For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Guppedantha Manasu: ఆ ఇంట్లో మహేంద్ర-జగతి అజ్ఞాతవాసం.. రిషిని ఆలోచనలో పడేసిన వసుధార

    |

    మహేంద్ర-జగతి ఇల్లు వదిలి వెళ్లిపోతారు. తండ్రిని తలుచుకుంటూ బాధపడతుంటాడు రిషి. వసుధార ఓదార్చుతుంది. డాడ్ వాళ్లు వస్తారంటావా వసుధార. వాళ్లు నన్ను వదిలేయడం ఏంటి. నేను ఈ మధ్య కొన్ని విషయాల్లో డాడ్ తో కఠినంగా మాట్లాడాను. అది కూడా దేవయాని పెద్దమ్మా విషయంలోనే, పెద్దమ్మకి గౌరవం తగ్గేటట్లు మాట్లాడినందుకు డాడ్ తో కఠినంగా మాట్లాడాను అది తప్పా వసుధార. నేను ఏమైనా తప్పు చేశానా అని రిషి అడుగుతాడు. దీనంతటికి కారణం దేవయాని మేడమే అని అనిపిస్తుంది, ఏదో ఒక రోజు ఆవిడ అసలు రంగు బయటపడుతుంది అని మనసులో అనుకుంటూ మీరేం బాధపడొద్దు సార్. మేడమ్, సార్ ఎప్పటికైనా దొరుకుతారు అని ధైర్యం చెబుతుంది వసుధార. ఇలా ఆసక్తికర కథా కథనంతో సాగుతోన్న గుప్పెడంత మనసు సీరియల్ అక్టోబర్​ 24, 2022 సోమవారం నాటి తాజా ఎపిసోడ్​ 589లో ఏం జరిగిందో చదివేసేయండి.

    ఈ రకంగా అయినా వస్తారు కదా..

    ఈ రకంగా అయినా వస్తారు కదా..

    నువ్ మేడమ్ మంచి ఫ్రెండ్స్ కదా వసుధార.. ఒకవేళ నీకు గానీ వాళ్లు ఎక్కడికి వెళ్లారో తెలుసా అని రిషి అడిగితే.. నన్నుఅనుమానిస్తున్నారా సార్ అని వసుధార అంటుంది. మీ ఇద్దరిది అన్ని బంధాలను దాటిన గొప్ప బంధం కదా. ఇది చెప్పలేదా.. అని రిషి అంటాడు. నాకు తెలియదు సార్.. జీవితాంతం మీతో నడవాల్సిన దాన్ని. నన్ను అనుమానిస్తున్నారా నా కళ్లలో కళ్లు పెట్టి చూడండి అని వసుధార అంటుంది. కనీసం నీకైనా చెప్పుటే బాగుండు కదా.. నేను మేడమ్ వర్క్ గురించి మెయిల్ పెట్టాను. నువ్వు కూడా మెయిల్ పెట్టు. ఈ రకంగా అయినా వాళ్లు వస్తారు కదా.. వస్తారంటావా.. అని రిషి అంటాడు. మరోవైపు వీరిద్దరి మాటలను చాటుగా ఉండి వింటుంది దేవయాని. ఇంత తెలివైన అమ్మాయిని రిషి జీవితంలో ఉండనీయకూడదనుకుంటూ వెళ్లిపోతుంది దేవయాని.

     రిషి సార్ ఎప్పుడు వెళ్లమంటే అప్పుడు..

    రిషి సార్ ఎప్పుడు వెళ్లమంటే అప్పుడు..

    తర్వాత కిచెన్ లో చిన్న అత్తయ్య, చిన్న మావయ్య లేకుంటే ఇలు ఏదోలా ఉంది. వాళ్లు వదిలి వెళ్లిపోయారు అంటే నాకు ఇంకా నమ్మశక్యంగా లేదు. నువ్ ఇంత ధైర్యంగా ఎలా ఉండగలుగుతున్నావో అని వసుధారతో ధరణి అంటుంది. బలహీనంగా ఉన్న సమయంలోనే కదా ధైర్యంగా ఉండాలి మేడమ్. అప్పుడే మనకు ఎదురించే శక్తి వస్తుంది. తట్టుకోగలం అని వసుధార చెబుతుంది. రిషికి కాఫీ తీసుకెళ్తున్న వసుధారకు దేవయాని ఎదురుపడుతుంది. కాఫీ కావాలా అని వసుధార అడుగుతుంది. ఇదేమీ నీ రెస్టారెంట్ కాదు. నా ఇల్లు నా రాజ్యం. నాకు ఏది నచ్చితే అది చేస్తాను అని దేవయాని అంటుంది. థ్యాంక్యూ మేడమ్.. మీకు కాఫీ పెట్టే లోపల సార్ కాఫీ చల్లారిపోయేది. సమయం మిగిల్చారు అని వసుధార అంటుంది. తర్వాత కోపంగా ధరణి అని పిలిచి.. పిలవని పేరంటానికి వచ్చినవాళ్లు ఎన్నాళ్లుంటారో అని దేవయాని అంటే.. ధరణి మేడమ్ ని ఏంటి.. నన్ను అడగండి. రిషి సార్ ఎప్పుడు వెళ్లమంటే అప్పుడు వెళ్తాను. నిజంగా నన్ను పంపాలనుకుంటే రిషి సార్ కి చెప్పండి అనేసి వెళ్లిపోతుంది వసుధార.

    మాకు అజ్ఞాతవాసం తప్పదు..

    మాకు అజ్ఞాతవాసం తప్పదు..


    ఇది రోజురోజుకీ బాగా ముదిరిపోతోంది. నాకే ఎదురు సమాధానాలు చెబుతుంది. ఆలోచించాల్సిందే అని అనుకుంటుంది దేవయాని. మరోవైపు మహేంద్ర-జగతిలు ఒక ఇంట్లో కూర్చుని ఆలోచనలో ఉంటారు. అప్పుడు పక్కనే ఉన్న గౌతమ్ తో రిషి. ఎలా ఉన్నాడు అని అడుగుతారు. దానికి తెలిసిందే కదా.. మీ గురించే కంగారుపడుతూ వెతుకుతున్నాడు. మీకు మెయిల్ కూడా పెట్టాడు. వర్క్ కోసమైనా కాలేజీకి వస్తారేమో అని గౌతమ్ అనడంతో.. రిషి గురించి మాకు తెలుసు. తన తపన మాకు అర్థం అవుతుంది. కానీ ఇది అవసరం గౌతమ్. వర్షకాలం అప్పుడే ఎండ విలువ తెలుస్తుంది. ఎండకాలం అప్పుడే వర్షం విలువ తెలుస్తుంది. ఇలా ఉంటేనే రిషి మమ్మల్ని అర్థం చేసుకుంటాడు అని మహేంద్ర అంటాడు. అప్పుడు మహేంద్రతో గౌతమ్ ఇంట్లో ఉండటం బాగానే ఉంటుందా.. గౌతమ్ కి ఇబ్బందేమో అని జగతి అనడంతో.. అదేం లేదు మేడమ్ అని గౌతమ్ అంటాడు. ఓ సమస్య వచ్చింది గౌతమ్. దాని పరిష్కరించాడనికి మేము వచ్చాం. అందుకే అజ్ఞాతవాసం మాకు తప్పదు. మేము ఇక్కడ ఉన్నట్లు ఎవరికీ చెప్పొద్దు అని మహేంద్ర అంటాడు. అదే నా బాధ అంకుల్. రిషి అడిగితే అబద్దం చెప్పలేను. అలాగని నిజం దాచలేను అని గౌతమ్ అంటాడు.

    మీ ముందే సమాధానం ఉంది..

    మీ ముందే సమాధానం ఉంది..


    ఓ మంచి కోసం ఒక అబద్దం మంచిదే గౌతమ్ అన మహేంద్ర అంటాడు. మరోవైపు కాలేజ్ బయట కూర్చున్న వసుధార వాళ్లు వెళ్లిపోడానికి ఒకరకంగా కారణం నేనేనా అని వసుధార ఆలోచిస్తూ ఉంటుంది. జగతి మేడమ్ చెప్పినట్లు చీర కట్టుకోలేదని, ఇంకా గురుదక్షిణ ఒప్పంద గురించి నేను పట్టు పడుతున్నాని కూడా వాళ్లు వెళ్లిపోయి ఉండొచ్చు కదా. ఇదంతా నా వల్లే జరిగిందా అని అనుకుంటూ ఉంటుంది వసు. అప్పుడు అక్కడికి వచ్చిన రిషి.. ఎందుకు వెళ్లిపోయారు.. వస్తారా.. నేను ఏమైనా తప్పు చేసినట్లయితే నన్ను నిలదీసి అడగాలి కదా. అసలు నేనేం తప్పు చేశాను అంటాడు రిషి. దేవయాని గురించి ఆలోచిస్తూ మీ ముందే సమాధానం ఉంది సార్ మీరు తెలుసుకోలేకపోతున్నారు అని వసుధార అంటుంది. అయితే నాకేం తెలియదు అంటావా వసు.. నేను ఏమైనా తప్పు చేస్తే నన్ను అడగాలి గానీ, ఇలా వెళ్లిపోవడం ఏంటని రిషి అంటాడు. మహేంద్ర సార్ ఎక్కడికి వెళ్లారని మీరు అనుకుంటున్నారు, ఎందుకు వెళ్లుంటారని అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ జగతి మేడమ్ విషయంలో మీ నిర్ణయం మార్చుకుంటే.. అని వసుధార అనేలోపే.. ఆపేయ్ వసుధార.. అటువైపు వెళ్లొద్దు అని అంటాడు రిషి.

    English summary
    Guppedantha Manasu Serial October 24 2022 Today Full Episode 589
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X