Guppedantha Manasu: షాకింగ్ ట్విస్ట్.. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన జగతి-మహేంద్ర.. రిషి ఒడిలో వసుధార

దొంగ ఏడుపుతో డ్రామా చేసిన దేవయాని జగతి-మహేంద్రలను రిషి ముందు ముందు ఇరికిస్తుంది. తర్వాత రిషి వెళ్లిపోతాడు. మీ వల్లే రిషి ఆనందంగా లేడు. రిషి ప్రేమకు అడ్డు వస్తోంది మీరే. రిషి ప్రేమకు మీరే శత్రువులు. మీరు ఇంట్లో నుంచి వెళితే అయిన రిషి ప్రశాంతంగా ఉంటాడు అని జగతి-మహేంద్రలను అంటుంది. రూమ్ కి వెళ్లిన జగతి-మహేంద్ర ఆ మాటలు తలుచుకుంటూ బాధపడతారు. ఇలా మాటలు పడటం నా వల్ల కాదు ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలి అని అంటాడు మహేంద్ర. ఏం మాట్లాడకు మహేంద్ర, దేవయాని అక్కయ్య అన్న మాటలు నా గుండెల్లో గుచ్చుకున్నాయని జగతి అంటుంది. దీంతో సమాధానం ఇవ్వాలి.. లేదా పరిష్కారం ఆలోచించాలి అంటాడు మహేంద్ర. ఇలా ఆసక్తికర కథా కథనంతో సాగుతోన్న గుప్పెడంత మనసు సీరియల్ అక్టోబర్​ 21, 2022 శుక్రవారం నాటి తాజా ఎపిసోడ్​ 587లో ఏం జరిగిందో చదివేసేయండి.

చాలా ఆనందంగా ఉంది వసుధార..

చాలా ఆనందంగా ఉంది వసుధార..

దేవయాని మాటలు తల్చుకుంటూ జగతి-మహేంద్ర బాధపడుతుంటే.. మరోవైపు కారులో బయటకు వెళ్తారు రిషి-వసుధార. తర్వాత ఓ దగ్గర కూర్చుని మాట్లాడుకుంటారు. నమ్మకం, ప్రేమ, చీకటి, వెలుగు, చినుకులు, మనిద్దరం అనుకుంటూ మాట్లాడుకుంటారు. ఈ సమయం నాకు చాలా ఆనందంగా ఉంది వసుధార అని రిషి అంటే అందుకే ఎలాంటి డిస్టర్బన్స్ లేకుండా.. మన ఇద్దరి ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసి కారులో పెట్టేశాను అంటుంది వసుధార. దీంతో షాక్ అయిన రిషి.. వెనక్కి తిరగడంతో రిషి ఒడిలో వసు పడిపోతుంది. కాసేపు ఒకరినొకరు చూసుకుంటూ అలాగే ఉంటారు. మరోవైపు రిషికి కాల్ చేస్తాడు మహేంద్ర. కానీ స్విచ్ ఆఫ్ వస్తుంది. తర్వాత లగేజ్ సర్దుకుని వచ్చిన మహేంద్రని నిజంగా ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నామా అని అడుగుతుంది జగతి.

బంధాలకు ఎలాంటి సంబంధం లేదు..

బంధాలకు ఎలాంటి సంబంధం లేదు..

అక్కయ్య అంది కదా.. రిషి ప్రేమకు మనమే శత్రువులం అని. మనం వెళ్లిపోవడమే పరిష్కారం జగతి. ఈ ఇంటికి ఈ బంధాలకు ఇక ఎలాంటి సంబంధం లేదు పద.. అంటూ రిషి, మహేంద్ర కలిసి దిగిన ఫొటో ఫ్రేమ్ చూసి ఆగుతాడు. ఆ ఫొటో ఫ్రేమ్ తీసుకుని.. మారిపోతున్నాను అన్నావ్ కదా నాన్నా.. మారిపోయానో.. పారిపోతున్నానో అంటూ ఎమోషనల్ గా ముద్దు పెట్టుకుని ఫ్రేమ్ లో నుంచి ఫొటోను తీసుకుంటాడు. తర్వాత ఆ ఫ్రేమ్ మీద ఏదో రాసి బయలుదేరతాడు. కన్నీళ్లతో, అత్యంత బారంగా, బాధగా కారు దగ్గరికి వెళ్తారు మహేంద్ర, జగతి. తమ ఇంటిని కింది నుంచి పై దాకా కొద్దిసేపు చూసి కారులో బయలుదేరతారు జగతి-మహేంద్ర. వాళ్లు వెళ్లడం చూసిన దేవయాని చాలా క్రూరంగా, వెకిలీగా నవ్వుకుంటుంది.

పొగరు అని ఎందుకుంది..

పొగరు అని ఎందుకుంది..

మరోవైపు జీవితం, అమవాస్య. వెన్నెల అంటూ మాట్లాడతాడు రిషి. మనం మనగురించి మాత్రమే మాట్లాడుకోవడం సంతోషంగా ఉంది. ఇది ఇలాగే కొనసాగేలా చూద్దాం వసుధార. ఎప్పుడూ గలగల మాట్లాడుతుంటావ్ కదా.. ఈరోజు నేను మాట్లాడుతుంటే సైలెంట్ గా ఉన్నావ్ అని రిషి అంటాడు. మీరు మాట్లాడుతుంటే వినడం, మీరు నవ్వితే చూడటం సంతోషంగా ఉంటుంది అని వసుధార అంటుంది. అలాగే మిమ్మల్ని ఒకటి అడగనా అని వసుధార అంటే మన ఇద్దరి గురించి మాత్రమే అయితే అడుగు అని రిషి అంటాడు. దీంతో మీ ఫోన్లో నా పేరు పొగరు అని ఎందుకుంది అని వసుధార అంటే.. చిన్న పిల్లలకు అందమైన పేర్లున్నా చిన్ను, చింటూ, బజ్జి అని ఎందుకు పిలుస్తారు అని రిషి అంటాడు. అవి అంటే ముద్దు పేర్లు... అని ఆగిపోతుంది వసుధార.

 నాకు దూరం అయిపోతున్నారు..

నాకు దూరం అయిపోతున్నారు..

నీ పేరు బాగుటుంది. ఎన్నోసార్లు ఎందరో పిలుస్తారు. అందరి ఫోన్లలో అదే పేరు ఉంటుంది. కానీ నువ్వు నాకు స్పెషల్ కదా వసుధార. అందుకే నీకు ముద్దుగా పొగరు అని పేరు పెట్టుకున్నా. పొగరు అంటే తిట్టు అనుకున్నావా.. కాదు.. ప్రేమ.. ఈ పిలుపు నాకే సొంతం అని రిషి చెబుతాడు. ఈరోజు ఏంటో గుండె తట్టుకోలేనంత ఆనందంగా ఉంది అని వసుధార అంటుంది. కానీ ఇలాంటప్పుడే భయమేస్తుందని రిషి చెబుతాడు. భయమెందుకు సార్ అని వసుధార అడిగితే.. నేను ఎవరినీ ఇష్టపడినా.. వాళ్లు నాకు దూరం అయిపోతున్నారు ఏంటో.. మనం కూడా అని రిషి అనబోతుంటే ఆపుతుంది వసుధార. సార్ అలా అనకండి అంటుంది. తర్వాత అయిన నాకంటూ ఇష్టపడే వాళ్లు ఎవరున్నారు.. నువ్ డాడ్ అంతే కదా.. డాడ్ అంటే నాకు ప్రాణం. నా సంగతి కాదు.. డాడ్ నన్ను చూడకుండా ఉండలేరు తెలుసా.. అంటూ మహేంద్ర గురించి చాలా గొప్పగా చెబుతాడు రిషి.

గుండె బరువెక్కిపోతోంది జగతి..

గుండె బరువెక్కిపోతోంది జగతి..

తర్వాత వసు, రిషి ఒక కారులో వెళ్తుంటారు. మరోవైపు జగతి-మహేంద్ర మరో కారులో ప్రయాణిస్తుంటారు. మనసుకి ఎంత ఆనందంగా ఉందో తెలుసా అని రిషి అంటే.. మరోవైపు గుండె బరువెక్కిపోతోంది జగతి.. రిషికి నేను దూరంగా వెళ్తున్నాను జగతి. ఇది కల అయితే బాగుండేది కదా.. అని మహేంద్ర అంటాడు. రిషి ఆనందం కోసం మనిద్దరం కలిసి రిషికి అందిస్తున్న కానుక అనుకుందాం అంటుంది జగతి. అదే సమయంలో ఆ దేవుడు నాకు ఇచ్చిన కానుక నువ్వు అని వసుధారను రిషి అంటాడు. లేదు లేదు.. మీరే నాకు కానుక అని వసుధార అంటుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే వచ్చే ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X