twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Guppedantha Manasu: రిషి ముందు మహేంద్ర-జగతిలను ఇరికించిన దేవయాని.. గౌతమ్ తో వసు ప్లాన్!

    |

    వసుధారతో మాట్లాడిన తర్వాత కారులో వెళ్తారు రిషి, దేవయాని. అలా కారులో వెళ్తుండగా ఏడుస్తూ డ్రామా ప్లే చేస్తుంది దేవయాని. దీంతో వసుధారను ఎలా మార్చాలో నాకు తెలుసు. జగతి మేడమ్ పై ఉన్న కృతజ్ఞత కంటే నాపై ప్రేమే ఎక్కువ. నా ప్రేమే గెలుస్తుంది. మీరు బాధపడకండి అని రిషి అంటాడు. నాకైతే నమ్మకం లేదంటూ దొంగ ఏడుపు మళ్లీ ఏడుస్తుంది దేవయాని. ఈ ఒక్క విషయం తప్పా.. మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు.

    వసుధార ఎప్పటికైనా మనింటి కోడలు అవుతుంది పెద్దమ్మా.. మీరు మనసుని కష్టపెట్టుకుని ఇలాంటి ప్రయత్నాలు చేయకండి అంటాడు రిషి. వసుధార గురించి నేను ఇంత ధీమాగా ఆలోచిస్తున్నాను. వసుధార కూడా ఇలాగే ఆలోచిస్తుందా అని అనుకుంటాడు రిషి. ఇలా ఆసక్తికర కథా కథనంతో సాగుతోన్న గుప్పెడంత మనసు సీరియల్ అక్టోబర్​ 20, 2022 గురువారం నాటి తాజా ఎపిసోడ్​ 586లో ఏం జరిగిందో చదివేసేయండి.

    పట్టువిడుపు ఉండాలి కదా..

    పట్టువిడుపు ఉండాలి కదా..

    కాలేజీకి వెళ్లిన మహేంద్ర, జగతి కలిసి రిషి కోసం ఆరా తీస్తారు. ఇంతలో వసుధార రావడంతో ఏం జరిగిందని అడుగుతారు. దేవయాని రావడం, ఆమెను రిషి వచ్చి తీసుకెళ్లడం అంతా చెబుతుంది వసుధార. వదినగారు ఎంత కూల్ గా చెబుతారో అంత ప్రమాదకరం నీకు అర్థం కావడం లేదంటాడు మహేంద్ర. నీకు అక్కయ్య సంగతి తెలియదు. 20 ఏళ్లకుపైగా తన మనస్తత్వాన్ని చూస్తున్నాను.

    ఎప్పుడూ మన అంచనాలకు ఓ అడుగు పైనే ఉంటారు. అయినా గురుదక్షిణ ఒప్పందం విషయంలో దేవయాని అక్కయ్యతో కూడా చెప్పించుకుంటున్నావా. జీవితం అన్నాక పట్టువిడుపు ఉండాలి కదా అని జగతి చెబుతుంది. నేను నమ్మినదాన్ని పాటించి తీరుతాను అని వసుధార అంటుంది. ఏంటీ నీ నమ్మకం.. గురుదక్షిణ విషయం వదిలేయవా.. ఎన్నోసార్లు ఈ విషయం చెబుతూనే ఉన్నాను. అయినా పట్టించుకోవడం లేదు. జీవితాంతం బాధ పడతావ్ అని జగతి అంటే.. లేదు మేడమ్.. జీవితాంతం మీరు ఆనందంగా ఉంటారు అని వసుధార సమాధానం ఇస్తుంది. దీంతో కోపంగా వెళ్లిపోతుంది జగతి.

    జగతి, మహేంద్రకు నీపై శ్రద్ధ లేదు..

    జగతి, మహేంద్రకు నీపై శ్రద్ధ లేదు..

    తర్వాత గౌతమ్ తో.. రిషి సార్ ఫ్రెండ్ గా నాకు హెల్ప్ చేయాలి అని అంటుంది వసుధార. రిషి ఓ మాట అంటే వెనక్కి తీసుకోడు. వాడి మనసుకు చిన్నప్పటి నుంచి అయిన గాయాన్ని ఒక్కసారిగా మారాలంటే ఇబ్బందే కదా.. నేను ప్రయత్నిస్తున్నాను కానీ, ఆ టాపిక్ వాడితో మాట్లాడాలంటేనే భయంగా ఉంది. ఈ విషయంలో ఇద్దరూ మొండిగా ఉంటే మీ బంధానికి ఇబ్బంది అవుతుంది చూసుకో అని గౌతమ్ అంటాడు.

    నేను అనుకున్నది సాధిస్తాను అని వసుధార అంటుంది. బలమైన బంధాలతో పాటు బలమైన పంతాలున్నాయి ఇద్దరికీ.. అనేసి కాల్ వస్తే మాట్లాడేందుకు వెళ్లిపోతాడు గౌతమ్. గురుదక్షిణ అడగకుండే బాగుండు అని మహేంద్ర బాధపడతాడు. లేదు సార్.. నమ్మకంగా ఉండండి అంటుంది వసుధార. కట్ చేస్తే రిషి దగ్గర కూర్చుని డ్రామా కొనసాగిస్తుంది దేవయాని. జగతి, మహేంద్రకు నీపై శ్రద్ధ లేదంటూ చెబుతుంది.

    అదంతా నిజమే అనుకుంటాడు రిషి. మరోవైపు కారులో ఇంటికి బయలుదేరతారు మహేంద్ర, జగతి. వదినగారు రోజురోజుకి ప్రమాదకరంగా మారుతున్నారు.. మనమేం చేయలేమో అని మహేంద్ర అంటే.. రిషికి అక్కయ్య నిజస్వరూపం తెలిస్తే కానీ ఏం చేయలేం. రిషి తనంతట తాను తెలుసుకోవాలి అని జగతి అంటుంది.

    మా కొడుకుపై మాకు ప్రేమ ఉండదా..

    మా కొడుకుపై మాకు ప్రేమ ఉండదా..

    వసుధారను తలుచుకుంటూ ఉంటాడు రిషి. ఈ మధ్య ధైర్యం ఎక్కువవుతోంది. చీర విషయంలో సమర్థించుకుందని గుర్తు చేసుకుంటాడు. ఇంతలో వసుధార నుంచి ఏం చేస్తున్నారని మెసేజ్ వస్తుంది. ఖాళీగా ఉన్నానని చెప్పాలా.. నీ గురించే ఆలోచిస్తున్నాని చెప్పాలా.. వద్దులే.. అనుకుని కలుద్దామా.. అని రిషి మెసేజ్ చేయగా.. ఎక్కడ అని అడుగుతుంది వసుధార. వస్తున్నా అని కాల్ కట్ చేసి బయలుదేరతాడు రిషి.

    అప్పుడే లోపలకి వస్తారు జగతి-మహేంద్ర. దీంతో అయిపోయాయా పనులు.. రిషి గురించి ఆలోచించే తీరిక ఉందా.. రిషి మనసు తెలుసుకునే ప్రయత్నం చేశావా ఇద్దరు ఇద్దరే మహానటులు.. అని దేవయాని అంటుంది. నటించడాలేంటీ.. మా కొడుకుపై మాకు ప్రేమ ఉండదా.. అని మహేంద్ర బదులిస్తాడు.

    రిషి డిస్టర్బ్ అయి వచ్చాడు మీరు వెళ్లకండి అని దేవయాని అంటుంది. నా కొడుకు రూమ్ లోకి వెళ్లడానికి నాకు మీ పర్మిషన్ కావాలా అని మహేంద్ర అంటాడు. ఇంతలో రిషి బయటకు వస్తాడు. వెంటనే దేవయాని డ్రామా స్టార్ట్ చేయగా.. మహేంద్ర-జగతి షాక్ అవుతారు.

    సర్ది చెప్పాల్సింది పోయి వదిలేశారు..

    సర్ది చెప్పాల్సింది పోయి వదిలేశారు..

    రిషికి నాకు ఎలాంటి బంధం లేనట్టే కదా.. ప్రత్యక్షంగా రిషిని.. పరోక్షంగా నన్ను ఏడిపిస్తున్నావ్ మహేంద్ర.. ఇంట్లో నుంచి నేను ఎక్కడికైనా వెళ్లిపోతా అని అంటుంది దేవయాని. ఇదంతా చూసిన రిషి దేవయానిని ఓదారుస్తాడు. ఇలాంటి పరిస్థితులు వస్తాయని నేను ఊహించలేదు డాడ్.. మిమ్మల్ని చూస్తుంటే మీరు కూడా మారిపోతారేమే అనిపిస్తోంది డాడ్.

    సారీ పెద్దమ్మా.. నేను వెళ్తున్నా అనేసి వెళ్లిపోతాడు రిషి. ఏంటిదంతా.. నేను ఏమన్నాని మహేంద్ర అడగడంతో ఇప్పుడేం మాట్లాడొద్దని జగతి ఆపేస్తుంది. ఇప్పుడు మీ కళ్లు చల్లబడ్డాయా అని దేవయాని మరో డ్రామా చేస్తుంది. రిషితో అలాగే మాట్లాడుతురా అని అంటుంది. దీంతో ఏం జరిగిందో రిషికి తెలియకపోవచ్చు.. కానీ మీకు తెలుసు కదా అని జగతి అంటుంది. బాగా తెలుస్తోంది. అసలు మీకు రిషి ఆనందంగా ఉండటం ఇష్టంలేదా అని దేవయాని అంటే.. అన్ని మీరే అంటారు.. అవన్నీ మేం అన్నామని నిరూపిస్తారు అని మహేంద్ర అంటాడు.

    రిషి మనసు తెలుసుకోలేరు. ఏం తల్లిదండ్రులు మీరు. రిషి సరదాగా మాట్లాడి నవ్వుతూ పలకరించి ఎన్నాళ్లయిందో కదా.. ఆ విషయం మీరు ఆలోచించారా.. సాక్షి విషయంలో ఏదో చిన్న పొరపాటు జరిగితే సర్ది చెప్పాల్సింది పోయి వదిలేశారు.

    నీ కాలు ఇంట్లో మోపాకే రిషి ఆనందాలు ఆగిపోయాయి.. కొందరి లెగ్గు మహిమ అలా ఉంటుంది మరి అని దేవయాని అంటుంది. వదినగారు మీరు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదని మహేంద్ర కోపగించుకోబోతుంటే.. జగతి ఆపుతుంది.

    English summary
    Guppedantha Manasu Serial October 20 2022 Today Full Episode 586
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X