Guppedantha Manasu Today Episode: రొమాన్స్ లో రిషిధార.. పెళ్లి పేరుతో దేవయాని మరో స్కెచ్?

రిషి ఇంట్లో వంటగదిలో ధరణి చపాతీలు చేస్తూ ఉంటుంది. అక్కడికి వచ్చిన వసుధార తాను సహాయం చేస్తానని ధరణిని అడుగుతుంది. దీంతో రిషికి చపాతీలు అంటే చాలా ఇష్టం అని ధరణి చెబుతుంది. ధరణి అలా అనేసరికి అలా అయితే నేను చేస్తాను అని వసుధార అంటుంది. అలా చెప్పిన వసుధార వంటగదిలో చపాతీలు చేస్తూ ఉంటుంది. ఇక అక్కడినుంచి ధరణి వెళ్లిపోతుంది. కానీ, ఇంతలో అక్కడికి రిషి వెనుక నుంచి వస్తాడు. దీంతో ధరణినే వచ్చిందనుకునుంటుంది వసుధార. ధరణి అనుకుని మాట్లాడుతు ఉంటుంది. ఇలా ఆసక్తికర కథా కథనంతో సాగుతోన్న గుప్పెడంత మనసు సీరియల్ నవంబర్ 4, 2022 శుక్రవారం నాటి తాజా ఎపిసోడ్​ 599లో ఏం జరిగిందో చదివేసేయండి.

Photos Courtesy: Star మా and Disney+Hotstar

చపాతీలు చేసే అవకాశం..

చపాతీలు చేసే అవకాశం..

వంటగదిలో చపాతీలు చేస్తున్న వసుధార వెనుక నుంచి వచ్చింది ధరణి అనుకుని మాట్లాడుతుంది. మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి మేడమ్.. అడగ్గానే చపాతీలు చేసే అవకాశం ఇచ్చారు. రిషి సర్ కి చపాతీ అంటే ఇష్టమని మీరు చెప్పేదాక నాకు తెలియదు. నేను చేసే చపాతీలకు రిషి సర్ పేరే పెడతాను. ప్రిన్స్ చపాతీ, జెంటిల్ మెన్ చపాతీ అని పేరు పెడతాను అంటూ వెనక్కి తిరిగుతుంది. అలా వసుధార వెనక్కి తిరిగేసరికి అక్కడ రిషి ఉంటాడు. అలా సడెన్ గా రిషిని చూసేసరికి అతనిపై పడిపోతుంది. పడిపోతున్న వసుధారను పట్టుకుంటాడు రిషి. ఇక్కడ కొద్దిసేపు అలానే ఉండిపోతారు రిషి, వసుధార.

ఒకరినొకరు చూసుకుంటూ..

ఒకరినొకరు చూసుకుంటూ..

తర్వాత చపాతీలు చేస్తున్నావా.. అప్పడాలు వేస్తున్నావా అని వసుధారకు కౌంటర్ ఇస్తాడు రిషి. ఇక ఈ సన్నివేశంలో ఇద్దరు కొద్దిసేపు చపాతీ గురించి మాట్లాడుకుంటారు. ఆ తర్వాత చపాతీ గురించి క్లాస్ తీసుకుంటుంది వసుధార. ఎలా చేయాలో చెబుతుంది. అలా వసుధార చెబుతుంటే రిషి చేస్తూ ఉంటాడు. వసుధార చేతిలను టచ్ చేస్తూ ఉంటాడు రిషి. ఇలా చేతులు తాకుతూ, ఒకరినొకరు చూసుకుంటూ రొమాంటిక్ సీన్ వేశారు. మరోవైపు దేవయానికి తల నొప్పిగా ఉందంటే ధరణి మర్దన చేస్తూ ఉంటుంది. వసుధార ఎక్కడ ఉందని ధరణిని దేవయాని అడుగుతుంది. వంటగదిలో చపాతీలు చేస్తుందని సమాధానం ఇస్తుంది ధరణి.

మాయలో కూరుకుపోతున్నాడు..

మాయలో కూరుకుపోతున్నాడు..

రిషి ఎక్కడ ఉన్నాడని అడుగుతుంది దేవయాని. రిషి కూడా వంటగదిలోనే ఉన్నాడని ధరణి బదులిస్తుంది. దీంతో ఈ రిషికి ఏం పని లేదు. ఆ వసుధార ఎక్కడా ఉంటే అక్కడ ఈ రిషి ఉంటున్నాడు. వెళ్లి తనను పిలువు అని ధరణికి చెబుతుంది దేవయాని. దీంతో రిషిని పిలవడానికని ధరణి వెళ్తుంది. రోజు రోజుకీ రిషి ఆ వసుధార మాయలో కూరుకుపోతున్నాడు. నన్ను లెక్క చేయడం లేదు. ఇది ఇలా కొనసాగితే నా ఉనికికే ప్రమాదం. ఎలాగైనా రిషిని వసుధార మాయలో నుంచి తప్పించి నా గుప్పెట్లోకి తెచ్చుకోవాలి అని దేవయాని మనసులో అనుకుంటుంది. ఇక్కడ కట్ చేస్తే చపాతీలు రుద్దడానికి రిషి ట్రై చేస్తుంటాడు కానీ రాదు.

ధరణి రావడంతో ఇద్దరు షాక్..

ధరణి రావడంతో ఇద్దరు షాక్..

రిషికి చపాతీలు చేయడం రాకపోయేసరికి.. నేను చూపిస్తాను అంటూ రిషికి చపాతీలు చేయడం నేర్పిస్తుంది వసుధార. ఈ క్రమంలో ఇద్దరి చూపులు కలిసి కాసేపు రొమాన్స్ నడుస్తుంది. ఇంతలో ధరణి రావడం చూసి ఇద్దరు షాక్ అయి బిత్తరపోతారు. దేవయాని అత్తయ్య పిలుస్తున్నారని రిషికి చెబుతుంది ధరణి. దీంతో దేవయాని దగ్గరికి వెళ్తాడు రిషి. పక్కనే తలనొప్పి బామ్ చూసి ఏమైందని అడుగుతాడు రిషి. తలనొప్పి అంటూ ఇక్కడ కొద్దిసేపు నాటకం ఆడుతుంది దేవయాని. ఆ తర్వాత వసుధార వాళ్ల ఇంటికి వెళ్లి వసు అమ్మానాన్నలని కలిసి పెళ్లి నిశ్చయం చేసుకుందామని చెబుతుంది దేవయాని.

సావాసదోషం అంటూ కౌంటర్..

సావాసదోషం అంటూ కౌంటర్..

వసుధారతో పెళ్లి గురించి దేవయాని అడగడంతో డాడ్ లేకుండా ఈ విషయం వద్దు అని రిషి చెబుతాడు. పెళ్లి పనులు మొదలయితే అయన వాళ్లు వస్తారేమో అని దేవయాని అంటుంది. లేదు పెద్దమ్మా.. డాడ్ లేకుండా ఇవన్నీ చేయడం కరెక్ట్ కాదని అక్కడి నుంచి వెళ్లిపోతాడు రిషి. ఇక్కడ కట్ చేస్తే వసుధార, రిషి కలిసి సంతోషంగా దీపాలు వెలిగిస్తారు. ఈ చిన్న దీపాలు, ఆకాశం, మెరిసే నీ కళ్లు, నీ ఆనందం ఇంతకన్నా సంతోషం ఏముంటుందని రిషి అంటాడు. ఏటీ సర్.. కవిత్వం చెబుతున్నారా అని వసుధార అంటే సావాసదోషం అని రిషి కౌంటర్ ఇస్తాడు. నా జీవితంలో చిన్న కొరత ఉన్నప్పుడు నువ్ వచ్చావ్. నువ్ లేకపోయి ఉంటే.. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఏమైపోయేవాడినో అని బాధపడతాడు రిషి. మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్లను అని వసుధార అంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X