Guppedantha Manasu: ఆస్పత్రి బెడ్ పై జగతి-మహేంద్ర.. తల్లికి రక్తం ఇచ్చిన రిషి
హాస్పిటల్ లో జగతి-మహేంద్రలను చూసి షాక్ అవుతాడు గౌతమ్. రిషికి చెప్పాలనుకుని కాల్ చేస్తాడు. అయితే ఆ కాల్స్ ను దేవయాని కట్ చేస్తుంది. మళ్లీ ట్రై చేసిన అదే పని చేస్తుంది దేవయాని. ఇక మరోవైపు ఇంట్లో మహేంద్ర వాళ్ల కోసం ఎదురుచూస్తుంటారు రిషి, వసుధార. కాఫీ తాగమని వసుధార అంటే డాడీ వచ్చాకే అని చెబుతాడు. ఇంతలో వాళ్ల దగ్గరికి వచ్చిన దేవయాని కూడా ఏంటి రిషి నువ్వు పొద్దున్నుంచి ఏం తినకుండా కాఫీ కూడా తాగకుండా అలాగే ఉన్నావేంటని అడుగుతుంది. ఇలా ఆసక్తికర కథా కథనంతో సాగుతోన్న గుప్పెడంత మనసు సీరియల్ నవంబర్ 25, 2022 శుక్రవారం నాటి తాజా ఎపిసోడ్ 617లో ఏం జరిగిందో చదివేసేయండి.

పెద్దనాన్నకి తెలిస్తే కోప్పడతారు..
కాఫీ, టిఫిన్ తినట్లేదని దేవయాని అడగితే.. డాడ్ వాళ్లు వచ్చాక తాగుతాను పెద్దమ్మా అని రిషి చెబుతాడు. మహేంద్ర వాళ్లను పిలిచావ్ కదా.. వస్తారు కదా.. వస్తున్నారని చెప్పి నువ్ తిండి మానేసి ఇలా ఉండటం ఏంటి.. సరే కిందకు వెళ్దాం పదా అని దేవయాని అంటుంది. మీరు వెళ్లండి పెద్దమ్మ అని రిషి అంటే.. నువ్ తినకుండా ఉన్నావని పెద్దనాన్నకి తెలిస్తే నన్ను కోప్పడతారు.. పద అని అంటుంది దేవయాని. కాఫీ అయినా, టిఫిన్ అయినా డాడ్ వాళ్లు వచ్చిన తర్వాతే అని రిషి అంటాడు. సరే కిందకు వెళదాం పదా.. పెదనాన్నతో మాట్లాడటానికేం అని దేవయాని అంటుంది. మరోవైపు హస్పిటల్ లో కంగారు పడుతుంటాడు గౌతమ్.

రిషిని హాస్పిటల్ కి రమ్మని గౌతమ్ కాల్..
డాక్టర్ దగ్గరికి వెళ్లి వాళ్లకేం ప్రమాదం లేదు కదా అని అడగడంతో జగతికి దెబ్బలు ఎక్కువగా తగిలాయి. ఆమెకు వెంటనే బ్లడ్ కావాలి. అరేంజ్ చేయండని డాక్టర్ చెప్పడంతో సరే అంటాడు గౌతమ్. మరోవైపు మహేంద్ర వాళ్లు రాలేదని అని టెన్షన్ పడుతూ బాధపడుతూ ఉంటాడు రిషి. అప్పుడు ఏం కాదు సార్ జగతి మేడమ్ వాళ్లు వస్తారు అని రిషికి ధైర్యం చెబుతూ ఉంటుంది. రిషి ఫోన్ ఎత్తడం లేదనుకుంటూ వసుధారకి కాల్ చేస్తాడు గౌతమ్. కాల్ చేసి రిషికి ఇవ్వమని చెబుతాడు. ఓసారి హాస్పిటల్ కి రారా అని రిషిని పిలుస్తాడు గౌతమ్. డాడ్ వాళ్లు వస్తారని ఎదురుచూస్తున్నా కదా రాలేనని చెబుతాడు రిషి.

ఇబ్బంది ఉంటే కానీ..
రిషి అలా అనడంతో ప్లీజ్ నాకోసం రారా.. నువ్వు వస్తున్నావ్ అంతే అని కాల్ కట్ చేస్తాడు గౌతమ్. ఏంటీ గౌతమ్ ఇలా పెట్టేసాడని రిషి అంటే.. గౌతమ్ సార్ కి ఏదో ఇబ్బంది ఉంటే కానీ అన్నిసార్లు కాల్ చేసి ఉంటారో.. వెళ్దాం పదండి సార్ అని రిషిని తీసుకెళ్తుంది వసుధార. మరోవైపు రిషి వస్తాడో లేదే అని గౌతమ్ టెన్షన్ పడుతూ ఉంటాడు. గౌతమ్ తొందరగా రమ్మని కాల్ చేసి చెప్పాడు. ఎవరు ఏంటీ అని అడిగితే.. ఏం సమాధానం చెప్పలేదని ఆలోచించుకుంటూ వెళతారు రిషి, వసుధార. తర్వాత హాస్పిటల్ కి వెళ్లిన రిషి నన్ను ఎందుకు రమ్మన్నావ్ రా.. ఏమైందని అడిగితే అప్పుడు మహేంద్రను చూపిస్తాడు గౌతమ్.

షాక్ అయిన వసుధార, రిషి..
హాస్పిటల్ బెడ్ పై మహేంద్రను చూసిన రిషి, వసుధార ఒక్కసారిగా షాక్ అవుతారు. రిషి పరిగెత్తుకుంటూ వెళ్లి.. డాడ్ మీకు ఏమైంది డాడ్ అని అనడంతో మహేంద్ర జరిగింది చెబుతాడు. మహేంద్ర రిషితో ఎమోషనల్ గా మాట్లాడుతూ ఉండగా.. జగతి మేడమ్ ఎక్కడున్నారని అడుగుతుంది వసుధార. గౌతమ్ జగతిని చూపించగా వసుధార, రిషి షాక్ అవుతారు. ఇంతలో ఆమెకు బ్లడ్ కావాలని చెప్పాం కదా అని డాక్టర్ అంటాడు. చాలా రేర్ గ్రూప్ అర్జెంటుగా కావాలని అనడంతో అందరూ షాక్ అవుతారు. అప్పుడు నాది కూడా ఓ నెగెటివ్.. నేను ఇస్తాను రిషి అంటాడు. జగతి కోసం రిషి బ్లడ్ ఇస్తానని చెప్పడంతో వసుధార, మహేంద్ర ఆనందపడతారు.

వసుధార కన్నీళ్లు..
జగతికి రిషి రక్తం ఇస్తుంటాడు. జగతివైపు ఎమోషనల్ గా బాధగా చూస్తూ ఉంటాడు రిషి. అమ్మా అని పిలవను అన్న రిషి మాటలు తలుచుకుంటుంది వసుధార. వసుధార కన్నీళ్లు చూసిన రిషి.. మేడమ్ కి ఏం కాదు.. నేనున్నా కదా అని ధైర్యం చెబుతాడు. మరోవైపు గౌతమ్, మహేంద్ర ఇద్దరూ బాధపడుతూ ఉంటారు. తర్వాత ఏమైందో తెలియాలంటే వచ్చే ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











