Guppedantha Manasu: రిషి ముందు దేవయాని దొంగ ఏడుపు.. కొడుకు కోసం తలవంచిన మహేంద్ర

ప్రాజెక్ట్ మీటింగ్ తర్వాత రెస్టారెంట్లో కూర్చుని వసుధార కోసం రిషి ఎదురుచూస్తుంటాడు. కాఫీ ఆర్డర్ ఇచ్చి ఇంతసేపు అయింది. ఇంకా రాలేదు. ఈ వసుధార కావలని లేట్ చేస్తుందా.. అని రిషి మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత వసుధార కాఫీ తీసుకొచ్చి రిషికి ఇస్తే కూర్చొమని చెబుతాడు. కాఫీని కప్పులో పోసి షేర్ చేసి వసుధారకి ఇస్తాడు. మానేయవచ్చు కదా అని వసుధారను అడుగుతాడు రిషి. కాఫీనా సర్.. అని వసుధార అంటే.. కాదు, కాఫీలు అందించే ఉద్యోగం.

మినిస్టర్ గారు ఏమన్నారో విన్నావ్ కదా.. నువ్ సివిల్స్ రాస్తే కచ్చితంగా పాస్ అవుతావు అని రిషి అంటాడు. తర్వాత వసుధార ఏం చెబుతుంది.. ఇలా ఆసక్తికర కథాకథనంతో సాగుతోన్న గుప్పెడంత మనసు సీరియల్ అక్టోబర్​ 2, 2022 సోమవారం నాటి తాజా ఎపిసోడ్​ 570లో ఏం జరిగిందో చదివేసేయండి.

నాకు ఒక లక్ష్యం ఉంది..

నాకు ఒక లక్ష్యం ఉంది..

సివిల్స్ గురించి వసుధారను రిషి అడగడంతో.. సివిల్స్ గొప్పదే.. కాదు అనను.. కానీ, మొదటి నుంచి నాకు ఒక లక్ష్యం ఉంది. డాక్టర్, లాయర్, కలెక్టర్ వీళ్లందరిని తయారు చేసేది టీచర్. అందుకే నాకు టీచర్ వృత్తి అంటే గౌరవం. మిగిలిన సివిల్స్ కి ఉండే గౌరవం వాటికి ఉంటుంది. కానీ నాకు పాఠాలు చెప్పడం అంటే ఇష్టం. నేను పంతులమ్మను అవుతాను సార్ అని వసుధార సమాధానం చెబుతుంది.

మధ్యలో మన జీవిత లక్ష్యాలు మార్చుకోవచ్చు అందులో ఏముంది అని రిషి అంటే.. సార్ నేను ఒక వృత్తిని ప్రేమించాను. దాన్నిమార్చుకోను. అలాగే నేను ఒక వ్యక్తిని కూడా ప్రేమించాను. అది మారదు. ఈ వసుధార ఎప్పటికీ ఒకేలాగా ఉంటుంది అని వసుధార అంటుంది. బాగుంది అని రిషి అంటే ఏంటీ సార్ అని వసుధార అడుగుతుంది. ఇదే కాఫీ అంటూ లేచి.. ఇందాక నువ్ అన్నావ్ చూడు ఏది మార్చుకోను అని కానీ, జీవితం అన్నాక కొన్ని మార్చుకోవాలి అని రిషి అంటాడు. అభిప్రాయాలు మార్చుకోనక్కర్లేదు. కొన్ని ఆలోచనలు మార్చుకోవాలి అంటున్నా అని రిషి అంటాడు.

మార్చుకోకూడదు అనుకున్నా..

మార్చుకోకూడదు అనుకున్నా..

కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడే మార్చుకోకూడదు అనుకున్నా సర్.. దాన్ని ఎలా మార్చగలం అని వసుధార అనడంతో నువ్వు మొండిదానివి వసుధార అని రిషి అంటాడు. దీనికి మంచిదాన్ని కూడా సర్ అని వసుధార అంటుంది. జగతి మేడమ్ విషయంలో వసుధార మనసు మారదు అని రిషి మనసులో అనుకుంటే.. జగతి మేడమ్ ని రిషి సార్ అమ్మా అని పిలవరా, నన్ను మొండిదాన్ని అంటారు కానీ నిజానికి రిషి సార్ మొండిఘటం అని వసుధార కూడా మనసులో అనుకుంటుంది.

రేపు కాలేజీకి వస్తున్నావా అని రిషి అడిగితే ఆత్రంగా రమ్మంటారా అని వసుధార అంటుంది. తర్వాత రిషి బై చెప్పి వెళ్తాడు. ఏంటో రిషి సార్ ప్రతిదానికి అలుగుతారు. రమ్మని అడగొచ్చు కదా.. ఆ మాత్రం స్వతంత్రం లేదా అని వసుధార మనసులో అనుకుంటే మీరు రమ్మంటే వస్తాను సార్ అని అనొచ్చు కదా అని రిషి అనుకుంటాడు.

దేవయాని నాటకం..

దేవయాని నాటకం..

ఇంట్లోకి రిషి రావడం చూసిన దేవయాని నాటకం మొదలుపెడుతుంది. ఏంటీ ధరణి.. మహేంద్ర, జగతి ఇంకా భోజనానికి రాలేదా నా మీద అలిగారా ఏంటి అని దేవయాని అడుగుతుంది. అది విన్న రిషి వెనక్కి వచ్చి ఏంటి పెద్దమ్మా మీ మీద అలగడం ఏంటి అని అడుగుతాడు రిషి. ఈ ఇంటి పెద్దదానిగా మాట అంటాను దానికి సమాధానం ఇవ్వాలి అంతే కానీ నా గుండె ముక్కలు అయ్యేలా మాట్లాడితే బాధగా ఉంటుంది కదా అని ఏడుస్తుంది.

అదంతా మహేంద్ర చూస్తూ ఉంటాడు. వసుధార కాలేజీకి వచ్చిందంట కదా.. ఎందుకు వచ్చిందని అడిగాను దానికి మహేంద్ర ఏమన్నాడే తెలుసా అంటే వదినగారు ఎందుకు ఏడుస్తున్నారని మహేంద్ర అంటాడు. నీ గురించి వసుధార గురించి అడుగుతుంటే నా కొడుకు గురించి నీకు ఎందుకు అన్నారని ఏడుస్తూ చెబుతుంది దేవయాని. దీంతో రిషి సీరియస్ అవుతాడు. ఇక్కడ పెద్ద సీన్ క్రియేట్ చేస్తుంది దేవయాని. అసలు ఏం జరిగిందో తెలుసుకో అని మహేంద్ర చెబుతుంటే రిషి మాత్రం వినకపోయేసరికి జగతి ఆపుతుంది.

డాడ్ ని కంట్రోల్ చేస్తున్నారా..

డాడ్ ని కంట్రోల్ చేస్తున్నారా..

ఏంటీ మేడమ్ డాడ్ చెబుతుంటే మీరు ఆపుతున్నారా.. డాడ్ ని కంట్రోల్ చేస్తున్నారా అని అంటాడు. తర్వాత పెద్దమ్మకి సారీ చేప్పమమని మహేంద్రతో రిషి అంటాడు. పెద్దమ్మకి మన ఇంట్లో ఇంతపెద్ద అవమానం జరుగుతుందని నేను అనుకోలేదు. ఒక్క మాట సారీ చెప్పండి. ఇంకేమి అడగను అని చెబుతాడు రిషి.

కానీ నేనేమి తప్పు చేయలేదని మహేంద్ర అనడంతో అన్నం తినకుండా రిషి సీరియస్ గా వెళ్తూ జరిగిన దానికి నేను సారీ చెబుతున్నా పెద్దమ్మ అనేసి వెళ్లిపోతాడు. దీంతో కోపంగా సారీ వదినగారు అని మహేంద్ర చెబుతాడు. నా కొడుకు కోసం ఎన్ని మెట్లు అయినా దిగుతాను. ఎన్ని సారీలు అయినా చెబుతాను. వాడని పిలవండి. నా కొడుకు ఆకలిగా వెళ్లడం నాకు ఇష్టం లేదు పిలవండి వాడిని అని బతిమిలాడతాడు. తర్వాత దేవయాని వెళ్లి రిషిని భోజనానికి తీసుకొచ్చి కూర్చోబెడుతుంది.

రగిలిపోయిన దేవయాని..

రగిలిపోయిన దేవయాని..

మహేంద్ర మాత్రం తికుండా వెళ్తుంటే రిషి చేయి పట్టుకుని ఆపి నా మీద కోపం వచ్చిందా డాడ్ మీరు తినకుండా వెళ్తే నేను ఎలా తింటాను డాడ్ అని రిషి అంటాడు. ఆ తర్వాత జగతిని కూడా కూర్చోమని చెబుతాడు. పెద్దమ్మ విషయంలో నేనేమైనా కఠినంగా మాట్లాడితే నన్ను క్షమించండి డాడ్. పెద్దమ్మ బాధపడితే నేను చూస్తూ ఉండలేను అని రిషి అంటాడు.

మహేంద్ర మాత్రం చాలా బాధపడిపోతాడు.. అప్పుడే వసుధార గురించి దేవయాని మాట్లాడుతుంటే రిషికి కాల్ వస్తుంది. ఆ తర్వాత వసుధార గురించి పొగుడుతూ రిషి ఉంటే అది విని దేవయాని రగిలిపోతుంది. ఆ తర్వాత వసుధార, రిషి ఇద్దరూ తమ ఫోన్లలో ఫొటోలు చూసుకుంటూ మురిసిపోతారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X