For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Guppedantha Manasu: అందరి తిక్క కుదురుస్తానన్న వసుధార.. కన్నింగ్ ప్లాన్ తో దేవయాని..

  |

  తన క్యాబిన్ లో గౌతమ్ తో కలిసి లంచ్ చేస్తుంటాడు రిషి. అప్పుడు ఎక్కువ సేపు నిల్చుంటే కాళ్లు నొప్పి పెడతాయి లోపలికి రా అని వసుధారను పిలుస్తాడు. దీంతో వసుధార లోపలికి వస్తుంది. ఇక్కడ ఏం చేస్తున్నావ్.. ఇక్కడ కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా అంటాడు రిషి. తర్వాత టేస్ట్ చూసి ఇంటి భోజనానికి, హోటల్ భోజనానికి తేడా ఆ మాత్రం చెప్పలేనా అంటాడు రిషి. తర్వాత నువ్వెందుకు వచ్చినట్టు అని రిషి అంటే.. వెళ్లమంటారా అని వసుధార అంటుంది.

  దీంతో గౌతమ్ ని తోడుగా తీసుకెళ్లు అంటాడు రిషి. ఉండమనొచ్చు కదా అని వసుధార మనసులో అనుకోగానే.. భోజనం చేసి వెళ్లు అంటాడు రిషి. అటువైపు ప్రేమ.. ప్రేమ.. అంటూ వెటకారంగా పాటలు పాడతాడు గౌతమ్. ఇలా ఆసక్తికర కథా కథనంతో సాగుతోన్న గుప్పెడంత మనసు సీరియల్ అక్టోబర్​ 19, 2022 మంగళవారం నాటి తాజా ఎపిసోడ్​ 585లో ఏం జరిగిందో చదివేసేయండి.

  దేవయానిని చూసి షాక్ అయిన వసుధార..

  దేవయానిని చూసి షాక్ అయిన వసుధార..

  తర్వాత ఇంటికి వెళ్తుంది వసుధార. అక్కడ ఉండి ఏంటీ రిషి సార్.. ఇలాగే మీరు ఆఫీసులో ఉంటే ఇంట్లో మేడమ్, సార్ బాధపడతారు కదా. మిమ్మల్ని ఇంటికి తీసుకెళతాను అనుకుంటూ తలుపు తీసేలోగా అక్కడ దేవయాని ఉంటుంది. దేవయానిని చూసి షాక్ అవుతుంది వసుధార. ఇక్కడికి ఎందుకు వచ్చారు మేడమ్ అని అడుగుతుంది.

  అయినా నేను ఇక్కడికి రాకూడదా.. వచ్చినందుకు మర్యాదలు చేయక్కర్లేదు నువ్వు. అన్ని సర్దుకుని ఇంటికి పదా ఎలాగు కాబోయే కోడలివి కదా అని దేవయాని అంటుంది. ఈవిడ ఏదో కొత్త ప్లాన్ తో వచ్చినట్టుంది.. ఏం మాట్లాడిని తిరిగి బెడిసి కొడుతుంది. ఏం మాట్లాడకుండా ఉండాలి అని వసుధార అనుకుంటుంది. తర్వాత మనకెందుకు వసుధార ఈ గురుదక్షిణ ఒప్పందాలు వంటివి. హాయిగా నువ్ రిషి ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోకుండా ఎందుకుంటావ్ పక్క వాళ్ల గురించి ఆలోచించుకుంటూ నీ సంతోషాన్ని నువ్వు దూరం చేసుకుంటున్నావ్. నేను బయట వెయిట్ చేస్తాను అన్ని సర్దుకుని వచ్చేయి అని అంటుంది దేవయాని.

  పెద్దరికం పక్కన పెట్టి..

  పెద్దరికం పక్కన పెట్టి..

  ఇక్కడ కట్ చేస్తే రిషి, గౌతమ్ ఇద్దరు బ్యాడ్మింటన్ ఆడుకుంటూ ఉంటారు. ఇంతలో రిషికి వసుధార నుంచి ఫోన్ వస్తుంది. సార్ దేవయాని మేడమ్ ఇక్కడికి వచ్చారు. త్వరగా రండి.. అని అంటే రిషి అప్పటికప్పుడే బయలుదేరతాడు. దారిలో పెద్దమ్మా అక్కడికి ఎందుకు వెళ్లింది.. అని అనుకుని దేవయానికి ఫోన్ చేస్తాడు. అప్పుడు నాకు తెలుసు రిషికి, వసుధార కాల్ చేసి చెబుతుందని. నాకు అదే కావాలి అప్పుడే కదా నా ప్లాన్ అమలు అవుతుంది. ఇక్కడికి వచ్చి నీతో మాట్లాడాలంటే ఇప్పుడు నీ ఫోన్ ఎత్తకూడదు అని కాల్ కట్ చేస్తుంది దేవయాని. ఇంట్లో ఉన్నవసుధార కంగారుపడుతూ జగతి మేడమ్ కి విషయం చెబుదామా అనుకుని వద్దు మళ్లీ వాళ్లను బాధపెట్టడం ఎందుకు.. రిషి సార్ ఉన్నారు కదా చూసుకుంటారు అని అనుకుంటుంది వసుధార.

  ఇంతలో రిషి అక్కడికి వస్తాడు. ఏమైంది పెద్దమ్మా ఇక్కడికి ఎందుకు వచ్చారని అడుగుతాడు. వసుధారను ఇంటి కోడలిగా దుస్తులన్ని సర్దుకుని ఇంటికి రమ్మన్నాను కానీ తను రావడం లేదు. నా పెద్దరికం పక్కన పెట్టి గురుదక్షిణ ఒప్పందం వదులుకోమ్మని తన నిర్ణయం మార్పిద్దామని వచ్చాను అని దేవయాని చెబుతుంది.

  ఊరు బయట ఎందుకు మాట్లాడటం..

  ఊరు బయట ఎందుకు మాట్లాడటం..

  దీంతో రిషి.. అలా చేయకూడదు పెద్దమ్మా. ఎవరి నిర్ణయాలు వాళ్లకి ఉంటాయి. వాళ్లంతట వాళ్లే మార్చుకోవాలి. మన బలవంతంపై వాళ్లు మార్చుకుంటే తర్వాత ఎప్పటికైనా అది సమస్య అవుతుంది అంటాడు. అవును మేడమ్.. మన నిర్ణయాలు ఇంకొకరి మీద రుద్దకూడదు. మారాలనుకుంటే వాళ్లే మారతారు. దాని కోసం మీరంతా కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు నాకోసం, రిషి సార్ కోసం ఇంత ఆలోచిస్తున్నారు అదే చాలు.

  నేను ఎప్పటికైనా మీ ఇంటికి రావాల్సిన దాన్నే కదా. నాకు రిషి సార్ కి మధ్య ఈ చిన్న ఒప్పందం తప్ప ఇంకేం అపార్థాలు లేవు. మేము బాగానే ఉన్నాం అని వసుధార అంటుంది. దీంతో దేవయాని ఏదో చెప్పబోతుండగా.. పెద్దమ్మా ఇప్పుడు మాటలన్నీ ఊరు బయట ఎందుకు మాట్లాడటం ఎందుకు అని రిషి అంటాడు. ఇంతలో పక్కింటి ఆవిడ వచ్చి ఏం వసుధార బయట మాట్లాడుతున్నారు. ఏమైనా గొడవ అని అంటుంది. దీంతో ఏం లేదు మా ఇంటి వ్యవహారామే అని బదులిస్తుంది వసుధార. మరి బయట ఎందుకు మాట్లాడుకోవడం, ఇంట్లోకి వెళ్లి మాట్లాడుకోవచ్చు కదా అని ఆమె అనడంతో భలే చెప్పారు అని వసుధార అంటుంది.

  కారులో దేవయాని ఏడుపు..

  అప్పుడు వసుధార మెల్లిగా వెళ్లి దేవయాని చెవిలో మీరేం భయపడొద్దు మేడమ్.. నేను ఆ ఇంటికి వస్తాను.. అందరి తిక్క కుదురుస్తాను అని చెబుతుంది. నేను ఇంటికి రమ్మని చెబుతున్నాను కదా. ఏంటి తెలివిగా మాట్లాడుతున్నావా అని అంటుంది దేవయాని. మీరే అన్నారు కదా మేడమ్ నేను తెలివైనా దాన్ని అని వసుధార అంటుంది.

  ఇంతలో ఇప్పుడు రోడ్డు మీద మీరేం మాట్లాడుకోవద్దు ఇంటికి వెళదాం పదండి పెద్దమ్మా అని దేవయానిని అక్కడి నుంచి తీసుకెళ్తాడు రిషి. కారులో వెళ్తుండగా.. దేవయాని ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నారు అని రిషి అడిగితే.. నా పెద్దరికం పక్కన పెట్టి వసుధారను ఒప్పిద్దామనుకున్నా. మీ అమ్మానాన్నలకు నీ మీద బాధ్యత ఎలాగు లేదు. నేనే ఆ బాధ్యత తీసుకుని మాట్లాడుదాం అనుకుంటే వసుధార నా పెద్దరికం కూడా పట్టించుకోలేదు అని చెబుతుంది. అందుకు రిషి.. వసుధారని ఎలా మార్చాలో నాకు తెలుసు పెద్దమ్మా.. మీరు మా గురించి ఏం కంగారు పడొద్దు. వసుధారకి జగతి మేడమ్ పై ఉన్న కృతజ్ఞతా భావం కన్నా నా మీద ఉన్న ప్రేమే ఎక్కువ అని అంటాడు.

  English summary
  Guppedantha Manasu Serial October 19 2022 Today Full Episode 585
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X