For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Guppedantha Manasu Today Episode:నగరం నిద్రపోతున్న వేళ రిషిధార బాసలు.. టెన్షన్ తో దేవయాని

  |

  ఎగ్జామ్స్ ఫలితాల గురించి టెన్షన్ గా పుష్పతో కాల్ మాట్లాడుతుంది వసుధార. ఇంతలో అక్కడికి రిషి వస్తాడు. ఏమైందని రిషి అడిగితే టెన్షన్ సార్ అని బదులిస్తుంది వసుధార. డీబీఎస్టీ కాలేజ్ యూత్ ఐకాన్ అయిన నువ్వు ఇలా భయపడుతున్నావా అని అంటాడు రిషి. ఆరోజు చివరి పరీక్ష ఎలాంటి పరిస్థితుల్లో రాశానో మీకు తెలుసు కదా సార్ అని వసుధార అంటుంది. వసుధార చేతులు పట్టుకుని ప్రేమగా చూస్తూ ధైర్యం చెబుతాడు రిషి. తర్వాత ఇద్దరు కలిసి చెరువు దగ్గరికి వెళ్తారు. ఇలా ఆసక్తికర కథా కథనంతో సాగుతోన్న గుప్పెడంత మనసు సీరియల్ నవంబర్ 2, 2022 గురువారం నాటి తాజా ఎపిసోడ్​ 598లో ఏం జరిగిందో చదివేసేయండి.

  నగరమంతా నిద్రపోతున్న వేళ..

  నగరమంతా నిద్రపోతున్న వేళ..

  చెరువు దగ్గరికి వెళ్లాకా.. ఏంటీ వసుధార ఇంత రాత్రిపూట ఇక్కడికి తీసుకొచ్చావ్ అని రిషి అంటే.. రాత్రివేళ ఈ నగరమంతా నిద్రపోతున్న సమయంలో చెరువులో మనం ఈ కాగితపు పడవలు వేస్తే ఎంత బాగుంటుందో కదా సార్ అని వసుధార అంటుంది. దీంతో కొత్తగా ఉందని రిషి అంటాడు. ఏదైనా కోరుకుని పడవలపై రాసి నీటిలో వేస్తే ప్రకృతి ఆ కోరికను నెరవేరుస్తుందని వసుధార అంటుంది. ఇంతకీ ఏం కోరుకుంటున్నావ్ అని రిషి అడిగితే.. అదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. మీరొకటి నేనొకటి కాదు కదా అని వసుధార అంటుంది. దీంతో యూనివర్శిటీ టాపర్ కావాలని కోరుకుంటున్నా అని రిషి అంటాడు. ఈ పడవపై అదే రాయండని వసుధార చెబుతుంది.

   భార్యాభర్తల్లా తిరుగుతున్నారు..

  భార్యాభర్తల్లా తిరుగుతున్నారు..

  ఇద్దరూ కాగితపు పడవలపై మనసులో ఉన్న మాట రాసుకుని నీటిలో వదిలి వాటిని చూసి సంతోషపడతారు. తర్వాత చిన్ననాటి జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ చెబుతుంది వసుధార. అలాగే కొద్దిసేపు కబుర్లు చెప్పుకుంటారు. ఇంకా ఏమైనా ఉన్నాయా అని రిషి అడిగితే.. అప్పుడే అయిపోతే నేను వసుధారను ఎలా అవుతానంటుంది వసుధార. దీంతో నవ్వేస్తాడు రిషి. మరోవైపు ఇంట్లో హాల్ లోకి వచ్చిన దేవయాని.. ధరణి అని పిలుస్తుంది. ఎప్పుడూ చూసిన వంటింట్లోనే ఉంటావంటూ విసుక్కుంటుంది దేవయాని. తర్వాత రిషి కనిపించడం లేదేంటని అడగితే.. రిషిధార బయటకెళ్లారని చెబుతుంది ధరణి. ఎంగేజ్ మెంట్ కూడా కాకుండా భార్యాభర్తల్లా తిరుగుతున్నారు.. వీళ్లేంటో అర్థం కావడం లేదని దేవయాని అంటుంది. దీంతో అత్తయ్యా గారు నేను ఓ మాట అడగొచ్చా అని అంటుంది ధరణి.

  ప్రేమకథ ఎక్కువ అవుతోంది..

  ప్రేమకథ ఎక్కువ అవుతోంది..

  నువ్ అడుగుతాను అంటే నాకు వాత పెడతా అన్నట్లు ఉందని దేవయాని అంటుంది. వసుధార ఈతరం అమ్మాయి కదా.. వాళ్లిద్దరూ కలిసి తిరిగితే తప్పేముందని ధరణి అడిగితే.. కలిసి తిరగడం తప్పు కాదా అని దేవయాని అంటుంది. అలాంటప్పుడు కలిసి తిరగడం గురించి రిషికి ఓ మాట చెబితే బాగుంటుంది కదా అని అన్న ధరణితో.. ఏం చెప్పాలి.. మనసులో ఉన్నవన్నీ ఎలా అడగుతాం.. అయినా వసుధార కన్నా నువ్ ముదిరిపోయావ్ ధరణి అని అంటుంది దేవయాని. అనంతరం ఈ వసుధార, రిషిల ప్రేమకథ రోజు రోజుకీ ఎక్కువ అవుతోంది. ఏదో వినకూడని వార్త వింటాను అనిపిస్తుందని టెన్షన్ పడుతుంది దేవయాని.

  జీవితాంతం ప్రయాణిస్తే ఎంత బాగుంటుందో..

  జీవితాంతం ప్రయాణిస్తే ఎంత బాగుంటుందో..

  మరోవైపు రిషి, వసుధార కారులో ప్రయాణిస్తుంటారు. థ్యాంక్స్ సార్ అని వసుధార అంటే.. థ్యాంక్స్ చెప్పుకునేంత దూరం మనమధ్య లేదంటాడు రిషి. మన మధ్య థ్యాంక్స్.. సారీ అనే విషయాలకు ఛాన్స్ లేదంటాడు. మనసు తెలుసుకున్న వాళ్లు మనతో జీవితాంతం ప్రయాణిస్తే ఎంత బాగుంటుందో తెలుస్తోంది ఇప్పుడు. ప్రతి ఆడపిల్లకు ఇలాంటి అదృష్టం దొరికితే బాగుంటుంది అనిపిస్తోందని వసుధార అంటే.. సడెన్ గా కారు ఆపిన రిషి.. వసుధార చేతిని చేతిలోకి తీసుకుని నన్నేదో మునగ చెట్టు ఎక్కిస్తున్నావ్ అని అంటాడు. అదేం లేదు సార్.. మీలాంటి జెంటిల్ మెన్ ఒక్కరే ఉంటారు. అందరికీ అదృష్టం ఉండదు కదా అని వసుధార అంటుంది.

  నన్ను విడిచి వెళ్లనని మాటివ్వు..

  నన్ను విడిచి వెళ్లనని మాటివ్వు..

  వసుధార అలా అనడంతో కొంపదీసి ఈ జెంటిల్ మెన్ ను అందరికీ పంచుతావా ఏంటీ అని సెటైర్ వేస్తాడు రిషి. అందరికీ ఎందుకు పంచుతాను. అదృష్టాన్ని ఆస్వాదిస్తానని వసుధార అంటుంది. మన మధ్యలో ఎన్నో అపార్థాలు, అభిప్రాయ బేధాలు వచ్చాయి. కానీ అవన్నీ తొలగిపోయాయి. నేను తప్పు చేస్తే మందలించావ్. చిన్న మంచి పని చేసినా ఆకాశానికి ఎత్తేశావ్. ఇలాగే జీవితాంతం తోడుంటానని నన్ను విడిచి వెళ్లనని మాటివ్వు అని అడుగుతాడు రిషి. దీంతో జన్మజన్మలకి వసుధార మీతోనే కలిసి ఉంటుంది సార్.. ఎన్నటికీ మిమ్మల్ని విడిచి వెళ్లదు. ఏ శక్తి మన బంధాన్ని విడదీయలేదు. రిషిధార బందం కలకాలం కొనసాగుతుంది. నా ప్రయాణం మీతోనే అని అంటుంది వసుధార.

  English summary
  Guppedantha Manasu Serial Novemberr 3 2022 Today Full Episode 598
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X