Guppedantha Manasu: తల్లికి రిషి సేవలు, మురిసిపోయిన మహేంద్ర.. ఎమోషనల్ గా ఎపిసోడ్

జగతికి బ్లడ్ ఇస్తుంటాడు రిషి. జగతి మేడమ్ గురించి రిషి అన్న మాటలు తల్చుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్న వసుధారను ఓదార్చుతాడు రిషి. ఇక జరిగిన యాక్సిడెంట్ గురించి గౌతమ్ తో చెప్పుకుంటూ బాధపడతాడు మహేంద్ర. ఏం కాదు అంకుల్.. డాక్టర్స్ కూడా బాగవుతుందని చెప్పారు. మీరు భయపడకండి అని ధైర్యం చెబుతాడు గౌతమ్.

పెద్దమ్మా, పెద్దనాన్నకి కాల్ చేసి చెప్పానని గౌతమ్ అంటే.. థ్యాంక్స్ గౌతమ్.. అన్ని దగ్గర ఉండి చూసుకుంటున్నావ్ అని అంటాడు మహేంద్ర. మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి ఇది నా బాధ్యత అని గౌతమ్ సమాధానం ఇస్తాడు. ఇలా ఆసక్తికర కథా కథనంతో సాగుతోన్న గుప్పెడంత మనసు సీరియల్ నవంబర్ 26, 2022 శనివారం నాటి తాజా ఎపిసోడ్​ 618లో ఏం జరిగిందో చదివేసేయండి.

Photos Courtesy: Star మా and Disney+Hotstar

రక్త బంధమే కలుపుతోంది..

రక్త బంధమే కలుపుతోంది..

మహేంద్ర కోసం టీ ఏమైనా తీసుకురానా అని గౌతమ్ అడిగితే ఇప్పుడేం వద్దని.. జగతికి బాగైతే చాలంటాడు. మిమ్మల్ని నేను కలపడం ఏంటి.. రక్త బంధమే మిమ్మల్ని కలుపుతోంది ఇంతకన్నా.. గొప్ప అనుబంధం ఏముంటుంది అనుకుంటుంది వసుధార. ఇంతలో నర్స్ వచ్చి బయటకు వెళ్లమని చెబుతుంది.

వసుధార డాడ్ కి చెప్పు మేడమ్ కి ఏం కాదని రిషి అంటాడు. సరే అని బయటకు వెళ్లిపోతూ జగతి దగ్గరకు వెళుతుంది వసుధార. మేడమ్ మీ అబ్బాయి మీకు రక్తం ఇస్తున్నాడు. మీకేం కాదు మేడమ్ త్వరగా కోలుకుంటారు. మీ అబ్బాయి మిమ్మల్ని కాపాడుకుంటున్నారు. కొడుకుగా అది తన బాధ్యత కదా అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది వసుధార.

రిషికి నేను క్షమాపణలు చెప్పుకుంటాను..

రిషికి నేను క్షమాపణలు చెప్పుకుంటాను..

మరోవైపు మహేంద్రకు గౌతమ్ టీ తీసుకొచ్చినా.. తనకొద్దని చెబుతాడు. జగతికి ఎలా ఉందో అని టెన్షన్ పడుతాడు. ఏం కాదు అంకుల్.. రిషి బ్డ్ ఇస్తున్నాడు కదా అని ధైర్యం చెబుతాడు గౌతమ్. ఇంతలో అక్కడికి వచ్చిన వసుధార.. ఫణీంద్ర సార్ కాల్ చేసి మేడమ్ కండిషన్ గురించి అడిగారు.. వస్తున్నానని చెప్పారని చెబుతుంది. దేవయాని వదిన ఈ సమయంలో కూడా ఏదో అవకాశం వెతుక్కుంటుంది.

మీరిద్దరూ ఏం మాట్లాడొద్దు. రిషికి నేను క్షమాపణలు చెప్పుకుంటాను. ఇంకెప్పుడూ రిషిని వదిలి వెళ్లేది లేదంటాడు. కూర్చొమ్మా అని వసుధారని పిలిచి.. మేం లేని సమయంలో రిషిని కంటికి రెప్పలా చుసుకున్నావంటా థ్యాంక్యూ అని మహేంద్ర చెబుతాడు. అది నా బాధ్యత అని వసుధార అంటుంది.

మీకేం కానివ్వను మేడమ్..

మీకేం కానివ్వను మేడమ్..

రిషి ఏమంటున్నాడని వసుధారను అడుగుతాడు మహేంద్ర. తల్లి రుణం తీర్చుకుంటున్నారు సార్ అని వసుధార చెబుతుంది. రక్తం ఇవ్వడం పూర్తయ్యాక జగతివైపు ఎమోషనల్ గా చూస్తుంటాడు రిషి. జగతి దగ్గరికి వెళ్లి గతంలో ఆమెతో మాట్లాడిన మాటలన్నీ గుర్తు చేసుకుంటాడు. అప్పుడు జగతి రిషి.. రిషి అని కలవరిస్తూ ఉంటుంది.

అక్కడున్న నర్స్.. ఈ మేడమ్ ఈ ఒక్క పేరే కలవరిస్తున్నారు. మీరేనా సార్ రిషి అంటే.. ఏమవుతారు సార్ మీరు తనకి.. చెప్పండి సార్.. అని చెప్పేసి.. ఒక్క నిమిషం చూసుకోండి సార్ ఇప్పుడే వస్తానని వెళ్లిపోతుంది నర్స్. మేడమ్ మీకేం కాదు మీకేం కానివ్వను. డాడ్ కి మీకు ఇలా జరగడం చాలా బాధకలిగించింది. ఒక్కసారిగా గుండె ఆగిపోయినట్టయిందని అంటాడు రిషి.

మీరు ఆనందంగా ఉండటమే కావాలి..

డాడ్ కి మీరంటే ప్రాణం.. మీరే ఆయనకు గొప్ప ఊరట. మీరు బాగుండాలి. డాడ్ మీరు కలిసి ఉండాలి. ఆనందంగా ఉండాలి. ఇదే నేను కోరుకుంటున్నా అంటాడు రిషి. తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు వెనక్కు తిరుగుతాడు. ఇంతలో రిషి చేయి పట్టుకుంటుంది జగతి.

ఆమె కన్నీళ్లు చూసి తుడుస్తాడు రిషి. మీరు స్పృహలో లేకపోయినా నా మాటలు మీ మనసుకు చేరాయని అనుకుంటున్నా.. మీకు నాకు జరిగినవన్నీ నేను ప్రస్తావించాలనుకోవట్లేదు.. మీరు డాడ్ ఆనందంగా ఉండటమే నాకు కావాలంటాడు రిషి. అప్పుడు జగతి మళ్లీ.. నీ దగ్గరికి వస్తున్నాం రిషి.. బయలుదేరాం అని కలవరిస్తూ ఉంటుంది.

ఇంకెప్పుడూ వదిలేసి వెళ్లకండి..

ఇంకెప్పుడూ వదిలేసి వెళ్లకండి..

జగతి అలా కలవరించడం చూసి ఆమె తల నిమురుతాడు రిషి. జగతి చెవి దగ్గరికి వెళ్లి మీకేం కాదని చెప్పి బయటకు వెళ్తుండగా దాహం దాం అని జగతి అనగానే నీళ్లు తాగిస్తాడు. బయటి నుంచి ఇదంతా చూసి సంతోషిస్తారు మహేంద్ర, వసుధార, గౌతమ్. లోపలికి వెళ్దాం పదండి అంకుల్ అని గౌతమ్ అనడంతో వద్దు ఆ తల్లి కొడుకుని అలాగే వదిలేద్దాం అంటాడు మహేంద్ర. ఇంతలో అక్కడికి దేవయాని, ఫణీంద్ర వస్తారు.

తర్వాత మహేంద్ర తాను బయటకు వెళ్లేందుకు కారణాలు చెబుతుండగా మీరేం చెప్పకండి డాడ్.. నేనేమీ అడగను.. మీరు బాగుంటే చాలు.. మేడమ్ కి బాగవుతుందని ధైర్యం చెబుతాడు రిషి. నీకు చాలా చెప్పాలి కానీ మాటలు రావడం లేదంటాడు మహేంద్ర. మీరు ఎక్కడికి వెళ్లారో.. ఎందుకు వెళ్లారో నాకు అనవసరం. ఇంకెప్పుడూ వదిలేసి వెళ్లకండి. మీరు లేకుండా నేను ఎలా ధైర్యంగా ఉండగలనని అంటాడు రిషి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X