For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Guppedantha Manasu Today Episode: దేవయానికి వసు స్ట్రాంగ్ వార్నింగ్.. మహేంద్ర-జగతిలను రిషి చూడనున్నాడా?

  |

  డాబాపై దీపాలు పెడతారు రిషి, వసుధార. నా జీవితంలో చిన్న కొరత ఉన్నప్పుడు నువ్ వచ్చావ్. నువ్ లేకపోయి ఉంటే.. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఏమైపోయేవాడినో అని బాధపడతాడు రిషి. మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్లను అని వసుధార అంటుంది. ఆకాశానికి మొక్కుకుందాం అని చెప్పి వసుధార దండం పెట్టుకుంటూ ప్రదక్షణలు చేస్తుంది. ఇంతలో వసుధార చున్నీ కాలికి చుట్టుకుని తూలి పడబోతుంటే.. రిషి పట్టుకుంటాడు. ఇద్దరి చూపులు కలిసి కొద్దిసేపు రొమాన్స్ నడుస్తుంది. తేరుకున్న రిషి.. చూసుకోవాలిగా వసుధార అంటాడు. దీనికి మీరున్నారుగా సార్ అని వసుధార బదులిస్తుంది. ఇలా ఆసక్తికర కథా కథనంతో సాగుతోన్న గుప్పెడంత మనసు సీరియల్ నవంబర్ 5, 2022 శనివారం నాటి తాజా ఎపిసోడ్​ 600లో ఏం జరిగిందో చదివేసేయండి.

  నువ్ నాకు వరంగా దొరికావ్..

  నువ్ నాకు వరంగా దొరికావ్..

  మన మధ్య అడ్డుతెరలు తొలగిపోయాయి. నీ మనసు మారింది. డాడ్ వాళ్లు ఇంటికి వస్తే చాలు అంతకంటే ఏం అవసరం లేదని రిషి అంటాడు. దీనికి వసుధారు తప్పకుండా వస్తారు సార్.. బలంగా కోరుకుంటే ఏదైనా జరుగుతుందని చెబుతుంది. దీంతో మురిసిపోయిన రిషి.. నువ్ నాకు వరంగా దొరికావ్ వసుధార అని ఆనందపడిపోతాడు. రిషి భుజంపై వసుధార వాలిపోతుంది. అది చూసి సంతోషపడతాడు రిషి. మరోవైపు రిషి గురించి బాధపడుతుంటాడు మహేంద్ర. అది గమనించిన జగతి.. ఏంటి మహేంద్ర ఏం ఆలోచిస్తున్నావ్ అని అడిగితే.. నా ఆశయం, ఆశలు ఇంకేముంటాయి జగతి. అన్ని రిషినే కదా అని సమాధానం ఇస్తాడు.

  నా భార్యను పట్టించుకోవట్లేదు..

  నా భార్యను పట్టించుకోవట్లేదు..

  తర్వాత అన్నం తినమని.. అన్నం మన కోసం ఎదురుచూడకూడదని చెబుతుంది జగతి. నాకు తినాలని లేదని మహేంద్ర చెబితే.. రిషి సంతోషంగా ఉండాలంటే ముందు నువ్వు సంతోషంగా ఉండాలి అని అన్నం తినిపించబోతుంది జగతి. నాకు నిజంగానే తినాలని లేదు జగతి.. నేనే నీకు తినిపిస్తా అంటూ జగతికి తినిపించబోతుంటాడు మహేంద్ర. ఈ గొడవలో పడి నా భార్యను పట్టించుకోవడమే మర్చిపోయాను. కార్యేషు దాసి.. కరణేషు మంత్రి అని భార్య ఎలా ఉండాలో చెప్పారే గానీ, భర్త ఎలా ఉండాలనేది చాలా తక్కువ సందర్భాల్లో చెప్పారు అంటూ జగతికి అన్నం తినిపిస్తాడు. అది చూసి జగతి ఎమోషనల్ అవుతుంది.

  మీ భాష మార్చుకుంటే మంచిది..

  మీ భాష మార్చుకుంటే మంచిది..

  అమ్మగా ఓడిపోయాను కదా అని జగతి బాధపడుతుంది. ఒకరికొకరు అన్నం తినిపించుకుంటారు జగతి మహేంద్ర. రిషి, వసుధార బంధం ఎక్కడ బీటలు వారుతుందో అని జగతి భయపడుతుంది. మరోవైపు రిషి ఇంట్లో వసుధార సంతోషంగా పైనుంచి కిందకు దిగుతుంటే దేవయాని ఎదురుపడుతుంది. నీకు సిగ్గు అనిపించడం లేదా అని దేవయాని వసుధారతో అంటుంది. దీంతో మీ భాష మార్చుకుంటే బాగుంటుందని వసుధార బదులిస్తుంది. రిషి సార్ కు మీ గురించి చెప్పడం ఒక్క క్షణం పట్టదు. కానీ చాడీలు చెప్పడం నా మనస్తత్వం కాదు. రిషి సర్ తో ఉండే హక్కు నాకు ఉంది. ఆయన నా జీవితం. తనతో కలిసి జీవితాంతం ప్రయాణిస్తాను. మీరు లేనిపోనివి ఆలోచించి.. మా మీద గూఢచారి పెట్టడం మంచిది కాదు జాగ్రత్త అని వసుధార స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది.

  మళ్లీ నావైపుకి తిప్పుకుంటాను..

  మళ్లీ నావైపుకి తిప్పుకుంటాను..

  ఏం మిడిసిపడుతున్నావ్.. రిషి నీవైపు ఉన్నాడనే కదా.. మళ్లీ రిషిని నా వైపుకి తిప్పుకుంటానని దేవయాని మనసులో అనుకుంటుంది. కట్ చేస్తే అటు రిషి.. మరోవైపు వసుధార ఒకరి గురించి మరొకరు ఆలోచించుకుంటూ ఉంటారు. కొద్దిసేపు ఇద్దరు ఫోన్ లో చాటింగ్ చేస్తారు. ఇద్దరూ చాటింగ్ చేసుకుంటూ తమ తమ గదుల్లో నుంచి బయటకు వచ్చి నిలబడతారు. మెసేజ్ చేసుకుంటూ ఇద్దరు ఒకరికొకరు ఎదురుపడతారు. వసుధారను రిషి తన గదిలో వదిలిపెట్టి వెళ్లిపోతాడు. గౌతమ్ కి జగతి కాల్ చేస్తుంది. రిషి.. మెయిల్ పెట్టాడు.. ముందు మినిస్టర్ దగ్గరికి వెళ్లి మాట్లాడతాం. తర్వాత మిగతా దాని గురించి ఆలోచిస్తాను అని జగతి చెబుతుంది.

  రిషిధార రొమాన్స్..

  రిషిధార రొమాన్స్..

  మిషన్ ఎడ్యుకేషన్ గురించి మినిస్టర్ తో మాట్లాడేందుకు నిర్ణయించుకుంటారు మహేంద్ర జగతి. మనం అక్కడ రిషి వాళ్లకి కనిపిస్తే ఎలా అని మహేంద్ర అంటాడు. వాళ్లకు కనిపించకుండా జాగ్రత్త పడదాములే అని జగతి సర్ది చెబుతుంది. మరోవైపు వసుధార తలస్నానం చేసి జుట్టు తుడుచుకుంటుంటే రిషి వచ్చి హెయిల్ డ్రయర్ పెడతాడు. మీరు ఎందుకు ఆ పని చేస్తున్నారని వసుధార లాక్కోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ, రిషి ఇవ్వకపోయేసరికి.. ఇద్దరూ ఒకరికొకరు లాక్కుంటూ ఉంటారు. దీంతో ఒక్కసారిగా ఒకరిపై మరొకరు పడిపోతారు. మళ్లీ చూపు చూపు కలిసి రొమాన్స్ నడుస్తుంది.

  English summary
  Guppedantha Manasu Serial Novemberr 5 2022 Today Full Episode 600
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X