twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Guppedantha Manasu: ప్రేమ, మొండితనం మధ్య రిషిధార.. దేవయానికి మహేంద్ర స్ట్రాంగ్ వార్నింగ్

    |

    ఉద్యోగంలో జాయిన్​ అయిన విషయం నాకు చెప్పాలనిపించ లేదా, ఇంతకుముందు నా దగ్గర అసిస్టెంట్​గా చేసేదానివి గుర్తుందా అని వసుధారతో రిషి అంటాడు. దీనికి నాకు గుర్తుంది సార్​.. అప్పుడు జీతం తీసుకుని అసిస్టెంట్​గా చేశాను. ఇప్పుడు జీతం తీసుకోకుండా జీవితాంతం మీతో నడిచే అసిస్టెంట్​గా ఉంటున్నాను అని అంటుంది వసుధార. ఏం జరగనట్లు ఎంత నార్మల్​గా మాట్లాడుతోంది అని మనసులో అనుకుంటాడు రిషి.

    అభిప్రాయ బేధాలు ఉన్నంత మాత్రానా ప్రేమ కరిగిపోదు కదా సార్.. అని వసుధార అంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన మహేంద్ర.. మినిస్టర్ గారు రమ్మంటున్నారు. రిషి చేయి ఎలా ఉంది అని జగతి అడుగుతుంది. ఇలా ఆసక్తిర కథనంతో సాగుతోన్న గుప్పెడంత మనసు సీరియల్ అక్టోబర్​ 1, 2022 శనివారం నాటి తాజా ఎపిసోడ్​ 570లో ఏం జరిగిందో చదివేసేయండి.

    నన్ను కమాండ్ చేస్తోంది

    నన్ను కమాండ్ చేస్తోంది

    చేయి ఎలా ఉంది అని రిషిని జగతి అడగ్గా.. పర్వాలేదు మేడమ్ అని సమాధానం ఇస్తాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతారు. కారులో రిషి, వసుధార ఇద్దరూ సైలెంట్ గా ఉంటారు. మాట్లాడొచ్చు కదా అని ఎవరికీ వాళ్లు మనసులో అనుకుంటారు. అప్పుడు రిషి చేతిపై వసుధార చేయి వేస్తుంది. తీయు అని రిషి అనడంతో చేయి వదలను సార్ అంటూ కారుని ఆపండి అని చెబుతుంది.

    ఏంటో ఈ మధ్య నన్ను కమాండ్ చేస్తోంది అనుకుంటూ కారు ఆపుతాడు రిషి. మరోవైపు మహేంద్ర ఏదో ఆలోచిస్తూ ఈ రెండు వేళ్లలో ఒకటి పట్టుకో జగతి అని అంటాడు. ఇంతలో గౌతమ్ అక్కడకి రావడంతో నువ్వు పట్టుకో అంటాడు. గౌతమ్ ఒక వేలు పట్టుకోగానే.. ఎస్.. ఇద్దరూ మళ్లీ కలిసిపోతారు అని సంతోషపడతాడు మహేంద్ర.

    బాధ ఎన్నాళ్లైనా పోదు..

    బాధ ఎన్నాళ్లైనా పోదు..

    కారు ఆపిన తర్వాత రిషి చేతికి ట్రీట్మెంట్ చేస్తుంది వసుధార. నా మనసు తెలిసి కూడా ఎందుకిలా ప్రవర్తిస్తున్నావని రిషి ప్రశ్నిస్తాడు. పిల్లలకు తల్లిదండ్రులు బొమ్మలు తెచ్చి ఇస్తారు. కానీ ప్రమాదకరమైన బొమ్మలు తెచ్చి ఇవ్వరు కదా.. కొన్ని విషయాలు అంతే మీకు కరెక్ట్ అనిపిస్తుంది. కానీ నాకు కాదనిపిస్తుంది అంటూ రిషి చేతికి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది వసుధార. ఈ చేయి నాకు కాలేజీలో సీట్ ఇచ్చింది, ఈ చేయి నాకు అండగా నిలిచింది.. ఈ చేయి నన్ను నడిపించింది.. మీరు అరిచినా కోప్పడినా.. మీ మీదున్న గౌరవం ఏ మాత్రం తగ్గదు సార్ అని వసుధార చెబుతుంది.

    చేతికి అయిన గాయం తగ్గిపోతుంది కానీ, మనసుకి అయిన గాయం, బాధ ఎన్నాళ్లైనా పోదు. బాల్యం నుంచి అనుభవిస్తోన్న ఆ బాధ ఏంటో నాకు తెలుసు.. నీకు తెలియదు కదా.. నువ్ చెప్పనట్టే నేనొక ఉదాహరణ చెబుతాను.

    ఆ కడుపు నొప్పి బాధేంటో నాకు మాత్రమే తెలుసు..

    ఆ కడుపు నొప్పి బాధేంటో నాకు మాత్రమే తెలుసు..

    నాకు కడుపు నొప్పి వచ్చిందనుకో.. పక్కనే ఉన్న ఫ్రెండ్ ట్యాబ్లెట్ వేసుకో, నీళ్లు తాగు తగ్గుతుందని అని చెప్పేస్తాడు. కానీ ఆ కడుపు నొప్పి బాధేంటో నాకు మాత్రమే తెలుస్తుంది అని రిషి చెబుతాడు. బాధకు కొలమానాలు ఉండవు సార్..కానీ రిషి, వసుధార ఇద్దరూ రిషిధార అయినప్పుడు ఒకరి బాధను ఒకరు పంచుకోగలం. ఒకరి సమస్యలను ఒకరు పరిష్కరించుకోగలం అని వసుధార అంటుంది.

    నాకు కావాల్సిన పరిష్కారం నీ దగ్గరుంది. కానీ నేను భరించలేనంత మొండితనం నువ్ చూపిస్తున్నావ్ అని రిషి అంటే.. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ప్రశ్నే వెతుక్కుంటుంది సార్.. వెళదాం పదండి అని వసుధార సమాధానం ఇస్తుంది. మనిద్దరి మనసులు దూరం అవుతున్నాయేమో అని భయంగా ఉందని అనుకుంటాడు రిషి. ఇన్నాళ్లు మనం దూరం ఉన్నాం. మనసులు కలిశాయ్.. చిన్న చిన్న వాటికోసం మనసు పాడుచేసుకోవద్దు సార్.. అని మనసులో అనుకుంటుంది వసుధార.

    సివిల్స్ కు వెళ్లిన అవలీలగా మంచి జాబ్ కొట్టేస్తుంది..

    సివిల్స్ కు వెళ్లిన అవలీలగా మంచి జాబ్ కొట్టేస్తుంది..

    కట్ చేస్తే.. మినిస్టర్ దగ్గర వసుధార, రిషి ఇద్దరూ కూర్చుంటారు. వసుధారను తెగ పొగుడుతాడు మినిస్టర్. వసుధారకు ఈ జాబ్ కరెక్ట్ కాదని తెలుసు కానీ తనే పట్టుబట్టి ఈ జాబ్ చేస్తానంది. కాదనలేకపోయానంటాడు మినిస్టర్. వసుధార సివిల్స్ కు వెళ్లిన అవలీలగా మంచి జాబ్ కొట్టేస్తుంది. వసుధార మంచి అమ్మాయి.

    ఎప్పుడూ వదులుకోకు అని మినిస్టర్ చెప్పడంతో మా ఇద్దరి మధ్య గొడవలు తెలిసినట్లే మాట్లాడుతున్నారేంటి అని అనుకుంటాడు రిషి. మరోవైపు రిషి ఇంకా రాలేదని జగతి కంగారు పడుతుంటే.. వసుతో కలిసి రిషి వెళ్లాడు కదా.. తిరగనీ.. వాళ్లిద్దరి మధ్యలో కోపం మంచులా కరిగిపోవాలి, మంచిగా కలిసిపోవాలి అని నవ్వుతూ అంటాడు మహేంద్ర. దీంతో అంతా సరదాగా నవ్వుకుంటూ ఉంటారు. ఇంతలో ధరణి అని దేవయాని కోపంగా అరుస్తుంది.

    రిషి జీవితాన్ని నాశనం చేయొద్దు..

    రిషి జీవితాన్ని నాశనం చేయొద్దు..

    జీవితాన్ని సరాదాగా తీసుకోకు.. రిషి జీవితాన్ని నాశనం చేయొద్దు అని దేవయాని అంటే.. నేను ఏమన్నాను అని మహేంద్ర బదులిస్తాడు. మీరిద్దరూ ఒకేమాటపై ఉంటారు. ఒకే విషయాన్ని ఆలోచిస్తారు. వసుధారతో రిషి ఉన్నప్పుడు నీకు ఆనందం ఏంటి. జగతికి ఏనాడు పట్టదు. తండ్రిగా నీకు బాధ్యత లేదా.. జగతి ఇంటికి రాగానే రిషిని గాలికి వదిలేశావా.. జగతి ఇంటికి రాకముందు రిషి అంటూ తిరిగేవాడివి.

    పెళ్లాం రాగానే కొడుకు చేదయ్యాడా.. అని దేవయాని అంటుంది. జగతికి నేను మానసికంగా ఎప్పుడూ దూరమవ్వలేదు అని మహేంద్ర అంటాడు. రిషిని పట్టించుకోవడం లేదు. తలతిక్కగా మాట్లాడుతూ పెద్దలంటే గౌరవం లేని ఆ వసుధారను ఇంటి కోడలిగా తీసుకొద్దాం అని అనుకుంటున్నారా.. నిజం చెప్పు.. ప్లాను వేస్తున్నారు కదా.. అని దేవయాని అంటే.. మీరేంటీ ఇలా మాట్లాడుతున్నారు అని జగతి అంటుంది.

    మొగుడు పెళ్లాలు నాటకాలు ఆడుతున్నారా..

    మొగుడు పెళ్లాలు నాటకాలు ఆడుతున్నారా..

    రిషి జీవితంలోకి వసుధార రావడానికి కారణం నువ్వే కదా.. మొగుడు పెళ్లాలు ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారా. ఈ మహాతల్లి రిషిని వదిలివెళ్లిపోతే.. రిషిని పెంచి పెద్ద చేసింది నేను. మీకు నచ్చిన వాళ్లని రిషికి అంటగడతానంటే నేను ఒప్పుకోను. తన జీవితం ఎలా ఉండాలో డిసైడ్ చేయాల్సింది నేను అని దేవయాని అంటుంది.

    అలా ఎలా వదినగారు.. రిషికి ఏం కావాలో మేం కదా డిసైడ్ చేయాల్సింది అని మహేంద్ర అంటాడు. రిషితో నాకు సంబంధం లేదా.. రిషఇ నీ కన్నకొడుకు అని నన్నుదూరం పెడుతున్నావా అని దేవయాని అంటే.. రిషి సంతోషాన్ని పాడుచేస్తే ఊరుకోనని మీరంటున్నారు.. ఆ మాట నేను అనాలి. రిషి నా కొడుకు. అవును రిషి మా కొడుకే. మా జీవితాన్ని గందరగోళం చేసారు. మా ఇద్దరి విషయంలో ఎన్నో కుట్రలు చేశారు.

    ఒక్క మాట మీ గురించి అన్నయ్యాకి చెప్పినా.. రిషికి చెప్పినా మీ స్థానం ఎక్కడో ఆలోచించుకోండి.. మన మంచితనం, సహనాన్ని చేతకాని తనంగా తీసుకుంటున్నారు. మీరు ఇక్కడితే ఆగండి. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి.. రిషి, వసుధార జీవితాలు వాళ్లకే వదిలేయండి. మధ్యలో జోక్యం చేసుకుంటే బాగుండదు జాగ్రత్త అని దేవయానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు మహేంద్ర.

    English summary
    Guppedantha Manasu Serial October 1 2022 Today Full Episode 570
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X