాక్ అవుతాడు. రిషికి ఎలా చెప్పాలి అనుకున్నా.. చెప్పకతప్పదని కాల్ చేస్తాడు. ఆ ఫోన్ దేవయాని చూసి మహేంద్ర వాళ్లు వచ్చారో లేదో తెలుసుకునేందుకేమో అని కట్ చేస్తుంది. అదేంటి కట్ అయిందని గౌతమ్ మళ్లీ కాల్ చేస్తే మళ్లీ కట్ చేస్తుంది దేవయాని.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X