For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Guppedantha Manasu: అత్తగారి హోదాలో జగతి.. వసుధారకు సమస్య తెచ్చిన రిషి నానమ్మ చీర

  |

  రిషి ఇంట్లో బొమ్మల కొలువు కోసం ప్రిపేర్ చేస్తుంటారు. పైన గదిలో రిషితో ఉన్న వసుధార బొమ్మలకు ఏ చీర సెలెక్ట్ చేయాలా అని ఆలోచిస్తుంటే నువ్ ఆ పనిలో ఉండు నేను ఇప్పుడే వస్తానని రిషి అక్కడి నుంచి వెళతాడు. కింద దేవయానితోపాటు గౌతమ్ వీళ్లిద్దరు వెళ్లి చాలా సేపు అయింది. ఇంకా రాలేదు ఏంటని అంటాడు. దీంతో నాకేం తెలుసు అని దేవయాని అంటే మరి వెళ్లి పిలుచుకుని రానా అని అడుగుతాడు గౌతమ్. దీనికి వద్దు అన్నట్గా సైగ చేసి గౌతమ్ ను వెనక్కి రప్పిస్తుంది జగతి. పైన రూమ్ లో రాజా రాణి బొమ్మలతో రిషి, వసుధార కలిసి సెల్ఫీ తీసుకుంటారు. ఈ బొమ్మలు ఎప్పటికీ విడిపోకూడదను అని వసుధార అంటే మన బంధం ఎప్పటికీ విడిపోకూడదు అని మనసులో రిషి అనుకుంటాడు ఇలా ఆసక్తికర కథాకథనంతో సాగుతోన్న గుప్పెడంత మనసు సీరియల్ అక్టోబర్​ 13, 2022 శుక్రవారం నాటి తాజా ఎపిసోడ్​ 581లో ఏం జరిగిందో చదివేసేయండి.

  ఈ బొమ్మలు మన ప్రేమకు ప్రతిరూపాలు..

  ఈ బొమ్మలు మన ప్రేమకు ప్రతిరూపాలు..

  రిషిధార కోసం కింద ఎదురుచూస్తు వీళ్లింకా రాలేదేంటని మహేంద్ర అంటాడు. ఇక్కడే ఉంటే ఏం లాభం వెళ్లి పిలుచుకుని రా అని కోప్పడుతుంది దేవయాని. ఇంతలో రిషిధార ఇద్దరు రానే వస్తారు. మళ్లీ ఆ బొమ్మలు భలే ఉన్నాయి ఇలా ఇవ్వు అని గౌతమ్ అంటే.. నేను ఇవ్వను అని రిషి అంటాడు. ఆ బొమ్మలేంటని దేవయాని అడిగితే నేనే తయారు చేసి ఇచ్చానంటుంది వసుధార. ఆ బొమ్మలతోపాటు ఇద్దరికీ ఫొటో తీస్తాడు గౌతమ్. మీరు కూడా రండి పెద్దమ్మా అని రిషి అంటే మీరు కానివ్వండి అనేస్తుంది దేవయాని. దీంతో దేవయాని తప్ప అందరూ సంతోషపడతారు. గౌతమ్ చేతిలో ఫోన్ లాక్కుని పూజకు టైమ్ అవుతుంది పదండి అని దేవయాని అంటుంది. రాజా రాణి బొమ్మల్ని కొలువులో పెట్టిన రిషి.. ఈ బొమ్మలు మన ప్రేమకు ప్రతిరూపాలు వసుధార అని మనసులో అనుకుంటే.. ఈ బొమ్మల మధ్య మన మధ్య దూరం ఎప్పుడూ ఉండొద్దు సార్ అని వసుధార అనుకుంటుంది. తర్వాత ఎవరికీ వారు కోరికలు కోరుకుంటారు.

  వసుధార ఈ చీర కట్టుకుంటే..

  వసుధార ఈ చీర కట్టుకుంటే..

  ఈ ఇంట్లో నా పెత్తనం సాగాలి. రిషి నా చెప్పు చేతల్లోనే ఉండాలి అని దేవయాని కోరుకుంటే.. పెద్దత్తయ్య ఏం కోరుకున్నారో అది మాత్రం జరగకూడదు అని ధరణి కోరుకుంటుంది. ఈ రిషి గాడి కోపాన్ని తగ్గించు అని గౌతమ్.. వసుధార మనసులో ఉన్న అడ్డుతెర తొలగాలి. తను గొప్ప స్థాయికి వెళ్లాలి అని రిషి కోరుకుంటే.. మా జగతి మేడమ్ ను రిషి సార్ అమ్మా అని పిలవాలి. మచ్చలేని చంద్రుడిలా చూడాలి. ఎప్పుడూ ప్రిన్స్ లా ఉండాలి అని వసుధార కోరుకుంటుంది. ఇంతలో నేను ఇప్పుడే వస్తానంటూ రిషి పైకి వెళతాడు. తర్వాత దేవయానిని కొద్దిసేపు ఆటపట్టిస్తాడు గౌతమ్. ఈ బొమ్మల కొలువు ఎందుకు పెడతారు పెద్దమ్మా అని గౌతమ్ అడుగుతాడు. దేవయాని నసుగుతుంటే.. నేను చెబుతాను అంటూ వసుధార వివరిస్తుంది. ఇంతలో అక్కడికి వచ్చిన రిషి.. మేడమ్ ఇది మా నానమ్మ గారి చీర. ఇంటికొచ్చే కోడలిగా ఈ సందర్భంగా వసుధార ఈ చీర కట్టుకుంటే బాగుంటుంది అని అంటాడు రిషి.

  ఇంటికోడలిగా భూషన్ వంశంలోకి..

  ఇంటికోడలిగా భూషన్ వంశంలోకి..

  ఈ ఒక్క మాటతో అందరి ముఖాలు సంతోషంతో వెలిగిపోతాయి. దేవయానికి మాత్రం పెద్ద షాక్ తగిలినట్లు అవుతుంది. ఈ చీర మీ చేతులుమీదుగా ఇవ్వండి అని జగతితో అంటాడు రిషి. రాబోయే కోడలికి కాబోయే అత్తగారిని అని నాకు అధికారం ఇస్తున్నావా రిషి అనుకుంటుంది జగతి. ఇంతలో నాన్నా రిషి అని దేవయాని పిలవగానే.. ఇవ్వనీయండి పెద్దమ్మా అని ఆ చీర జగతికి చేతికిస్తాడు. దీంతో అసలే అది మా అత్తగారి చీర.. పవిత్రంగా, గౌరవంగా చూసుకోవాలి కదా.. ఉట్టి చీర ఇవ్వకు పసుపు, కుంకుమ అద్ది ఇవ్వు అని దేవయాని అంటుంది. ఈ చీరపై తాంబూలం పెట్టి వసుధారకు సంతోషంగా ఇస్తుంది జగతి. మా అత్తగారి చీరను ఈరోజు నీకిలా బహుమానంగా నా చేతులతో ఇలా ఇవ్వడం నా భాగ్యంగా భావిస్తున్నాను. తీసుకో వసుధార అని అంటుంది జగతి. తర్వాత వెళ్లి ఈ చీర కట్టుకుని వచ్చి బొమ్మల కొలువులో దీపాన్ని వెలిగించు. ఈ ఇంటికోడలిగా భూషన్ వంశంలోకి ఈ రకంగా ఆహ్వానిస్తున్నాం అనుకో అంటుంది దేవయాని. మీ పెదనాన్న ఇక్కడ ఉండి ఉంటే బాగుండేది. ఈ పండుగ రోజుల్లో వెళ్లి వసుధార వాళ్ల పెద్దవాళ్లతో మాట్లాడేవారం కదా.. ఏదో మీటింగ్ ఉందని వెళ్లిపోయారంటుంది దేవయాని. దీంతో ఇప్పుడెందుకు ఇవన్ని.. నువ్వెళ్లమ్మా అని వసుధారతో అంటాడు మహేంద్ర.

  ఎలాంటి మచ్చలేకుండా చూడాలి..

  ఎలాంటి మచ్చలేకుండా చూడాలి..

  వసుధార మాత్రం.. వాగ్ధానం మర్చిపో అన్న మాటలు తలుచుకుంటూ అయిష్టంగా ఆ చీర తీసుకుని గదిలోకి వెళ్తుంది. పైన గదిలోకి వెళ్లి ఆ చీర పక్కన పెట్టేసి ఆలోచనలో పడుతుంది వసుధార. ఇంతలో అక్కడికి జగతి వస్తుంది. ఏంటీ వసుధార ఆలోచిస్తున్నావ్.. చీర కట్టుకో.. అని జగతి అంటుంది. ఈ చీర కట్టుకుంటే సగం ఈ ఇంటికోడలు అయినట్లే కదా.. రిషి సార్ అంటే నాకు ప్రాణమే కానీ, నేను ఇంటి కోడల్ని కావాలంటే దానికి అడ్డంకి మిగిలిపోయింది కదా.. అని వసుధార అంటుంది. ఇప్పుడు అవన్ని ఆలోచించే సమయం కాదు కదా అని జగతి అంటుంది. సమయాన్ని సందర్భాన్ని పక్కనపెట్టి సడలింపులు ఇచ్చుకుంటూ పోతే దాన్ని వ్యక్తిత్వం, జీవితం అనరు. మనం ఒకటి నమ్మినప్పుడు కష్టమైనా నిలబడాలి. మధ్యలోనే ఎలా వదిలేస్తాం అని వసుధార అంటుంది. కొన్నిటిని చూసి చూడనట్లు వెళ్లాలి అని జగతి అంటే.. కొన్నింటిని మాత్రమే కాదు.. అన్నింటినీ కదా..రిషి సార్ ని ఎలాంటి మచ్చలేకుండా చూడాలి అనుకుంటున్నాను. ప్రపంచంలో ఎవరైనా తల్లి గొప్పతనం గురించి అనర్గళంగా మాట్లాడతారు. అలాంటిది రిషి సార్.. అమ్మ అని కూడా పిలవరు అటే నేను తట్టుకోలేను అని వసుధార అంటుంది.

   ఆలోచనలో వసుధార..

  ఆలోచనలో వసుధార..

  ఎందుకింత మొండిపట్టు.. నా మాట విను.. చీర కట్టుకో.. దీన్ని పెద్ద ఇష్యూ చేయొద్దు అని జగతి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇంతలో మహేంద్ర కూడా ఎంట్రీ ఇస్తాడు. దీనికంతటికీ నేనే కారణం కదా.. నా వల్లే కదా అనుకుంటాడు మహేంద్ర. దీంతో నువ్వెళ్లు మహేంద్ర నేను వస్తానంటుంది జగతి. గురుదక్షిణ అడిగాడు కానీ ఈ విషయం ఇంత పెద్దది అవుతుందని మహేంద్ర అప్పుడు అనుకోలేదు కదా.. నా మాట విను.. అని జగతి అంటుంది. దీంతో ఆలోచనలో పడుతుంది వసుధార. తర్వాత వసుధార ఏం చేసిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వచ్చే వరకు ఆగాల్సిందే.

  English summary
  Guppedantha Manasu Serial October 14 2022 Today Full Episode 581
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X