twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Guppedantha Manasu: బెడ్ పై పేషంట్ లా జగతి.. క్లాస్ తీసుకున్న రిషి, దేవయానికి వసు కౌంటర్

    |

    నీరసంగా కళ్లు తిరిగిపడిపోయిన జగతి బెడ్ పై ఉంటుంది. జగతితో వసుధార మాట్లాడటాన్ని బయటి నుంచి రిషి వింటాడు. జ్యూస్ తాగమని జగతికి అందిస్తుంది వసుధార. తర్వాత రిషి మాటలు వినడం గమనించిన వసుధార బయటకు వెళ్లి రిషిని కలుస్తుంది. ఎలా ఉంది మేడం అని రిషి అడుగుతాడు. డాక్టర్ శరీరానికి ట్రీట్ మెంట్ ఇస్తాడు. మనసుకి కాదు అని వసుధార సమాధానం ఇస్తుంది. జాగ్రత్తగా చూసుకో వసుధారా.. అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు రిషి.

    తర్వాత లోపలికి వెళ్లిన రిషి దగ్గరికి మహేంద్ర వస్తాడు. చాటుగా ఎందుకు.. నేరుగా వచ్చి చూడొచ్చు కదా అని రిషితో అంటాడు మహేంద్ర. ఇలా ఆసక్తికర కథాకథనంతో సాగుతోన్న గుప్పెడంత మనసు సీరియల్ అక్టోబర్​ 11, 2022 మంగళవారం నాటి తాజా ఎపిసోడ్​ 578లో ఏం జరిగిందో చదివేసేయండి.

    జగతి కావాల్సింది మానసిక ప్రశాంతత..

    జగతి కావాల్సింది మానసిక ప్రశాంతత..

    డాక్టర్ ఏమన్నారు. స్పెషలిస్టుని పిలిపించండి. ఎక్కడి నుంచైన డాక్టర్ ని పిలిపించి ట్రీట్మెంట్ చేయించండి అని మహేంద్రతో రిషి అంటాడు. జగతి కావాల్సింది మానసిక ప్రశాంతత. తను అన్నింటా గెలిచింది. కానీ తల్లిగా ఓడిపోతుంది. తనను గెలిపించాలని ప్రయత్నిస్తున్నాను. గెలుస్తుంది కదా రిషి అని వెళ్లిపోతాడు మహేంద్ర. వంటగదిలో ఉన్న ధరణితో మాట్లాడుతుంది వసుధార. ఇంతలో అక్కడకు వచ్చిన దేవయాని, ధరణిని పంపించివేస్తుంది.

    వసుధార కూడా వెళ్లబోతుంటే ఆపి మాట్లాడుతుంది. నాకు కొంచెం పని ఉంది అంటూ వెళ్లబోతుంది వసుధార. నీతో మాట్లాడాలి అని అంటున్నా కదా. ఈ మధ్య నీకు ధైర్యం ఎక్కువైందని దేవయాని అంటే ధైర్యం ఉంటే మంచిదే కదా అని వసుధార కౌంటర్ ఇస్తుంది. దీనికి ఇంత జరిగినా ఇంట్లోకి ఎలా రావాలనిపించింది అని వసుధారను దేవయాని అడుగుతుంది.

    గురుదక్షిణ గురించి చేసినా గొడవనా..

    గురుదక్షిణ గురించి చేసినా గొడవనా..

    దీనికి ఏం జరిగింది మేడమ్.. ఓ.. మీరు గురుదక్షిణ గురించి చేసినా గొడవనా.. మేడమ్.. రిషి సార్ కు నాకు మధ్య ఇంతకన్నా పెద్ద పెద్ద గొడవలే జరిగాయ్ అని వసుధార అంటే నువ్ రిషిని వదిలిపెట్టవా అని దేవయాని అడుగుతుంది. జీవితాంతం వదిలిపెట్టకూడదు డిసైడ్ అయ్యాను. మీరేదే ట్రై చేశారు కానీ, మా ఇద్దరి మధ్య ఆరోగ్యకరమైన ఒప్పందం కుదిరింది అని వసుధార అంటుంది.

    ఏంటా ఒప్పందం అని వసుని అడుగుతుంది దేవయాని. ఇంతలో రిషి రావడం చూసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది దేవయాని. వసుధార దగ్గరకు వచ్చిన రిషి.. నేను చిన్న పని మీద బయటకు వెళ్తున్న గౌతమ్ నిన్ను డ్రాప్ చేస్తాడు అనేసి వెళ్లిపోతాడు. మరోవైపు తనకోసం వసుధారను రిషి తీసుకొచ్చాడు అని సంతోషపడుతుంది జగతి. తర్వాత రిషి వసుధార కలిసి సంతోషంగా ఉన్నట్లు ఊహించుకుంటాను.. ఇవన్నీ ఎంత బాగుంటాయో కదా.. ఊహల్లో అయనా అబద్ధాన్ని నిజం చేసుకోని మహేంద్ర అని జగతి అంటుంది. బయటకు ఆనందం అంటున్నావ్ కానీ, నీ మాటల్లో అది గొప్ప విషాదం కదా జగతి అని మహేంద్ర అంటాడు.

    నిన్ను తీసుకురాగలను కానీ, పంపించలేను..

    నిన్ను తీసుకురాగలను కానీ, పంపించలేను..

    మరోవైపు వసుధారను డ్రాప్ చేసేందుకు కారులో తీసుకెళ్తాడు గౌతమ్. వీరిద్దరూ రిషి గురించి మాట్లాడుకుంటారు. ఇక మరోవైపు రోడ్డు పక్కన కారు ఆపిన రిషి.. వసుధార గురించే ఆలోచిస్తూ ఉంటాడు. నిన్ను తీసుకురాగలను కానీ, పంపించలేను. నీకు అర్థమైన కాకపోయినా కోపం వచ్చినా.. ఇది నా మనసు. నేను ఇలాగే ఉంటాను అని అనుకుంటాడు రిషి.

    తన గదిలో ఓ బెంచ్ పై కూర్చున్న వసుధార రాజు, రాణి బొమ్మలతో రిషి గురించి మాట్లాడుతుంది. మరోవైపు రిషి వసుధార గురించి ఆలోచిస్తు ఉంటాడు. తనను నేను డ్రాప్ చేయనందుకు కోపం వచ్చి ఉంటుంది కదా.. క్శశ్చన్ చేయాలి కదా.. కోపం వస్తే అడగొచ్చు కదా.. కనీసం మెసేజ్ చేయాలి కదా అనుకుంటాడు రిషి. ఇక తనే ఏం చేస్తున్నావ్. నన్ను ఏమైనా అడగాల్సింది ఉందా అని మెసేజ్ చేస్తాడు రిషి.

    అందుకు హా ఒకటి అడగాలి సార్ అని వసు రిప్లై ఇస్తుంది. ఏంటో అది అని రిషి అంటే.. రేపు ఇంటికి రావొచ్చా.. జగతి మేడమ్ ని కలవాలి విత్ యువర్ పర్మిషన్ అని వసుధార అంటుంది. దీనికి ఇదా అడిగేది.. డ్రాప్ చేయలేదని అడగదా..నువ్వొస్తే ఇక్కడన నిన్ను ఆపేది ఎవరు.. ఎప్పుడైనా రావొచ్చు.. పికప్ చేసుకోమని అంటుందా ఏంటీ అని రిషి అనుకుంటుండగా.. మీరు పికప్ చేసుకోవద్దు.. డ్రాప్ కూడా చేయోద్దు.. అని వసుధార అంటుంది.

    నువ్ పొగరు ఎలా అవుతావ్ అనుకుంటూ..

    నువ్ పొగరు ఎలా అవుతావ్ అనుకుంటూ..

    ఇలా అనకపోతే నువ్ పొగరు ఎలా అవుతావ్ అనుకుంటూ కాల్ చేస్తాడు రిషి. కాల్ లిఫ్ట్ చేయకుండా ఫోన్ చూస్తూ ఉండిపోతుంది వసుధార. ఫోన్ లో మాట్లాడాలి అంటే భయంగా ఉందనుకుంటా అలాగే ఉంటుంది. ఫోన్ మాట్లాడకపోతే ఇంటికొచ్చేస్తాను అని రిషి మెసేజ్ చేస్తాడు. వద్దు సార్.. రేపు నేనే వస్తాను అని వసుధార అంటుంది.

    ఇద్దరు గుడ్ నైట్ చెప్పుకుంటారు. ఉదయం జగతికి కాఫీ తీసుకెళ్లి ఇస్తాడు రిషి. రిషిని చూసి జగతి కొంచెం ఆశ్చర్యపడుతుంది. మీ ఆరోగ్యం గురించి డాడ్ ని అడిగాను. మీ గురించి డాడ్ టెన్షన్ పడుతున్నారు. మీ గురించి మీరు శ్రద్ధ తీసుకోవాలి. డాడ్ కోసమైనా. డాడ్ కోసం ఆలోచించాలి. 80 శాతం బాధలు మనుషుల ఆలోచన విధానం వల్లే వస్తాయి. మీరొకటి ఆలోచిస్తున్నారు అది సాధ్యామా అసాధ్యామా అని పక్కన పెడితే.. దానివల్ల మీరు అందరిని బాధపెడుతున్నారు. నిజానికి మీరు బాగా ఆలోచిస్తే మీ బాధకు కారణం నేను కాదు.. మీరే.. ఓ పిలుపు కోసం బంధాన్ని బలిపెట్టాలని అనుకోవద్దు.

    కోల్పోయిన బాల్యం మీరు తెచ్చివ్వగలరా..

    కోల్పోయిన బాల్యం మీరు తెచ్చివ్వగలరా..

    నా దృష్టిలో ఆ పిలుపు ఎప్పుడో దూరమైంది. ఆ బంధం ఎప్పుడో ఒంటరివాడని చేసింది. మీరు పోగొట్టుకున్న పిలుపు విలువ ఎంతో తెలుసా.. నేను పోగొట్టుకున్న బాల్యం అంత. మీకు కావాల్సిన ప్రశాంతత నేను ఇవ్వగలను. కానీ నేను కోల్పోయిన బాల్యం మీరు తెచ్చివ్వగలరా. మిమ్మల్ని మారమని నేను అడగడం లేదు. నా మనసులో మాట చెప్పడానికి వచ్చాను. చిన్నప్పుడే నన్ను ఒంటరి చేసి వెళ్లిపోయాక వసుధార వచ్చాక జీవితం అంటే ఏంటో తెలుసుకున్నాను.

    ఇప్పుడు ఆ ఒక్క పిలుపు కోసం వసుధారతో బంధాన్ని దూరం చేయకండి. నేను మాట్లాడే మాటలు కటువుగా ఉండొచ్చు. కానీ, అందులో ఏ ఒక్కటి అబద్ధం కాదు. మీ మనసు నొప్పిస్తే క్షమించండి. తల్లి ఆదరణ లేకుండా పెరిగినవాడిని కదా.. దయచేసి డాడ్ ఆనందాన్ని దూరం చేయకండి అని రిషి వెళ్తుండగా.. అక్కడ మహేంద్ర నిల్చొని ఉంటాడు.

    English summary
    Guppedantha Manasu Serial October 11 2022 Today Full Episode 578
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X