Guppedantha Manasu: వసుధారపై చేయి చేసుకున్న జగతి.. భరించే శక్తి లేదన్న రిషి

రిషి తన నానమ్మ చీరను జగతి చేతులమీదుగా వసుధారకు ఇప్పిస్తాడు. తర్వాత తన గదిలోకి వెళ్లిన వసుధార ఆ చీరను కట్టుకోవాలా వద్దా అని ఆలోచిస్తుంది. వసుధారను ఒప్పించే ప్రయత్నం చేస్తుంది జగతి. ఇంట్లో బొమ్మల కొలువు పెట్టుకున్నాం.. ఇంతకన్నా ఆనందం ఏముంది.. ఈ ఆనందాన్ని చెడగొట్టకు వసుధార ప్లీజ్.. ముందు చీర కట్టుకో తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం అని జగతి అంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన ధరణితో వసుధారకు సహాయం చేయి అని వెళ్లిపోతుంది జగతి.

ఈ చీరలో నువ్ చాలా అందంగా ఉంటావ్ వసుధార అని ధరణి అంటుంది. మరోవైపు కింద పూజ ఎప్పుడు అవుతుంది పెద్దమ్మా ఆకలేస్తోంది అని గౌతమ్ అంటాడు. ఇలా ఆసక్తికర కథా కథనంతో సాగుతోన్న గుప్పెడంత మనసు సీరియల్ అక్టోబర్​ 15, 2022 శనివారం నాటి తాజా ఎపిసోడ్​ 582లో ఏం జరిగిందో చదివేసేయండి.

చీర కట్టుకునే అర్హత కేవలం ధరణికి మాత్రమే ఉంది..

చీర కట్టుకునే అర్హత కేవలం ధరణికి మాత్రమే ఉంది..

ఆకలేస్తుంది అన్న గౌతమ్ తో అంతా అయినట్టే.. వసుధార కిందకు వచ్చి కలశానికి నమస్కరించి హారతిస్తే పూజ అయిపోయినట్లే అంటుంది దేవయాని. అంటే కాసేపట్లో పూజ అయిపోతుందన్న మాట అని గౌతమ్ అంటుండగా కిందకు జగతి వస్తుంది. ఏమైంది.. వసుధార రాలేదేంటని దేవయాని అడగితుంది.

అందుకు వచ్చేస్తుంది అక్కయ్యా అని జగతి రిప్లై ఇస్తుంది. ఇంతలో మెట్లపై నుంచి దిగుతున్న ధరణిని చూసి షాక్ కు గురవుతారు. వసుధార కట్టుకోవాల్సిన చీరను ధరణి కట్టుకుందేంటని అంతా ఆశ్చర్యపోతారు. దీంతో ఆ చీర నువ్ ఎందుకు కట్టుకున్నావ్ ధరణి అని కోపంగా అడుగుతుంది దేవయాని. అందుకు నేనే కట్టుకోమన్నాను మేడమ్.. ఈ ఇంటి కోడలిగా చీర కట్టుకునే అర్హత కేవలం ధరణికి మాత్రమే ఉంది అని అంటుంది వసుధార.

దీంతో నేను నీకు ఏం చెప్పాను.. నువ్ ఏం చేస్తున్నావ అని వసుధారపై జగతి కోప్పడుతుంది. ఎందుకు కోప్పడతావ్ జగతి.. రిషి తనకు ఓ మాట చెప్పాడు. ఇంట్లో వాళ్లకైతే ఆ చీర విలువ ఇస్తుంది. పరాయి వాళ్లకు ఆ చీర విలువ ఏం తెలుస్తుంది అని దేవయాని అంటుంది.

వసుధార ఇంకోసారి ఈ ఇంటికి రావొద్దు..

వసుధార ఇంకోసారి ఈ ఇంటికి రావొద్దు..

ఇప్పుడు నాకు అర్థమైంది పెద్దమ్మా. మనం ఒకటి చెప్పాం. అది వాళ్లకు నచ్చకపోతే మనం మన ఆలోచనలు వాళ్లమీద రుద్దలేం కదా అప్పటికి నేను మా నానమ్మ చీర అని చెప్పాను. అయినా సరే విలువ ఇవ్వలేదు అని చెప్పి మౌనంగా ఉండిపోతాడు రిషి. ధరణిని వెళ్లి హారతి ఇవ్వమని చెబుతుంది దేవయాని.

ఇంటి వాళ్లకు మాత్రమే ఇంటి పూజలు చేసే అర్హత ఉంది అని వసుధార వైపు చూస్తూ చెబుతుంది దేవయాని. తర్వాత హారతి తీసుకోమని రిషికి చెబితే అక్కడి నుంచి వెళ్లిపోతాడు. వసుధార నా గదికి రా మాట్లాడాలి అని బాధతో అంటుంది జగతి వెళ్లిపోతుంది. జగతి ఏడుస్తూ ఉంటుంది. అదే సమయంలో అక్కడికి వెళ్తుంది వసుధార. ఇంకోసారి ఈ ఇంటికి రావొద్దు అని చెబుతుంది జగతి.

దీంతో మేడమ్ నేను చెప్పేది వినండి అనడంతో నిన్ను నువ్ సమర్ధించుకోవద్దు.. నువ్ చేయాలి అనుకున్నదే చేశావ్ కదా.. తెలివైన దానివని తెలుసు కానీ మనుషుల జీవితాలతో ఆడుకునే అంత తెలివైన దానివి అని నాకు తెలీదు. నేను అప్పటికీ చెబుతూనే ఉన్నాను. గొడవ చేయొద్దు అని. కేవలం నీ వల్లే అక్కడ రిషి మాట అందరి ముందు పోయింది, నీ వల్లే రిషి తలదించుకున్నాడు. ఒక కన్న తల్లిగా ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఇన్నాళ్ల నుంచి జరిగినదంతా వృథా అయిపోయింది అని జగతి అంటుంది.

నన్ను కొట్టే హక్కు మేడమ్ కి మాత్రమే ఉంది..

నన్ను కొట్టే హక్కు మేడమ్ కి మాత్రమే ఉంది..

దీంతో ఆ చీర కట్టుకుంటే ఇంటి కోడలుగా సగం బాధ్యత వచ్చినట్టే కదా మేడమ్.. గురుదక్షిణ ఒప్పందం తీర్చుకోకుండా నేను ఇప్పుడు ఆ చీర కట్టుకుంటే నేను గురుదక్షిణ నుంచి తొలగిపోయినట్టే కదా.. అని వసుధార అనడంతో కోపంతో వసుధారను కొడుతుంది జగతి. అదే సమయంలో అక్కడికి వచ్చిన రిషి మేడమ్ ఏం చేస్తున్నారు.. వసుధార మీద మీరు చేయి చేసుకోవడం ఏంటి అని అరుస్తాడు.

ఆడపిల్లను కొడతావా ఇదేం పని.. వసుధార మీద చెయి చేసే అర్హత నీకు ఎక్కడిది అంటుంది దేవయాని. దీంతో నన్ను కొట్టే హక్కు మేడమ్ కి మాత్రమే ఉంది అని వసుధార అంటుంది. నేను చేసిన పనికి మేడమ్ కు తప్పని అనిపించిందేమో అందుకే నన్ను కొట్టారు అని చెబుతుంది. విషయం ఏదైనా అవన్ని ఈ ఇంటికి అంటూ కొన్ని గౌరవాలు ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి, ఇలా కొట్టడం కరెక్ట్ కాదు అని దేవయాని అంటుంది.

వసుధార బాధపడితేనే నేను తట్టుకోలేను అలాంటిది తన మీద చేయి పడింది అంటే నేను చూస్తూ ఊరుకుంటానా అని రిషి అంటాడు.

కొడుకుని వదిలేసి వెళ్లిన వాళ్లకు కాదు..

ఇదే అవకాశం అనుకుని మా అత్తగారి చీర కట్టుకోమని రిషి తనకు చెప్పాడు. తను కట్టుకోలేదు. అది తన ఇష్టం. ఈ ఇంటి పిల్ల అవ్వాలని తనకు లేదు. అంత మాత్రానా కొట్టాలా.. ఇంటికి కోడలు అవ్వాలని లేదనుకుంటా అంత మాత్రానా కొట్టలా అంటు మాట్లాడుతుంది దేవయాని. ఇంతలో నన్ను క్షమించు వసుధార అని మహేంద్ర చెబుతాడు.

దీంతో సార్.. మీరెందుకు క్షమాపణ అడుగుతున్నారు. మేడం కొట్టినందుకు నాకు బాధగా ఏం లేదు. కానీ నాకు ఒక విషయం అర్థమైంది సర్. ఇంట్లో ప్రేమలు, బంధాలు ఎక్కువ.. బంధాల కోసం ఆరాటాలు ఎక్కువ అని వసుధార అంటుంటే.. వసుధార నిన్ను.. అని జగతి అంటుంది. జగతి అనేలోపే ఇక చాలు మేడమ్.. అని రిషి దండం పెడతాడు.

ఎవరికైనా భరించే శక్తి కొంతకాలమే ఉంటుంది. నేను అలసిపోయాను. విసిగిపోయాను. ఇవన్నీ మనసు ఉన్న వాళ్లకే తెలుస్తుంది. చిన్నప్పుడే కన్న కొడుకుని వదిలేసి వెళ్లిన వాళ్లకు కాదు అని కోపంతో జగతిని అంటాడు. తర్వాత అక్కడి నుంచి వసుధార చేయి పట్టుకుని తీసుకువెళ్లిపోతాడు రిషి. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే వచ్చే ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే మరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X