For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Guppedantha Manasu Today Episode: రిషి బాధకు మందులా వసుధార.. ఫ్రస్టేషన్ లో దేవయాని

  |

  గౌతమ్ తో తండ్రి గురించి తన బాధ చెప్పుకుంటూ ఉంటాడు రిషి. నాకే ఇలా జరుగుతుంది. నా జీవితంలో మా డాడ్ కన్నా నాకు ఎవరు ఎక్కువ కాదు. ఒక రెండు అక్షరాలు నా చిన్ననాటి సంతోషాన్ని పోగొట్టాయి. చిన్నప్పుడు ఆ రెండు అక్షరాల కోసం నేను ఎంతో తపన పడ్డాను. కానీ దొరకలేదు. ఇప్పుడు అవే రెండు అక్షరాలు నన్ను వాళ్లకు దూరం చేశాయి. నా జీవితంలో ప్రతి ఒక దశలో ఏదో ఒకటి కోల్పోతూనే ఉన్నాను. ఇంకా నా జీవితంలో కోల్పోవడానికి ఏం మిగిలింది. వసుధార తన ప్రేమ.. అది కూడా అనేలోగా అప్పటి నుంచి వింటున్న వసుధార వస్తుంది. వచ్చి రిషి నోటికి చేయి అడ్డం పెడుతుంది. దీంతో అక్కడి నుంచి గౌతమ్ వెళ్లిపోతాడు. ఇలా ఆసక్తికర కథా కథనంతో సాగుతోన్న గుప్పెడంత మనసు సీరియల్ అక్టోబర్​ 28, 2022 శుక్రవారం నాటి తాజా ఎపిసోడ్​ 593లో ఏం జరిగిందో చదివేసేయండి.

  మిమ్మల్ని విడిచి నేనెక్కడికి వెళతాను..

  మిమ్మల్ని విడిచి నేనెక్కడికి వెళతాను..

  సార్ ఇంకెప్పుడూ ఆ మాట అనొద్దు సార్.. రిషి కన్నీళ్లు తుడుస్తూ నేను మీ నీడ సార్. నేను ఎక్కడికి వెళ్లను. మీతోనే ఉంటాను. మిమ్మల్ని విడిచి నేనెక్కడికి వెళతాను సార్. రిషిధార బంధం నిలిచిపోతుంది. మీరంటే నేను.. నేనంటే మీరు.. మీరు ఇంకోసారి ఇలా అంటే ఈ వసుధార తుదిశ్వాస వదులుతుంది అని వసుధార అంటుంది. ఏం మాట్లాడుతున్నావ్ వసుధార.. ఇలా మాట్లాడి నన్ను ఇంకా బాధపెడతావ్. నువ్ నన్ను అంత ప్రేమగా చూసుకుంటున్నావ్ కదా.. మరి ఆ ఒక్క విషయం దగ్గర ఎందుకు అలా మొండి పట్టుపడుతున్నావ్. ఒకప్పటి రిషిలా కాకుండా నేను కొన్ని మెట్లు దిగాను కదా.. అది కూడా డాడ్ మీద ప్రేమతో. నన్ను ఇంకా అని రిషి అనేలోగా.. మీ పొగరుకి బుద్ధి లేదు సార్.. లేవండి.. మీ గదిలోకి వెళదాం మనశ్సాంతిగా నిద్రపోండి అని చెప్పి రిషిని తన గదిలో కూర్చోబెడుతుంది వసుధార. తర్వాత మెట్ల దగ్గర కూర్చుని బాధపడుతుంది వసుధార. మరోవైపు మహేంద్ర-జగతి బాధపడుతూ ఉంటారు.

  వసుధార కూడా మన ఇంటి మనిషే కదా..

  వసుధార కూడా మన ఇంటి మనిషే కదా..

  కట్ చేస్తే తర్వాత రోజు ఉదయం వంట గదిలో ధరణి ఉండగా వచ్చిన దేవయాని.. రిషికి కాఫీ ఇచ్చావా అని అడుగుతుంది. లేదు అని ధరణి అనడంతో.. ఇంట్లో అసలు ఏం జరుగుతోంది ధరణి. రిషికి కాఫీ ఇవ్వకుండా ఏ పనులు ఉంటాయి. ఆ జగతి మహేంద్రలు ఎలాగు రిషిని పట్టించుకోరు. నేనైనా పట్టించుకోవాలి కదా అంటూ ధరణిపైకి అరుస్తుంది దేవయాని. ఇంతలో అక్కడికి రిషి వస్తాడు. రిషి రావడం గమనించిన దేవయాని సైలెంట్ అయిపోయి.. నేను నీకు కాఫీ పెడుతున్నాను రిషి.. అని కాఫీ పెట్టి ఇస్తుంది. వసుధారకు కాఫీ ఇచ్చారా అని అడిగిన రిషికి ఇవ్వలేదని చెబుతుంది ధరణి. సరే అని తనే తీసుకెళ్లి ఇస్తానని చెబుతాడు రిషి. దీంతో నువ్వెందుకు వెళ్లడం నాన్నా అని దేవయాని అంటే.. వసుధార కూడా మన ఇంటి మనిషే కదా పెద్దమ్మా.. ఇందులో తప్పేముందని కాఫీ తీసుకెళ్తాడు రిషి. అప్పుడు మనం అనుకున్నవన్ని అవుతాయని ఆశించకూడదు కదా అత్తయ్య గారు.. కొన్ని కొన్ని జరగవు అని దేవయానితో ధరణి కాస్తా వెటకారంగా అంటుంది.

  నన్ను ఎందుకు ఇంతలా గౌరవిస్తావ్..

  నన్ను ఎందుకు ఇంతలా గౌరవిస్తావ్..

  మరోవైపు జగతితో వసుధార మాట్లాడుతూ ఉంటుంది. మేడమ్ మీరు ఇలాగా వదిలేసి వెళ్లిపోవడం న్యాయమా. మీకు నిజంగా నా మీద కోపం ఉంటే నన్ను తిట్టండి. మొన్న చీర కట్టనప్పుడు కొట్టినట్లు కొట్టండి. నేను భరిస్తాను. కానీ ఇలా వెళ్లిపోవద్దు అని అంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన రిషి.. ఎవరితో మాట్లాడుతున్నావ్ అని అంటే అదంతా ఊహ అని అనుకుంటుంది వసుధార. జగతితో మాట్లాడినట్లు కల కంటుంది వసుధార. కాఫీ తీసుకొచ్చి రిషి.. కప్పు ఆ.. సాసర్ ఆ అని అడుగుతాడు. ఏదో ఒకటి సార్. ఏదైనా పర్లేదు.. అడ్జస్ట్ అవుతాను.. ఇలాంటి చిన్న విషయాల్లో అని వసుధార అంటుంది. మళ్లీ ఆ ఒక్క విషయం గురించే అడుగుతాడు రిషి. మనం ఒకటి అనుకుంటే జీవితాంతం అదే మనకు శాశ్వతం కానక్కర్లేదు సార్.. అభిప్రాయాలు మారుతాయి. మీ విషయంలో కూడా మారొచ్చేమో అని అంటుంది వసుధార. దీంతో నన్ను ఎందుకు ఇంతలా గౌరవిస్తావ్ అని రిషి అడిగితే సమయం వచ్చినప్పుడు చెబుతాను అని వసుధార అంటుంది. ఈ సీన్ తర్వాత వసుధార బ్యాగ్ పట్టుకుని కిందకు వెళ్తుంది.

  మేడమ్ కి చాలా నచ్చుతుంది..

  మేడమ్ కి చాలా నచ్చుతుంది..

  కిందకు వెళ్తున్న వసుధారను ఆపుతుంది దేవయాని. ఇంటి నుంచి వెళ్లిపోతున్నావా.. క్షేమంగా వెళ్లు.. ఆరోగ్యం జాగ్రత్త అని అంటుంది. మేడమ్.. నేను ఇంటి నుంచి వెళ్లిపోతే.. చూడటానికి మీరు ఆశగా ఉన్నారని నాకు తెలుసు. కానీ నేను ఇంటి నుంచి వెళ్లడం లేదు. రిషి సార్ ఎప్పుడు వెళ్లమంటే అప్పుడే వెళతాను. ఒకవేళ రిషి సార్ వెళ్లమన్నా కూడా నాకు నచ్చితేనే వెళతానని వసుధార సమాధానం ఇస్తుంది. దీంతో దేవయానికి కోపం వస్తుంది. అదే సమయంలో రిషి వచ్చి.. ఏమైంది పెద్దమ్మా.. వసుధారను ఏదో అంటునట్టున్నారు అని అడుగుతాడు. దానికి వసుధార.. ఏం లేదు సార్.. నేను ఇక్కడ ఉండటం మేడమ్ కి చాలా నచ్చుతుంది. మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాను అని నన్ను అభినందిస్తున్నారు అని అంటుంది. దీంతో ఏం చేయలేక తల ఊపుతుంది దేవయాని.

  English summary
  Guppedantha Manasu Serial October 28 2022 Today Full Episode 593
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X