For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Guppedantha Manasu: రిషి చేయి పట్టుకుని నడిచిన వసుధార.. దేవయాని మరో ప్లాన్!

  |

  రిషికి వసుధార బొమ్మలు ఇస్తుంది. వాటిని చూసుకుంటూ మురిసిపోతుంటాడు రిషి. ఇంతలో అక్కడికి వచ్చిన గౌతమ్.. బొమ్మలు చాలా బాగున్నాయి. ఏదీ చూడని అని తీసుకునేందుకు ప్రయత్నిస్తాడు గౌతమ్. దీంతో ఇవి నా బొమ్మలు ఇవ్వను అంటాడు రిషి. మళ్లీ ఆ బొమ్మలు లాక్కునేందుకు గౌతమ్ ప్రయత్నించడంతో ఇవి నా బొమ్మలు అని చెప్పి మురిసిపోతుంటాడు రిషి.

  అలాగే ఇంట్లో బొమ్మల కొలువు పెడుతున్నాం. నువ్ హెల్ప్ చేయాలని గౌతమ్ కి చెబుతాడు రిషి. ఆ తర్వాత అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర రిషి కోసం ఎదురుచూస్తూ ఉంటారు. నేను మెసేజ్ చేశాను లేండి అని వసుధార అనేలోగా.. రిషి వస్తాడు. ఇలా ఆసక్తికర కథాకథనంతో సాగుతోన్న గుప్పెడంత మనసు సీరియల్ అక్టోబర్​ 12, 2022 గురువారం నాటి తాజా ఎపిసోడ్​ 580లో ఏం జరిగిందో చదివేసేయండి.

  ఈరోజు నేను వడ్డిస్తాను మీరు కూర్చొండి..

  ఈరోజు నేను వడ్డిస్తాను మీరు కూర్చొండి..

  ఇంతలో వచ్చిన భోజనం చేయమని అందరూ అడుగుతారు. దీంతో ధరణి వడ్డిస్తుండగా ఈరోజు నేను వడ్డిస్తాను మీరు కూర్చొండి అంటాడు రిషి. దేవయాని వద్దు రిషి అని వారిస్తున్నా పర్వాలేదన వడ్డిస్తాడు రిషి. వసుధారకి కొసరి కొసరి పెడతాడు రిషి. అరేయ్ మేము కూడా ఉన్నాంరా ఇక్కడ అని గౌతమ్ అంటాడు. నువ్వుంటావ్ లేరా.. పాపం వసుధార రూమ్ లో ఏం వండుకుంటుందో.. ఏం తింటుందో అన్న స్పృహ నీకుందా అంటాడు. దీంతో ఊరుకుంటాడు గౌతమ్. ఆ తర్వాత అందరికీ వడ్డిస్తాడు రిషి. ఇదంతా చూసిన దేవయాని కోపంతో కుళ్లుకుంటుంది. కానీ ఇంట్లో అందరూ సంతోషపడతారు.

  అన్నీ క్లియర్ అవ్వాలంటే అన్నీ తినాలి..

  అన్నీ క్లియర్ అవ్వాలంటే అన్నీ తినాలి..

  అయితే జగతికి రిషి వడ్డించడులే అని అనుకుంటుంది దేవయాని. కానీ రిషి అందరితోపాటు జగతికి కూడా వడ్డిస్తాడు. తను ఎక్కువ తినదు చాలు చాలు అని మహేంద్ర అంటే.. తిననివ్వండి డాడ్.. హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవ్వాలంటే అన్నీ తినాలి. తృప్తిగా తినాలి అని రిషి సమాధానం ఇస్తాడు.

  రిషి మాటలు విని దేవయాని కుళ్లుకోవడం చూసి.. ఏమైనా వడ్డించమంటారా మేడమ్.. ఎందుకలా చూస్తున్నారు తినండీ.. అని అంటుంది వసుధార. వడ్డిస్తున్న రిషిని అలానే చూస్తున్న జగతిని చూసి తినండి మేడమ్.. అలా చూస్తున్నారేంటి అంటాడు రిషి. అంతేకాకుండా డైనింగ్ టేబుల్ దగ్గర చాలా సందడి చేస్తాడు. దీంతో దేవయానికి ముద్దు లోపలికి పోదు.

   ఏదైనా పిక్ నిక్ కి వెళ్లొచ్చు కదా..

  ఏదైనా పిక్ నిక్ కి వెళ్లొచ్చు కదా..

  ఆ తర్వాత డాడ్.. మేడమ్ గారితో కలిసి సరదాగా ఏదైనా పిక్ నిక్ కి వెళ్లొచ్చు కదా అని రిషి అంటాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. ఐ మీన్ మనసు ప్రశాంతగా ఉంటుంది అని చెప్పుకొస్తాడు రిషి. దీంతో రిషి.. సూపర్ ఐడియా ఇచ్చాడు వెళ్లండి.. ఎప్పుడు కాలేజీ, ఇల్లేనా అని అంటాడు గౌతమ్. దీంతో వరుసగా ప్లాన్ చేయండి అని వసుధార మరోవైపు వెళ్లిరండి చిన్న మావయ్యా అని ధరణి అనడంతో సరే ప్లాన్ చేద్దాం అంటాడు మహేంద్ర.

  డాడ్ మీ సంతోషమే.. నా సంతోషం. బంధాలు పక్షుల్లా స్వేచ్ఛగా ఎగిరినంతకాలం చాలా బాగుంటాయి. కానీ బంధాలను ఒప్పందాల పేరుతో బంధించనంతవరకే బాగుంటాయి అని షాకిస్తాడు రిషి. దీంతో అన్నీ ఒప్పుకుంటావ్. కానీ గురుదక్షిణ ఒప్పుకోవని అర్థమైంది అనుకుంటాడు మహేంద్ర.

   అందమైన జ్ఞాపకాలు చాలా తక్కువ..

  అందమైన జ్ఞాపకాలు చాలా తక్కువ..

  డాక్టర్ చెప్పినట్టు మనసు ప్రశాంతంగా ఉంచుకునేందుకు ఏం చేయాలో మీరు కూడా ఆలోచించండి అని మళ్లీ రిషి అంటాడు. ఈ క్రమంలోనే బొమ్మల కొలువు గురించి డిస్కషన్ స్టార్ట్ చేస్తారు. నా బాల్యంలో అలాంటి అందమైన జ్ఞాపకాలు చాలా తక్కువ అని బాధపడతాడు రిషి. బొమ్మల కొలువుతో మంచి పని చేస్తున్నాం అంటాడు మహేంద్ర. ఏమంటారు వదినగారు అని మహేంద్ర అంటే.. అన్నీ మీరే డిసైడ్ చేసుకుని నన్ను అడుగుతున్నారెందుకు అనుకుంటుంది దేవయాని.

  ఇంకా చాలా ఉంటాయని దేవయాని అనడంతో మీ చేయి పడనిదే ఏం జరగదు అంటాడు రిషి. దీంతో నవ్వేసి వసుధార ఇంట్లోకొచ్చింది. ఇప్పుడు బొమ్మల కొలువు అంటోంది. ఏదో ఒకటి చేయాల తప్పదు అని అనుకుంటుంది దేవయాని.

  ఎవరినైనా తోడు తీసుకుని వెళ్లు..

  ఎవరినైనా తోడు తీసుకుని వెళ్లు..

  అందరూ బొమ్మల కొలువు కోసం ప్రిపేర్ చేస్తుంటారు. ఇంతలో అందుకు కావాల్సిన వస్తువుల గురించి దేవయాని అడుగుతుంది. ధరణి వెళ్లి తీసుకొస్తా అంటే.. మీరు ఉండండి మేడమ్ నేను వెళ్లి తీసుకొస్తా అని వెళ్తుంది వసుధార. దీంతో వసుధార.. ఎవరినైనా తోడు తీసుకుని వెళ్లు అని రిషి చెబితే.. వెనక్కి వచ్చి.. రిషి చేయి పట్టుకుని ఎవరో ఎందుకు.. మీరే తోడు రండి అని తీసుకెళ్తుంది వసుధార.

  అలా రిషిని వసుధార తీసుకెళ్తే ఎంతో బాగుందని అందరూ అనుకుంటారు. కానీ దేవయాని మాత్రం ఉడికిపోతుంది. తర్వాత వసుధార, రిషి ఇద్దరూ పై రూమ్ కి వెళతారు. ఏంటి అందరిముందు అలా తీసుకొచ్చావ్ అని రిషి అడుగుతాడు. దీంతో నవ్వి ఊరుకుంటుంది వసుధార. ఏంటి నవ్వుతున్నావ్ అని రిషి అంటే కొన్ని సార్లు చిరునవ్వే సమాధానం అని చెబుతుంది వసుధార.

  English summary
  Guppedantha Manasu Serial October 13 2022 Today Full Episode 580
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X