Guppedantha Manasu:అదిరిపోయే ట్విస్ట్.. పూలదండలతో రిషిధార.. ఉలిక్కిపడిన దేవయాని

గురు దక్షిణ ఒప్పందాన్ని రద్దు చేసుకోమ్మని వసుధారకు చాలా స్ట్రాంగ్ గా చెబుతుంది జగతి. కోపంగా వస్తువులు అన్నింటిని విసిరేస్తుంది ఇంతలో మహేంద్ర వస్తాడు. ఏమైంది అని జగతిని అడుగుతాడు. జీవితాలు నాశనం అయిపోతున్నాయ్. మీకెవ్వరికీ అర్థం కావడం లేదని కోపంగా అరుస్తూ చెబుతుంది జగతి. తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. దేవయాని అక్కయ్యకి అవకాశం ఇస్తున్నారు. తప్పు చేస్తూనే ఉన్నారని జగతి ఆవేశంగా అంటుంది. నమ్మిన దాని కోసం పోరాటం చేయడం తప్పు లేదు కదా అని వసుధార అంటే.. వసుధార ఆపు.. ఆపు.. అని గట్టిగా అరుస్తుంది జగతి. మహేంద్ర.. రిషి గురించి, తన మనసు గురించి నాకు తెలుసు అని అంటుంది జగతి. ఇలా ఆసక్తికర కథాకథనంతో సాగుతోన్న గుప్పెడంత మనసు సీరియల్ అక్టోబర్​ 10, 2022 సోమవారం నాటి తాజా ఎపిసోడ్​ 577లో ఏం జరిగిందో చదివేసేయండి.

 20 ఏళ్లకు పైగా రిషికి దూరంగా..

20 ఏళ్లకు పైగా రిషికి దూరంగా..

రిషి మనసు ఎంత సెన్సెటివో నాకు తెలుసు అని జగతి అంటుంది. 20 ఏళ్లకు పైగా నేను రిషికి దూరంగా ఉన్నాను ఎందుకు.. ఆ ఇంట్లోకి రాలేకనా.. రిషి మనసు గాయపడుతుందని ఆగాను కదా.. ఇప్పుడు మీరు అదే పని చేస్తున్నారు. చూడు వసుధార మనం ఓడిపోయినా ఎదుటివారిని గెలిపించాలి. అది గెలుపంటే.. నేను 20 ఏళ్లు ఓడిపోయినా రిషిని గెలిపించాను. అది అర్థం కావడం లేదు. నన్ను అమ్మా అని పిలవడం ఇష్టం లేక ప్రేమను వదులుకోవడానికి ఇష్టపడ్డాడు రిషి. ఇంతలో వసుధార.. మేడమ్ నేను చెప్పేది ఒకసారి వినండి అని అనడంతో.. వసుధార నేను చెప్పేది విను అంటూ చాలా గట్టిగా అరుస్తుంది.

రిషి ప్రేమకు నేనే అడ్డంకి..

రిషి ప్రేమకు నేనే అడ్డంకి..

ఇంతలో వసుధార నువ్ ఇక్కడి నుంచి వెళ్లమ్మా.. అని మహేంద్ర అనడంతో వెళ్లిపోతుంది వసుధార. తను వెళ్లేటప్పుడు వసుధార నేను చెప్పేది విను అని జగతి అంటుంది. చేసేది లేక అక్కడి నుంచి వసుధార వెళ్లిపోతుంది. మహేంద్ర నేను కన్నతల్లిగా ఫెయిల్ అయ్యాను. ఇప్పుడు తన ప్రేమకు కూడా నేనే అడ్డంకిగా మారాను. నేనేం తల్లిని మహేంద్ర అంటూ ఏడుస్తూ కళ్లు తిరిగి పడిపోతుంది జగతి. దీంతో జగతి ఏమైంది అంటూ కంగారు పడతాడు మహేంద్ర. తర్వాత రిషికి ధరణి ఫోన్ చేస్తుంది. జగతి అత్తయ్య మాట్లాడుతూ.. మాట్లాడుతూ.. సడెన్ గా పడిపోయారని చెబుతుంది. ఇప్పుడు ఎలా ఉన్నారు అని రిషి అడుగుతాడు.

 జగతి గురించి ఏడ్చిన వసుధార..

జగతి గురించి ఏడ్చిన వసుధార..

ఇంట్లోనే జగతికి ట్రీట్మెంట్ ఇప్పిస్తాడు మహేంద్ర. తన మనసుకి ప్రశాంతత కావాలి. అదే తనకు మందు అని డాక్టర్ చెబుతుంది. రిషి, వసుధార గురించే తన బాధంతా అని మహేంద్ర అనుకుంటాడు. మరోవైపు వసుధార రెస్టారెంట్ కి రిషి వస్తాడు. జగతి గురించి వసుధారకు చెప్పడంతో వసుధార చాలా టెన్షన్ ఫీల్ అవుతుంది. పడిపోయారని తెలియదు కానీ అందుకు కారణం తెలుసు. జగతి మేడమ్ మీరు ఇద్దరూ ఒకే విషయం గురించి మాట్లాడుతున్నారని వసుధార అంటుంది. మేడమ్ ఎలా ఉన్నారో అని ఏడుస్తుంది. నేను నిన్ను తీసుకెళ్లడానికే వచ్చాను అని రిషి చెప్పి తనను తీసుకుని ఇంటికి వెళతాడు రిషి. వసుధార, రిషి ఇద్దరూ పూల దండలు వేసుకుని కుడికాలు ఇంట్లోకి పెట్టి వస్తారు. వాళ్లను చూసిన దేవయాని ఉలిక్కిపడి లేస్తుంది.

 పూలదండలతో రిషిధార..

పూలదండలతో రిషిధార..

అలా కొద్దిసేపు షాక్ లోనే ఉంటుంది దేవయాని. ఇంతలో పెద్దమ్మా.. పెద్దమ్మా అని రిషి భుజం తట్టి పలకరించడంతో తేరుకుంటుంది దేవయాని. అయితే అదంతా దేవయాని ఊహ. వసుధార, రిషి పెళ్లి చేసుకుని పూల దండలతో వచ్చినట్లు ఊహించుకుంటుంది. ఇదేంటి నాకు అలా అనిపించింది. ఇదేంటి నాకు అలా అనిపించింది. ఇది దేనికి సంకేతం. ఇది శుభమా.. అశుభమా అన ఆలోచిస్తుంది దేవయాని. తర్వాత జగతి మేడమ్ ఎలా ఉన్నారు.. తనకు ఏమైంది.. తనను కాస్త జాగ్రత్తగా చూసుకోండి పెద్దమ్మా అని దేవయానికి చెబుతాడు రిషి. వసుధార వచ్చింది ఏంటి అని దేవయాని అడుగుతుంది.

ఎవరి అనుమతి కూడా అవసరం లేదు..

నేనే తీసుకొచ్చాను. మీకు మేడమ్ కి సహాయంగా ఉంటుందని తీసుకొచ్చా అని రిషి చెబుతాడు. నీ పెళ్లి గురించి ఎప్పటి నుంచో మాట్లాడాలని అనుకుంటున్నా అని దేవయాని చెబుతుంది. ఇందులో మాట్లాడటానికి ఏముంది. మా ఇద్దరి బంధం గురించి వసుధార వాళ్ల ఇంట్లో చెప్తే సరిపోతుంది కదా. ఇక్కడ ఎవరి అనుమతి కూడా అవసరం లేదు. నేనే అన్నీ చూసుకుంటాను. మీకేం శ్రమ ఇవ్వను అని రిషి చెప్పి వెళ్లిపోతాడు. దీంతో ఒకింత ఆవేశానికి గురవుతుంది దేవయాని. తర్వాత జగతి దగ్గరికి వెళ్లిన వసుధార.. ఏమైంది మేడమ్ ఎలా ఉన్నారు అని కంగారుగా అడుగుతుంది. రిషికి నీ మీద కోపం తగ్గిందా అని అడుగుతుంది జగతి. రిషి సార్ కోపం, ప్రేమ పాలునీళ్లలా కలిసిపోయే ఉంటాయి అని వసుధార చెబుతుంది. ఇంతలో తనకు మీ గురించి తప్ప వేరే ఆలోచన లేదని మహేంద్ర అంటాడు. మీరు ఎప్పుడు హుషారుగా ఉండాలి, నా మీద అరవాలి అని వసుధార అంటుంది. నేను ఇక్కడ, కాలేజ్ లో హుషారుగా కనిపించిన జగతి మేడమ్ లోపల ఉన్న తల్లి ఎప్పుడూ ఓడిపోతూనే ఉంది అని బాధపడుతుంది జగతి. వీరి మాటలన్ని అటుగా వెళ్తున్న రిషి ఆగి వింటాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X