For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Guppedantha Manasu Today Episode:కాలేజీలో రిషిధార ముచ్చట్లు.. క్యారియర్ తో దేవయాని.. వసుకు స్వీట్ వార్నింగ్

    |

    వసుధారపై రిషి కోపంతో అరుస్తాడు. దీంతో వసుధార కాలేజ్ గ్రౌండ్ లో కూర్చుని రిషి అన్న మాటలు తలుచుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. రిషి సార్ నాపై అరిచారు. అరిస్తే అరవని.. తిడితే తిట్టని.. రిషి సార్ ఎలా ఉన్నా నాకు ఓకే. రిషిధార అంటేనే ఒకటి కదా అని అనుకుంటూ తన నోట్ బుక్ లో 'VR' (వసుధార-రిషి) అని రాసి లవ్ సింబల్ వేసి దానిని డిజైన్ చేస్తూ ఉంటుంటే ఇంతలో రిషి వస్తాడు. ఆ నోట్ బుక్ ను లాక్కుంటాడు. అందులో ఉన్న వీఆర్ లెటర్స్ చూసి.. ఇది నీ బుక్ అంటావ్.. మరి ఇందులో నా పేరు కూడా ఉందికదా అని అంటాడు రిషి. నేను రాసుకున్నాను.. నా నోట్ బుక్.. నా ఇష్టం నాకు ఇచ్చేయండి అని వసుధార అంటుంది. ఇలా ఆసక్తికర కథా కథనంతో సాగుతోన్న గుప్పెడంత మనసు సీరియల్ నవంబర్ 2, 2022 బుధవారం నాటి తాజా ఎపిసోడ్​ 597లో ఏం జరిగిందో చదివేసేయండి.

    నా నోట్ బుక్ నాకిచ్చేయండి

    నా నోట్ బుక్ నాకిచ్చేయండి

    నా నోట్ బుక్ నాకిచ్చేయండి అని వసుధార అనడంతో.. ఏంటి కోపం వచ్చిందా.. అలిగావా.. అని రిషి అంటాడు. మీకోపం నాకేమి కొత్తకాదుకదా.. ఇలానే ఉంటాయి కదా మీ కోపాలు అని వసుధార అంటే హర్ట్ అయ్యావా అని రిషి అడుగుతాడు. అలవాటైంది సార్ మీకోపం అని వసుధార అనడంతో.. అరిచినా ప్రేమ పెరుగుతుందా అని రిషి అంటాడు. ప్రేమ దేనికి ప్రభావితం కాదు సార్ అని వసుధార రిప్లై ఇస్తుంది. దీంతో వసుధార చేతిలో వీఆర్ అని రాసి కింద జెంటిల్ మెన్ అని రాస్తాడు రిషి. దీంతో సంతోషపడిపోతుంది వసుధార. తర్వాత నేను నిన్ను పొగరు అని పిలుస్తానని నీకెలా తెలుసు అని రిషి అడుగుతాడు. గతంలో ల్యాబ్ లో పడిపోయినప్పుడు పొగరు అని రిషి పిలవడం, ఓసారి రిషి ఫోన్లో పొగరు అని ఉండటం చూసినవి గుర్తు తెచ్చుకుని చెబుతుంది వసుధార. తర్వాత ఒకరొకరు సరదాగా మాట్లాడుకుంటారు.

     అజ్ఞాతం వీడి.. అక్కడికి వచ్చేయండి..

    అజ్ఞాతం వీడి.. అక్కడికి వచ్చేయండి..


    మరోవైపు జరిగిన విషయాల గురించి మహేంద్ర, జగతి ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడికి వచ్చిన గౌతమ్ ను రిషి ఎలా ఉన్నాడని మహేంద్ర అడుగుతాడు. దీంతో గౌతమ్.. చాలా బాధపడుతున్నాడు అంకుల్. ఎన్నాళ్లిలా అక్కడ వాడి బాధ చూడలేకపోతున్నాను. ఇప్పుడు ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లేలా ఉంది. జరిగిందేదో జరిగింది అంకుల్. ఇప్పటికైనా అజ్ఞాతం వీడి.. అక్కడికి వచ్చేయండి అని అంటాడు. దీంతో మౌనంగా ఉండిపోతాడు మహేంద్ర. అప్పుడు గౌతమ్ చేతులు జోడించి.. వాడి బాధ మాత్రం చూడలేకపోతున్నాను.. అర్థం చేసుకోండని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక్కడ కట్ చేస్తే మళ్లీ కాలేజ్ లో లంచ్ టైం అయిందని మాట్లాడుకుంటారు రిషిధార. ఈ క్రమంలో ఆకలిగా లేదంటాడు రిషి. ఇంతలో రిషి ఆకలి తెలుసుకునేది పెద్దమ్మ ఒక్కతే అని ఎంట్రీ ఇస్తుంది దేవయాని.

    పెద్దమ్మ మనసు ఎంత మంచిదో..

    పెద్దమ్మ మనసు ఎంత మంచిదో..

    నేను ఎక్కడా ఉన్నా ప్రతి క్షణం నీ గురించే ఆలోచిస్తాను. అందుకే క్యారియర్ తీసుకొచ్చాను. చిన్నప్పటి నుంచి నీ ఆకలేంటో.. నాకు తెలుసు కదా అని అంటుంది దేవయాని. దీంతో చూశావా వసుధార.. పెద్దమ్మ మనసు ఎంత మంచిదో అని రిషి అంటాడు. అంతా నటన సార్.. మీరెప్పుడు తెలుసుకుంటారో ఏంటో.. అని మనసులో అనుకుంటుంది వసుధార. ఇంతలో ఏంటీ వసుధార అలా చూస్తున్నావ్.. నా ప్రేమలో లోపం ఉందని నీకు అనిపిస్తోందా.. అని దేవయాని అంటే.. రిషి కలుగజేసుకుని ఈ విషయంలో ఎవ్వరూ ఏం చెప్పినా నమ్మను.. మీ ప్రేమలో లేపం లేదని నాకు తెలుసు అని అంటాడు. వసుధారకు నా గురించి తెలియదా ఏంటీ నాన్నా.. కొత్తగా చెబుతావ్.. ఏం వసుధార నా గురించి నీకు పూర్తిగా తెలుసు కదా.. అలా చూస్తావేంటి.. భోజనాలకు సిద్ధం చేయి అని దేవయాని అంటే.. నేను వడ్డిస్తాను మీరు తినండి మేడమ్ అని వసుధార అంటుంది.

    మీరింతా ప్రేమ చూపిస్తుంటే నేనెలా కాదనగలను..

    మీరింతా ప్రేమ చూపిస్తుంటే నేనెలా కాదనగలను..

    నీకు అవకాశం ఇవ్వను కదా.. నేనుండగా నీకెందుకు ఆ శ్రమ.. నేను వడ్డిస్తాను కదా.. నీకేం కావాలో చెప్పు కూర్చో.. అని దేవయాని అంటే.. పెద్దమ్మా తనకు కూడా వడ్డించండని అంటాడు రిషి. వసుధారకు ఎప్పుడు ఏం వడ్డించాలో నాకు బాగా తెలుసు.. తిను సిగ్గుపడకు.. కడుపునిండా తిను.. మొహమాట పడకు.. ఇంకొంచెం వేయనా అని దేవయాని అంటే.. మీరింతా ప్రేమ చూపిస్తుంటే నేనెలా కాదనగలను వేయండని వసుధార సమాధానం ఇస్తుంది. దీంతో నా ప్రేమ ఇప్పుడేం చూశావ్ వసుధార.. ముందు ముందు ఇంకా చూపిస్తాను అని దేవయాని అంటుంది. దానికి పెద్దమ్మ ప్రేమని నువ్ తట్టుకోలేవ్ అని రిషి అంటూ దేవయానిని పొగుడుతాడు రిషి. దేవయాని మేడమ్ నిజస్వరూపాన్ని మీరే అర్థం చేసుకోవడం లేదు. ఆ రోజు త్వరలోనే రావాలని కోరుకుంటున్నా. అప్పుడుంటుంది దేవయాని మెడమ్ కి అని మనసులో అనుకుంటుంది వసుధార.

    జగతి మేడమ్ కూడా లేరు..

    జగతి మేడమ్ కూడా లేరు..

    ఇక్కడ కట్ చేస్తే పుష్పతో వసుధార కాల్ మాట్లాడుతుంటుంది. రిజల్ట్స్ గురించి టెన్షన్ పడుతూ.. సమయానికి జగతి మేడమ్ కూడా లేరు. యూనివర్శిటీ టాప్ ర్యాంక్ కొట్టాలి. ఆ విజయం కోసమే కదా అందర్నీ వదిలేసి మరి వచ్చానంటూ బాధపడుతుంటుంది వసుధార. మరోవైపు మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కోసం రిషి ఒక్కడే కష్టపడుతూ ఉంటాడు. ఒంటరి అయిపోయాడు అని బాధపడుతూ ఉంటారు జగతి-మహేంద్ర. తర్వాతి గురువారం ఎపిసోడ్ లో రాత్రిపూట చెరువు దగ్గరికి రిషిని తీసుకెళ్లిన వసుధార.. కాగితంపై కోరికలు రాసి పడవ చేసి నీటిలో వదిలితే నెరవేరుతుంది అని చెబుతుంది. తర్వాత ఇద్దరూ కాగితంపై రాసి నీటిలో వదులుతారు.

    English summary
    Guppedantha Manasu Serial Novemberr 2 2022 Today Full Episode 597
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X