For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Guppedantha Manasu: ప్రేమ పంతాల మధ్య రిషిధార.. కలిపేందుకు గౌతమ్.. విడగొట్టే పనిలో దేవయాని

    |

    రిషి వాళ్ల నానమ్మ చీర ఎందుకు కట్టుకోలేదనే డిస్కషన్ రిషి, వసుధార మధ్య జరగుతుంది. ఈ క్రమంలోనే జగతి మేడమ్, నేను మా ఇద్దరిలో నీకు ఎవరంటే ఇష్టం అని వసుధారను అడుగుతాడు రిషి. జగతి మేడమ్ నాకు ఇష్టం సార్.. కానీ మీరే నా జీవితం. నా జీవితమంతా మీతో కొనసాగాలనుకుంటున్నాను, అలాంటప్పుడు మీరు నేను వేర్వేరు ఎందుకు అవుతాం సార్ అని అంటుంది వసుధార. అన్ని విషయాల్లో సరిగ్గానే ఉంటావు.

    కానీ ఈ ఒక్క విషయం దగ్గర ఎందుకు ఆగిపోతావ్ వసుధార. నువ్ ఆ గురుదక్షిణ ఒప్పందం తీసుకోవడం నాకు ఇష్టం లేదు. మానేయొచ్చు కదా అని రిషి అంటే మీరే తగ్గొచ్చు కదా అని వసుధార అంటుంది. ఇలా ఆసక్తికర కథా కథనంతో సాగుతోన్న గుప్పెడంత మనసు సీరియల్ అక్టోబర్​ 18, 2022 మంగళవారం నాటి తాజా ఎపిసోడ్​ 584లో ఏం జరిగిందో చదివేసేయండి.

    నువ్ మారవని అర్థమైంది..

    నువ్ మారవని అర్థమైంది..

    నువ్ ఇంకా తగ్గవా వసుధార, నువ్ మారతావ్ అనుకోవడం నా తప్పు. నువ్వు ఇలాగే ఉంటే మన జీవితంలో మనిద్దరం కలిసి ప్రయాణం చేయలేం అని రిషి షాక్ ఇస్తాడు. నేనేం తప్పు చేయడం లేదు సార్.. ఇంత మాట ఎలా అంటారని వసుధార సమాధానమిస్తుంది. అందుకు నువ్వే అనిపిస్తున్నావ్.. ఇద్దరి మనుషుల మధ్య అభిప్రాయ బేధాలు వస్తాయి. కానీ ఎక్కడో చోట పరిష్కారం దొరుకుతుంది.

    నాతో బలవంతంగా చేయిస్తున్నావ్ అని రిషి అంటాడు. నేను మానేయలేను సార్.. నేను నా మాట మీద నిలబడాలి అనుకుంటున్నాను. కావాలంటే మీరే తగ్గొచ్చు కదా.. జగతి మేడమ్ ని అమ్మా అని పిలవచ్చు కదా.. అలా పిలిచినంత మాత్రానా మీకు తగ్గేదేముందు.

    నాకు లాభమేముంది చెప్పండి. మీరైనా ఆలోచించాలి కదా అని వసుధార చెబుతుంది. నువ్ మారవని అర్థమైందని అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు రిషి. మరోవైపు జగతి మహేంద్ర, జరిగిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడతారు. రిషి వచ్చాడా అని మహేంద్ర అడిగితే జగతి రాలేదని చెబుతుంది.

    గూఢచారిగా ఉండటానికి ఎంత ఇస్తున్నారు..

    గూఢచారిగా ఉండటానికి ఎంత ఇస్తున్నారు..

    ఇంతలో వాళ్ల దగ్గరికి ధరణి వస్తుంది. రిషి ఏమైనా చెప్పాడా.. అని అడిగితే లేదు చిన్న అత్తయ్య. కానీ, ఈ మధ్య దేవయాని అత్తయ్య ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఈ మధ్య చాలా ప్రశాంతంగా, ఎప్పుడూ ఉండేదానికి విరుద్ధంగా ఉంటున్నారు అని చెబుతుంది ధరణి. దీంతో అక్కయ్య ఏదో ప్లాన్ చేస్తున్నారు, అందుకే అలా ఉన్నారు అని జగతి, మహేంద్ర అనుకుంటారు.

    అప్పుడు రిషి ఈరోజు ఇంటికి రానన్నాడట పెద్ద అత్తయ్యకి పోన్ చేశాడని చెబుతుంది ధరణి. దీంతో రిషి ఎంత లేట్ గా వస్తే అంత ప్రశాంతంగా ఉంటాడు అంటుంది జగతి. మరోవైపు రిషి కాలేజ్ కి వెళ్లేసరికి అక్కడ గౌతమ్ ఉంటాడు.

    అక్కడ గౌతమ్ ని చూసిన రిషి.. నీకు ఎంత ఇస్తున్నారు నాకు గూఢచారిగా ఉండటానికి అని అంటాడు. దీంతో ఎప్పుడు ఇలా తల తిక్కగానే మాట్లాడతావా, నేను నీకోసం వచ్చాను అని చెబుతాడు గౌతమ్.

    తప్పుగా అర్థం చేసుకుంటున్నారు..

    తప్పుగా అర్థం చేసుకుంటున్నారు..

    నేను ఎవరి జీవితాల్లోకి దూరకుండా హాయిగా నా కాలేజీ నడుపుకుంటూ, నా గతం గురించి ఆలోచించుకుంటూ సాఫీగా గడుపుతున్నాను. అలాంటి నా జీవితంలోకి ముందు సాక్షి వచ్చింది. జగతి మేడమ్ వచ్చారు. ఆ తర్వాత.. వసుధార వచ్చింది. అప్పుడే ఈ ప్రేమ ఇవన్నీ వచ్చాయి. నేను జీవితంలో ఏదైనా కావాలని కోరుకోలేదు.. అన్నీ నాకు ఇష్టం లేకుండా వచ్చి వెంటనే వెళ్లిపోయినవే.. ఇప్పుడు ఇది కూడా అలాగే జరుగుతుంది.

    అసలు నేను ఏమైనా కావాలని చేశానా ఎందుకు నాకు ఇష్టమైన వాళ్లు నాకు దూరం అవుతున్నారని అంటాడు రిషి. దీంతో సర్లేరా ముందు ఇంటికి బయలుదేరుదాం రా.. అని గౌతమ్ అంటాడు. నేను ఇంటికి రాను అని చెప్పానురా.. నేను ఇక్కడే ఉంటాను అని రిషి సమాధానం ఇస్తాడు. అయితే నేను ఇక్కడే ఉంటాను అని గౌతమ్ అంటాడు.

    ఇలాగే అక్కడే ఉంటారు వారిద్దరు. మరోవైపు ఫోన్ లో రిషి ఫొటో చూసుకుంటూ మాట్లాడుతుంది వసుధార. ఎందుకు నన్ను ఎప్పుడూ తప్పుగా అర్థం చేసుకుంటున్నారు మిమ్మల్ని మచ్చలేని మనిషిగా చూడాలనుకుంటున్నాను. ఆ ఒక్క విషయంలోనే ఎందుకు అలా ఉన్నారు అని రిషికి కాల్ చేస్తుంది వసుధార. కానీ ఫోన్ లిఫ్ట్ చేయడు రిషి.

    నిల్చున్నది చాలు అలసిపోతావ్..

    నిల్చున్నది చాలు అలసిపోతావ్..

    రెండోసారి కాల్ చేయడంతో జగతి లిఫ్ట్ చేస్తుంది. రిషి సార్ వచ్చారా అని అడిగితే.. రాలేదని సమాధానం ఇస్తుంది జగతి. ఇంతలో మహేంద్ర ఫోన్ లాక్కుని.. ఎక్కడున్నాడో నీకు తెలుసా.. అని అడిగేతే.. నాకు తెలియదు సార్ అని చెబుతుంది వసుధార. ేకట్ చేస్తే కాలేజీలో తన క్యాబిన్ లో రిషి ఉంటాడు.

    గౌతమ్ అక్కడికి వచ్చి.. టైమ్ అవుతుంది రా.. లంచ్ చేద్దామని క్యారేజ్ తీస్తాడు. అప్పడు రిషి, గౌతమ్ ఇద్దరు తింటూ, ఇది ఇంటి భోజనంలా ఉందే అని రిషి అడుగుతాడు. లేదురా.. కొత్తగా హోటల్ పెట్టాడు. అందులో నుంచి తెప్పించాను అని గౌతమ్ అంటాడు. అప్పుడు ఇంకో ముద్ద తిన్న రిషి.. నిజంగా.. ఇది హోటల్ దేనా.. అని అంటే.. అవునురా బాబు.. భోజనం బాగున్నప్పుడు ఎక్కడిదైతే నీకెందుకు అని గౌతమ్ అంటాడు.

    ఇంకొంచెం తిన్న తర్వాత.. నిల్చున్నది చాలు అలసిపోతావ్.. లోపలికి రా.. అని రిషి అంటాడు. లేదురా.. నేను కూర్చొనే ఉన్నాను.. అని గౌతమ్ అంటాడు. దీనికి నేను చెబుతుంది నీకు కాదు.. వసుధారకు అని అంటాడు రిషి. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

    English summary
    Guppedantha Manasu Serial October 18 2022 Today Full Episode 584
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X