For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Guppedantha Manasu: తల్లిదండ్రులు ఉన్న చోటుకి రిషి.. గౌతమ్ పై మహేంద్ర సీరియస్..

  |

  కాలేజీలో వసుధారతో తన తండ్రి ఎక్కడికి వెళ్లారో అని చెబుతూ బాధపడతాడు రిషి. సార్ సమాధానం మీ ముందే ఉంది అంటూ చెబుతుంది వసుధార. ఈ క్రమంలోనే సార్ వాళ్లు వెళ్లిపోవడానికి మనం కూడా ఒక కారణం కావచ్చు సార్ అని వసుధార అంటుంది. దీంతో కోపంగా వసుధార.. నువ్వు లేనిపోనివి తలకు ఎక్కించుకోకు అని అంటాడు రిషి. డాడ్ వెళ్లింది నా మీద కోపంతో. మళ్లీ తిరిగి వస్తారు అని రిషి అంటే.. తిరిగి వచ్చే వాళ్లు అయితే ఎందుకు వెళతారు సార్ అని వసుధార అంటుంది. వసుధార.. ప్లీజ్ అలా మాట్లాడకు. ఇప్పుడు నేనేం చేయాలంటావ్.. అందరిని సావధానంగా అర్థం చేసుకోవాలా.. మరి నన్ను ఎవరు అర్థం చేసుకుంటారు అని నిస్సహాయంగా అంటాడు రిషి. ఇలా ఆసక్తికర కథా కథనంతో సాగుతోన్న గుప్పెడంత మనసు సీరియల్ అక్టోబర్​ 24, 2022 మంగళవారం నాటి తాజా ఎపిసోడ్​ 590లో ఏం జరిగిందో చదివేసేయండి.

  రిషి సార్ బాధ చూడలేకపోతున్నాను..

  రిషి సార్ బాధ చూడలేకపోతున్నాను..

  తననెవరు అర్థం చేసుకుంటారు అని రిషి అంటే.. నేను ఉన్నాగా సార్.. అని వసుధార సమాధానం ఇస్తుంది. దీంతో ఒక్కసారిగా సైలెంట్ అయిపోతాడు రిషి. తర్వాత కొద్దిసేపటికి సరే.. ఇదంతా తర్వాత మాట్లాడుదాం. మీటింగ్ కు టైమ్ అవుతుందని వెళతారు రిషి, వసుధార. మీటింగ్ లో వాళ్ల గురించి.. వస్తారుగా వసుధార.. రాకుండా ఉంటారా.. కచ్చితంగా వస్తారు.. నిజంగా వస్తారు అంటూ తనలో తానే మథనపడుతూ వసుధారతో బాధను పంచుకుంటాడు రిషి. అది చూసి తట్టుకోలేక గౌతమ్ కి.. సార్.. నేను రిషి సార్ బాధ చూడలేకపోతున్నాను.. మీరే ఏదైనా చేయండి అని మెసేజ్ చేస్తుంది వసుధార. అది చూసిన గౌతమ్.. మహేంద్ర-జగతిలతో అంకుల్ ఏదో ఒకటి చెప్పండి.. రిషి చాలా బాధపడిపోతున్నాడని అంటాడు. మహేంద్ర-జగతి మౌనంగా ఉండటంతో రేయ్ రిషి.. మీటింగ్ అయ్యాక కలుద్దాం.. లొకేషన్ పంపిస్తున్నా వచ్చేయ్.. అంటూ తన ఇంటి లొకేషన్ పంపిస్తాడు గౌతమ్.

  రిషి రావడం చూసి షాక్..

  రిషి రావడం చూసి షాక్..

  దీంతో వసుధార గౌతమ్ మెసేజ్ చేశాడు. లొకేషన్ కూడా పంపించాడంటే.. కచ్చితంగా డాడ్ వాళ్లు అక్కడే ఉండి ఉంటారు. పదా వెళ్దాం.. మీటింగ్ క్యాన్సిల్ చేయ్ అని చెబుతాడు రిషి. మీటింగ్ క్యాన్సిల్ చేసి గౌతమ్ ఇంటికి బయలుదేరతారు రిషి, వసుధార. మరోవైపు మీటింగ్ క్యాన్సిల్ అయినట్లు దేవయానికి తన మనుషులు కాల్ చేసి చెబుతారు. హమ్మయ్యా.. మంచిదైంది. ఎక్కడ మహేంద్ర వాళ్లు ఆ మీటింగ్ కు వస్తారోనని భయపడి చచ్చాను. ఇక నా కథ నేను నడుపుతాను అని ఫిక్స్ అవుతుంది దేవయాని. కట్ చేస్తే రిషి, వసుధారలు ఇంటికి రావడం చూసి షాక్ అవుతారు మహేంద్ర-జగతి, గౌతమ్. ఏంటీ గౌతమ్ ఇది.. రిషి వచ్చాడేంటి.. స్నేహధర్మం పాటించావా.. అంటూ అరిచేస్తాడు మహేంద్ర.

  మిమ్మల్ని బాధపెట్టాలని కాదు..

  మిమ్మల్ని బాధపెట్టాలని కాదు..

  అయ్యో అంకుల్.. రిషికి లొకేషన్ పంపించింది నేనే కానీ, నేను మీ గురించి చెప్పాలని, మిమ్మల్ని బాధపెట్టాలని కాదు. మీటింగ్ తర్వాత వస్తాడు అనుకున్నాను.. ఇప్పుడే వచ్చేశాడు.. వాడిని ఓదార్చాలనే పిలిచాను అను అయోమయంగా చూస్తూ అంటాడు గౌతమ్. సరే గౌతమ్.. మేము లోపలికి వెళ్తున్నాం.. మేము ఇక్కడే ఉన్నామని వాడికి చెప్పావో.. ఇక జీవితంలో నీతో మాట్లాడను గుర్తుపెట్టుకో.. అని పక్క గదిలోకి వెళ్తారు మహేంద్ర-జగతి. తర్వాత వెళ్లి తలుపు తీస్తాడు గౌతమ్. గౌతమ్ తలుపు తీయ్యగానే.. వెంటనే లోపలికి పరిగెత్తి.. డాడ్ ఎక్కడున్నారు అంటూ పిలుస్తాడు రిషి. దీంతో పక్కకు దాక్కుంటారు మహేంద్ర-జగతి. తర్వాత కొద్దిసేపటకి.. రేయ్ ఆగరా.. వాళ్లు ఇక్కడెందుకు ఉంటారు. కేవలం నిన్ను ఓదార్చాలనే ఇక్కడికి రమ్మన్నాను అని చెప్పుకొస్తాడు గౌతమ్.

  కన్నీళ్లు పెట్టుకున్న మహేంద్ర..

  కన్నీళ్లు పెట్టుకున్న మహేంద్ర..

  వాటర్ కోసం వసుధార వెళ్తుంటే.. తనను ఆపేసి తనే వెళ్లి తీసుకోస్తాడు గౌతమ్. ఇంతలో టీపాయ్ పై రిషి, మహేంద్రల ఫొటో ఉంటుంది. అటువైపుగా రిషి నడిస్తే.. కంగారు పడతాడు మహేంద్ర. తర్వాత ఆ విషయం సైగల ద్వారా గౌతమ్ కి చెబుతాడు మహేంద్ర. దీంతో వెంటనే వాటర్ తో వచ్చిన గౌతమ్.. ఆ ఫొటోకు అడ్డుగా నిలబడతాడు. తర్వాత ఇద్దరిని కూర్చొమన్న గౌతమ్.. రేయ్.. మీటింగ్ వదిలేసి మరి వచ్చావేంట్రా.. నువ్ ఇంకా రావులే అనుకున్నానని అంటాడు. డాడ్ కంటే నాకు ఏది ఎక్కువ కాదురా.. అయినా మా డాడ్ ది చిన్న పిల్లల మనస్తత్వం రా.. హగ్ ఇచ్చి సారీ చెబితే వెంటనే కోపం తగ్గిపోతుంది తెలుసా.. అని రిషి మాట్లాడుతుంటే చాటుగా వింటున్న మహేంద్ర కన్నీళ్లు పెట్టుకుంటాడు. చూశావా జగతి నా కోసం రిషి ఎలా బాధపడుతున్నాడో అని చెబుతూ ఎమోషనల్ అవుతాడు మహేంద్ర.

  English summary
  Guppedantha Manasu Serial October 25 2022 Today Full Episode 590
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X