Guppedantha Manasu: రిషికి దొరికిపోయిన గౌతమ్?.. దేవయానికి మహేంద్ర స్ట్రాంగ్ వార్నింగ్!

హాస్పిటల్ నుంచి బయటకు వెళ్లేందుకు మహేంద్ర కారణాలు చెబుతుండగా మీరేం చెప్పకండి డాడ్.. నేనేమీ అడగను.. మీరు బాగుంటే చాలు.. మేడమ్ కి బాగవుతుందని ధైర్యం చెబుతాడు రిషి. నీకు చాలా చెప్పాలి కానీ మాటలు రావడం లేదంటాడు మహేంద్ర. మీరు ఎక్కడికి వెళ్లారో.. ఎందుకు వెళ్లారో నాకు అనవసరం.

ఇంకెప్పుడూ వదిలేసి వెళ్లకండి. మీరు లేకుండా నేను ఎలా ధైర్యంగా ఉండగలనని అంటాడు రిషి. ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో మహేంద్ర చెప్పేందుకు ట్రై చేస్తుంటే అదేమి వద్దని రిషి అంటాడు. మీరు లేకుండా ఉండలేను డాడ్.. అని రిషి ఎమోషనల్ గా అంటాడు. ఇలా ఆసక్తికర కథా కథనంతో సాగుతోన్న గుప్పెడంత మనసు సీరియల్ నవంబర్ 28, 2022 సోమవారం నాటి తాజా ఎపిసోడ్​ 619లో ఏం జరిగిందో చదివేసేయండి.

తండ్రీకొడుకులు ఒక్కటైపోయారు..

తండ్రీకొడుకులు ఒక్కటైపోయారు..

రిషి అలా ఎమోషనల్ గా అనేసరికి క్షమించమని మహేంద్ర అడుగుతాడు. దీనికి అలా అనకండి డాడ్.. నేనే ఏదైనా తప్పు చేస్తే క్షమించమని అడుగుతాడు రిషి. కోపం లేదా అని మహేంద్ర అడిగితే.. మీమీద కోపం ఎప్పటికీ రాదని అంటాడు రిషి. ఫణీంద్ర, దేవయాని వాళ్లని గౌతమ్ తీసుకోని వస్తాడు. వాళ్లని చూసి తండ్రీకొడుకులు ఒక్కటైపోయారని అనుకుంటుంది దేవయాని. తర్వాత ఎలా ఉందని జగతి పరిస్థితి గురించి అడుగుతుంది దేవయాని. అందుకు బ్లడ్ ఎక్కించిన తర్వాత జగతి పరిస్థితి బాగానే ఉందని డాక్టర్ చెబుతాడు. తనని ఇంటికి తీసుకెళ్తామని డాక్టర్ తో రిషి అంటాడు.

స్పృహ పోయినట్లు నటించింది..

స్పృహ పోయినట్లు నటించింది..

రిషి రక్తం ఇచ్చిన విషయం జగతికి మహేంద్ర చెప్పడంతో చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. ఇంతకన్నా ఈ జన్మకి ఇంకేం కావాలని సంతోషంగా అంటుంటే దేవయాని ఎంట్రీ ఇస్తుంది. ఈ యాక్సిడెంట్ నీకు అనుకూలంగా మలుచుకున్నావ్ అని అంటుంది దేవయాని. ఆ మాటకు వసుధార సీరియస్ అవుతోంది. స్పృహ పోయినట్లు నటించిందని దేవయాని అంటుంది. ఆ మాటకు కోపంగా మహేంద్ర కోపంగా ఇలాగేనా మాట్లాడేది అని అంటాడు. కంట్రోల్ గా ఉండమని జగతి చెప్పేందుకు చూస్తుంది. ఏదో మాయ చేసి రిషితో రక్తం ఇప్పించుకోగానే మీమీద ప్రేమ పోంగిపోయినట్లు కాదని దేవయాని అంటుంది.

దేవయాని దొంగ ప్రేమ..

దేవయాని అన్న మాటలకు రిషి నా కొడుకు.. జగతి కొడుకు.. మీ మాటలు, కుట్రలకి రోజులు చెల్లిపోయాయని గుర్తు పెట్టుకోండి అని మహేంద్ర గట్టిగా సమాధానం ఇస్తాడు. ఇంతలో నర్స్ వచ్చి అందరినీ బయటకు వెళ్లమని చెబుతుంది. అప్పుడే రిషి, ఫణీంద్ర వాళ్లు రావడం చూసిన దేవయాని జగతిపై లేని ప్రేమ ఒలకబోస్తుంది.

ఎక్కడా లేని ప్రేమ నటిస్తుంది. ఇదిలా ఉంటే రిషి వైపు జగతి ప్రేమగా చూస్తూ ఉంటుంది. రిషి కోసం టిఫిన్ తీసుకురావడానికి వసుధార బయటకు వస్తుంది. తన కోసం రిషి వెతుక్కుంటూ వస్తాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో టిఫిన్ చేయడం అవసరమా అని అంటుంటే ఏం మాట్లడొద్దని వసుధార అంటుంది.

నువ్ ఒక మోసగాడివంటూ..

నువ్ ఒక మోసగాడివంటూ..

రిషికి ప్రేమగా టిఫిన్ తినిపిస్తుంటుంది వసుధార. జగతి వాళ్లను డిశ్చార్జ్ చేసినట్లు గౌతమ్ ఫోన్ చేసి చెబుతాడు. వాళ్లకోసం వెళ్దామని అంటే ముందు టిఫిన్ తినమని చెబుతుంది. తన ఆకలి గురించి ఆలోచించినందుకు రిషి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇద్దరూ సేఫ్ గా బాగున్నారు.

ఇంకేమైనా జరిగి ఉంటే అని రిషి ఎమోషనల్ అవుతుంటే అలా మాట్లాడొద్దని.. అంతా బాగుంది కదా హ్యాపీగా ఉండమని వసుధార చెబుతుంది. ఇంతలో రిషికి ఏదో ఫోన్ వస్తుంది. కోపంగా వసుధారను లోపలికి వెళ్లిపోమ్మని చెప్పి.. గౌతమ్ దగ్గరికి ఆవేశంగా వస్తాడు. డాడ్ కోసం నేను ఇంత బాధపడుతుంటే చెప్పకుండా దాస్తావా అసలు నువ్ ఫ్రెండ్ వేనా, నువ్ ఒక మోసగాడివి, నీది అసలు ఫ్రెండ్షిప్ కాదని చాలా మాటాలు అంటూ అరుస్తాడు రిషి.

రిషి బాధ చూడలేను..

రిషి బాధ చూడలేను..

రిషి అలా అరుస్తుంటే చాలా బాధపడతాడు గౌతమ్. తన మాట వినమని ఎంతగానో బతిమిలాడతాడు గౌతమ్. ఇంతలో గౌతమ్ పై రిషి చేయి వేసి.. ఏం మాట వినాలి అనేసరికి గౌతమ్ తేరుకుంటాడు. అంటే నిజం తెలియలేదా.. ఇదంతా భ్రమనా అని అనుకుంటాడు గౌతమ్. రిషికి ఏం తెలియలేదని ఊపిరి పీల్చుకుంటాడు గౌతమ్.

మహేంద్ర, జగతి రిషి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. రిషి తనను ఏం అడగడం లేదని మహేంద్ర బాధపడతాడు. రిషికి ఇంకెప్పుడూ దూరం అవ్వొద్దని తన కళ్లలో బాధ చూడలేనని జగతి అంటుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X