twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Guppedantha Manasu: తండ్రి కోసం విలవిల్లాడుతున్న రిషి.. దేవయానికి వసుధార స్ట్రాంగ్ వార్నింగ్

    |

    తండ్రినే తలుచుకుంటూ బాధపడుతున్న రిషిని వసుధార ఓదార్చుతుంది. నాతో మాట్లాడనంతా తప్పు నేను ఏం చేశానంటూ ఆవేదనగా చెబుతాడు. తర్వాత వసుధార భుజంపై వాలి తన బాధ చెప్పుకుంటాడు రిషి. ఇదంతా పైనుంచి చూస్తున్న దేవయాని షాక్ అవుతుంది. మిషన్ ఎడ్యుకేషన్ మీటింగ పోస్ట్ పోన్ చేయమని మెయిల్ లో అడిగారంటే అక్కడ నన్ను చూడాలనే కదా.. నా మొహం చూసేందుకు కూడా డాడ్ ఇష్టం పడటం లేదంటే.. అని రిషి అంటుండగా.. మీరు బాధపడితే నేను చూడలేను, లోపలికి వెళదాం పదండి.. బయట చలిగా ఉంది అని వసుధార అంటుంది. ఇక్కడే నేను డాడ్ చాలా సార్లు ఇలాగే కూర్చుని బోలేడన్నీ కబుర్లు చెప్పుకున్నాం. కాసేపు ఇక్కడే ఉంటాను.. నువ్వెళ్లు వసుధార అని రిషి అంటాడు. ఇలా ఆసక్తికర కథా కథనంతో సాగుతోన్న గుప్పెడంత మనసు సీరియల్ అక్టోబర్​ 27, 2022 గురువారం నాటి తాజా ఎపిసోడ్​ 592లో ఏం జరిగిందో చదివేసేయండి.

    మీ పెత్తనం నాపై కాదు..

    మీ పెత్తనం నాపై కాదు..

    మహేంద్ర సార్ వస్తారు.. త్వరలోనే మిమ్మల్ని కలుస్తారు అని రిషితో వసుధార చెబుతుంది. నువ్వెళ్లు వసుధార కాసేపు ఇక్కడే ఉంటాను అని రిషి అంటాడు. తర్వగా వచ్చేయండి సార్.. అని వెళ్లిపోతుంది వసుధార. నువ్వు కూడా లేకుంటే నేను ఏమైపోయేవాడినో అనుకుంటాడు రిషి. లోపలికి వెళ్లిన వసుధార చేయి పట్టుకుని లాగుతుంది దేవయాని. నువ్వేం చేస్తున్నావో తెలుసా.. ఓ పరాయి మగాడితో.. అని దేవయాని అంటుంటే.. ఆగండి మేడమ్.. రిషి సార్ పరాయివాడు కాదు.. నావాడు అని అంటుంది వసుధార. మీకు పెళ్లయిందా.. ఊరుకున్న కొద్దీ రెచ్చిపోతున్నావ్.. నా ప్లేస్ లో ఇంకొకరు ఉటే వేరే రకంగా ఉండేది అని దేవయాని అంటే.. కాస్తా ఆపుతారా.. నాకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వండి.. మీ ప్లేస్ లో ఇంకొకరు ఉంటే రిషి సార్ ను అర్థం చేసుకునేవాళ్లు. ఆయన ముందు పదే పదే మహేంద్ర సార్, జగతి మేడమ్ ని తిడుతున్నారు. రిషి సార్ రమ్మంటేనే వచ్చాను.. రమ్మనకపోయినా వస్తాను.. మీ పెత్తనం నాపై కాదు అని వసుధార గట్టిగా చెబుతుంది.

    మీ పెద్దరికాన్ని తగ్గించుకోవద్దు..

    మీ పెద్దరికాన్ని తగ్గించుకోవద్దు..

    దీంతో నీకింత ధైర్యం వచ్చిందా.. అని దేవయాని అంటే.. మీరు భయపెడితే భయపడటానికి ధరణి మేడమ్ ని కాదు. ఒకప్పటి జగతి మేడమ్ ని కాదు. ఎవ్వరికీ భయపడను. తండ్రీకొడుకుల బంధాన్ని ఎలా కలపాలో నాకు తెలుసు. మీరెళ్లి గోరువెచ్చటి పాలు తాగి పడుకోండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అనవసర విషయాల్లో కలుగజేసుకుని మీ పెద్దరికాన్ని తగ్గించుకోవద్దు. నన్ను కంట్రోల్ చేయాలని అస్సలు చూడొద్దని వసుధార లెక్చర్ ఇస్తుంది. నా గురించి నీకు పూర్తిగా తెలియదు వసుధార. దీనికి నువ్వు వందరెట్లు చెల్లించాల్సి ఉంటుందని దేవయాని వసుధారను భయపెట్టే ప్రయత్నం చేస్తుంది. కట్ చేస్తే తన గదికి వెళ్లిన రిషి తండ్రి ఆలోచనల్లో ఉంటాడు. వసుధార కూడా అదే ఆలోచిస్తూ ఉంటుంది.

    ఆ ఆట మర్చిపోలేదన్నమాట..

    ఆ ఆట మర్చిపోలేదన్నమాట..

    తెల్లవారుతుంది. గౌతమ్ తన తల్లితో ఫోన్ లో మాట్లాడతాడు. అదంతా విన్న రిషి.. దిగాలుగా కూర్చుంటాడు. ఏమైందిరా అంటూ వచ్చి రిషి పక్కన కూర్చున్న గౌతమ్.. అమ్మరా చెప్పిందే చెబుతోందని అంటాడు. విన్నానురా అని ఎమోషనల్ అవుతాడు రిషి. నువ్ అమ్మతో మాట్లాడుతుంటే ఇంకా వినాలనిపించింది చెప్పురా.. అమ్మ ఇంకా ఏమంటోంది అని రిషి అడిగితే.. ఒకే మాటని మళ్లీ మళ్లీ చెబుతోంది. అయినా నేనేమైనా చిన్నపిల్లాడినా అని గౌతమ్ అంటాడు. అలాంటి మాట నేను ఒక్కసారి కూడా విన్లేదు. జీవితం అంటేనే విచిత్రం కదరా.. లేనివాటి గురించి ఎక్కవ బాధ కదరా.. అని రిషి అంటే.. అంకుల్ వచ్చేస్తారురా.. అని గౌతమ్ ఓదార్చుతాడు. ఇంకెప్పుడు రా.. డాడ్ నాతో చిన్నప్పుడు దాగుడుమూతలు ఆడేవారు. ఇంకా ఆ ఆట మర్చిపోలేదన్నమాట. లేట్ గా ఇంటికి వస్తే బెడ్ షీట్ కప్పుకున్నానో లేదో అని కప్పి వెళతారే.. మరి ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు. ఇప్పుడు నన్ను వదిలి ఎలా వెళ్లగలిగారు అని బాధపడతాడు రిషి.

    ఎదుటివాళ్ల పరిస్థితి తెలియదు కదా..

    ఎదుటివాళ్ల పరిస్థితి తెలియదు కదా..

    ఏంటిది.. నిజం తెలిసి కూడా చెప్పలేను. వీడి బాధను చూస్తూ ఉండలేను అని మనసులో అనుకుంటాడు గౌతమ్. అరేయ్ వాళ్లు ఎక్కడున్నా బాగానే ఉంటారు. నీకోసం వచ్చేస్తారు అని చెబుతాడు గౌతమ్. వాళ్లు కావాలనే దొరక్కుండా ఉంటున్నారు.. నేను చేసిన తప్పేంటి.. నాకైనా ఎవరున్నారు డాడీ తప్పా.. అందరు కోపం ఎక్కువ అంటారు కానీ, ఆ కోపం వెనుక ఉన్న కొండంత ప్రేమను ఎందుకు అర్థం చేసుకోరు. నేను ఎవర్ని ఎక్కువగా ప్రేమిస్తే వాళ్ల నుంచి దూరం అయిపోతుంటాను అని రిషి అంటే.. ఎవరూ దూరం అవలేదురా అని గౌతమ్ అంటాడు. దీనికి ఇంకేంట్రా.. డాడ్ నన్ను ఎలా వదిలి వెళ్లగలిగారని రిషి అంటే.. ఒక్కోసారి ఎంత ప్రేమ ఉన్నా.. పరిస్థితుల వల్ల దానికి వ్యతిరేకంగా మసులుకోవాల్సిన అవసరం వస్తుంది. ప్రేమ ఉన్నా చూపించలేని పరిస్థితి రావొచ్చు.. ఎవరికీ తెలుసు అని గౌతమ్ అంటాడు. నీకు అన్ని తెలిసినట్టే మాట్లాడుతున్నావ్ అని రిషి అంటే.. సమస్యలు, పరిస్థితుల గురించి చెబుతున్నాను. ఒక్కోసారి ఎదుటివాళ్ల పరిస్థితి తెలియదు కదా అని గౌతమ్ అంటాడు. వీళ్ల మాటలు బయట ఉండి వింటున్న వసుధార కన్నీళ్లు పెట్టుకుంటుంది.

    English summary
    Guppedantha Manasu Serial October 27 2022 Today Full Episode 592
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X