twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Guppedantha Manasu: తండ్రి వెళ్లిపోయిన బాధలో రిషి.. ఆజ్యం పోస్తున్న దేవయాని.. షాక్ ఇచ్చిన వసుధార

    |

    దేవయాని అన్న మాటలకు ఎంతో బాధతో ఇంట్లో నుంచి కారులో వెళ్లిపోతారు మహేంద్ర-జగతి. రిషి ఆనందం కోసం మనిద్దరం కలిసి అందిస్తున్న కానుక అనుకుందామని జగతి అంటుంది. మరోవైపు అదే సమయంలో మరో కారులో రిషి-వసుధార ప్రయాణిస్తుంటారు. దేవుడు నాకు ఇచ్చిన కానుక అని రిషి అంటే.. మీరే దేవుడిచ్చిన కానుక అని అంటుది వసుధార. చీకటి అందంగా ఉందని రిషి అంటే.. మరోవైపు ఈ రాత్రి ఎప్పటికీ చీకటి రాత్రిగా మిగిలిపోతుందని మహేంద్ర అంటాడు.

    వసుధారను తన రూమ్ దగ్గర డ్రాప్ చేసి ఇంటికి వెళతాడు రిషి. తెల్లవారుతుంది. వసుధార ఫోన్ కు వరుసగా మెసేజ్ లు వస్తాయి. టైమ్ ఎంత అయిందో అనుకుని ఫోన్ చూసుకుంటుంది వసుధార. జగతి నుంచి మెసేజెస్ ఉంటాయి. మిషన్ ఎడ్యుకేషన్ ఫైల్స్ అన్నీ పంపిన జగతి.. వసుధార ఇకపై ఇవన్నీ నువ్వే చూసుకో అని చెబుతుంది. ఇలా ఆసక్తికర కథా కథనంతో సాగుతోన్న గుప్పెడంత మనసు సీరియల్ అక్టోబర్​ 22, 2022 శనివారం నాటి తాజా ఎపిసోడ్​ 588లో ఏం జరిగిందో చదివేసేయండి.

    ఎక్కడికి వెళ్లారో మీకు తెలియదా..

    ఎక్కడికి వెళ్లారో మీకు తెలియదా..

    జగతి పంపిన మెసేజెస్ చూసుకున్న వసుధార కాల్ చేస్తుంది. ఫోన్ స్విచ్చాఫ్ వస్తుంది. ఇవన్నీ నాకేందుకు పంపారు మేడమ్.. అర్థం కావడం లేదని అనుకుంటుంది. ఇక మహేంద్ర రూమ్ కు వెళ్లి డాడ్ అని పిలుస్తాడు రిషి. డాడ్ అప్పుడే లేచారా.. ఎక్కడికి వెళ్లి ఉంటారని గది మొత్తం చూస్తుంటాడు. ఫొటో ఫ్రేమ్ లో ఉన్న ఫొటో తీసేసి.. వెళ్తున్నాం అని రాసి ఉండడం చూస్తాడు రిషి. అసలు వెళ్లడం ఏంటంటూ దేవయాని దగ్గరికి వెళ్లి.. ఏంటిది అని అడుగుతాడు.

    ఎక్కడికి వెళ్లారో మీకు తెలియదా.. మీరు చూడలేదా అని అడుగుతాడు. వెళ్తుంటే ఆపాను రిషి.. కానీ ఆగలేదు అని దేవయాని సమాధానం ఇస్తుంది. డాడ్ వెళ్తుంటే నాకు చెప్పాలి కదా.. డాడ్ వెళ్లడం ఏంటి అంటూ కంగారుగా కాల్ చేస్తాడు రిషి. కానీ ఫోన్ స్విచ్చాఫ్ వస్తుంది. ఇంతలో దేవయాని ఏదో చెప్పబోతుంటే.. వాళ్లేమన్నారని కాదు.. మీరు ఎలా వెళ్లనిచ్చారు.. గొడవ ఏమైనా జరిగిందా.. మీరేమైనా అన్నారా అని అడుగుతాడు రిషి.

    దండం పెడతాను ఏమన్నారో చెప్పండి..

    దండం పెడతాను ఏమన్నారో చెప్పండి..

    నన్ను అంటున్నావేంటి.. నేను ఏమంటాను.. బయటకు వెళుతున్నారు కదా.. ఏదో జాలీ ట్రిప్ అనుకున్నాను అని దేవయాని అంటుంది. మీరు నాకు అప్పుడే చెప్పాలి కదా.. అని రిషి అంటే బయటకు వెళ్తున్నారు అనుకున్నాను కానీ, ఇంట్లో నుంచి వెళ్లిపోయారని అనుకోలేదు అని దేవయాని అంటుది. తండ్రిని తలుచుకుంటూ రిషి టెన్షన్ పడతాడు. నాపై ప్రేమతో మీరు ఆయన్ని ఏమైనా అన్నారా.. మీకు డాడ్ కి ఎప్పుడూ ఏవో గొడవలు జరుగుతూ ఉంటాయి కదా.. నిజం చెప్పండి పెద్దమ్మా.. అని నిలదీస్తాడు రిషి.

    అసలు ఇలా జరిగిందని నాకు తెలియదు.. మహేంద్రని నేనేం అంటాను చెప్పు అని దేవయాని అంటుంది. సరే మేడమ్ ని ఏమైనా అన్నారా.. చెప్పండి పెద్దమ్మా.. మీకు దండం పెడతాను ఏమన్నారో చెప్పండి అని రిషి అడిగితే.. నేనేందుకు అంటాను రిషి అని దొంగ ఏడుపు స్టార్ట్ చేస్తుంది దేవయాని. ఏదో జరిగింది పెద్దమ్మా.. లేదంటే డాడ్ ఎక్కడికీ వెళ్లరు కదా.. పెద్దమ్మా మీరు నాకు నిజం చెబుతున్నారా.. నిజం చెప్పడం లేదు కదా అని నిలదీస్తాడు రిషి. ఇంతలో అక్కడికి గౌతమ్ వస్తాడు.

    నేనేమైనా తప్పు చేశానా..

    నేనేమైనా తప్పు చేశానా..

    జగతి మహేంద్రలు ఇల్లు వదిలిపెట్టి వెళ్లిపోయారు అని చెబుతుంది గౌతమ్ తో. వెళ్లేవాళ్లు అడ్రస్ చెప్పి వెళతారా ఏంటీ.. రిషిని బాధపెట్టాలని, నాపై నిందలు మోపాలని వెళ్లారు అని దేవయాని అంటుంది. రేయి అంకుల్ నిన్ను వదిలేసి ఎలా వెళతారు అని గౌతమ్ అంటాడు. అయినా ఇవేం బుద్దులు.. అలా వెళ్లడం ఏంటీ.. వద్దు వద్దు అంటే జగతిని ఇంట్లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు తండ్రికొడుకులను దూరం చేసింది అని దేవయాని అంటే.. పెద్దమ్మా మీరు ఆగండి ప్లీజ్. రిషి నా మాట వినరా.. అంకుల్ వాళ్లు ఎక్కడికీ వెళతారు.. ఏదో అలిగారేమో.. వచ్చేస్తారు.. అంకుల్ సంగతి నీకు తెలుసు కదా.. అని కాల్ చేస్తాడు గౌతమ్. డాడ్ ఇలా చేయరు కదా అని కన్నీళ్లు పెట్టుుకుంటాడు రిషి.

    ప్రేమ ఉండి ఉంటే వెళ్లేవారా అని దేవయాని అంటుంది. నేను వెళ్లి అంకుల్ ఎక్కడికి వెళ్లారో చూస్తా అంటూ రిషిని ఓదారుస్తాడు గౌతమ్. నేనేమైనా తప్పు చేశానా అని రిషి అనగానే.. తల్లిదండ్రులపై కోపం పెంచేలా చేస్తుంది దేవయాని. మరోవైపు వసుధారను కలిసిన గౌతమ్ జరగినదంతా చెబుతాడు. రిషి సంగతి నువ్ చూసుకో అంకుల్ వాళ్లు ఎక్కడున్నారో నేను వెతుకుతానంటాడు గౌతమ్.

    ఏదో తప్పు జరిగింది పెద్దమ్మా ..

    ఏదో తప్పు జరిగింది పెద్దమ్మా ..

    రిషి దగ్గరికి వెళ్తుంది వసుధార. దేవయాని దగ్గర మహేంద్ర గురించి చెబుతూ బాధపడతాడు రిషి. డాడ్ కి నా మీదకోపం వస్తే నన్ను తిట్టే హక్కు డాడ్ కి ఉంది కదా. ఎప్పుడూ కోపం వచ్చిన సరే నన్ను తిట్టరు. ఎందుకంటే నేను బాధపడతాను అని. నన్ను ఒక్క మాట కూడా అనని డాడ్ నన్ను ఇలా వదిలేసి వెళ్లారంటే.. ఏదో తప్పు జరిగింది పెద్దమ్మా అని రిషి అంటాడు. పోనీలే పెద్దమ్మా.. వాళ్లిద్దరు వెళ్లిపోయారు కదా.. నాకు మీరున్నారు అదే చాలు అని అంటాడని అనుకుంటే ఇలా అయిందేంటి అని మనసులో అనుకుంటుంది దేవయాని. జగతి వల్ల అని దేవయాని ఏదో చెప్పబోతుంటే.. లేదు పెద్దమ్మా డాడ్ ఎప్పటికీ నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటాడు రిషి. ఇంతలో వసుధార వస్తుంది.

    స్ట్రాంగ్ కాఫీ తీసుకురండి..

    డాడ్ కనిపించడం లేదు వసు.. నీకు ఏమైనా తెలిసిందా అని అడుగుతాడు రిషి. నా కాల్ కూడా ఎత్తడం లేదు మీరు ముందు ధైర్యంగా ఉండండి, గౌతమ్ సర్ వెళ్లారుగా వెతకడానికి అని రిషిని పైకి తీసుకెళ్తుంది. ఎక్కడికి తీసుకెళ్తున్నావ్ అని దేవయాని అంటే.. ధైర్యం చెప్పడానికి అని అలాగే మేడమ్ కొంచెం స్ట్రాంగ్ కాఫీ తీసుకురండి అని అంటుంది వసుధార. దానికి షాక్ అయిన దేవయాని.. నేను కాఫీ తేవడం ఏంటి అంటే.. కాఫీ కాదు.. స్ట్రాంగ్ కాఫీ తెచ్చేయండి మేడమ్ అని రిషిని తీసుకుని పైకి వెళ్లిపోతుంది వసుధార. దీంతో కోపంతో రగిలిపోతుంది దేవయాని.

    English summary
    Guppedantha Manasu Serial October 22 2022 Today Full Episode 588..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X