twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Guppedantha Manasu Today Episode:తండ్రి కోసం రిషి పోలీస్ కంప్లైంట్?.. దేవయానికి వసు కౌంటర్స్

    |

    మినిస్టర్ దగ్గరికి వచ్చిన తన తండ్రి మహేంద్రను కలవకుండా వెళ్లిపోవడంతో రిషి చాలా ఎమోషనల్ అవుతాడు. ఈ రిషి డాడ్ కు అవసరం లేదా.. ఎప్పటికీ నా దగ్గరకు రారా అని బాధపడతాడు. ఇదంతా చూసిన వసుధార.. ఎగ్జామ్ రిజల్ట్స్ రోజు కచ్చితంగా రావాలి కదా.. సార్ వస్తారు లెండి అని ధైర్యం చెబుతుంది. ఈ సమస్యను మరింత పెద్దది చేస్తున్నారా.. రిషి సార్ ని ఎందుకు బాధపెడుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారం నేను చూస్తాను అని మనసులో అనుకుంటుంది వసుధార.

    మరోవైపు గౌతమ్ ఇంటికి వెళతారు మహేంద్ర-జగతి. ఎంటంకుల్ రిషికి కనిపించారా మీరు అని అడుగుతాడు గౌతమ్. ఇలా ఆసక్తికర కథా కథనంతో సాగుతోన్న గుప్పెడంత మనసు సీరియల్ నవంబర్ 8, 2022 సోమవారం నాటి తాజా ఎపిసోడ్​ 602లో ఏం జరిగిందో చదివేసేయండి.

    ఇప్పటికైనా వదిలేయవచ్చు కదా..

    ఇప్పటికైనా వదిలేయవచ్చు కదా..

    ఫోన్ లో గౌతమ్ అడిగిన ప్రశ్నకు లేదులే.. కొద్దిలో తప్పించుకున్నామని చెబుతాడు మహేంద్ర. అంకుల్ ఇవన్నీ అవసరమా.. ఇప్పటికైనా వదిలేయవచ్చు కదా.. అని గౌతమ్ అంటాడు. ఇద్దరం బాధపడుతున్నాం. ఇంకా నేనొకటి అనుకుంటున్నాను. అది జరగాల్సి ఉంటుంది. ఇంతకీ వసుధార మనసులో ఏముందని మహేంద్ర అడుగుతాడు.

    దీనికి రిషిని ఆ బాధనుంచి బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోందని చెబుతాడు గౌతమ్. ఇంతలో అక్కడికి దేవయాని రావడంతో గౌతమ్ కాల్ కట్ చేస్తాడు. ఫోన్ తీసుకున్న దేవయాని.. నువ్ ఎవరితో మాట్లాడుతున్నావో నాకు తెలుసు.. మీ పెదనాన్నకి ఇక్కడి పరిస్థితి చెబుతున్నావా.. ఇవన్నీ చెప్పి ఆయన్ను టెన్షన్ పెట్టకు అంటుంది. హమ్మయ్యా అనుకున్నా గౌతమ్.. మీరు చాలా తెలివైన వాళ్లు పెద్దమ్మా అంటాడు.

    డాడ్ ఇలా ఎందుకు చేస్తున్నారు..

    డాడ్ ఇలా ఎందుకు చేస్తున్నారు..

    ఇంతలో రిషి రావడం చూసిన దేవయాని.. ఏంటీ నాన్నా.. అలా ఉన్నావేంటి.. వెళ్లిన పని ఓకేనా.. ఏమైంది నాన్నా అంటుంది. డాడ్ ఏం చేశారో తెలుసా అని రిషి అంటాడు. మహేంద్ర వచ్చాడా అని దేవయాని అడుగుతుంది. వచ్చే ఉద్దేశం డాడ్ కి లేనట్టుంది. మినిస్టర్ గారి దగ్గరికి వచ్చారు. నేను వెళ్లేలోపే వేళ్లిపోయారు.

    డాడ్ ఇలా ఎందుకు చేస్తున్నారని రిషి అంటే.. మనుషుల స్వరూపాలు కొందరు ఇంటికి వచ్చాకా మారిపోయాయి. నువ్ ఎక్కువ ఆలోచించి మనసు పాడుచేసుకోకు అని అంటుంది దేవయాని. దీంతో అందరి స్వరూపాలు బాగానే ఉన్నాయి.. మీ నిజస్వరూపం తెలిస్తే అప్పుడు ఉంటుందని అనుకుంటుంది వసుధార మనసులో. నువ్ పద నాన్నా అని లోపలికి తీసుకెళ్లిపోతుంది దేవయాని. వసుధార కూడా అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

    నేను ఏం తప్పు చేశానో..

    నేను ఏం తప్పు చేశానో..

    తన గదికి వెళ్లిన రిషి తండ్రిని గుర్తు చేసుకుంటూ బాధపడతాడు. ఇంతలో ద్వారం దగ్గర మహేంద్ర నిల్చుని ఉంటాడు. డాడ్ అనుకుంటూ రిషి పరుగెత్తుకుని వెళతాడు. మీరొస్తారని నాకు తెలుసు.. థ్యాంక్యూ డాడ్ అని ఎమోషనల్ అవుతాడు. కానీ అక్కడుంది గౌతమ్. మహేంద్ర వచ్చినట్లుగా రిషి ఫీలవుతాడు. తర్వాత తేరుకున్న రిషి.. నేను ఏం తప్పు చేశానో కూడా నాకు తెలియదు.

    డాడ్ వదిలేసి వెళ్లిపోయారు. డాడ్ నన్ను వదిలేసి వెళ్లిపోతే ఆనందంగా ఎలా ఉంటాను అని అంటాడు. ఎప్పటికైనా వస్తారులేరా అని గౌతమ్ అంటాడు. దీనికి ఇంకా వస్తారని నేను అనుకోవడం లేదు. కావాలనే తప్పించుకుని తిరుగుతున్నారు. నేనే ఏదో ఒకటి చేయాలి. పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యానురా అని రిషి అంటాడు. వద్దని గౌతమ్ చెబుతాడు. తర్వాత తనను ఒంటరిగా వదిలేయమంటాడు రిషి.

    నేను కూడా కోడలు లాంటిదాన్నే..

    నేను కూడా కోడలు లాంటిదాన్నే..

    కట్ చేస్తే మేడపై ఉన్న వసుధార ఎగ్జామ్స్ గురించి టెన్షన్ పడుతుంది. రిషి కూడా ఒంటరిగా మేడపై నిల్చుని మహేంద్ర గురించి ఆలోచిస్తాడు. వసుధారను చూసి నిద్రపోలేదేంటని అడుగుతాడు. రిజల్ట్స్ గురించి చెబుతుంది. ఇక్కడ ఎగ్జామ్స్, రిజల్ట్స్, టాపర్ గురించి మాట్లాడుకుంటారు రిషిధార. తెల్లవారుతుంది. వసుధార కూరగాయలు కట్ చేస్తుంటుంది. అక్కడికి వచ్చిన ధరణి అన్ని పనులు చకాచకా చేస్తావ్.

    ఏ పని చెప్పినా విసుక్కోవు. ఇది చాలా మంచి అలవాటు అంటే.. అలా చేయడం మనసుకు హాయిగా ఉంటుందని వసుధార బదులిస్తుంది. నీ దగ్గర చాలా నేర్చుకోవాలని ధరణి అంటుంది. తర్వాత దేవయానికి కాఫీ తీసుకెళ్తుంది వసుధార. నా కోడలేదని దేవయాని అంటే.. నేను కూడా కోడలు లాంటిదాన్నే కదా అంటుంది వసుధార.

    జగతి చెంప దెబ్బ కొట్టినందుకే..

    అసలేంటీ నీ ప్లాన్.. ఎన్నాళ్లు తిష్ట వేస్తావ్ అని దేవయాని అంటే.. ప్లాన్స్ తో జీవితం నడువదు.. అయినా ఇప్పుడు రిషి సార్ ని ఇలా ఒంటరిగా వదిలి వెళ్లడం కరెక్ట్ కాదు. ఇక్కడే ఉన్నా.. ఇక్కడే ఉంటా.. అని వసుధార అంటుంది. ఈ మధ్య ఎక్కువ మాట్లాడుతున్నావన్న దేవయాని మాటలకు కావాలనే కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నాను.. నాక్కూడా తెలుసని వసుధార రిప్లై ఇస్తుంది.

    నీకు రిషి అండగా ఉన్నాడనే ధైర్యం కదా అని దేవయాని అంటుంది. నేను ఏం చేసినా డైరెక్ట్ గా చేస్తాను. కొంతమందిలా ఇన్ డైరెక్ట్ గా చేయడం నాకు నచ్చదు. చెప్పి చేయడం మంచి లక్షణమని వసుధార అంటుంది. నువ్ చేసే పనులన్నీ చూస్తున్నాను.. బాగా గమనిస్తున్నాను.. జగతి చెంప దెబ్బ కొట్టినందుకే రిషి అలా మాట్లాడాడు కాబట్టి నీకు బలం ఎక్కువైందని దేవయాని అంటుంది.

    English summary
    Guppedantha Manasu Serial Novemberr 8 2022 Today Full Episode 602
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X