Guppedantha Manasu Today Episode: మహేంద్ర షాకింగ్ నిర్ణయం.. రిషికి కనిపించకుండా దూరంగా!

రిషి ఇంట్లోనే స్టే చేస్తుంది వసుధార. వసుధార తలస్నానం చేసి హెయిర్ ఆరబెట్టుకుంటుంది. ఇంతలో హెయిర్ డ్రయర్ తో వచ్చిన రిషి ఆరబెట్టేందుకు ప్రయత్నిస్తాడు. మీరెందుకు ఇలాంటి పనులు చేస్తున్నారని రిషి చేతిలో నుంచి హెయిర్ డ్రయర్ లాక్కునేందుకు ట్రై చేస్తుంది వసుధార. చేస్తే ఏంటని రిషి కూడా లాగుతాడు. దీంతో ఇద్దరూ ఒకరిమీద ఒకరు పడిపోతారు. కాసేపు ఇద్దరి చూపులు కలుసుకుని రొమాన్స్ నడుస్తుంది. అప్పుడే వచ్చిన ధరణి.. రిషని పిలుస్తుంది. కాల్ వచ్చిందని ఫోన్ తీసుకొచ్చి ఇస్తుంది ధరణి. ఇలా ఆసక్తికర కథా కథనంతో సాగుతోన్న గుప్పెడంత మనసు సీరియల్ నవంబర్ 7, 2022 సోమవారం నాటి తాజా ఎపిసోడ్​ 601లో ఏం జరిగిందో చదివేసేయండి.

మీ మంకు పట్టు వల్లే సార్ దూరమయ్యారు..

మీ మంకు పట్టు వల్లే సార్ దూరమయ్యారు..

రిషి తన దగ్గరికి వచ్చి చేసిన పని గుర్తు చేసుకుంటూ మురిసిపోతుంటుంది వసుధార. రిషిని చూస్తూ తనలో తానే.. మీ మంకు పట్టు వల్లే మహేంద్ర సార్ దూరమయ్యారు. అమ్మ అనే పిలుపు కోసం నాన్న అనే పిలుపును దూరం చేసుకున్నారు. ఇదంతా మీ వల్లే జరుగుతుంది. కొన్ని సమస్యలకు కాలమే పరిష్కారం చూపిస్తుంది అని అనుకుంటుంది వసుధార. మరోవైపు మినిస్టర్ ను కలుస్తారు మహేంద్ర జగతి. మిషన్ ఎడ్యుకేషన్ వేరే ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేయాలని వాళ్లకు కాల్ చేస్తున్నాం.

మేము ఆ పని చూసుకుంటాం అని మినిస్టర్ కు జగతి చెబుతుంది. ఒక ఆథరైజేషన్ లెటర్ ను మంత్రికి ఇస్తుంది. అదేంటి మేడమ్.. మీరందరూ ఒకటే కుటుంబం కదా.. మళ్లీ ఈ లెటర్ ద్వారా ఎందుకు.. ఒకటి రెండు పనులు మీరే సర్దుకోవచ్చు కదా అని మినిస్టర్ అంటే.. జరిగితే బాగుంటుంది కదా అని మహేంద్ర అంటాడు.

పెర్ఫ్యూమ్ స్మెల్ గుర్తు పట్టిన రిషి..

పెర్ఫ్యూమ్ స్మెల్ గుర్తు పట్టిన రిషి..

ఇక మంత్రి దగ్గరి నుంచి త్వరగా వెళ్లిపోవాలని ప్రయత్నిస్తారు మహేంద్ర-జగతి. ఇంతలో రిషి ఎక్కడా.. తను ఇంకా రాలేదేంటి అని ప్రశ్నిస్తాడు మంత్రి. ఏదోటి చెప్పి బయటకు వచ్చేస్తారు మహేంద్ర-జగతి. మహేంద్ర వాళ్లు ఇంట్లో నుంచి బయటకు వెళ్తుంటే అప్పుడే రిషి కారు లోపలికి వస్తుంది. రిషి ఇంట్లోకి రావడం గమనించిన మహేంద్ర-జగతి వేరే దారి గూండా బయటకు వెళ్లిపోతారు.

అప్పుడు తన తండ్రికి దగ్గరగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది రిషికి. పెర్ఫ్యూమ్ స్మెల్ గుర్తు పట్టిన రిషి.. డాడ్ వచ్చారంటూ మంత్రి దగ్గరికి పరుగు తీస్తాడు. డాడ్ వాళ్లు వచ్చి ఎంతసేపయిందని అడుగుతాడు. ఇప్పుడే వచ్చి వెళ్లారని చెప్పడంతో బయటకు పరుగులు తీస్తాడు. కానీ అప్పటికే వాళ్లిద్దరు వెళ్లిపోతారు.

ఈ విషయాలన్ని చెప్పడం బాగుండదు..

ఈ విషయాలన్ని చెప్పడం బాగుండదు..

తర్వాత అక్కడి వాచ్ మెన్ ను అడుగుతాడు రిషి. అదంతా మహేంద్ర-జగతి చాటుగా గమనిస్తూనే ఉంటారు. అందుకేనా రిషికి తెలియని కారు మహేంద్ర తీసుకొచ్చిందని జగతి అంటుంది. అవును జగతి, రిషిని చూసి కొన్ని యుగాలు అయినట్లు ఉందని మహేంద్ర బాధగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత ఏమైంది రిషి అంత కంగారుగా వెళ్లాడు అని మినిస్టర్ అడుగుతాడు.

మంత్రితో ఈ విషయాలన్ని చెప్పడం బాగుండదనుకుని.. సర్ తో.. ఏదో ఒక అర్జెంట్ వర్క్ ఉందనుకుంటా అందుకే వెళ్లారని కవర్ చేస్తుంది వసుధార. తర్వాత వచ్చిన రిషిని మహేంద్ర సార్ కనిపించారా అని అడుగుతుంది వసుధార. లేదని సైగ ద్వారా చెబుతాడు రిషి.

డాడ్ కి అంతా కోపం ఏంటి..

డాడ్ కి అంతా కోపం ఏంటి..

కొత్త ప్రాజెక్టు కు సంబంధించిన ఫైల్స్ పై మంత్రి సంతకాలు తీసుకుంటారు రిషిధార. మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు కోసం మహేంద్ర-జగతి వాళ్లు సర్వేకు వెళ్లారని, దానికి సంబంధించిన బాధ్యతలు అన్నీ చూసుకోవాల్సిందిగా వసుధారకు ఒక లెటర్ ఇచ్చారని మినిస్టర్ రిషికి చెబుతారు. లెటర్ ఇచ్చారా.. అని రిషి షాక్ అవుతాడు. అవును, సర్వే కోసం వెళ్లాలని. టైమ్ అవుతోంది. ఎయిర్ పోర్టుకు బయలు దేరాలని మంత్రి చెప్పేసరికి మరింత షాక్ అవుతారు రిషి, వసుధార.

అదేంటి మీకు చెప్పలేదా, మీరందరు ఒకే ఇంట్లో ఉంటారు కదా అని మంత్రి అడిగేసరికి రిషి కవర్ చేస్తాడు. వాళ్లు సర్వేకు వెళ్లారు కాబట్టి ఈ పనులన్నీ మీరిద్దరే చూసుకోమని మంత్రి చెబుతారు. రిజల్ట్స్ వస్తున్నాయి కదా. దాని తర్వాత కొత్త ప్రాజెక్ట్ మొదలు పెడతామని రిషి అంటే అవునని అంటాడు మినిస్టర్. డాడ్ కి అంతా కోపం ఏంటి.. నాకు కనిపించకుండా వెళ్లిపోయారు అని రిషి చాలా ఫీల్ అవుతాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X